పెళ్లి కావడం లేదని యువకుడు ఆత్మహత్య
తానూరు: పెళ్లి కావడం లేదని యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ట్రైయినీ ఎస్సై నవనీత్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం..మండల కేంద్రానికి చెందిన వాగ్మారే ఆకాశ్ (25) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు. తల్లి కొడ్యబాయికి కొంత కాలంగా మానసిక పరిస్థితి బాగాలేదు. ఇంట్లో పనులు చేసేవారు లేక వంట చేసుకోవడం ఇబ్బందిగా ఉందని, తల్లి మానసిక పరిస్థితి బాగా లేకపోవడం, తనకు పెళ్లి కావడం లేదని సోదరికి గురువారం రాత్రి ఫోన్‌లో చెప్పాడు. తల్లి బంధువుల ఇంటికి వెళ్లడంతో ఒంటరిగా ఉన్న ఆకాశ్ మనస్తాపంతో రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. శుక్రవారం ఉదయం ఇంటిపక్క వారు చూసి సమాచారమివ్వడంతో ట్రైయినీ ఎస్సై అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సోదరి గాయక్వాడ్ గీతాంజలి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైయినీ ఎస్సై తెలిపారు.
జీవితంపై విరక్తితో వ్యక్తి..
కడెం: జీవితంపై విరక్తితో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి తెలిపా రు. ఎస్సై, స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని చిట్యాల్‌కు చెందిన బానవత్ రవి(35) నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి అప్పుల పాలయ్యాడు. అప్పుల బాధతో జీవితంపై విరక్తి చెందాడు. గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. తల్లి జీజాబాయి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చికిత్సపొందుతూ వృద్ధుడి మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): గుర్తుతెలియని పురుగుల మందు తాగిన వృద్ధుడు చికిత్స పొందు తూ మృతిచెందాడు. హాజీపూర్ ఎస్సై స్వరూప్‌రాజ్ కథనం ప్రకారం..మండలంలోని ముల్కల్ల గ్రామంలోని వాగొడ్డుపల్లెకు చెందిన పెట్టం మల్లయ్య(68), భార్య మల్లక్క దంపతులు. వారితో ఉన్న పాత గొడవలను మనసులో పెట్టుకుని వాగొడ్డుపల్లెకు చెందిన లగిశెట్టి అమ్మక్క, ఆమె కుటుంబ సభ్యులు గురువారం మల్లయ్య, మల్లక్కపై గురువారం భౌతిక దాడి చేసి దుర్భాషలాడి మానసిక ఇ బ్బందులకు గురిచేశారు. పిల్లలు లేని మల్లయ్య చా వక ఎందుకు బతుకుతున్నావని ఊరందరి ముందు తిట్టడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. మల్లయ్య తన ఇంటి వెనుక పశువుల కొట్టంలో మధ్యాహ్న సమయంలో గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి అతన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ రాత్రి మృతిచెందాడు. భార్య మల్లక్క ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


