ఏపీ డీజీపీకి ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ

Vijaya Sai Reddy Wrote Letter To DGP About Ramesh Kumar Issue - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ ఎన్‌. రమేశ్‌ కుమార్‌ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖపై విచారణ జరిపించాలని ఎంపీ విజయసాయిరెడ్డి డీజీపీ గౌతమ్‌సవాంగ్‌కి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో ఉన్నది పోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లని పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ సందర్భంగా రమేశ్‌ కుమార్‌ చేసిన సంతకానికి, ఇప్పుడు లేఖలో ఉన్న సంతకానికి అసలు పొంతన లేదన్నారు. సంతకం ఫోర్జరీ చేసిన లేఖ కచ్చితంగా టీడీపీ ఆఫీసులోనే తయారయిందని తమ దగ్గర సమాచారం ఉన్నట్లు తెలిపారు. (‘ఆ లేఖపై రమేష్‌కుమార్‌ మౌనం వీడాలి’)

ఇది కచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేశారని, ఇందులో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌, వర్ల రామయ్య, టీడీ జనార్థన్‌ల హస్తం ఉందని వెల్లడించారు. వీరంతా కలిసే ఈ లేఖను సృష్టించారని, అయితే ఈ తతంగమంతా రమేశ్‌ కుమార్‌కకు తెలిసే జరిగిందని విమర్శించారు. ఫోర్జరీ సంతకాలు, కల్పిత డాక్యుమెంట్లపై డీజీపీ విచారణ చేయాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. వెంటనే ఆ లేఖను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించాలని, దీనిపై వచ్చే నివేదిక ఆధారంగా క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సిందిగా వెల్లడించారు. ఐపీ ఆధారంగా ఈ లేఖను ఎవరు పంపారో గుర్తించి చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి డీజీపీని కోరారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top