కాంగ్రెస్‌లో ఎందుకిలా?
● ‘హస్తం’ వెనుకబాటుపై మీనాక్షి ప్రశ్న
● ఎమ్మెల్యే, ఇన్‌చార్జీల అభిప్రాయ సేకరణ
● పార్లమెంట్ పరిధిలో పరిస్థితిపై ఆరా
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధి లో పార్టీ పూర్తిగా వెనుకబాటుకు కారణమేంది?.. ఈ ప్రశ్న సంధించింది కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్. బుధవారం హైదరాబా ద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాయకులతో ఆమె స మావేశమయ్యారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొ జ్జు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడే గజేందర్, శ్యామ్‌నాయక్, రావి శ్రీనివాస్ హాజ రయ్యారు. వేర్వేరుగా వారితో ఆమె పది నిమిషాల చొప్పున సమీక్షించారు. పార్లమెంట్ పరిధిలో పార్టీ పరిస్థితిపై ఆరా తీసి వారి అభిప్రాయాలు సేకరించారు. నివేదిక రూపంలో అధిష్టానానికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా పార్లమెంట్ పరిధిలో పార్టీ పటిష్టతకు మీనాక్షి నటరాజన్ దృష్టి సారించారని నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికల్లో ఓటమిపై ఆరా
గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నియోజకవర్గ ఇన్‌చార్జీలతో మాట్లాడి వారి ఓటమికి గల కారణాలను మీనాక్షి నటరాజన్ తెలుసుకున్నారు. పార్లమెంట్ పరిధిలో పార్టీని పటిష్టపర్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని అడిగారు. కొందరు పార్లమెంట్ ని యోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలు అందరినీ సమన్వయం చేయడంలో వి ఫలమయ్యారని మీనాక్షి నటరాజన్‌కు తెలిపారు. గ్రూపులను ప్రోత్సహించడంతో నియోజకవర్గాల్లో పరిస్థితులు మారిపోయాయని వివరించినట్లు స మాచారం. ఎన్నికల తర్వాత ప్రస్తుతం వేదికలపైన కూర్చుంటున్న ముఖ్య నాయకులు పార్టీని పటిష్టపర్చడంలో బాధ్యతగా వ్యవహరించడం లేదని ఇ న్‌చార్జికి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో అన్ని కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేయాలని కోరినట్లు చెప్పుకొంటున్నారు.
కొలిక్కి వచ్చేనా?
పార్టీ బూత్, గ్రామ, మండల, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలను నియమించేందుకు ఇప్పటికే అన్ని స్థాయిల్లో పేర్లు సేకరించారు. ఒక్కొక్క కమిటీకి ఐదుగురి ఆశావహుల పేర్లు పరిగణనలోకి తీసుకున్నారు. వా టిని పరిశీలకుడు తాహెర్‌బిన్ హందన్, చిట్ల సత్యనారాయణ అధిష్టానానికి పంపే ఏ ర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత ఆ కమిటీలు అధిష్టానం నుంచి ఖరారు కానున్నా యి. కాగా, ఈ కమి టీలకు ముందే రాష్ట్ర కార్యవర్గం కూర్పు జరగనుండగా, ఈ పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నాయకులకు ఎవరికైనా చోటు దక్కుతుందా? అనేది ఆసక్తి కలిగిస్తోంది. జిల్లా అధ్యక్షుల నియామకానికి సంబంధించి త్వరలో పీసీసీ నుంచి మరో కమిటీ వేయనున్నట్లు తెలుస్తోంది. ఆ కమిటీ ద్వారా అభిప్రాయ సేకరణ చేసి పేర్లను ఏఐసీసీకి పంపించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాతే జిల్లా అధ్యక్షుడిని ఖరారు చేసే అవకాశముంది.


