పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలి

Aug 5 2026 1:47 AM | Updated on Aug 5 2026 1:47 AM

● కలెక్టర్‌ రాజర్షిషా

కై లాస్‌నగర్‌: జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించిన పెండింగ్‌ దరఖాస్తులు నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్‌ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రెవెన్యూ శాఖ పనితీరుపై మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు రెవెన్యూ సేవలు పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రజలు సమీప మీసేవ కేంద్రాల ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆర్‌ఎస్‌.చిత్రు, రాజేశ్వర్‌, ఐటీడీఏ పీవో మంద మకరంద్‌, డిప్యూటీ కలెక్టర్‌ వంశీకృష్ణ, ఆర్టీవో జగదీశ్వర్‌రావు, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.

డిజిటల్‌ వ్యసనాలతో ప్రమాదంలో

యువత భవిష్యత్తు

ఆదిలాబాద్‌: ఇన్‌స్ట్రాగాం రీల్స్‌, మొబైల్‌ ఫోన్ల అధిక వినియోగం వంటి డిజిటల్‌ వ్యసనాలు కూడా యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ‘నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు యోగా, ధ్యానం వంటి అలవాట్లు అలవరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అనూష, డీఈవో మాధవి, డీఐఈవో గణేశ్‌, డీపీఆర్వో విష్ణువర్ధన్‌, ఆర్టీసీ డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ రామయ్య, బ్రహ్మకుమారి నిర్వాహకులు రేవతి, దిల్‌రెడ్డి, లెక్‌రాజ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement