‘డిమాండ్‌కు తగినట్లుగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ’

IOC Executive Director Sravan: Increased Gas Consumption In Lockdown - Sakshi

సాక్షి, హైద‌రాబాద్ : లాక్‌డౌన్‌ కారణంగా ప్రతి ఒక్కరూ ఇళ్ల‌లోనే ఉండ‌టంతో వంట‌గ్యాస్ వినియోగం పెరిగిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ శ్రవణ్ ఎస్. రావు తెలిపారు. లాక్‌డౌన్‌  ప్రారంభంలో  సిలిండ‌ర్ బుకింగ్ బాగా పెరిగిపోయినప్పటికీ.. ఇప్పుడు సాధార‌ణ స్థితికి చేరుకుందని  బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ డిమాండ్‌కు త‌గిన‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో స‌కాలంలో సిలిండ‌ర్లు అందించేందుకు ఇండియన్‌ పంపిణీదారులు నిరంత‌రం శ్ర‌మిస్తున్నారన్నారు. ఈ సంద‌ర్భంగా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంపై స‌ర‌ఫ‌రా యంత్రాంగానికి అవ‌గాహ‌న క‌ల్పిస్తూ, గ్యాస్ నింపే ప్ర‌దేశాల్లోనూ యాజ‌మాన్యం అన్నివిధాలా అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుందని తెలిపారు. (రైతులకు తీపికబురు 

మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అన్ని ట్ర‌క్కుల ప‌రిశుభ్ర‌త‌పైనా శ్ర‌ద్ధ వ‌హిహస్తున్నామని తెలిపారు. ఖాళీ సిలిండ‌ర్ల‌తో వ‌చ్చే వాహ‌నాలు తిరిగి గ్యాస్ నింపిన సిలిండ‌ర్లు తీసుకెళ్లేదాకా అన్ని స్థాయిల్లోనూ అత్యంత అప్ర‌మ‌త్త‌త పాటిస్తుమన్నారు. జిల్లా యంత్రాంగంతో  సంప్ర‌దిస్తూ వాహ‌నాల రాక‌పోక‌లు, సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రా కార్య‌క‌లాపాల‌ను సజావుగా నిర్వహిస్తోందన్నారు. సిలిండర్ల బిల్లు చెల్లింపు నిమిత్తం కరెన్సీ నోట్లకు బదులుగా సాధ్యమైనంత వరకూ డిజిటల్‌ పద్ధతిని ఉపయోగించే విధంగా ఐఓసీఎల్‌ ఖాతాదారులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ప్ర‌ధాన‌మంత్రి ఉజ్వ‌ల యోజ‌న పథకం కింద ప్ర‌భుత్వం నిర్దేశించిన మేర‌కు ల‌బ్ధిదారులకు ఏప్రిల్‌, మే, జూన్ నెల‌ల్లో ఒక్కొక్క ఉచిత సిలిండ‌ర్ అందజేయదానికి వీలుగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు సుమారు 73000 ఇండియన్ సిలిండర్లను (14.2 కేజీలు), 468 మంది లబ్దిదార్లకు 5 కేజీల సిలిండర్లను.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్  ఉంచితంగా పంపిణీ చేసిందన్నారు. (ఏపీ డీజీపీకి విజయసాయిరెడ్డి లేఖ )

శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నారు
ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కోవిడ్‌-19ను ప్ర‌పంచ మ‌హ‌మ్మారిగా ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఒక‌వైపు వేలాది ప్రాణాలు బ‌లికాగా, మ‌రోవైపు ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌న్నీ మంద‌గించాయి. ఈ భారీ ఆరోగ్య సంక్షోభంలో దేశ‌మంతా దిగ్బంధ‌మైన వేళ అత్య‌వ‌స‌ర సేవ‌లు మాత్ర‌మే కొన‌సాగుతున్నాయి. ఇందులో భాగంగా దేశానికి, ప్ర‌జ‌లకు మ‌ద్ద‌తుగా ఐఓసీఎల్ సిబ్బంది శ‌క్తివంచన లేకుండా త‌మ‌వంతు క‌ర్త‌వ్యం నిర్వ‌ర్తిస్తున్నారు.ఈ ప‌రీక్షా స‌మ‌యంలో పెట్రో ఉత్ప‌త్తుల స‌ర‌ఫ‌రా క్ర‌మం కుంటుప‌డ‌కుండా పలు చర్యలు తీసుకుంటున్నాము. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో వినియోగ‌దారుల‌కు సంతృప్తిక‌రంగా సేవ‌లందించేందుకు ఐఓసీఎల్ సిబ్బంది పూర్తి వ్య‌క్తిగ‌త ర‌క్ష‌ణ‌ సరంజామాతో విధులు నిర్వ‌ర్తిస్తున్నారు’’. (ఏపీ పోలీసులు మంచి నిర్ణయం తీసుకున్నారు.. )

‘‘ప్రాంతీయ కార్యాల‌యాలు, పంపిణీదారు ప్రాంగ‌ణాల వద్ద పూర్తిస్థాయిలో రక్షణ ఏర్పాట్లు చేశాము. వ‌ల‌స కార్మికుల వంటి అన్నార్తుల‌కు ఆహారం, నీరు, పాలు త‌దిత‌ర నిత్యావ‌స‌రాల‌ను మాన‌వ‌తా దృష్టితో స‌ర‌ఫ‌రా చేస్తున్నాము. వాహ‌నాల డ్రైవ‌ర్లు సొంతంగా వంట చేసుకునేందుకు వీలుగా కూర‌గాయ‌లు, కిరాణా స‌ర‌కులు, వంట‌గ్యాస్ త‌దిత‌రాల‌న్నీ ఉచితంగా అందిస్తున్నాము. అనూహ్య సంఘ‌ట‌న‌ల్లో దుర‌దృష్ట‌వ‌శాత్తూ సిబ్బందికి, కార్మికుల‌కు ప్రాణ‌న‌ష్టం వాటిల్లితే రూ.5 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించే ఏర్పాటు కంపెనీ చేసింది. వివిధ ప్రభుతరంగ సంస్థల తరహాలో ‘పీఎం కేర్స్‌’ సహాయ నిధిసహా ఇతర సహాయ నిధులకూ ఐఓసీఎల్‌ సంస్థతోపాటు ఉద్యోగులు, సిబ్బంది తమ జీతాల నుంచి విరాళమిచ్చారు’’. అని శ్రవణ్‌ తెలిపారు. (ఏప్రిల్ 20 తర్వాత లాక్‌డౌన్‌ సడలింపు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top