
అత్యవసరమైతేనే బయటకు రావాలి
ఆదిలాబాద్‌టౌన్/ఆదిలాబాద్‌రూరల్: అత్యవసరమైతేనే బయటకు రావాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. పట్టణంలోని హరిఓం కాలనీలో తెగిన రోడ్డును పరిశీలించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కల్వర్టు పైను ంచి వరదనీరు ప్రవహించేటపుడు వాహనదారులు, ప్రజలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ఎస్పీ వెంట మావల సీఐ కర్రె స్వామి ఉన్నారు.
భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకోవాలి
గణేశ్ నవరాత్రోత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మ హాజన్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలో ని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రతిష్ఠించిన వినాయకుడికి పూజలు చేశారు. ఏఎస్పీ సురేందర్‌రావు, డీఎస్పీలు శ్రీనివాస్‌రావు, ఇంద్రవర్ధన్, ఇన్‌స్పెక్టర్లు వెంకటి, మురళి, చంద్రశేఖర్ తదితరులున్నారు.