
వరద ప్రాంతాలను పరిశీలించిన అనిల్ జాదవ్
నేరడిగొండ: భారీ వ ర్షాలు కురుస్తున్నందు న బోథ్ ఎమ్మెల్యే అ నిల్ జాదవ్ మండలంలోని వాంకిడి వాగు, చెక్‌డ్యాంలను గురువా రం పరి శీలించారు. మండల కేంద్రంలో నీటమునిగిన పలు కా లనీల్లో పర్యటించారు. బ్రిడ్జిలు, డ్రైనేజీలను పరిశీలించారు. అత్యవసరమైతేనే బయ టకు రావాలని, వాగులు, వంకల వైపు వెళ్లొద్దని సూచించారు. మాజీ ఎంపీపీ రాథోడ్ సజ న్, వీడీసీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, నాయకులు వెంకటరమణ, దేవేందర్‌రెడ్డి, సురేందర్, గులాబ్, సంతోష్, శాదాబ్, శ్రీధర్‌రెడ్డి, రవి ఉన్నారు.
ఒడ్డుకు చేరిన వాగులో చిక్కుకున్న వ్యక్తి
ద్విచక్రవాహనంపై వెళ్తున్న నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం దుప్పనాయక్ తండాకు చెందిన జాదవ్ సంజు కుప్టి–కుమారి మధ్యలోగల చిన్న వాగులో చిక్కుకున్నాడు. గ్రామస్తుల సమాచారం మేరకు ఎస్సై ఇమ్రాన్‌ఖాన్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. గ్రామ యువకులతో కలిసి తాడు సాయంతో అతడిని బయటకు చేర్చారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన తహసీల్దార్ ఎంఏ కలీమ్‌ను కల్వర్టుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరారు. ఆ యన వెంట ఎంపీడీవో శేఖర్, ఆర్‌ఐ నాగో రావ్, పంచాయతీ కార్యదర్శి దత్తాద్రి, జూని యర్ అసిస్టెంట్ పెద్దులు ఉన్నారు.

వరద ప్రాంతాలను పరిశీలించిన అనిల్ జాదవ్