అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండాలి

Aug 5 2026 1:47 AM | Updated on Aug 5 2026 1:47 AM

సాత్నాల: సీజనల్‌ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో సాధన అన్నారు. మండలంలోని సైద్‌పూర్‌ పీహెచ్‌సీని మంగళవారం తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. మందుల నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం సీజనల్‌ జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండి వైద్యసేవలందించాలని సిబ్బందికి సూచించారు. నవజాతి శిశు సంరక్షణ, తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పించాలన్నారు. ఆమె వెంట ఎన్‌హెచ్‌ఎం డీపీవో దేవదాస్‌నాయక్‌, వైద్య బృందం ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement