breaking news
LPG Gas Supply
-
భారత్‌కు మరో భారీ ఎల్పీజీ నౌక
వదినార్ (గుజరాత్): పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ భారత్‌కు ఊరటనిచ్చే వార్త వినిపించింది. దేశంలో ఎల్పీజీ కొరత వెంటాడుతున్న తరుణంలో 47,000 మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో కూడిన ‘నందా దేవి’ నౌక సురక్షితంగా గుజరాత్‌లోని వదినార్ పోర్టుకు చేరుకుంది. ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ జలసంధిని దాటుకుని భారత్ చేరుకున్న రెండో భారీ ఎల్పీజీ నౌక ఇది.నౌకాదళాల పహారాలో ప్రయాణంయుద్ధ వాతావరణం నడుమ అత్యంత ఉద్రిక్తత నెలకొన్న ప్రాంతం గుండా ఈ నౌక ప్రయాణించింది. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖతో పాటు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న ప్రత్యేక చొరవతో ఇది సాధ్యమైంది. భారత నౌకాదళం, ఇరానియన్ నేవీలు సంయుక్తంగా ఈ నౌకకు రక్షణ కవచంలా నిలిచి ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ను దాటించాయి.తీరనున్న కొరతప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభం దృష్ట్యా, ఈ 47,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ భారత్‌కు ఎంతో కీలకం కానుంది. వదినార్ నుంచి ఈ నౌక కాండ్లా పోర్టుకు వెళ్లనుందని, అక్కడ గ్యాస్‌ను అన్లోడ్ చేస్తారని అధికారులు తెలిపారు. ‘ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. భవిష్యత్తులో కూడా దేశ అవసరాలకు తగ్గట్లుగా ఎల్పీజీ సరఫరాను కొనసాగిస్తాం’ అని నందా దేవి నౌక చీఫ్ ఆఫీసర్ హర్షం వ్యక్తం చేశారు.వరుసగా చేరుతున్న నౌకలుఇంతకుముందే 40,000 మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో ‘శివాలిక్’ అనే నౌక ముంద్రా పోర్టుకు చేరుకుంది. ఇందులో 20,000 టన్నులను ముంద్రాలో, మిగిలిన 20,000 టన్నులను మంగళూరులో అన్లోడ్ చేయనున్నారు. వీటితో పాటు యూఏఈ నుంచి 81,000 టన్నుల ముడి చమురుతో వస్తున్న ‘జగ్ లాడ్కి’ నౌక కూడా భారత్ వైపు వస్తోంది. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో భారత జెండాతో ఉన్న మరో 22 నౌకలు ప్రయాణిస్తున్నాయి. అందులోని 611 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని, గత 24 గంటల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు. ఈ వరుస సరఫరాలతో దేశంలో గ్యాస్, ఇంధన కొరత తీరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
ఎల్పీజీ సంక్షోభంపై కేంద్రం అబద్దాలు చెబుతోంది : మల్లిఖార్జున ఖర్గే
న్యూఢిల్లీ: ఇరాన్ వార్తో దేశంలో ఎల్పీజీ గ్యాస్ లభ్యంత గందరగోళంగా మారింది. సోమవారం పార్లమెంటులో ఈ సంక్షోభంపై దుమారం రేగింది. ఒకవైపు ఎల్పీజీ కొరతలేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి ఆందోళనగా కరంగా ఉందని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. దీంతో ప్రతిపక్ష నాయకుడు (ఎల్ఓపి) మల్లికార్జున్ ఖర్గే, జె.పి. నడ్డా మధ్య వాగ్వాదంచోటు చేసుకుంది. జీరో అవర్ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, గల్ఫ్ యుద్ధం మరియు హార్ముజ్ జలసంధి దిగ్బంధనం వల్ల ఏర్పడిన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఎల్పిజి సరఫరాపై ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ కేంద్రంపై మండిపడింది. రాజ్యసభలో ఎల్పిజి సంక్షోభ అంశాన్ని లేవనెత్తిన మల్లికార్జున్ ఖర్గే సిలిండర్ల ప్యానిక్ బుకింగ్‌పై ఖర్గే విమర్శలు గుప్పించారు. ఎల్పిజి సమస్య మధ్యతరగతి, రెస్టారెంట్లు, హాస్టళ్లు , వాణిజ్య వినియోగ దారులను ప్రభావితం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో, ఎల్పిజి లభ్యత, ధర స్థిరత్వం తీవ్రమైన సమస్యలుగా మారాయనే విషయాన్ని కేంద్రం గుర్తించాలన్నారు. కేంద్ర పెట్రోలియం మంత్రి ఎల్పిజి కొరత లేదని లోక్‌సభలో ప్రకటించిన వైనాన్నిఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చెబుతున్న వాదనలు తప్పు అని వాస్తవాలు రుజువు చేస్తున్నామని మండిపడ్డారు.హార్ముజ్ జలసంధి దిగ్బంధనంతో తలెత్తిన ఇంధన సంక్షోభాన్ని ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేదని ఖర్గే ఆరోపించడంతో జీరో అవర్ సమయంలో ఘర్షణ చెలరేగింది.దేశవ్యాప్తంగా ఎల్పిజి సిలిండర్ల తీవ్ర కొరతకు ప్రభుత్వమే కారణమని ఖర్గే అన్నారు. మధ్యతరగతి , పేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని అన్నారు. రెస్టారెంట్లు, హాస్టళ్లు కమ్యూనిటీ కిచెన్లను మూసివేయాల్సి వచ్చిందని, ఎల్పిజి సిలిండర్లను అధిక ధరలకు అమ్ముతున్నారని ఆయన పేర్కొన్నారు.దేశంలో 60 శాతం ఎల్పిజి దిగుమతి అవుతుందని, ఇందులో 90 శాతం సరఫరా హోర్ముజ్ జలసంధి ద్వారా జరుగుతుంద న్నారు. ప్రపంచ చమురు సంక్షోభానికి దారితీసే కీలకమైన సముద్ర మార్గం ఇది అని అన్నారు. ఎల్పిజి సరఫరాపై కేంద్రం ముందస్తు ప్రణాళిక వేసుకుని ఉంటే, ఈపరిస్థితి తలెత్తేది కాదన్నారు. ఖర్గే ఎరువుల సరఫరా కొరతను కూడా ఎత్తిచూపారు.అలాగే సిలిండర్ కోసం వెయిటింగ్ సమయాన్ని కూడా 21 - 25 రోజులకు పెంచారు, ఇది, బ్లాక్ మార్కెటింగ్‌కు దారితీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం ప్రభుత్వ పేలవమైన ప్రణాళిక నిదర్శనమని, ఇది విదేశాంగ విధానంపై కూడా ప్రశ్నలను లేవనెత్తుతుదని ఖర్గే మండిపడ్డారు. ప్రణాళిక లేకపోవడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి దేశంలో ఎల్పిజి సరఫరాపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు.నడ్డా కౌంటర్ ఖర్గే విమర్శలతో సభలో వేడి రాజుకుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు, నడ్డా కూడా స్పందించారు. జీరో అవర్ కారణంగా సభ్యులు ప్రజా సమస్యలపై లేవనెత్తాల్సిన అవసరం ఉందని, చైర్ జోక్యం చేసుకోవాలని నడ్డా కోరారు. సభలో తీవ్రమైన అంశాలపై చర్చలు జరుగుతున్నపుడు వాటిపై శ్రద్ధపెట్టకుండా ప్రతిపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు LPG సమస్యపై మాట్లాడకుండా ఇతర అంశాలపై మాట్లాడటానికే మొగ్గు చూపారంటూ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల ఆందోళన అయితే ప్రతిపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, LPG సంక్షోభం విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడిని కొనసాగించాయి. ప్రతిపక్షాల వైపు నుంచి గందరగోళం కొనసాగుతుండగానే, సభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ ముగించాలని ఖర్గేను కోరారు. ఖర్గే చేసిన ఆరోపణలకు బదులిస్తూ, నడ్డా ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగారు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు అసలు ఈ సంక్షోభం దేశం వల్ల కాదని, ప్రపంచవ్యాప్త కారణాల వల్లే తలెత్తిందని పేర్కొన్నారు. కాగా దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు మరియు వంట గ్యాస్ నిరంతరాయంగా లభ్యతను నిర్ధారించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సిలిండర్లకు సంకెళ్లు.. బడిలో పానీపూరీ భోజనం
దేశంలో ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత సామాన్యునికి ఊపిరి ఆడనివ్వడం లేదు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, సరఫరాలో అంతరాయాల వల్ల గ్యాస్ సిలిండర్ ఇప్పుడు సామాన్య వస్తువు కాదు.. ఒక విలాసవంతమైన వస్తువుగా మారిపోయింది. ఈ సంక్షోభం ఎంతటి వింత పరిస్థితులకు దారితీసిందంటే.. ఐఐటీ లాంటి విద్యాసంస్థల మెనూలు మారిపోయాయి.. సిలిండర్లకు సెక్యూరిటీ పెరిగింది. ఇటువంటి ఆసక్తికర కథనాల సమాహారం మీకోసం..సిలిండర్లకు ఇనుప గొలుసుల పహారా!మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో గ్యాస్ సిలిండర్ల దొంగతనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ‘వెల్వెట్ గార్డెన్’ లాంటి వంటి నివాస ప్రాంతాల్లో దొంగలు సిలిండర్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీంతో అక్కడి ప్రజలు తమ సిలిండర్లను కాపాడుకునేందుకు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. వాచ్మెన్ క్వార్టర్లలో ఉండే స్టోర్ చేసే సిలిండర్లకు ఇనుప గొలుసులతో తాళాలు వేసి భద్రపరుస్తున్నారు. గ్యాస్ దొరకడమే కష్టమైన వేళ.. ఉన్న సిలిండర్లు దొంగలపాలైతే ఆకలితో అలమటించాల్సి వస్తుందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ఐఐటీ బాంబేలో 'నో ఫ్రైడ్.. ఓన్లీ ఐస్‌క్రీమ్'!దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థ అయిన ఐఐటీ బాంబేలో గ్యాస్ కొరత కారణంగా విచిత్ర పరిస్థితి నెలకొంది. అక్కడ వందలాది మంది విద్యార్థులకు భోజనం వండటం మెస్ నిర్వాహకులకు సవాలుగా మారింది. దీంతో వారు తమ మెనూని పూర్తిగా మార్చేశారు. గ్యాస్ ఎక్కువగా ఖర్చయ్యే వేపుడు పదార్థాలను పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో గ్యాస్ అవసరం లేని ఐస్‌క్రీమ్‌లు, చల్లని పదార్థాలను అందిస్తున్నారు.బడిలో పానీ పూరీల భోజనం!పశ్చిమ బెంగాల్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వడ్డించిన మధ్యాహ్న భోజనం అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్యాస్ సిలిండర్ల కొరతతో వంట చేయడం అసాధ్యం కావడంతో, పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు పానీపూరీలను భోజనంగా అందించింది. అన్నం, కూరలకు బదులు చాట్ ఐటమ్స్ వడ్డించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గ్యాస్ సంక్షోభం చిన్నారుల ఆకలిపై ఎంతటి ప్రభావం చూపుతుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.పెళ్లిళ్లలో గ్యాస్ తిప్పలు.. క్యాటరర్ల హైరానా!ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అయితే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత పెళ్లిళ్ల విందుపై విపరీతమైన ప్రభావం చూపుతోంది. హోటళ్లు, క్యాటరింగ్ సర్వీసుల వారికి గ్యాస్ అందక సతమతమవుతున్నారు. కొన్ని చోట్ల పెళ్లిళ్లలో భారీ విందులు ఏర్పాటు చేయడం కష్టతరం కావడంతో మెనూని కుదించడం లేదా గ్యాస్ అవసరం లేని వంటకాల వైపు మొగ్గు చూపడం జరగుతోంది. సిలిండర్లు దొరకక పోతే శుభకార్యాలు ఎలా నిర్వహించాలని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వీధి వ్యాపారుల ఉపాధి గల్లంతు!నగరాల్లోని స్ట్రీట్ ఫుడ్ వెండర్లు, చిన్న చిన్న హోటల్ నిర్వాహకుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. సిలిండర్ల ధరలు పెరగడమే కాకుండా, అసలు సరఫరానే నిలిచిపోవడంతో వేలాది మంది వ్యాపారులు తమ బండ్లను మూసివేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూసినా ఫలితం ఉండటం లేదని, ఫలితంగా తమ రోజువారీ ఆదాయం దెబ్బతింటోందని చిన్న వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అంతర్జాతీయ ప్రభావం.. స్థానిక కష్టాలు!ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ మేఘాలు, ముఖ్యంగా ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపాయి. దీని ప్రభావంతోనే భారత్‌లో ఎల్పీజీ కొరత ఏర్పడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రవాణా వ్యవస్థ దెబ్బతినడం, ధరల పెరుగుదల వల్ల సామాన్యుడి వంటగదిలో మంట ఆరిపోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది.సంక్షోభంలో సామాన్యుడి పోరాటం!ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే సామాన్యుల జీవనం మరింత దుర్భరంగా మారుతుందనడంలో సందేహం లేదు. సిలిండర్లకు తాళాలు వేసుకోవడం, వంటలు మానేసి ఐస్‌క్రీమ్‌లు తినడం వంటివి తాత్కాలిక పరిష్కారాలే కానీ, శాశ్వత పరిష్కారం కాదు. గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని, ధరలను అదుపులోకి తీసుకురావాలని దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.ఇది కూడా చదవండి: ‘దళపతి’ మైండ్ గేమ్.. దిక్కుతోచని బీజేపీ? -
ఎల్పీజీ కొరత.. మారిన ఆహార అలవాట్లు
న్యూఢిల్లీ/ముంబై: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాల కారణంగా ఇంధన సరఫరా వ్యవస్థలో ఆటంకాలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత తీవ్రతరమవుతోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ తదితర నగరాల్లో సిలిండర్ల కోసం వినియోగదారులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. గ్యాస్ సరఫరాలో అనిశ్చితి నెలకొనడంతో హోటళ్లు తమ మెనూలను కుదిస్తుండటంతో ఇడ్లీలు, దోశలు తినేవారు టీ, కాఫీలతోనే సరిపెట్టుకుంటున్నారు. మెనూలో కోతలుదేశ రాజధాని ఢిల్లీలోని విద్యాసంస్థల క్యాంటీన్లపై ఎల్పీజీ కొరత ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని పలు క్యాంటీన్లు ఇప్పటికే మెనూలోని స్నాక్స్ ఐటమ్స్‌ను నిలిపివేశాయి. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ క్యాంటీన్ తన ‘మటన్ దోశ’ను తాత్కాలికంగా తొలగించింది. ధరలు పెంచలేక, గ్యాస్ దొరకక వంటకాలను తగ్గించుకుంటున్నామని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముంబైలో మరీ దారుణంసిలిండర్ రీఫిల్ కోసం ఆఫీసులకు సెలవులు పెట్టి మరీ డీలర్ల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి ముంబైవాసులకు ఏర్పడింది. గ్యాస్ కొరత కారణంగా ముంబైలోని పలు రెస్టారెంట్లు మళ్లీ పాత కాలపు బొగ్గు పొయ్యిల బాట పట్టాయి. మరోవైపు బెంగళూరులో ఆటో గ్యాస్ ధరలు రెండు రోజుల్లోనే లీటరుకు రూ. 10 వరకు పెరగడం వాహనదారులను కోలుకోలేని దెబ్బతీసింది. ఇందిరా క్యాంటీన్ల నిర్వహణపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది.టిఫిన్ బాక్సుల షేరింగ్..పుణెలో విద్యార్థుల మెస్ నిర్వహణ భారంగా మారడంతో ధరలు పెంచక తప్పడం లేదు. దీంతో విద్యార్థులు ఒకే టిఫిన్ బాక్సును ఇద్దరు పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోల్‌కతా, అజ్మీర్ తదితర నగరాల్లో కమర్షియల్ సిలిండర్ల కొరత వల్ల హోటల్ యజమానులు కట్టెలు, బొగ్గును వినియోగిస్తున్నారు. దీంతో మార్కెట్లో బొగ్గు, కట్టెల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. కేజీ బొగ్గు ధర రూ. 30 నుంచి రూ. 35కి చేరగా, కట్టెల ధరలు కూడా అమాంతం పెరిగాయి. పశ్చిమాసియా సంక్షోభం త్వరగా ముగియకపోతే, రాబోయే రోజుల్లో ఇంధన కష్టాలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: వార్ ఎఫెక్ట్: మూసివేత దిశగా ప్రముఖ కాఫీ హౌస్? -
ఖాళీ సిలిండర్ల కామెడీ.. ‘మీమ్స్’ మహోత్సవం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన ఆటంకాలు సామాన్యులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సిలిండర్ బుక్ చేశాక రోజుల తరబడి నిరీక్షించాల్సి రావడంతో, వినియోగదారులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. అయితే ఈ పరిస్థితులను కొందరు తమదైన శైలిలో హాస్యంగా మలుస్తున్నారు. గ్యాస్ కష్టాలపై సోషల్ మీడియా వేదికగా షేర్ అవుతున్న ‘మీమ్స్’ ప్రస్తుతం ఇంటర్నెట్ను ఊపేస్తున్నాయి.‘ఉత్తుత్తి’ వంటలు.. వివిధ విన్యాసాలుపశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ దిగుమతులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా పలు ప్రాంతాల్లో సిలిండర్ల కోసం వినియోగదారులు క్యూ కడుతున్నారు. ఇదే తరుణంలో నెటిజన్లు తమ సృజనాత్మకతకు పదును పెడుతున్నారు. ‘ఖాళీ సిలిండర్లు - నిండుగా కామెడీ’ అన్నట్లుగా పరిస్థితి మారింది. స్టవ్ మీద వంట చేస్తున్నట్లు నటిస్తూ, ‘ఇది ఊహాజనిత గ్యాస్’ అని పేర్కొనే వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరికొందరు.. మళ్లీ పాతకాలం నాటి కట్టెల పొయ్యిల వైపు మళ్లుతున్నట్లుందని అంటున్నారు.గ్యాస్ అప్పు ఇస్తారా?గతంలో ఇరుగుపొరుగు వారి వద్ద చక్కెర, పాలు అప్పుగా తీసుకునేవారమని, ఇప్పుడు గ్యాస్ అప్పు ఇస్తారా? అని అడిగే రోజులు వచ్చాయంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. సిలిండర్లను బంగారు ఆభరణాల్లాగా దాచుకోవడం, వాటికి సెక్యూరిటీ గార్డులను పెట్టుకోవడం వంటి మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. కేవలం గృహ అవసరాలకే కాకుండా, వాణిజ్య రంగంపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరలు దాదాపు 8 శాతం పెరగడంతో రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వహణ భారంగా మారింది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ సరఫరా వ్యవస్థ దెబ్బతినవచ్చనే భయంతో చాలామంది ముందస్తుగా సిలిండర్లను నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కృత్రిమ కొరతకు కూడా దారితీస్తోంది.పరిస్థితిని చక్కదిద్దేందుకు భారత ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇప్పటికే మధ్యప్రాచ్య దేశాలతో చర్చలు జరిపారు. హార్ముజ్ జలసంధి గుండా చమురు ట్యాంకర్ల రాకపోకలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని 25 శాతం పెంచాలని రిఫైనరీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెట్రోలియం శాఖ భరోసా ఇస్తున్నప్పటికీ, అంతటా పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: ఎల్పీజీ కష్టాలకు త్వరలో విముక్తి: మంత్రి సురేష్ గోపి -
శాండ్విచ్ కోసం లాయర్లు క్యూ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నెలకొన్న వంటగ్యాస్ (ఎల్పీజీ) కొరత న్యాయస్థాన ప్రాంగణాలనూ తాకింది. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా ఢిల్లీ హైకోర్టులోని ‘లాయర్స్ క్యాంటీన్’లో ప్రధాన భోజన వసతిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ లభ్యత కష్టతరంగా మారడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్ ఇన్ఛార్జ్ సందీప్ శర్మ తాజాగా న్యాయమూర్తుల కార్యదర్శికి, న్యాయవాదులకు ఒక విజ్ఞప్తి చేశారు. గ్యాస్ సిలిండర్ల నిల్వలు నిండుకోవడంతో, వంట చేయడానికి వీలు లేక ‘మెయిన్ కోర్స్’ తయారీని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి రాగానే తిరిగి భోజన సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం వంట గ్యాస్‌తో సంబంధం లేని శాండ్విచ్లు, సలాడ్లు, ఫ్రూట్ చాట్ వంటి అల్పాహారాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. దీంతో న్యాయవాదులు, కోర్టు పనులపై వచ్చేవారు మరోమార్గం లేక క్యాంటీన్లోని శాండ్వించ్ల కోసం క్యూ కడుతున్నారు.పశ్చిమాసియా సంక్షోభం కారణంగా చమురు ధరలు పెరగడంతో, కేంద్ర ప్రభుత్వం మార్చి 7న ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 60 పెంచింది. దీంతో ఢిల్లీలో సబ్సిడీ లేని సిలిండర్ ధర రూ. 913కు చేరింది. కేవలం ధరల పెరుగుదలే కాకుండా, సరఫరాలో ఏర్పడిన అవరోధాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో గ్యాస్ కొరత తీవ్రమైంది. ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో వినియోగదారులు సిలిండర్ల కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద తెల్లవారుజాము నుంచే బారులు తీరుతున్నారు. గత పది రోజులుగా ఈ పరిస్థితి నెలకొందని, ఒక్కో ఏజెన్సీ వద్ద వందలాది మంది వేచి చూడాల్సి వస్తోందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘నిత్యావసర వస్తువుల చట్టాన్ని’ ప్రయోగించింది. గృహ అవసరాలు, ఆస్పత్రులు, అత్యవసర సేవలకు ఎల్పీజీ సరఫరాలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇందులో భాగంగా డొమెస్టిక్ రీఫిల్ బుకింగ్‌ల మధ్య 25 రోజుల గడువును తప్పనిసరి చేసింది. వాణిజ్య అవసరాలకు సరఫరాను పరిమితం చేయడంతో హోటళ్లు, క్యాంటీన్లపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: పప్పన్నం పెట్టకుండా 10 వేల పెళ్లిళ్లు? -
ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం హోటల్ రంగాన్ని తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తోంది. గల్ఫ్ దేశాల నుంచి పెట్రో ఉత్పత్తుల దిగుమతికి ఆటంకాలు ఎదురవుతుండటంతో దేశంలో వాణిజ్యావసరాలకు ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. గృహావసరాలకు, అత్యవసర సేవలు అందించే ఆస్పత్రులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. మరోవైపు ఈ నెల 7వ తేదీ నుంచి గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచింది. కేంద్రం ఆంక్షల నేపథ్యంలో గ్యాస్ ఏజెన్సీలు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేశాయి. దీంతో ఇప్పటికే ముంబై, బెంగళూరులో 20 శాతం హోటళ్లు మూతపడినట్లు తెలుస్తోంది. చిన్న, మధ్య తరగతి హోటళ్లు, మెస్‌లు, హాస్టళ్లపై సైతం దీని ప్రభావం పడుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి ప్రధాన నగరాల్లోనూ సమస్య తలెత్తుతున్నట్టు సమాచారం. వీరికి హోటళ్లే ఆధారం తెలంగాణలో 1.49 కోట్ల గృహ వినియోగదారులు ఉండగా, నెలకు కోటికి పైగా సిలిండర్లు వినియోగమవుతున్నాయి. అలాగే 5 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉండగా, వినియోగం దానికి రెట్టింపు స్థాయిలో ఉంటుంది. కాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25 వేలకు పైగా మీడియం స్థాయి హోటళ్లు, రెస్టారెంట్లు ఉండగా, చిన్న హోటళ్లు భారీ ఎత్తున ఉన్నాయి. మెస్‌లు, చిన్న చిన్న రోడ్డుపక్క హోటళ్లు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇక స్టార్ హోటళ్లు, క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. చిన్న చిన్న హోటళ్లు రోజుకు ఒక సిలిండర్, పెద్దవి 3–5 వినియోగిస్తాయి. వినియోగదారులను బట్టి రెస్టారెంట్లు, బార్లలో కూడా రోజుకు ఐదుకు తక్కువ కాకుండా సిలిండర్ల వినియోగం ఉంటుంది. అదే స్టార్ హోటళ్లు రోజుకు 25 సిలిండర్లకు పైగా వినియోగిస్తాయి. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, మంచిర్యాల, రామగుండం, కొత్తగూడెం వంటి నగరపాలక సంస్థలతో పాటు జిల్లా కేంద్రాలు, మునిసిపాలిటీలు, మండల కేంద్రాలలోని హోటళ్లలో కూడా గ్యాస్ సిలిండర్ల వినియోగం పెద్ద ఎత్తున ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులకు హోటల్ ఆహారమే ఆధారం. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేస్తే హోటళ్లు మూత పడడమే కాకుండా లక్షలాది మంది ఉపాధికి గండి పడుతుంది. 60–65 శాతం ఎల్పీజీ దిగుమతి భారత్ 60–65 శాతం ఎల్పీజీ కోసం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇరాన్, సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి సరఫరా ఆగిపోవడంతో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. 2025లో ఎల్పీజీ వినియోగం 31 మిలియన్ టన్నులకు చేరగా, దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి కేవలం 12–13 మిలియన్ టన్నులకే పరిమితమవడంతో సమస్య మరింత ఉధృతమైంది. ప్రత్యామ్నాయాల అన్వేషణలో హోటల్ రంగం తాజా పరిస్థితులతో ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు హోటల్ రంగం మొగ్గు చూపుతోంది. ఎలక్ట్రిక్ స్టవ్‌లు, బయోగ్యాస్ వంటి ఆప్షన్లు పరిశీలిస్తున్నప్పటికీ, అవి ఖర్చుతో కూడుకున్నవే గాక తక్షణ పరిష్కారానికి వీలుకానివనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు వంటగదుల్లో విద్యుత్ వినియోగం పెంచే ఆలోచనలో హోటళ్ల యజమానులు ఉన్నారు. హైదరాబాద్‌లో పుష్కలంగా నిల్వలు యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడుతుందనే ప్రచారంతో సాధారణ రోజుల కంటే ఇప్పుడు గృహ వినియోగం బుకింగ్‌ల సంఖ్య 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో సిలిండర్ల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, వినియోగదారులు అనవసరంగా భయాందోళన చెందవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి: భారత్ గ్యాస్ వంట గ్యాస్ కొరతపై జరుగుతున్న ప్రచారంతో ప్రజలు ఆందోళన చెందుతుండడంతో గ్యాస్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. భారత్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్..ఎల్పీజీ వినియోగదారులు ఆందోళన చెందవద్దంటూ సంక్షిప్త సందేశాలు పంపుతోంది. ‘ఇంధన సరఫరాలో కొరత ఉందని సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదారి పట్టించే, ఆధార రహితమైన వార్తలు ప్రచారం చేస్తున్నారు. దేశంలో ఇంధనం సమృద్ధిగా అందుబాటులో ఉంది. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నాం. ఇంధనాన్ని సమర్థవంతంగా, అవసరానికి అనుగుణంగా వినియోగించడం మంచిది’ అని బీపీసీఎల్ ఆంగ్లంలో ఎస్ఎంఎస్లు పంపించింది. అయితే గృహ వినియోగదారులు ఒకసారి గ్యాస్ బుక్ చేసిన తర్వాత మరోసారి బుక్ చేయాలంటే ఇప్పటివరకు ఉన్న 21 రోజుల గడువును 25 రోజులకు పెంచుతూ ఆయిల్ కంపెనీల నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఏజెన్సీలు చెబుతున్నాయి. హోటళ్లు మూతపడే ప్రమాదం: హోటల్స్ అసోసియేషన్ వాణిజ్య ఎల్పీజీ సరఫరా నిలిచిపోతే హోటల్ రంగం మూతపడే పరిస్థితి ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్ర హోటళ్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. సంఘం అధ్యక్షుడు ఎస్.వెంకటరెడ్డి, కార్యదర్శి సీహెచ్ వేణుగోపాల్ తదితరులు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కలిసి సమస్యను వివరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మంత్రి ఢిల్లీకి వెళ్లిన కారణంగా వచ్చిన తర్వాత ఆయన్ను కలుస్తామని వెంకటరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటివరకు హైదరాబాద్ నగరంలో హోటళ్లు మూతపడిన దాఖలాలు లేవని, కానీ సోమవారం నుంచి కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేశారని ఆయన వివరించారు. -
భారీగా గ్యాస్ కొరత... మూతపడ్డ హోటళ్లు కేంద్రం కీలక నిర్ణయం
-
గ్యాస్ సరఫరాపై యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బుకింగ్స్
-
సమ్మె అయినా గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆగదు
హైదరాబాద్: సదరన్ రీజియన్ బల్క్ ఎల్పీజీ ట్రాన్స్పోర్ట్ ఓనర్స్ అసోసియేషన్‌కు చెందిన బల్క్ ఎల్పీజీ రవాణాదారుల సమ్మె నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్) తమ ఎల్పీజీ వినియోగదారులకు తగినంత సిలిండర్ సరఫరా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చాయి. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల బాట్లింగ్ ప్లాంట్లలో బల్క్ ఎల్పీజీ నిల్వలు తగినంత ఉన్నాయన్నారు. ఎల్పీజీ పంపిణీ కేంద్రాలు యథావిధిగా పని చేస్తాయని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన రవాణా టెండర్‌ను అన్ని ప్రాంతాల ట్రాన్స్పోర్టర్లతో విస్తృత చర్చల తర్వాత తుది రూపం ఇచ్చారన్నారు. ఈ ప్రక్రియలో రవాణాదారుల వివిధ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమైన సందేహాలను నివృత్తి చేసేందుకు వివరణలు ఇచ్చారన్నారు.చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, గువాహటి నగరాల్లో నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశాల ద్వారా వారి అభిప్రాయాలను కూడా కలుపుకున్నారన్నారు. ఈ టెండర్ నిబంధనలను ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు, కేంద్ర విజిలెన్స్ మార్గదర్శకాలను పాటిస్తూ పూర్తిగా పారదర్శకంగా రూపొందించారని పేర్కొన్నారు. ఈ నిబంధనలు పీఈఎస్ఓ, పీఎన్జీఆర్బీ, ఓఐఎస్డీ వంటి చట్టబద్ధ సంస్థల మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందాయన్నారు. ఎల్పీజీ రవాణా భద్రత, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మా ప్రయత్నాల్లో భాగంగా ఈ కొత్త టెండర్ నిబంధనలను తీసుకు వచ్చామన్నారు.ఈ చర్యలు తీసుకున్నప్పటికి కొంతమంది రవాణాదారులు సమ్మెకు పిలుపునిచ్చారన్నారు. ప్రధానంగా భద్రతా ఉల్లంఘనలకు సంబంధించిన శిక్షా నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే, ఈ భద్రతా సంబంధిత చర్యలు ట్యాంకర్ యజమానులు, డ్రైవర్లు, వినియోగదారులు సహా అన్ని స్టేక్హోల్డర్లకు లాభదాయకంగా ఉంటాయని తెలిపారు. అవి మరింత భద్రతా ప్రమాణాలు కలిగిన, విశ్వసనీయమైన ఎల్పీజీ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడంలో సహాయపడతాయని పేర్కొన్నారు.మా స్టేక్హోల్డర్ల నుంచి బాధ్యతాయుతమైన చర్యలు, అవగాహనను ఆశిస్తున్నామన్నారు. తద్వారా అవసరమైన భద్రతా ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ ఎల్పీజీ సిలిండర్ల నిరంతర సరఫరాను నిర్ధారించవచ్చన్నారు. రవాణాదారులకు సమ్మెను విరమించాలని, అత్యవసరమైన ఎల్పీజీ సరఫరా నిల్వలను ప్రభావితం చేసే చర్యలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తద్వారా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడవచ్చన్నారు.ఓఎంసీలు ప్రధాన రవాణాదారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుందన్నారు. త్వరలో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలుగా గృహ అవసరాలు, వాణిజ్య అవసరాలు తీర్చేందుకు ఎల్పీజీ సరఫరాను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే ఎల్పీజీ సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
ఇక.. నేటి నుంచి మరో రెండు గ్యారంటీలు ప్రారంభం
సాక్షి, యాదాద్రి: కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి కింద రూ.500లకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను మంగళవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. బుధవారం నుంచి ఈ రెండు పథకాలు అమలులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌కు పంపించింది. తెల్ల రేషన్‌కార్డు (ఆహార భద్రతా కార్డు) ప్రామాణికంగా ఈ రెండు పథకాలను వర్తింపజేయనున్నారు. వీటి ద్వారా జిల్లాలో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందడంతో పాటు, నగదు బదిలీ పద్ధతిన గ్యాస్ వినియోగదారులకు రూ.500లకే సిలిండర్ అందనుంది. జిల్లాలో 2,16,942 ఆహార భద్రత కార్డులు జిల్లాలో 2,16,942 ఆహార భద్రత కార్డులున్నాయి. జిల్లాలో 3,11,415 గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. ప్రజాపాలనలో గ్యాస్ సబ్సిడీ కోసం 2,30,412 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్యాస్ వినియోగదారులు ముందుగానే మొత్తం డబ్బులు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తరువాత ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.500పోను మిగిలిన సబ్సిడీ మొత్తాన్ని బదిలీ చేస్తుంది. తెల్లరేషన్ కార్డుదారులకు ప్రతి రీఫిల్‌కు రూ.500సబ్సిడీ అందనుంది. గడిచిన మూడు సంవత్సరాల్లో వినియోగదారులు గృహ అవసరాలకు వాడిన గ్యాస్ సిలిండర్ల ఆధారంగా గ్యాస్ సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేకంగా లెక్కలు తీశారు. మార్చి1 అనంతరం జీరో బిల్లులు.. జిల్లాలో ఉచిత కరెంట్ కోసం 2,09,899 మంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 200 యూనిట్ల లోపు వాడే గృహ విద్యుత్ వినియోగదారులు 1,61,099 మంది ఉన్నారు. వీరి వివరాలను విద్యుత్ శాఖ సేకరించింది. లబ్ధిదారుల స్థానికత గుర్తింపు కోసం ఆధార్ కార్డు, ఆహార భద్రతా కార్డు, ఫోన్‌నంబర్లు సేకరించారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబంలో ఒక నెలలో 200 యూనిట్ల వరకు జీరో బిల్లును ఇస్తారు. మార్చి 1 అనంతరం వచ్చే విద్యుత్ బిల్లులతో జీరో బిల్లు పథకం అమలవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇవి చదవండి: లక్ష కోట్లు.. 5 లక్షల ఉద్యోగాలు -
ఊరట: మూడు నెలలు వంట గ్యాస్ ఫ్రీ?
సాక్షి, హైదరాబాద్: ఉజ్వల (దీపం) పథకం వంట గ్యాస్ లబ్దిదారులకు శుభవార్త. గృహోపయోగ వంట గ్యాస్ ధర చుక్కలు చూపిస్తున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల వినియోగదారులకు ఊరట కలిగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. వంట గ్యాస్ ధరల పెరుగుదల నేపథ్యంలో వరుసగా మూడు నెలలు పాటు ఉజ్వల వినియోగదారులకు ఉచితంగా సిలిండర్ రీఫిల్ సరఫరాల చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిసింది. ఇప్పటికే మూడు నెలల వ్యవధిలో గృహోపయోగ సిలిండర్ రీఫిల్‌పై రూ.225 పెరిగి ధర రూ. 871.50కు చేరింది. అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తుల ధరలకు అనుగుణంగా మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 1.42 లక్షల మంది.. హైదరాబాద్ మహానగర పరి«ధిలో సుమారు 26 లక్షల వంట గ్యాస్ వినియోగ కనెక్షన్లు ఉండగా, అందులో 1.42 లక్షల కుటుంబాలు ప్రధాన మంత్రి ఉజ్వల పథకం లబి్ధదారులుగా ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఆరి్థక సవంత్సరం (2021–22)లో మూడు నెలల పాటు 3 ఉచిత సిలిండర్లు అందించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. . కరోనా కాలంలో సైతం.. గత సంవత్సరం కరోనా లాక్డౌన్ సమయంలోనూ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద ఉజ్వల పథకం లబి్ధదారులందరికీ మూడు నెలల పాటు ఉచిత ఎల్íపీజీ సిలిండర్లు పంపిణీ చేశారు. తిరిగి అధిక ధరల నేఫథ్యంలో ఉచితంగా సరఫరా చేసి చేయూత అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో మాదిరిగానే వినియోగదారులు ఇంటి వద్దకు వచి్చన ఎల్íపీజీ సిలిండర్ల రీఫిల్‌ను బహిరంగ మార్కెట్ ధర ప్రకారం నగదు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి బదిలీ కానుంది. గ్రేటర్లో ఉజ్వల (దీపం) వంట గ్యాస్ కనెక్షన్లు ఇలా హైదరాబాద్- 81,083 మేడ్చల్- 20,231 రంగారెడ్డి- 40,766 -
‘డిమాండ్‌కు తగ్గట్టు గ్యాస్ సిలిండర్ల పంపిణీ’
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ కారణంగా ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండటంతో వంటగ్యాస్ వినియోగం పెరిగిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ శ్రవణ్ ఎస్. రావు తెలిపారు. లాక్డౌన్ ప్రారంభంలో సిలిండర్ బుకింగ్ బాగా పెరిగిపోయినప్పటికీ.. ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ డిమాండ్‌కు తగినట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సకాలంలో సిలిండర్లు అందించేందుకు ఇండియన్ పంపిణీదారులు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై సరఫరా యంత్రాంగానికి అవగాహన కల్పిస్తూ, గ్యాస్ నింపే ప్రదేశాల్లోనూ యాజమాన్యం అన్నివిధాలా అవసరమైన చర్యలు తీసుకుందని తెలిపారు. (రైతులకు తీపికబురు మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అన్ని ట్రక్కుల పరిశుభ్రతపైనా శ్రద్ధ వహిహస్తున్నామని తెలిపారు. ఖాళీ సిలిండర్లతో వచ్చే వాహనాలు తిరిగి గ్యాస్ నింపిన సిలిండర్లు తీసుకెళ్లేదాకా అన్ని స్థాయిల్లోనూ అత్యంత అప్రమత్తత పాటిస్తుమన్నారు. జిల్లా యంత్రాంగంతో సంప్రదిస్తూ వాహనాల రాకపోకలు, సిలిండర్ల సరఫరా కార్యకలాపాలను సజావుగా నిర్వహిస్తోందన్నారు. సిలిండర్ల బిల్లు చెల్లింపు నిమిత్తం కరెన్సీ నోట్లకు బదులుగా సాధ్యమైనంత వరకూ డిజిటల్ పద్ధతిని ఉపయోగించే విధంగా ఐఓసీఎల్ ఖాతాదారులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ప్రభుత్వం నిర్దేశించిన మేరకు లబ్ధిదారులకు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఒక్కొక్క ఉచిత సిలిండర్ అందజేయదానికి వీలుగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు సుమారు 73000 ఇండియన్ సిలిండర్లను (14.2 కేజీలు), 468 మంది లబ్దిదార్లకు 5 కేజీల సిలిండర్లను.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంచితంగా పంపిణీ చేసిందన్నారు. (ఏపీ డీజీపీకి విజయసాయిరెడ్డి లేఖ ) శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన నేపథ్యంలో ఒకవైపు వేలాది ప్రాణాలు బలికాగా, మరోవైపు ఆర్థిక వ్యవస్థలన్నీ మందగించాయి. ఈ భారీ ఆరోగ్య సంక్షోభంలో దేశమంతా దిగ్బంధమైన వేళ అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా దేశానికి, ప్రజలకు మద్దతుగా ఐఓసీఎల్ సిబ్బంది శక్తివంచన లేకుండా తమవంతు కర్తవ్యం నిర్వర్తిస్తున్నారు.ఈ పరీక్షా సమయంలో పెట్రో ఉత్పత్తుల సరఫరా క్రమం కుంటుపడకుండా పలు చర్యలు తీసుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వినియోగదారులకు సంతృప్తికరంగా సేవలందించేందుకు ఐఓసీఎల్ సిబ్బంది పూర్తి వ్యక్తిగత రక్షణ సరంజామాతో విధులు నిర్వర్తిస్తున్నారు’’. (ఏపీ పోలీసులు మంచి నిర్ణయం తీసుకున్నారు.. ) ‘‘ప్రాంతీయ కార్యాలయాలు, పంపిణీదారు ప్రాంగణాల వద్ద పూర్తిస్థాయిలో రక్షణ ఏర్పాట్లు చేశాము. వలస కార్మికుల వంటి అన్నార్తులకు ఆహారం, నీరు, పాలు తదితర నిత్యావసరాలను మానవతా దృష్టితో సరఫరా చేస్తున్నాము. వాహనాల డ్రైవర్లు సొంతంగా వంట చేసుకునేందుకు వీలుగా కూరగాయలు, కిరాణా సరకులు, వంటగ్యాస్ తదితరాలన్నీ ఉచితంగా అందిస్తున్నాము. అనూహ్య సంఘటనల్లో దురదృష్టవశాత్తూ సిబ్బందికి, కార్మికులకు ప్రాణనష్టం వాటిల్లితే రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించే ఏర్పాటు కంపెనీ చేసింది. వివిధ ప్రభుతరంగ సంస్థల తరహాలో ‘పీఎం కేర్స్’ సహాయ నిధిసహా ఇతర సహాయ నిధులకూ ఐఓసీఎల్ సంస్థతోపాటు ఉద్యోగులు, సిబ్బంది తమ జీతాల నుంచి విరాళమిచ్చారు’’. అని శ్రవణ్ తెలిపారు. (ఏప్రిల్ 20 తర్వాత లాక్డౌన్ సడలింపు) -
వేగంగా వంటగ్యాస్ సరఫరా
చెన్నై, సాక్షి ప్రతినిధి: వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాలో తరచూ ఏర్పడుతున్న జాప్యానికి చెక్పెట్టబోతున్నారు. బుక్ చేసుకున్న వారం రోజుల్లోనే ఇంటికి సిలిండరు సరఫరా చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) సిద్ధమవుతోంది. రాష్ట్రం మొత్తం మీద 1.12 కోట్ల గ్యాస్ సిలిండర్లు సరఫరాలో ఉండగా, ఒక్క చెన్నైలోనే రూ.12 లక్షలు ఉన్నాయి. అట్టడుగు వర్గాలు సైతం వంటగ్యాస్ వినియోగానికి అలవాటుపడిన తరుణంలో సక్రమంగా సరఫరా జరగని పక్షంలో సతమతమవుతున్నారు. వంటగ్యాస్ కంపెనీల నిబంధనల ప్రకారం బుక్ చేసుకున్న వారం రోజుల్లోగా గ్యాస్ సిలిండర్ చేరాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 20 నుంచి 30 రోజుల సమయం తీసుకుంటున్నారు. చెన్నైలో ఇటీవల ఒక మహిళ ఎంతకూ గ్యాస్ సరఫరా జరగక పోవడంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీస్ జోక్యంతో సిలిండరు పొందాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ జాప్యానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. కాలం చెల్లిన వంటగ్యాస్ సిలిండర్ల సంఖ్య పెరిగిపోవడం, వాటి స్థానంలో కొత్త సిలిండర్లు లేకపోవడం వంటివి కొన్ని కారణాలు. అయితే కొన్ని ఏజన్సీల్లోని ఉద్యోగులు సిలిండర్ల సరఫరాలో గోల్‌మాల్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. లోడు రాలేదు, ఇంకా జాప్యం కావచ్చు వంటి మాటలతో గ్యాస్ కంపెనీలపై నిందలు మోపి తమకు నచ్చిన వారికి సిలిండర్లు మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది. సిలిండర్ల సంఖ్యలో తగ్గుదల ఏజెన్సీలకు అవకాశంగా మారకుండా ఐవోసీ దృష్టి సారించింది. పదేళ్ల వినియోగకాలాన్ని దాటిన సిలిండర్లను ముందుగా తనిఖీ చేసే పనిలో పడింది. ఐవోసీ చెన్నై మండలం పరిధిలోని తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లోని పాత సిలిండర్లను సేకరించి రోజుకు 5 వేల నుంచి 10 వేల చొప్పున తనిఖీలు నిర్వహిస్తోంది. సరఫరాలో జాప్యానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఒక వైపు కాలం చెల్లిన సిలిండర్లను లెక్కకడుతూనే రెండు లక్షల కొత్త సిలిండర్లను సిద్ధం చేస్తున్నారు. ఈ విషయంపై ఐఓసీ అధికారి ఒక మీడియాతో మాట్లాడుతూ, వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఏర్పడిన డిమాండ్ మరో రెండు వారాల్లో సర్దుకుంటుందన్నారు. బుక్ చేసిన వారంలోగా సిలిండర్లు చేరేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్యాస్ ఏజెన్సీలు మోసానికి పాల్పడుతున్నట్లు రాతపూర్వక ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. చెన్నై ఆళ్వారుపేటకు చెందిన ఒక గృహిణి ఇటీవల ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడి గ్యాస్ ఏజన్సీపై క్రమశిక్షణ చర్యను చేపట్టామని అన్నారు.


