‘కరెంట్‌ కావాల్నా.. కాంగ్రెస్‌ కావాల్నా..!?' : ముఖ్యమంత్రి కేసీఆర్‌

- - Sakshi

తేల్చుకోవాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌..

ఆదిలాబాద్‌, ఇచ్చోడ ప్రజాఆశీర్వాద సభల్లో సభికులకు ప్రశ్నలు?

ఉత్సాహంగా సమాధానాలిచ్చిన జనం!

రెండు చోట్ల భారీగా జనసమీకరణ..

సభలు సక్సెస్‌.. గులాబీ పార్టీలో జోష్‌!

విజయసంకేతం చూపుతున్న  సీఎం కేసీఆర్‌..

ఆదిలాబాద్‌ సభకు హాజరైన జనం!

సాక్షి, ఆదిలాబాద్‌: ‘కరెంట్‌ కావాల్నా.. కాంగ్రెస్‌ కావాల్నా.., రైతుబంధు కావాల్నా.. రాబందా?..’ అంటూ సీఎం కేసీఆర్‌ ప్రజాఆశీర్వాద సభల్లో సభికులను ప్రశ్నించారు. దీంతో కరెంట్‌ కావాలని... రైతుబంధు ఉండాలని జనం ఉత్సాహంగా బదులిచ్చారు. సంక్షేమ పథకాలుండాలంటే ఆదిలాబాద్‌, బోథ్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు జోగు రామన్న, అనిల్‌జాదవ్‌ను గెలిపించాలని సీఎం కేసీఆర్‌ కోరారు. వీరిని గెలిపిస్తేనే బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని, తద్వారా అభివృద్ధి కొనసాగుతుందని చెప్పారు.

కాంగ్రెస్‌ను గెలిపిస్తే వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ రాదని, రైతుబంధు రద్దు చేస్తారని విమర్శించారు. గురువారం ఆదిలాబాద్‌, ఇచ్చోడలో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలకు ఆయన హాజరై ప్రసంగించారు. ఆదిలాబాద్‌ చరిత్రలో ఒకే ఒక్కడు జోగు రామన్న తన మాట నిలబెట్టుకుని కోరటా–చనాకా బ్యారేజీ చేయిస్తున్నాడని, పనులు పూర్తి కావచ్చాయని తెలిపారు. అలాగే బోథ్‌ నియోజకవర్గ అభ్యర్థి అనిల్‌జాదవ్‌ విజ్ఞప్తి మేరకు కుప్టి రిజర్వాయర్‌ ప్రారంభించి పూర్తి చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.

అనిల్‌జాదవ్‌ను గెలిపిస్తే బోథ్‌ రెవెన్యూ డివిజన్‌ను నెలరోజుల్లోనే ఏర్పాటు చేస్తానని చెప్పా రు. డిగ్రీ కళాశాల మంజూరు చేస్తామని తెలిపారు. ఇక్కడ టమాట సాగు చేస్తున్నందున కోల్డ్‌ స్టోరేజీ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. కోరటా–చనాకా కాలువతో 51వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. దీనిని పిప్పల్‌కోటి రిజర్వాయర్‌కు కూడా లింక్‌ చేసుకుంటే బ్రహ్మాండమైన అభివృద్ధి సాధ్యమని తెలిపారు. జోగు రామన్న, అనిల్‌జాదవ్‌ సామాన్య, ఉత్తమ వ్యక్తులని, ప్రజల్లో కలిసి ఉండేవారని కితాబిచ్చారు.

ఉత్సాహం నింపిన సభలు!
జిల్లాలో సీఎం కేసీఆర్‌ సభలు సక్సెస్‌ కాగా గులాబీ శ్రేణుల్లో ఆనందోత్సాహం కనిపిస్తోంది. ఆదిలాబా ద్‌, ఇచ్చోడలో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలకు భారీగా జనసమీకరణ చేశారు. ఆదిలాబాద్‌ డై ట్‌ మైదానం, ఇచ్చోడలోని బైపాస్‌ రోడ్డు వద్ద మైదా నంలో గురువారం భారీ సభలు నిర్వహించారు. మొదట ఆదిలాబాద్‌కు మధ్యాహ్నం 2.15గంటలకు కేసీఆర్‌ హెలీక్యాప్టర్‌లో చేరుకున్నారు. సీఎం రాక ఆలస్యమైనా జనాలు ఉత్సాహంగా ఎదురుచూడటం కనిపించింది. తెలంగాణ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వేణుగోపాలాచారి, అసెంబ్లీ మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి ఆయన వెంట వచ్చారు.

ఎమ్మెల్సీ దండే విఠల్‌, జెడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, డీసీసీబీ చైర్మన్‌ అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రావుత్‌ మనోహర్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు రోకండ్ల రమేశ్‌, మున్సి పల్‌ వైస్‌ చైర్మన్‌ జహీర్‌ రంజాని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఇచ్చోడ సభకు సీఎం చేరుకున్నారు. ఆదిలాబాద్‌ సభలో పాల్గొన్న నేతలతోపాటు మాజీ ఎంపీ గోడం నగేశ్‌, ఇచ్చోడ, బోథ్‌ ఎంపీపీలు ప్రీతంరెడ్డి, తుల శ్రీనివాస్‌, తాంసి జెడ్పీటీసీ సభ్యుడు రాజు, మండల కన్వీనర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలి..
జిల్లాలో అధికశాతం రైతులు పత్తి సాగు చేస్తున్నారు. ఇక్కడ టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తే వారికి మేలు జరగనుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల మంజూరు చేశారు. బీఎస్సీ అగ్రికల్చర్‌ కళాశాల ఏర్పాటు చేశారు. ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలిచ్చారు. మిగతా అందరికీ త్వరలో అందజేస్తారు. జిల్లాలో ఫార్మసీ, పీజీ కళాశాలలు కూడా ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇదివరకు జిల్లాకు అనేక నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో నడిపించిన సీఎంకు కృతజ్ఞతలు. – జోగు రామన్న, ఆదిలాబాద్‌ అభ్యర్థి

జనం బీఆర్‌ఎస్‌ వెంటే..
బోథ్‌ నియోజకవర్గ జనం ఉద్యమ కాలం నుంచి బీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారు. బోథ్‌లో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలి. డిగ్రీ కళాశాల, కుప్టి ప్రాజెక్ట్‌ కోసం టెండర్లు వేయాలి. ఇచ్చోడ, బోథ్‌ మండలాలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలి. చిక్‌మన్‌ ప్రాజెక్ట్‌ రీడిజైన్‌ చేయాలి. ఇచ్చోడలో పోలీస్‌ సబ్‌డివిజన్‌ ఏర్పాటు చేయాలి. – అనిల్‌జాదవ్‌, బోథ్‌ అభ్యర్థి
ఇవి చదవండి: తప్పుల తడక.. ఎప్పటికీ మారదిక!

Read latest Adilabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

17-11-2023
Nov 17, 2023, 08:37 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎన్ని సంస్కరణలు తెచ్చినా..ఎన్నిమార్లు సవరణలు చేసినా..ఎంత మంది ఫిర్యాదులు చేసినా ఓటరు లిస్టులో మాత్రం తప్పుల్ని నివారించలేకపోతున్నారు....
17-11-2023
Nov 17, 2023, 08:04 IST
ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరగాలంటే రాష్ట్ర పోలీసులతో పాటు సాయుధ దళాల బందోబస్తు కూడా ఎంతో ముఖ్యం. ఆ...
17-11-2023
Nov 17, 2023, 04:44 IST
సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 28,057 మందికి పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం...
17-11-2023
Nov 17, 2023, 04:31 IST
సాక్షి, ఆదిలాబాద్‌/ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:  పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో బీదాబిక్కీ, చిన్నాపెద్ద, కులమతా లకు...
17-11-2023
Nov 17, 2023, 03:39 IST
చెరుపల్లి వెంకటేశ్‌: కార్పొరేటర్‌ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగిన వారెందరో ఉన్నారు. హైదరాబాద్‌ బల్దియా నుంచే ఇలా ఎదిగిన వారూ  చాలామంది...
17-11-2023
Nov 17, 2023, 03:02 IST
యెన్నెల్లి సురేందర్‌ : మలివిడత తెలంగాణ ఉద్యమ కాలం నుంచి 2021వరకు ఎంతో సాన్నిహిత్యం, అనుబంధం ఉన్న సీఎం కేసీఆర్, మాజీ...
17-11-2023
Nov 17, 2023, 00:39 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయి...
16-11-2023
Nov 16, 2023, 14:57 IST
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరగబోయే మూడో అసెంబ్లీ ఎన్నికలు ఇవి. గత ఎన్నికల ప్రక్రియ ముగిశాక.. తెలంగాణ అసెంబ్లీ కాలపరిమితి 2019 జనవరి 15వ తేదీ...
16-11-2023
Nov 16, 2023, 13:58 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/జెడ్పీసెంటర్‌ /జడ్చర్ల/ దేవరకద్ర: ఎన్నికల ప్రక్రియలో కీలకఘట్టం ముగిసింది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అసెంబ్లీ...
16-11-2023
Nov 16, 2023, 11:24 IST
ఇబ్రహీంపట్నం: కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి దండెం రాంరెడ్డి బుధవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇబ్రహీంపట్నం స్థానం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌...
16-11-2023
Nov 16, 2023, 11:24 IST
సాక్షి, ఆసిఫాబాద్‌: జిల్లాలో శాసనసభ ఎన్నికలు సెగ పుట్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సిర్పూర్‌ బరిలో నిలిచిన బీఆర్‌ఎస్‌, బీఎస్పీ అభ్యర్థులు...
16-11-2023
Nov 16, 2023, 10:49 IST
రోడ్‌ షోలు, బహిరంగ సభలు అత్యధికంగా నాంపల్లి నుంచి 34 మంది కంటోన్మెంట్‌ నుంచి అత్యల్పంగా 10 మంది.. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఇదీ పరిస్థితి ఎన్నికలకు...
16-11-2023
Nov 16, 2023, 10:46 IST
ఆదిలాబాద్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ నుంచి టిక్కెట్‌ను ఆశించిన గండ్రత్‌ సుజాత నిరాదరణకు గురయ్యారు. ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ టిక్కెట్‌ కంది...
16-11-2023
Nov 16, 2023, 10:37 IST
సాక్షి, మేడ్చల్‌ జిల్లా: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావడంతో పోటీలో...
16-11-2023
Nov 16, 2023, 09:59 IST
సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఈ క్రమంలో అందరి దృష్టిని మాత్రం ఓ పాట ఆకర్షిస్తోంది. అన్ని...
16-11-2023
Nov 16, 2023, 08:28 IST
సాక్షి,ఆదిలాబాద్‌: ‘ఆదివాసీ, లంబాడాలు కాంగ్రెస్‌ పార్టీకి రెండు కళ్ల లాంటివారు.. 12 అసెంబ్లీ స్థానాల్లో ఆరు లంబాడాలకు, ఆరు ఆదివాసీలకు...
16-11-2023
Nov 16, 2023, 07:25 IST
యాదగిరిగుట్ట రూరల్‌: ‘నేను ఓట్లు అడుక్కోవడానికి వచ్చాను.. మీ దయ ఉంటే ఓట్లు వేయండి.. లేదంటే లేదు’ అని ఆలేరు...
16-11-2023
Nov 16, 2023, 06:27 IST
వెంగళరావు నగర్‌: కాంగ్రెస్‌ పార్టీ హయాంలో మాత్రమే నగరం అభివృద్ధి చెందిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం...
16-11-2023
Nov 16, 2023, 06:27 IST
హైదరాబాద్: ముస్లిం గొంతును వినిపించే ఆల్‌ ఇండియా మజ్లిస్‌–ఏ– ఇత్తేహదుల్‌ ముస్లిమీన్‌న్‌ (ఏఐఎంఐఎం) పార్టీ ‘గోషామహల్‌ –జూబ్లీహిల్స్‌’ అసెంబ్లీ స్థానాలపై వ్యవహరిస్తున్న...
16-11-2023
Nov 16, 2023, 06:18 IST
● బలం ఉన్న నాయకులపై ప్రధాన పార్టీల అభ్యర్థుల దృష్టి ● నిత్యం జంపింగ్‌లతో ప్రజల్లో అయోమయం ● జిల్లాలో... 

Read also in:
Back to Top