
పంట నష్టం గణన చేపట్టాలి
కై లాస్‌నగర్: పంట నష్టం గణన ప్రక్రియ వేగవంతం చేయాలని, నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహా రం అందించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, ఉద్యావనశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంట నష్టం సర్వే ప్రక్రియపై ఆరా తీసి వెంటనే నివేదికలు అందించాలని సూ చించారు. మండలాల వారీగా ఇచ్చిన ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాలను సాధించేలా చూడాలని తెలిపారు. యూరియా, ఇతర ఎరువుల కొరత లేకుండా చూ డాలని, నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పిస్తూ దాని లాభాల గురించి వివరించాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌స్వామి, డీసీవో మోహన్ తదితరులు పాల్గొన్నారు.