‘సరిహద్దు’లో కర్ర గణేశులే.. | - | Sakshi
Sakshi News home page

‘సరిహద్దు’లో కర్ర గణేశులే..

Aug 27 2025 8:44 AM | Updated on Aug 27 2025 8:44 AM

‘సరిహ

‘సరిహద్దు’లో కర్ర గణేశులే..

● సమాజ హితమే వీరి అభిమతం ● ప్రత్యేకత చాటుకుంటున్న ‘పాలజ్‌’ ● నేటి నుంచి నవరాత్రోత్సవాలు

భైంసా/తానూరు: గణేశ్‌ నవరాత్రోవాలను నిర్మల్‌ జిల్లాలోని తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు గ్రామా ల ప్రజలు వినూత్న రీతిలో జరుపుకొంటారు. పీవో పీ, మట్టి విగ్రహాలు ఇక్కడ మచ్చుకై నా కనిపించవు. రంగులు, రసాయనాల వినియోగం అస్సలే ఉండదు. హంగులు, ఆర్భాటాలు లేకుండా సమాజహితమే తమ అభిమతమని ఇక్కడి ప్రజలు పూర్వీకులు చూపిన బాటనే నేటికీ అనుసరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా దోహదం చేస్తున్నారు. కర్రతో చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు.

పాలజ్‌ గణేశ్‌ ఫేమస్‌

తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని ఓ చిన్న మరాఠీ గ్రామం పాలజ్‌. కుభీర్‌కు పక్కనే మహా రాష్ట్రలోని బోకర్‌ తాలూకాలో ఈ ఊరు ఉంది. స్వా తంత్య్రానికి పూర్వం ఈ గ్రామంలో కలరా, ప్లేగు వ్యాధులు ప్రబలి జనమంతా మంచం పట్టారు. ఇదే సమయంలో వినాయక చవితి పండుగ వచ్చింది. ఓ వైపు కలరా, ప్లేగు వ్యాధులు, మరోవైపు కరువు పరిస్థితులతో జనం సతమతమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా కర్ర గణపతిని చేయించి ప్రతిష్ఠించాలని గ్రామపెద్దలు నిర్ణయించారు. నిర్మల్‌ కొయ్యబొమ్మలు చేసే నకాషీ కళాకారుడైన గుండాజీ వర్మను కలిశారు. నిష్టతో గుండాజీ వర్మ చేసిన సుందరమైన కర్ర విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఊ రంతా మొక్కితేనే వ్యాధులు దూరమయ్యాయని, కరువు కాటకాలు తొలగిపోయాయని గ్రామపెద్దలు చెబుతారు. అలా 1948 నుంచి కర్ర గణేశుడిని వినా యక ఉత్సవాల్లో కొలవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ఊరి ఆడబిడ్డల ద్వారానే కర్రగణేశుడి గురించి ఇతర గ్రామాలకు తెలిసింది. పూజల అనంతరం నిమజ్జనం రోజున స్థానిక వాగు వద్దకు తీసుకెళ్లి కర్ర గణేశుడికి పూజలు నిర్వహిస్తారు. అక్కడే నీళ్లు చల్లి తిరిగి ఆలయానికి తీసుకువస్తారు. దీనినే నిమజ్జ నోత్సవంగా భావిస్తారు. అనంతరం కర్ర విగ్రహా న్ని తిరిగి ఆలయంలోని బీరువాలో భద్రపరుస్తారు.

కలిసికట్టుగా.. లక్షలాదిగా..

తిరుపతి, షిర్డీలో ఉన్నట్లు పాలజ్‌లోనూ భక్తులకు క్యూలైన్లు ఉన్నాయంటే.. ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య అంచనా వేయొచ్చు. ప్రతీ ఏడాది వినాయక ఉత్సవాల్లో దాదాపు ఆరు లక్షల నుంచి ఏడు లక్షల మంది భక్తులు పాల్గొంటున్నారని అంచనా. లక్షల్లో తరలివచ్చే భక్తులకు గ్రామస్తులే సేవలందిస్తున్నారు. ఆ ఊరంతా కలిసికట్టుగా కర్రగణేశుషుడి సేవలో పాల్గొంటుండడం ఇక్కడి విశేషం.

మరికొన్ని గ్రామాల్లోనూ..

తానూరు మండలం బోసిలో వరసిద్ధి కర్ర వినాయకుడు, కుభీర్‌ మండలం కుభీర్‌, పార్డి, మాలేగాం చిక్లీ, భైంసా మండలం మాటేగాం, లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్‌ గ్రామాల్లోనూ కర్ర గణపతులను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు. స్వాతంత్య్ర పోరాటకాలంలో కరువు నేపథ్యంలో గ్రామస్తుల మొక్కులతో ఇలా ఈ ప్రాంతంలో ఊరంతా కలిసి కర్ర గణపతులను ప్రతిష్ఠించడం మొదలైంది.

పాలజ్‌కు ఎలా వెళ్లాలంటే..

హైదరాబాద్‌ నుంచి వచ్చేవారు నిజామాబాద్‌, బాసర మీదుగా భైంసా చేరుకుంటే దూరభారం తగ్గుతుంది. నిర్మల్‌ మీదుగా వచ్చేవాళ్లు కూడా భైంసా మీదుగానే పాలజ్‌ వెళ్లాల్సి ఉంటుంది. భైంసా నుంచి 23 కిలోమీటర్ల దూరంలో పాలజ్‌ ఉంటుంది. ఉత్సవాల సందర్భంగా ఈ గ్రామానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ప్రైవేట్‌ వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి.

‘సరిహద్దు’లో కర్ర గణేశులే..1
1/1

‘సరిహద్దు’లో కర్ర గణేశులే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement