
మద్యం మత్తులో ఆత్మహత్య
భీమారం: భీమారం గ్రామంలోని ఐటీడీఏ కాలనీకి చెందిన మారం చందు (42) మద్యం మత్తులో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శ్వేత తెలిపిన వివరాల ప్రకారం.. ఐటీడీఏలో నివాసముంటున్న చందు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొనేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 25న మద్యం మత్తులో ఇంట్లోనే ఉన్నాడు. ఈ క్రమంలో గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్వేత తెలిపారు. మృతుడికి భార్య సుజాత, కూతుళ్లు శ్రీవళ్లి, శ్రీనిక ఉన్నారు.
పురుగుల మందు తాగి ఒకరి ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ సమీపంలో రైల్వే ట్రాక్ పక్కనే పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ సంపత్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రానికి చెందిన ఆజ్మీర సుకేందర్ (27) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. 15రోజుల క్రితం సుకేందర్ భార్య రాజేశ్వరి ప్రసవించగా కుమారుడు పుట్టి చనిపోయాడు. రాజేశ్వరి తల్లిదండ్రల నిర్లక్ష్యంతోనే కొడుకు పుట్టగానే చని పోయాడని ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవ జరగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుకేందర్ ఈ నెల 25న రాత్రి హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు వచ్చి రాజీవ్‌నగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కనే పురుగుల మందు తా గి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలంలో పురుగుల మందు డబ్బాను జీ ఆర్‌పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.
చెరువులో పడి పశువుల కాపరి మృతి
కుంటాల: మండలంలోని అంబకంటి గ్రామానికి చెందిన పశువుల కాపరి పొన్నవేని భోజన్న (48) కొత్త చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబకంటి గ్రామానికి చెందిన భోజన్న సోమవారం ఉదయం పశువులను మేపడానికి రోజులాగే గ్రామ శివారుకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కొత్త చెరువులో గజ ఈతగాళ్లతో గాలించగా మంగళవారం మృతదేహం లభించింది. మృతుడికి భార్య లక్ష్మి, కూతురు, కుమారుడు ఉన్నారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పాత నేరస్తుల బైండోవర్
మంచిర్యాలక్రైం: గతేడాది గణేశ్ నవరాత్రోత్సవాల్లో జిల్లా కేంద్రంలో గొడవలకు పాల్పడిన 13మంది పాత నేరస్తులను మంగళవారం స్థానిక తహసీల్దార్ రఫతుల్లా హుస్సేన్ ఎదుట బైండోవర్ చేసినట్లు సీఐ ప్రమోద్‌రావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది జరిగిన గణేశ్ నవరాత్రోత్సవా ల్లో హింసాత్మక ఘటనలకు ప్రేరేపించిన వారిని, గొడవలకు పాల్పడినవారిని గుర్తించినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా, శాంతి భద్రతలకు విఘాతం కల్పించకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా వారిని బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. అయినా తీరు మార్చు కోకుండా నేరాలు, హింసాత్మక ఘటనలకు పాల్పడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఏఎస్సై సత్తయ్య ఉన్నారు.

మద్యం మత్తులో ఆత్మహత్య

మద్యం మత్తులో ఆత్మహత్య