‘బాల ఆధార్‌’కు బాలారిష్టాలు! | - | Sakshi
Sakshi News home page

‘బాల ఆధార్‌’కు బాలారిష్టాలు!

Aug 5 2026 1:47 AM | Updated on Aug 5 2026 1:47 AM

● సర్కారు ఆసుపత్రుల్లో అందని ఉచిత సేవ ● అవకాశం ఉన్నా సాంకేతికత లోపాలతో అవస్థలు ● సమస్య పరిష్కరిస్తే పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పొందే ‘బాల ఆధార్‌’ సేవల బాలారిష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు చిన్నారుల వరకు ఎలాంటి బయోమెట్రిక్‌ నమోదు లేకుండానే బాల/శిశు ఆధార్‌ జారీ చేయాలనే ఉద్దేశంతో యూఐడీఏఐ(యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) ప్రత్యేకంగా ఈ వీలు కల్పించింది. మొదట పిల్లలకు పేర్లు పెట్టకముందే బేబీ ఆఫ్‌తోనే తల్లిదండ్రుల ఆధార్‌తో కార్డులు జారీ చేశారు. కానీ కొన్ని చోట్ల ఈ సేవను దుర్వినియోగం చేస్తున్నారని గుర్తించారు. దీంతో మీ సేవ కేంద్రాల్లో జనన ధ్రువీకరణ పత్రం ఉంటేనే బాల ఆధార్‌ నమోదు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో ప్రభుత్వాసుపత్రుల్లో ఈ సేవలు అందడం లేదు. మంచిర్యాల, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌ ప్రభుత్వాసుపత్రుల్లో అరకొరగా సేవలు అందుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఈ సేవలు కూడా అందడం లేదు. దీంతో తల్లిదండ్రులు చిన్నారులకు ఆధార్‌ కోసం తిప్పలు పడుతున్నారు. ఆధార్‌ చిన్నారుల నివాస రుజువు, తల్లిదండ్రుల ఆధార్‌తో అనుసంధానం, టీకాలు, ‘అభా’ కార్డు, రేషన్‌కార్డుతోపాటు ఇతర అనేక చోట్ల తప్పనిసరిగా మారింది.

రెండు నెలలుగా తిరుగుతున్నా

మా పాపకు బాల ఆధార్‌ కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి రెండు నెలలు నుంచి తిరుగుతున్నాను. రోజూ సర్వర్‌ పని చేయడం లేదంటూ తిప్పి పంపిస్తున్నారు. అధికారులు సమస్య పరిష్కరించి, ఆధార్‌ ఇప్పించేలా చూడాలి. –అజయ్‌, కాగజ్‌నగర్‌,

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement