
జాప్యం లేకుండా సీఎంపీఎఫ్ సేవలు
రెబ్బెన: జాప్యం లేకుండా సింగరేణి ఉద్యోగులకు సీఎంపీఎఫ్ సేవలు అందించేందుకు కృషి చేస్తున్న ట్లు సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్–2 గోవర్ధన్ కంటెపుడి తెలిపారు. మంగళవారం గోలేటి టౌన్‌షిప్ లోని జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రయాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. సీఎంపీఎఫ్ లావాదేవీలు అ న్ని సీకేర్స్ పోర్టర్ ద్వారా మాత్రమే జరుగుతున్నాయని, సేవలన్నీ పారదర్శకంగా ఉంటాయని పే ర్కొన్నారు. ఉద్యోగులు మధ్యవర్తులు లేకుండా సీ ఎంపీఎఫ్ సేవలను పారదర్శకంగా పొందవచ్చని సూచించారు. సీఎంపీఎఫ్ బెనిఫిట్స్‌కు అర్హులు, పె న్షన్, రివైస్డ్ పెన్షన్‌పై ఎలాంటి పెండింగ్‌లు ఉండకుండా చర్యలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. ఉద్యోగుల సందేహాలకు సమాధానం ఇచ్చా రు. పెన్షన్, సీఎంపీఎఫ్ దరఖాస్తులు జీరో పెండింగ్ స్థాయికి తీసుకువచ్చేందకు ప్రతీ ఉద్యోగి కృషి చే యాలని సూచించారు. ఎస్‌వోటూ జీఎం రాజమ ల్లు, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్, ప్రశాంత్, సీఎంపీఎఫ్ ఉద్యోగులు మనోహర్, అనిత, అన్ని విభాగాల సంక్షేమ శాఖ క్లరికల్ సిబ్బంది ఉన్నారు.