ఏపీలో సైబర్‌ క్రైం ఫిర్యాదులకు వాట్సప్‌ నెంబర్‌

Gautam Sawang Launch Whatsapp Number For Prevention Of Cyber Crime - Sakshi

సాక్షి, అమరావతి : సోషల్ మీడియాలో అబద్దపు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో బూతులు మాట్లాడేవారిపై కేసులు నమోదు చేస్తున్నామని, ఈ క్రమంలో తెలంగాణాకు వెళ్లి ఒకరిని అరెస్ట్ చేశామని, చిత్తూరులో మరొకరిని అరెస్ట్ చేశామని తెలిపారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో సైబర్‌ క్రైం ఫిర్యాదుల కోసం వాట్సప్‌ నెంబర్‌ను ఆయన ప్రారంభించారు. దీని ద్వారా సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు వార్తల ప్రచారాలను అరికట్టవచ్చు అన్నారు. ప్రత్యేక వాట్సప్‌ నంబర్‌  9071666667 ను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా జామ్‌ యాప్‌ ద్వారా బాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, సినీ నటులు నిఖిల్‌ సిద్ధార్థ, అడవి శేష్‌ ఆన్‌లైన్‌లో ఇంట్రాక్ట్‌ అయ్యారు. (1200 మంది విస్తారా ఉద్యోగులకు షాక్  )

కరెన్సీ నోట్లపై కరోనా ఎక్కువ సమయం ఉండదు
అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. కొత్తగా పుట్టుకొస్తున్న నేరాలను పోలీసులు ఎల్లప్పుడూ అరికడుతున్నారని తెలిపారు. నేరాలు అరికట్టడంలో ప్రజలందరి సహాకారం అవసరమని కోరారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో  ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్యం రాజ్యాగంలో అందరికీ హక్కులు ఉన్నాయని, ఏది వాస్తవమో ఏదీ అవాస్తవామో అందరూ తెలుసుకోవాలని అన్నారు. చాలామంది వాస్తవం తెలుకోకుండా అసత్యాలు ప్రచారం చేస్తుంటారని, అలాంటి వాటిని ఏపి పోలీస్ అరికడుతుందన్నారు. మహిళలు పిల్లలను ఆదుకునేందుకు సీఎం జగన్‌ దిశ చట్టం, దిశా కంట్రోల్ రూంలు తెచ్చారని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లిన వారు తిరిగి రావడం వల్ల, ఢిల్లీ నిజాముద్దీన్ ద్వారా మన రాష్ట్రంలోకి కరోనా వచ్చిందని, వారిని 22 వేల మందిని గుర్తించి హోం క్వారెంటైన్ చేశామని తెలిపారు. కరెన్సీ నోట్లపై కరోనా ఎక్కువ సమయం ఉండదని, వీటి ద్వారా వైరస్‌ ప్రబలే అవకాశం ఉండదన్నారు. (హాలీవుడ్‌ సింగర్‌, ఆమె భర్తకు కరోనా పాజిటివ్‌! )

కొత్త కోవిడ్-19 కేసులు కేవలం మూడు మాత్రమే
ఇక లాక్‌డౌన్‌ కాలంలో ఎంత మందిపై కేసులు నమోదు చేశామనేది చెప్పాలంటే బాధగా ఉందన్నారు. అనేక మందిపై కేసులు పెట్టామని, వాహనాలు సీజ్ చేశామని తెలిపారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు.. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే వారికి కేవలం ఆరోగ్య అత్యవసర‌ పరిస్థితిని బట్టి ప్రయానించేందుకు అనుమతి ఇస్తామని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో రాష్ట్రంలో  గృహహింస కేసులు పెరగడం లేదన్నారు. రాష్ట్రంలో ఎవరతో కాంటాక్ట్ లేని కొత్త కోవిడ్-19 కేసులు కేవలం మూడు మాత్రమే వున్నాయని, వాటిని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. (కరోనా లక్షణాలతో వెళ్తే.. డాక్టర్లు పట్టించుకోలేదు! )

కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో ప్రభుత్వం మంచి విధానాన్ని  తీసుకువచ్చిందని పీవీ సింధు అన్నారు. ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు నిఖిల్‌ సిద్దార్థ ఏపీ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈ విధానం వల్ల నేరాలు తగ్గుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీ పోలీస్ మంచి నిర్ణయం తీసుకుందని హీరో అడవి శేషు అన్నారు. పోలీస్ వాళ్లు వాట్సప్ ప్రారంభించడం సరైన సమయంలో తీసుకున్న నిర్ణయమని సామ్‌ కార్యకర్త కొండవీటి సత్యవతి అన్నారు. కోవిడ్-19 పై ఒక మతాన్ని టార్గెట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమ సహకారం పోలీసులకు ఎల్లప్పుడు వుంటుందని ఆమె తెలిపారు. (గజిని ఫోటోతో పోలీసుల వినూత్న యత్నం )

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

22-01-2021
Jan 22, 2021, 08:10 IST
కరోనా వైరస్‌ను నియంత్రించలేక ఏకంగా ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం మంగోలియా దేశంలో వచ్చింది.
22-01-2021
Jan 22, 2021, 04:15 IST
సాక్షి ప్రతినిధి, చెన్నై/బెంగళూరు: జయలలిత స్నేహితురాలు శశికళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో ఆమెను బెంగళూరు విక్టోరియా ఆస్పత్రి ఐసీయూకి...
22-01-2021
Jan 22, 2021, 02:07 IST
శివమొగ్గ: కర్ణాటకలోని శివమొగ్గ నగరంలో కరోనా టీకా వేయించుకున్న ప్రముఖ ప్రైవేటు వైద్యుడు గుండెపోటుతో మరణించడం కలకలం రేపుతోంది. జేపీ...
22-01-2021
Jan 22, 2021, 01:53 IST
న్యూఢిల్లీ: రెండో విడత వ్యాక్సినేషన్‌లో 50 ఏళ్ల వయస్సు పైబడిన ప్రజా ప్రతినిధులకు టీకా వేసే అవకాశముంది. ప్రధాని నరేంద్రమోదీ,...
21-01-2021
Jan 21, 2021, 20:32 IST
ఢిల్లీ: కోవిడ్‌ మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా గత ఆరు రోజులుగా సాగుతున్న వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమంలో 9,99,065 మందికి...
21-01-2021
Jan 21, 2021, 18:50 IST
హైదరాబాద్‌: కరోనా మహమ్మారికి సంబంధించిన 24 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై నేడు హైకోర్టులో విచారణ కొనసాగింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత...
21-01-2021
Jan 21, 2021, 16:54 IST
వాషింగ్టన్‌:  పలు చోట్ల కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నవారు ఆస్పత్రిపాలు అవుతుండటంతో జనాలు వ్యాక్సిన్‌ అంటేనే జంకుతున్నారు. వ్యాక్సిన్‌ తీసుకోవాలా? వద్దా? అని పునరాలోచనలో...
21-01-2021
Jan 21, 2021, 14:18 IST
సాక్షి, కరీంనగర్‌ : జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ వికటించి ఒకరు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వాంతులు జ్వరంతో ఇబ్బంది పడుతున్న అంగన్...
21-01-2021
Jan 21, 2021, 12:36 IST
విషయం ఏంటంటే పాజిటివ్‌ వచ్చిన వారిలో 69 మందికి వ్యాక్సిన్‌ సెకండ్‌ డోస్‌ కూడా ఇచ్చారు
21-01-2021
Jan 21, 2021, 11:43 IST
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభానికి ముందు ప్రతిపక్షాలు పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. టీకా మొదట...
21-01-2021
Jan 21, 2021, 04:12 IST
పొదలకూరు: కరోనా లాక్‌డౌన్‌ సమయంలో తండ్రి వ్యాపారం బాగా దెబ్బతిన్న నేపథ్యంలో.. తీవ్ర మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఉరేసుకుని...
21-01-2021
Jan 21, 2021, 03:50 IST
సాక్షి, అమరావతి: నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 25,126 మందికి వ్యాక్సిన్‌...
20-01-2021
Jan 20, 2021, 11:50 IST
సెకండ్‌ డోస్‌ తీసుకున్న రెండు వారాల తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నట్లు డాటా వెల్లడించింది
20-01-2021
Jan 20, 2021, 11:36 IST
టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా కోవిడ్‌ అనుభవాలను  సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఒంటరిగా, కుటుంబానికి, బిడ్డకు దూరంగా ఉండటం చాలా...
20-01-2021
Jan 20, 2021, 09:23 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని సమర్థవంతంగా, ఎటువంటి పొరపాట్లు లేకుండా...
20-01-2021
Jan 20, 2021, 08:43 IST
న్యూఢిల్లీ: వ్యాక్సిన్‌ తీసుకోవడంపై సమాజంలో అపోహలు ఉన్నాయని నీతిఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ చెప్పారు. మంగళవారం ఆయన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో...
19-01-2021
Jan 19, 2021, 12:57 IST
సాక్షి, ముంబై: ఒకవైపు కరోనా  మహమ్మారి అంతానికి దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు  సీరం వ్యాక్సిన్‌ తీసుకున్న 24...
19-01-2021
Jan 19, 2021, 10:34 IST
సాక్షి, పిఠాపురం: స్థానిక ప్రభుత్వాసుపత్రి నుంచి మండలంలోని విరవ ఆస్పత్రికి తరలించిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వయల్స్‌ పగిలిపోయిన సంఘటన వైద్య,...
19-01-2021
Jan 19, 2021, 08:45 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా టీకాల కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుందో తెలియట్లేదు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణీత...
19-01-2021
Jan 19, 2021, 08:06 IST
బెంగళూరు : వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం రెండు మరణాలు సంభవించడం దేశంలో కలకలం రేపుతోంది. ఒకరు ఉత్తరప్రదేశ్‌లోనూ, మరొకరు కర్ణాటకలోనూ...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top