ఎట్టకేలకు ‘ప్రీప్రైమరీ’ | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు ‘ప్రీప్రైమరీ’

Aug 29 2025 2:31 AM | Updated on Aug 29 2025 2:31 AM

ఎట్టకేలకు ‘ప్రీప్రైమరీ’

ఎట్టకేలకు ‘ప్రీప్రైమరీ’

● సెప్టెంబర్‌ 5 నుంచి తరగతులు ● జిల్లాలో 15 పాఠశాలల ఎంపిక ● ఇప్పటికే నాలుగు చోట్ల అమలు

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రా థమికవిద్య (ప్రీప్రైమరీ)ను ప్రారంభించేందుకు వి ద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్‌ 5నుంచి తరగతులు ప్రా రంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో అధికారులు జిల్లాలో 15పాఠశాలలను ఎంపిక చేశారు. పీఎంశ్రీ కింద ఎంపికై న నాలుగు స్కూళ్లల్లో గతేడాది నుంచే బోధన ప్రారంభించారు.

ఎంపికై న పాఠశాలలు

ప్రీప్రైమరీ బోధించేందుకు జిల్లాలో 15 పాఠశాలల ను ఎంపిక చేశారు. ఇందులో కేశవపట్నం, దుబ్బ (కె), కంఠ, దస్నాపూర్‌గూడ, వైజాపూర్‌, కేస్లాగూ డ, బరంపూర్‌, రాంపూర్‌(పీ), మల్కాపూర్‌, చెర్లపల్లి, గుబిడి, యాపల్‌గూడ, రణదీవెనగర్‌, పిప్పల్‌కో టి (ఉర్దూ మీడియం), భుక్తాపూర్‌ పాఠశాలలున్నా యి. పీఎంశ్రీ కింద ఎంపికై న జైనథ్‌ మండలం దీపాయిగూడ, సిరికొండ మండల కేంద్రం, భీంపూర్‌ మండలం నిపాని, గాదిగూడలోని చింతగూడ పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రీప్రైమరీ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు ఆటాపాటలతో చిన్నారులకు ఇంగ్లిష్‌ మీడియంలో బోధిస్తున్నారు. స్లీపింగ్‌ హవర్‌, మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు.

సిబ్బంది నియామకం ఇలా..

ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి అధికారులు గురువారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇన్‌స్ట్రక్టర్‌కు నెలకు రూ.8వేలు, ఆయాకు రూ.6వేలు చెల్లించనున్నారు. ఇందుకు కలెక్టర్‌ చైర్మన్‌గా, డీఈవో కన్వీనర్‌గా, కలెక్టర్‌ నామినేట్‌ చేసిన ఒకరు, అడిషనల్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) సభ్యులుగా కమిటీ వేశారు. ఇన్‌స్ట్రక్టర్‌కు ఇంటర్‌, ఆయా పోస్టుకు ఏడో తరగతి అర్హత కాగా, 18–44 ఏళ్లలోపు మహిళలు అర్హులని పేర్కొన్నారు. ఒక్కో పాఠశాలకు ప్రభుత్వం రూ.1.70లక్షలు విడుదల చేసింది. ఇందులో రూ.1.50లక్షలు ఫర్నిచర్‌, పెయింటింగ్‌, బోధన పరికరాలు, ఇతర వస్తువుల కోసం ఖర్చు చేయనున్నారు. మిగతా రూ.20వేలు ఒక్కో విద్యార్థికి బూట్లు, యూనిఫాంల కోసం రూ.వెయ్యి చొప్పున వెచ్చించనున్నారు. 20 మంది విద్యార్థుల కంటే ఎక్కువగా ఉంటే అదనంగా ప్రభుత్వం బడ్జెట్‌ విడుదల చేయనుంది. 10 నెలల పాటు ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలకు గౌరవ వేతనం చెల్లించనుంది. ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు చ దివిన విద్యార్థులు అదే పాఠశాలలో ఒకటో తరగతి చదివేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సదరు పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం వీరికీ అందించనున్నారు.

పాఠశాలల బలోపేతానికే..

ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు లేకపోవడంతో ఆర్థికభారం అయినప్పటికీ చా లామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్‌ పా ఠశాలల్లో చేర్పిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సర్కారు బడుల్లో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభిస్తోంది. దీంతో సర్కారు బడులు మరింత బలోపేతం కానున్నాయి. ఇక్కడ ఎల్‌కేజీ, యూకేజీ చదివిన పిల్లలకు వచ్చే విద్యాసంవత్సరంలో ఒకటో తరగతిలో చేరేందుకు అర్హత ఉంటుంది. దీంతో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశముంటుంది.

చర్యలు చేపడుతున్నాం

ప్రీప్రైమరీ పాఠశాలల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వం జిల్లాకు రెండో విడతల్లో 15 ప్రీప్రైమరీ పాఠశాలలను ఎంపిక చేసింది. ప్రస్తుతం నాలుగు పాఠశాలల్లో తరగతులు కొనసాగుతున్నాయి. సిబ్బంది నియామకం కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులు ఈ నెల 30లోపు సంబంధిత ప్రధానో పాధ్యాయులకు దరఖాస్తు చేసుకోవాలి. సె ప్టెంబర్‌ 5నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నాం.

– అజయ్‌, విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement