ఏకదంతా.. నమో నమః. ఏటా నీ రాక కోసం వెయ్యి కళ్లతో ఎదు రు
● నవ రాత్రుల వేళ.. మా నివేదనల మాల ● విన్నపాలు మన్నించి.. దీవించు వినాయకా
నిన్ను వాడవాడలా కొలువు దీర్చేందుకు మండపాలను సిద్ధం చేసుకున్నాం వక్రతుండా. అయితే నీ శోభాయాత్ర నిర్విఘ్నంగా సాగేందుకు జిల్లాలో చాలా చోట్ల రహదారులు ఛిద్రమయ్యాయి. నీ ఆగమనానికి, నిమజ్జనానికి గుంతలమయైన రోడ్లతో ఇబ్బందులు తప్పేలా లేవు లంబోదరా. మన్నించి రాస్తా సమస్యలు త్వరగా దూరం చేయు పార్వతీతనయా.
అక్షర క్రమంలో ముందున్నా అక్షరాస్యతలో మాత్రం వెనుకబడుతున్నాం స్వామీ. ఈ ప్రాంతంలో ఉన్నత విద్యాసంస్థలు లేక నీ పిల్లలంతా పెద్ద చదువులకు దూరమవుతున్నారు. నిన్ను మనసారా తలిచి జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఉద్యమాన్ని మొదలుపెట్టాం స్వామీ. ప్రభుత్వం త్వరగా కరుణించేలా చూడు చతుర్భుజా.
తలాపునే గంగమ్మ ప్రవహిస్తున్నా.. పంటల సాగు దినదిన గండంగా సాగుతోంది గణాధ్యక్షా. మీ తల్లిని మా పంట చేలకు ప్రాణం పోసేలా చూడు స్వామీ. చనాఖా– కొరటా బ్యారేజ్ త్వరగా అందుబాటులోకి వచ్చేలా అభయమివ్వు అగ్రపూజ్యాయ.
ఆదిలాబాద్ నుంచి భాగ్యనగరానికి వెళ్లడానికి ఎన్నో తిప్పలు పడుతున్నాం గణేశా. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం ఆర్థిక భారమవుతోంది. జిల్లా కేంద్రం నుంచి పఠాన్ చెరు వరకు రైల్వేలైన్ ఏర్పాటును త్వరగా పూర్తయ్యేలా చూడు మూషికవాహనా.
ఆకాశంలో విహరించాలనే మా కలలకు రెక్కలను త్వరగా ప్రసాదించు స్వామీ. నీ దీవెనలకు ‘సాక్షి’ చొరవ, ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల సహకారం తోడవగా కేంద్రం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది లంబోదరా. జిల్లా కేంద్రంలో త్వరగా విమానాశ్రయం అందుబాటులోకి వచ్చేలా చూడు మోదకప్రియా.
జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అన్నదాతలు తల్లాడిల్లారు తండ్రీ. పంటలు పోయి, ఆశలపై ఇసుక మేటలు వేశాయి స్వామీ. పత్తి చేలన్నీ వరద తాకిడికి గురై బురదమయయ్యాయి. పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా, అప్పుల బాధ నుంచి గట్టెక్కేలా కాపాడు గణాధిపా.
పూజలో నీకు సమర్పించే వస్త్రాన్ని ఓ సారి చూడు స్వామి. తెల్ల బంగారం పండించే రైతన్నకు కష్టాలు తప్పట్లేదు అగ్రగణ్యా. తేమ పేరుతో దూది రైతుకు ఏటా గిట్టుబాటు దక్కడం లేదు. ఆరుగాలం శ్రమను గుర్తించి మంచి ధర అందేలా చూడు వక్రతుండా.
అటవీ అందాలు, పాలనురుగుల జలపాతాలతో కన్నుల విందు చేసే జిల్లాలో పర్యాటక అభివృద్ధి మాత్రం లేదు స్వామీ. రాష్ట్రంలో ఎత్తైన జలపాతాల్లో ఒకటైన కుంటాల మా దగ్గరే పరవళ్లు తొక్కుతున్నా అభివృద్ధికి మాత్రం అడుగులు పడడం లేదు. జిల్లాలో పర్యాటకం ప్రగతి సాధించేలా కరుణించు గౌరీనందనా.
నిరుపేదలకు వైద్యం అందించే రిమ్స్ ఆసుపత్రి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారయిందయ్యా. రూ.150 కోట్లతో అధునాతన ఆసుపత్రిని నిర్మించినా ఆది నుంచి విఘ్నాలే స్వామీ. ఆసుపత్రి నిర్మాణం పూర్త యి ఏళ్లు గడుస్తున్నా నాణ్యమైన సేవలకు మాత్రం నోచుకోని పరిస్థితి. వైద్య పోస్టులు పూర్తిస్థాయిలో భర్తీ అయ్యేలా చూడు విఘ్నరాజా.