breaking news
SRH
-
మరోసారి బజారున పడిన HCA ఇమేజ్
-
HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు సహా ఐదుగురి ఎంక్వైరీ
-
హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్రావు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) ఫ్రాంచైజీ, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్(HCA) వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్రావును తెలంగాణ సీఐడీ బుధవారం అరెస్ట్ చేసింది. జగన్‌తోపాటు హెచ్‌సీఏ ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విజిలెన్స్ సిఫార్సు మేరకు సీఐడీ ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.గత ఐపీఎల్ సీజన్లో హెచ్‌సీఏ-ఎస్ఆర్హెచ్ మధ్య టికెట్ల వివాదం జరిగిన సంగతి తెలిసిందే. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ హోదాలో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీని జగన్మోహన్రావు బెదిరించారన్నది ప్రధాన అభియోగం. అయితే ఆ అభియోగాలన్నీ వాస్తవమేనని విజిలెన్స్ నిర్ధారించడంతో సీఐడీ ఇప్పుడు అరెస్టులు చేసింది. హెచ్‌సీఏకు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం 10 శాతం టికెట్లు ఉచితంగా ఇస్తోంది. అయితే మరో 20 శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని, లేకుంటే మ్యాచ్‌లు జరగబోనివ్వమని ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. అయితే హెచ్‌సీఏ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆలోచన చేస్తామని ఆ సమయంలో హెచ్ఆర్ఎస్ ఆయనకు స్పష్టం చేసింది. అయితే.. తనకు వ్యక్తిగతంగా 10 శాతం వీఐపీ టికెట్లు కచ్చితంగా ఇవ్వాలని, లేకుంటే మ్యాచ్‌లు జరగనివ్వబోమని ఆయన బెదిరింపులకు దిగారు. అందుకు ఎస్ఆర్హెచ్ అంగీకరించలేదు. దీంతో లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ కార్పొరేట్ బాక్స్‌కు ఆయన తాళాలు కూడా వేయించారు. ఈ పరిణామంతో షాక్ తిన్న ఎస్ఆర్హెచ్ యాజమాన్యం.. హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామంటూ ప్రకటించడం సంచలన చర్చకు దారి తీసింది. ఐపీఎల్ టికెట్ల వివాదం నేపథ్యంతో ఈ ఘటనపై విజిలెన్స్ ఎంక్వయిరీకి తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ వ్యవహారంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా హెచ్‌సీఏ అక్రమాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన సీఐడీ.. ఇప్పుడు ఆ అక్రమాలు వాస్తవమేనని తేలడంతో ఏకంగా అరెస్టులు చేసింది. -
సన్ రైజర్స్ ఫ్రాంఛైజ్ రద్దు కానుందా..?
-
‘సన్‌రైజర్స్’ ఓనర్‌తో పెళ్లి.. స్పందించిన అనిరుధ్!
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందన్(Anirudh Ravichander ) పెళ్లిపై ప్రతిసారి ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. గతంలో నటి ఆండ్రియాతో అనిరుధ్ పెళ్లి అనే ప్రచారం జరిగింది. అందులో కూడా వాస్తవం లేదని తేలింది. వారిద్దరు డేటింగ్ చేసినా..కొన్నాళ్లకు బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఆ తర్వాత కీర్తి సురేశ్‌తో పెళ్లి పక్కా అని కోలీవుడ్ అంతా కోడై కూసింది. కీర్తి పెళ్లయిన తర్వాత ఆ రూమర్స్ తగ్గిపోయాయి. ఇక ఇప్పుడు ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ పెళ్లిపై మరో రూమర్ బయటకు వచ్చింది. ఐపీఎల్లో కీలక జట్టు ‘సన్‌రైజర్స్ హైదరాబాద్’ అధినేత కావ్యా మారన్( kavya Maran)ని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త గత రెండు రోజులుగా నెట్టింట చక్కర్లు కొట్టింది. 2014 నుంచి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో మాత్రం పెళ్లి చేసుకుంటారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై అనిరుధ్ స్పందించాడు. ‘‘నాకు పెళ్లా..? చిల్ అవ్వండి.. ఇలాంటి రూమర్స్‌ని స్ప్రెడ్ చేయకండి’అని అనిరుధ్ ట్వీట్ చేశాడు. దీంతో కావ్యా మారన్ తో పెళ్లి అనేది కూడా పుకారేనని తేలిపోయింది. అనిరుధ్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన రజనీకాంత్ కూలీ, విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు. దీంతో పాటు నాని, శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న రెండో చిత్రం %ప్యారడైజ్’కి కూడా అనిరుధే మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. -
హైదరాబాద్ జట్టు ఓనర్‌తో అనిరుధ్ పెళ్లి?
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదో ఒక పెళ్లి రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. అయితే కొన్నిసార్లు నమ్మాలనిపించదు. మరికొన్నిసార్లు మాత్రం నిజంగా ప్రేమించుకుంటున్నారా? పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అలాంటి ఓ గాసిప్ పుల్గా వైరల్ అవుతోంది. అదే లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి?తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న అనిరుధ్.. గతంలో ఆండ్రియా, కీర్తి సురేశ్ లాంటి హీరోయిన్లతో డేటింగ్ చేశాడనే వార్తలొచ్చాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని వైరల్ అయ్యాయి. కానీ కాలక్రమేణా వాటి గురించి జనాలు మర్చిపోయారు. సడన్‌గా ఇప్పుడు సరికొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి యజమానిగా వ్యవహరిస్తున్న కావ్య మారన్ని అనిరుధ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని అంటున్నారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) 2014 నుంచి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, కానీ ఈ విషయం బయటపడకుండా సైలెన్స్ మెంటైన్ చేశారని.. త్వరలో మాత్రం పెళ్లి చేసుకుంటారనే పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇద్దరూ తమిళవాళ్లు కావడంతో ఇది నిజమేనేమోనని చాలామంది అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఇరువైపుల నుంచి ఎలాంటి ఖండన లేదు. అలా అని అంగీకారం కూడా లేదు. కాబట్టి ఇప్పటివరకు అయితే ఇది రూమర్ మాత్రమే.అనిరుధ్ విషయానికొస్తే టీనేజీలోనే సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కావ్య మారన్ విషయానికొస్తే.. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కూతురు. ఇప్పటికే తండ్రితోపాటు పలు వ్యాపారాల్లో కీలకంగా ఉంది. వీటితో పాటు ఐపీఎల్‌లోనూ హైదరాబాద్ జట్టుకి యజమానిగా వ్యవహరిస్తోంది.(ఇదీ చదవండి: అఖిల్‌తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?) -
కోల్ కతాపై హైదరాబాద్ ఘనవిజయం
-
IPL 2025: సన్‌రైజర్స్ జట్టులో చరిత్ర సృష్టించిన బౌలర్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో నిష్క్రమణకు అంచుల్లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇవాళ (మే 5) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగబోయే డు ఆర్ డై మ్యాచ్‌కు ముందు కీలక ప్రకటన చేసింది. గాయపడిన స్మరణ్ రవిచంద్రన్ స్థానంలో విదర్భ లెఫ్డ్ ఆర్మ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబేను జట్టులోకి తీసుకుంది. హర్ష్‌ను బేస్ ధర రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది. కొద్ది రోజుల ముందే స్మరణ్ ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చాడు. స్మరణ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అంతకుముందు జంపా రెండు మ్యాచ్‌లు ఆడి ప్రాక్టీస్ సందర్భంగా గాయపడ్డాడు.Harsh Dubey joins the squad as a replacement for Smaran, who is ruled out due to injury.#PlayWithFire pic.twitter.com/Bd4vnLanGF— SunRisers Hyderabad (@SunRisers) May 5, 2025ఎవరీ హర్ష్ దూబే..?పూణేలో జన్మించి, విదర్భ తరఫున దేశవాలీ క్రికెట్ ఆడుతున్న 22 ఏళ్ల హర్ష్ దూబే.. తాజాగా ముగిసిన రంజీ సీజన్లో (2024-25) రికార్డు స్థాయిలో 10 మ్యాచ్‌ల్లో 69 వికెట్లు (7 ఐదు వికెట్ల ప్రదర్శనలతో పాటు రెండు 10 వికెట్ల ప్రదర్శనలు) తీసి, రంజీ చరిత్రలోనే ఓ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. హర్ష్ విదర్భ తరఫున 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 21 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 16 టీ20లు ఆడి 128 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో దాదాపు 100 పరుగులు చేశాడు. హర్ష్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 7 అర్ద సెంచరీలు, లిస్ట్-ఏ క్రికెట్లో 2 అర్ద సెంచరీలు సాధించాడు.హర్ష్ అద్బుత ప్రదర్శన కారణంగా గత రంజీ సీజన్లో విదర్భ ఛాంపియన్‌గా నిలిచింది. విదర్భ రంజీ టైటిల్ గెలవడం ఇది మూడో సారి. ఫైనల్లో విదర్భ కేరళపై విజయం సాధించి, ఛాంపియన్‌గా అవతరించింది.నిష్క్రమణ అంచుల్లో ఎస్ఆర్హెచ్ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శనలు చేస్తూ నిష్క్రమణ అంచుల్లో ఉంది. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 పరాజయాలు చవిచూసి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్లో సన్‌రైజర్స్ ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నాలుగు గెలిచినా సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు చేరడం అసంభవం. టెక్నికల్‌గా ఆ జట్టు ఇంకా ఎలిమినేట్ కాలేదు కానీ, ఈ సీజన్లో సన్‌రైజర్స్ పని అయిపోయింది. ఇవాళ (మే 5) ఆ జట్టు సొంత మైదానంలో (ఉప్పల్ స్టేడియం) టేబుల్ ఫిఫ్త్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. -
IPL 2025: మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న ఇషాన్ కిషన్, ట్రవిస్ హెడ్
ఐపీఎల్ 2025లో తదుపరి ఆడబోయే అత్యంత కీలకమైన మ్యాచ్‌లకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ప్రముఖ పర్యాటక దేశం మాల్దీవ్స్‌లో సేద తీరుతున్నారు. ఏప్రిల్ 25న సీఎస్కేపై విజయానంతరం ఆరెంజ్ ఆర్మీ మాల్దీవ్స్‌కు చెక్కేసింది. అప్పటి నుంచి సన్‌రైజర్స్ ఆటగాళ్లు మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా సన్‌రైజర్స్ స్టార్ ఆటగాళ్లు సరదాగా గడుపుతున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో ప్రత్యక్షమైంది. Ishan Kishan Vs Abhishek Sharma in the volleyball game. 😄 pic.twitter.com/d46iqYQlR7— Mufaddal Vohra (@mufaddal_vohra) April 28, 2025ఈ వీడియోలో సన్‌రైజర్స్ విధ్వంసకర ఆటగాడు ట్రవిస్ హెడ్ డ్రింక్ తాగుతూ సేద తీరుతుండగా.. మరో విధ్వంకర బ్యాటర్ ఇషాన్ కిషన్ సహచరులతో వాలీబాల్ ఆడుతూ కనిపించాడు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కీలక మ్యాచ్‌లకు ముందు తమ ఆటగాళ్లకు రీఫ్రెష్మెంట్ అవసరమని సన్‌రైజర్స్ యాజమాన్యం మాల్దీవ్స్ టూర్ ప్లాన్ చేసింది. సన్‌రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ మే 2న అహ్మదాబాద్‌లో జరుగనుంది. దీని తర్వాత సన్‌రైజర్స్ వరుసగా ఢిల్లీ (మే 5, హైదరాబాద్), కేకేఆర్ (మే 10, హైదరాబాద్), ఆర్సీబీ (మే 13, బెంగళూరు), లక్నోతో (మే 18, లక్నో) మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.గత మ్యాచ్‌లో సీఎస్కేపై గెలుపుతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ సీజన్లో ఆ జట్టు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే సన్‌రైజర్స్ తదుపరి ఆడాల్సిన ఐదు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఇలా జరిగినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉంటాయి.ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గతేడాది రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆశించిన ఫలితాలు సాధించలేదు. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచి.. ఆతర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది (లక్నో, ఢిల్లీ, కేకేఆర్,గుజరాత్). తర్వాత పంజాబ్‌పై సంచలన విజయం సాధించి (246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి).. ముంబై ఇండియన్స్ చేతుల్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. తాజాగా సీఎస్కేను వారి సొంత ఇలాకాలో ఓడించి, సీజన్లో మూడో విజయాన్ని నమోదు చేసింది.కాగా, ఈ సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్‌పై భారీ అంచనాలు ఉండేవి. అందుకు తగ్గట్టుగానే తొలి మ్యాచ్‌లో ఆ జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై 286 పరుగుల రికార్డు స్కోర్ సాధించి విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీతో మెరిశాడు.ఆ మ్యాచ్ తర్వాత మళ్లీ గెలవడానికి సన్‌రైజర్స్‌కు ఐదు మ్యాచ్‌ల సమయం పట్టింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో సన్‌రైజర్స్ రెండో విజయం సాధించింది. తాజాగా సన్‌రైజర్స్ సీఎస్కేపై గెలిచినా అది వారిపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా లేదు. సీఎస్కే నిర్దేశించిన 155 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆ జట్టు ఆపసోపాలు పడింది. -
చెపాక్‌లో తలా సందడి.. మరో తలా కోసమే వచ్చాడంటున్న నెటిజన్స్!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవలే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఆయన నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఏప్రిల్ 10న విడుదలైన 'గుడ్ బ్యాడ్ అగ్లీ'కి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. విదాముయార్చి ఫెయిల్యూర్ తర్వాత వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.రెండు రోజుల క్రితమే అజిత్ తన భార్య షాలినితో కలిసి వివాహా వార్షికోత్సవం జరుపుకున్నారు. వీరిద్దరి బంధానికి దాదాపు 25 ఏళ్లు పూర్తి కావడంతో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా ఈ జంట ఐపీఎల్ మ్యాచ్‌లోనూ సందడి చేశారు. తమ కుమారుడు ఆద్వైక్తో కలిసి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ను ఎంజాయ్ చేశారు. అభిమానులు తలా అని ముద్దుగా పిలుచుకునే అజిత్.. మరో తలాగా పిలవబడే ఎంఎస్ ధోని ఆటను ఆస్వాదించేందుకు స్డేడియానికి వచ్చారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అతని కొడుకు ఆద్వైక్ను తన ఒడిలో కూర్చొబెట్టుకుని మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకించారు.కాగా.. ఈ మ్యాచ్‌లో మరో హీరో శివకార్తికేయన్ కూడా స్టేడియంలో కనిపించారు.అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో హీరోయిన్ శృతిహాసన్ సైతం సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. అయితే సినిమాలతో పాటు రేసింగ్‌లోనూ అజిత్ కుమార్ యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన టీమ్ బెల్జియంలో జరిగిన కారు రేస్‌లో రెండో స్థానంలో నిలిచింది. Seems like Shalini AjithKumar is a big fan of CSK & the way she explains the team players to AK so heartwarming 🥰AK’s Wedding Anniversary Gift 🎁 pic.twitter.com/2jqVtRU6bc— Kolly Corner (@kollycorner) April 25, 2025 -
ఐదు ప్రశ్నలకు సమాధానం.. ఫ్రీగా ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ టికెట్స్ !
ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన తాజా చిత్రం చౌర్యపాఠం(Chaurya Paatam Movie). ఈ సినిమాకు నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు, చూడామణి సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా..ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అయితే ఈ సినిమాకు రిలీజ్‌కు ఇంకా రెండు రోజులు సమయం ఉండడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. దీంతో చౌర్యపాఠం చిత్రబృందం అందరికంటే కాస్తా భిన్నంగా ప్రమోషన్స్ ప్రారంభించింది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ఫుల్ స్వింగ్‌లో ఉండడంతో ప్రమోషన్లలో వాడేశారు. ఈనెల 23న హైదరాబాద్‌లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌కు ఉచితంగా టిక్కెట్స్ గెలుచుకునే అవకాశాన్ని కల్పించారు. దీనికోసం ఓ చిన్న కాంటెస్ట్‌ను ప్లాన్ చేశారు. అదేంటో తెలుసుకుందాం.చౌర్యపాఠం ట్రైలర్ చూసి అందులో ఐదు ప్రశ్నలకు కరెక్ట్‌గా సమాధానాలు పంపాలి. ఐదింటికి సరైన సమాధానాలు పంపిన వారిలో లక్కీ డ్రా ఎంపిక చేస్తారు. ఈ ప్రశ్నలను ట్విటర్ ద్వారా షేర్ చేశారు హీరో ఇంద్ర రామ్. మొదటి ప్రశ్న- ట్రైలర్లో వినిపించే గ్రామం పేరేంటి? రెండోది- ప్రతి రోజు బెల్ ఎన్ని గంటలకు మోగుతుంది? మూడోది.. వీక్నెస్ కోసం వినియోగించే ట్యాబ్లెట్ పేరేంటి? నాలుగో ప్రశ్న- ఈ ట్రైలర్ వాడిన ముగ్గురు హీరోయిన్ల పేర్లు? ఇక ఐదో ప్రశ్న- చౌర్యపాఠం మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు? ఈ ఐదింటికి సరైన సమాధానాలు వాట్సాప్ ద్వారా పంపిస్తే విజేతలను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ సారి ట్రై చేయండి. Hey hai #IPL lovers Need #IPL tickets for Hyderbad match tomorrow ?Then participate in our #ChauryaPaatam contents and the best answers can grab IPL tickets for free ☺️#ChauryaPaatamonApr25th #3daystogo pic.twitter.com/heEyYXqRQq— Velivela Indhra Ram (@indhraram) April 22, 2025 -
పంజాబ్ పై 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ గెలుపు
-
ఉప్పల్ పిచ్ ఆటకు అనుకూలమే.. ఓటములకు నిరాశ పడొద్దు
శేరిలింగంపల్లి: హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో పిచ్ ఆటకు అనుకూలంగానే ఉంటుందని ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ నితీష్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నల్లగండ్లలోని టీబీసీ సెలూన్‌ను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ క్రికెట్, ఇతర ఆటల పోటీల్లో గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. రేపటి ఐపీఎల్ మ్యాచ్ కోసం సిద్ధం అవుతున్నామని తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌లలో ఓడిపోతున్నామని నిరాశ పడవద్దని, ఇప్పటి వరకూ ఆడిన ఆటతీరుతో ఎస్ఆర్హెచ్తో ప్రయాణం పట్ల సంతోషంగా ఉన్నామని అన్నారు. రెండు రోజుల గ్యాప్ ఉందని తనను ఇక్కడికి ఇన్వైట్ చేశారని, తాను ప్రారంభించిన స్టోర్‌లో తన అభిమానులు విజిట్ చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తనను అభిమానిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అభిమానులకు కతజ్ఞతలు తెలిపారు. ఇక్కడి బిర్యానీ టేస్ట్ చేశా.. తాను క్రికెట్‌ను ఎంతగా ఇష్టపడతానో.. నగరంలోని బిర్యానీని అంతగా ఇష్టపడతానని, అందుకే హైదరాబాద్ బిర్యానీని టేస్ట్ చేశానని నితీష్ తెలిపారు. దీంతో పాటు నగరంలోని క్రికెట్ పిచ్ కూడా అంతే ఇష్టమని స్పష్టం చేశారు. ఎస్ఆర్హెచ్ క్రికెటర్ల సందడి.. నల్లగండ్ల టీబీసీ సెలూన్ ప్రారంభానికి నితీష్ కుమార్‌రెడ్డితోపాటు ఎస్ఆర్హెచ్ క్రికెటర్లు మ్కాస్ స్టోయినిస్, ఇషాన్‌కిషన్, అభిõÙక్ శర్మ, జావియర్ బార్లెట్, అరోన్ హర్డీ వంటి క్రికెటర్లు కూడా హాజరై సందడి చేశారు. క్రికెటర్లను చూడడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. -
ఉప్పల్‌లో ప్రాక్టీస్ అదరగొట్టిన SRH, పంజాబ్ ప్లేయర్స్ (ఫొటోలు)
-
సన్ రైజర్స్ అడ్రెస్ గల్లంతు! ప్లే ఆఫ్ చేరాలంటే...
-
IPL 2025: నిబంధనలు ఉల్లంఘించిన ఇషాంత్ శర్మ.. భారీ జరిమానా
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి ఏకపక్ష విజయం సాధించింది. ఈ గెలుపుతో గుజరాత్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. సన్‌రైజర్స్ విషయానికొస్తే.. ఈ జట్టు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది.కాగా, ఈ మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను ఉల్లఘించినందుకు గానూ గుజరాత్ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మకు భారీ జరిమానా విధించారు. మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం కోత పెట్టారు. అలాగే ఓ డీ మెరిట్ పాయింట్ కూడా కేటాయించారు.ఈ మ్యాచ్‌లో ఇషాంత్ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లోని ఆర్టికల్ 2.2 ప్రకారం లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడని మ్యాచ్ రిఫరీ ప్రకటించాడు. ఈ నిబంధన మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు, దుస్తులు, గ్రౌండ్ పరికరాల దుర్వినియోగంతో వ్యవహరిస్తుంది. ఓ ఆటగాడు ఉద్దేశపూర్వకంగా వికెట్లను లేదా ప్రకటన బోర్డులను లేదా సరిహద్దు కంచెలను లేదా డ్రెస్సింగ్ రూమ్ సామాగ్రికి నష్టం కలిగిస్తే ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లోని ఆర్టికల్ 2.2 ఉల్లంఘించినట్లు లెక్క. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్ ఇషాంత్ శర్మకు అంత కలిసి రాలేదు. ఈ మ్యాచ్‌లో అతను 4 ఓవర్లు వేసి వికెట్ లేకుండా 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఇషాంత్ ఇచ్చిన పరుగులు సన్‌రైజర్స్ స్కోర్‌లో 30 శాతం. ఈ సీజన్ మొత్తంలో కూడా ఇషాంత్ ఇంతే ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. సహచర పేసర్లు సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ రాణిస్తున్నా ఇషాంత్ చెత్త బౌలింగ్‌తో విసుగుతెప్పించాడు. ఈ సీజన్లో ఇషాంత్ ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకే ఒక వికెట్ తీశాడు. ఇందులో 8 ఓవర్లు వేసి 107 పరుగులు సమర్పించుకున్నాడు.ఈ సీజన్లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనకు పాల్పడిన ఐదో క్రికెటర్ ఇషాంత్. అతనికి ముందు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్, లక్నో బౌలర్ దిగ్వేశ్ రతీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. వీరిలో కెప్టెన్లు స్లో ఓవర్ రేట్‌కు బాధ్యులు కాగా.. దిగ్వేశ్ రతీ తన నోట్ బుక్ సెలబ్రేషన్స్‌కు గానూ జరిమానా ఎదుర్కొన్నాడు. -
SRH VS GT: ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను.. అదే నన్ను పైకి లేపింది: సిరాజ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్లో సిరాజ్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. నిన్న (ఏప్రిల్ 6) సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలకమైన వికెట్లు తీశాడు. తద్వారా గుజరాత్ సన్‌రైజర్స్‌ను వారి సొంత ఇలాకాలో (ఉప్పల్ స్టేడియంలో) చిత్తుగా ఓడించింది. ఈ ప్రదర్శనకు గానూ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ (4-0-19-3) సిరాజ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఆ ప్రదర్శనకు కూడా సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అంతకుముందు గుజరాత్ ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించడంలోనూ సిరాజ్ కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో సిరాజ్ 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు (రోహిత్ శర్మ, రికెల్టన్లను క్లీన్ బౌల్డ్ చేశాడు) తీశాడు.సిరాజ్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో రెచ్చిపోవడంతో గుజరాత్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. తొలి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓడిన ఈ జట్టు ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. గుజరాత్ ఈ స్థాయిలో సత్తా చాటడంలో సిరాజ్‌దే ప్రధాన పాత్ర. సన్‌రైజర్స్‌పై ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం సిరాజ్ ఇలా అన్నాడు. సొంత మైదానంలో ఆడటం ఓ ప్రత్యేకమైన అనుభూతి. ఇవాళ మ్యాచ్‌లో నా కుటుంబ సభ్యులు జనం మధ్యలో ఉన్నారు. అదే నన్ను పైకి లేపింది. నేను ఏడు సంవత్సరాలు ఆర్సీబీకి ఆడాను. నా బౌలింగ్‌ను మెరుగుపర్చుకునేందుకు చాలా కష్టపడ్డాను. అది నాకు ఇప్పుడు పనిచేస్తోంది. ఓ సమయంలో నేను దానిని జీర్ణించుకోలేకపోయాను (ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కానందుకు).అయినా నిరాశపడకుండా ఫిట్నెస్ మరియు ఆటపై దృష్టి పెట్టాను. నేను చేసిన తప్పులపై వర్కౌట్ చేశాను. ప్రస్తుతం నా బౌలింగ్‌ను ఆస్వాదిస్తున్నాను. టీమిండియా తరఫున స్థిరంగా ఆడుతున్నప్పుడు జట్టులో స్థానం కోల్పోవడం నిజంగా బాధించింది. అయినా నన్ను నేను ఉత్సాహపరుచుకున్నాను. ఐపీఎల్ కోసం ఎదురు చూశాను. కసితో వర్కౌట్ చేసి సత్ఫలితాలు సాధిస్తున్నాను. -
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు హ్యాట్రిక్ ఓటమి
-
SRH Vs HCA వివాదంపై సీఎం రేవంత్ సీరియస్
సాక్షి,హైదరాబాద్ : హెచ్‌సీఏ- సన్ రైజర్స్ హైదరాబాద్ వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్నివేధింపులు గురి చేసి పాసులు అడిగిన విషయంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాసుల విషయంలో బెదిరించిన అంశంపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని సూచించారు. విజిలెన్స్ డీజీ కొత్తకోట శశ్రీకాంత్‌కు ఆదేశాలు జారీ చేశారు.ఎస్ఆర్హెచ్ను పాసులు విషయంలో ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే పాసుల వ్యవహారంపై సీఎంఓ కార్యాలయం వివరాలు సేకరించింది. తాజా, ఇదే అంశంపై సీఎం రేవంత్ సైతం స్పందించారు. అసలేం జరిగిందంటే?ఉచిత పాస్‌ల విషయంలో (ఐపీఎల్ 2025) సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. పాసుల కోసం హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తీవ్రంగా వేధిస్తున్నాడని సన్‌రైజర్స్ మేనేజ్మెంట్ సంచలన ఆరోపణలు చేసింది. ఇలా చేస్తే హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామని బెదిరించింది. ఈ అంశానికి సంబంధించి సన్‌రైజర్స్ జనరల్ మేనేజర్ టిబి శ్రీనాథ్ హెచ్‌సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్ రావు ఓ ఘాటు లేఖ రాశారు.ఇలాంటి ప్రవర్తన సహించంఉచిత పాస్‌ల కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు జగన్మోహన్ రావు వేధింపులు తీవ్రమయ్యాయి. ఇలాంటి ప్రవర్తనను మేము ఏమాత్రం సహించం. ఇలాగే కొనసాగితే మేము వేదికను మార్చుకునేందుకు మేం వెనకాడం. మేము ఉప్పల్ స్టేడియంను హోం గ్రౌండ్‌గా ఎంచుకుని మ్యాచ్‌లు ఆడటం వారికి ఇష్టం లేనట్లుంది. ఇలా అయితే లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరుతున్నాం. తద్వారా ఈ విషయాన్ని బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, మా యాజమాన్యానికి తెలియజేయగలరు. మీకు ఇష్టం లేకపోతే మీరు కోరుకున్నట్లే హైదరాబాద్ నుంచి తరలిపోతామని సన్‌రైజర్స్ ప్రతినిథి హెచ్‌సీఏ కోశాధికారికి రాసిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు. గత 12 సంవత్సరాలుగా హెచ్‌సీఏతో కలిసి పనిచేస్తున్నాము. గత సీజన్ నుండి మాత్రమే ఈ సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నాము. ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారికి ప్రతి సీజన్లో 50 కాంప్లిమెంటరీ టికెట్లు (F12A బాక్స్) ఇస్తున్నాము. ఈ ఏడాది వారు అదనంగా మరో 20 టికెట్లు అడుతున్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చినప్పుడు పరస్పరం చర్చించి స్నేహపూర్వక పరిష్కారానికి వస్తామని వారికి తెలియజేసాము.హెచ్‌సీఏ ప్రతినిథులు ఓవరాక్షన్అయినా పట్టించుకోకుండా హెచ్‌సీఏ ప్రతినిథులు ఓవరాక్షన్ చేశారు. SRH-LSG మ్యాచ్ రోజున సీటింగ్ బాక్స్‌కు (F3) తాళం వేశారు. మేము అడిగిన అదనపు టికెట్లు ఇవ్వకపోతే తాళం తెరవమని బెదిరించారు. గత రెండేళ్లలో హెచ్‌సీఏ నుంచి మా సిబ్బందికి ఇలాంటి బెదిరింపులు చాలా వచ్చాయి. అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఈ ఏడాదే చాలాసార్లు మా వారిని బెదిరించారు. ఇది ఏమాత్రం సహించరానిది. మేము స్టేడియంకు అద్దె చెల్లిస్తున్నాము. ఐపీఎల్ సమయంలో స్టేడియం మా ఆధీనంలో ఉండాలి అని శ్రీనాథ్ తన ఈ-మెయిల్లో హైలెట్ చేశారు. కాగా, ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) హోం గ్రౌండ్‌గా ఉన్న విషయం తెలిసిందే. -
IPL 2025: ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమి..
SRH Vs Delhi Capitals Match Updates: ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమి.. ఐపీఎల్-2025లో ఎస్ఆర్హెచ్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయం పాలైంది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో ఫాఫ్ డుప్లెసిస్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జాక్ ఫ్రెజర్ మెక్‌గర్క్(38), అభిషేక్ పోరెల్(34) రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జీషన్ అన్సారీ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు. మిగితా బౌలర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ డౌన్.. కేఎల్ రాహుల్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన రాహుల్.. జీషన్ అన్సారీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి ట్రిస్టన్ స్టబ్స్ వచ్చాడు.ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ డౌన్..ఢిల్లీ క్యాపిటల్స్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. జీషన్ అన్సారీ బౌలింగ్‌లో తొలి బంతికి ఫాఫ్ డుప్లెసిస్(50) ఔట్ కాగా.. ఆఖరి బంతికి జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్(38) ఔటయ్యాడు. క్రీజులోకి కేఎల్ రాహుల్ వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ రెండు వికెట్లు నష్టానికి 96 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ..164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడుతోంది. 5 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. క్రీజులో జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్(8), ఫాఫ్ డుప్లెసిస్(29) ఉన్నారు.163 పరుగులకు ఎస్ఆర్హెచ్ ఆలౌట్‌ఐపీఎల్-2025లో భాగంగా వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు తడబడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్.. 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అనికేత్ వర్మ(74) టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్లాసెన్(32), హెడ్(22) పరుగులతో రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ మూడు, మొహిత్ శర్మ ఒక్క వికెట్ సాధించారు.ఎస్ఆర్హెచ్ ఎనిమిదో వికెట్ డౌన్.. అనికేత్ ఔట్అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అనికేత్ వర్మ(41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 74).. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 16 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.ఏడో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ఎస్ఆర్హెచ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 12 ఓవర్లో అభినవ్ మనోహర్(4) ఔట్ కాగా.. ఆ తర్వాత 14 ఓవర్లో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఔటయ్యాడు. ఈ ఇద్దరు కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో అనికేత్ వర్మ(50) ఉన్నాడు. వియాన్ ముల్డర్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు.ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ డౌన్.. క్లాసెన్ ఔట్‌హెన్రిచ్ క్లాసెన్ రూపంలో ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన క్లాసెన్.. మొహిత్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. క్రీజులో అనికేత్ వర్మ(47) ఉన్నాడు.అనికేత్ ఆన్ ఫైర్.. ఎస్ఆర్హెచ్ యువ సంచలనం అనికేత్ వర్మ మరోసారి దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40 పరుగులు చేసి ఆజేయంగా ఉన్నాడు. అతడితో పాటు హెన్రిచ్ క్లాసెన్(24) ఉన్నాడు. 9 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది.ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ డౌన్..ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి క్లాసెన్ వచ్చాడు.29 పరుగులకే 3 వికెట్లు.. కష్టాల్లో ఎస్ఆర్హెచ్వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు తడబడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ కేవలం 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 4 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ మూడు వికెట్లు కోల్పోయి 37 పరుగులు చేసింది. క్రీజులో హెడ్(22), అనికేత్(5) ఉన్నారు.ఐపీఎల్-25 లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో విశాఖ వేదికగా డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ కు మొగ్గుచూపాడు.ఇక ఇరుజట్ల మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ అత్యంత హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇరు జట్లలో భయంకరమైన హిట్టర్లు ఉన్నారు. విశాఖ పిచ్‌పై పరుగుల వరద పారిన చరిత్ర ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో పోలిస్తే ఢిల్లీ ఈ మ్యాచ్‌లో మరింత బలపడనుంది. పితృత్వ సెలవుపై ఉండిన ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టులో చేరాడు.ఈ సీజన్లో ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై సంచలన విజయం సాధించి జోష్ మీద ఉంది. సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌లో రాయల్స్‌పై అద్భుత విజయం సాధించి, ఆతర్వాతి మ్యాచ్‌లో లక్నో చేతిలో పరాభవం ఎదుర్కొంది. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 24 మ్యాచ్‌ల్లో తలపడగా.. సన్‌రైజర్స్ 13, ఢిల్లీ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.ఎస్ఆర్ హెచ్ తుది జట్టుప్యాట్ కమిన్స్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్, జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, మహ్మద్ షమీఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టుఅక్షర్ పటేల్(కెప్టెన్), జేక్ ప్రేజర్, డుప్లిసెస్, అభిషేక్ పార్కెల్, కేఎల్ రాహుల్, ట్రిస్టాన్ స్టబ్స్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముకేష్ కుమార్ -
13 బంతుల్లో విధ్వంసం.. ఎస్ఆర్హెచ్ నయా హీరో! ఎవరీ అనికేత్?
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో కొత్త హిట్టర్ దొరికేశాడు. అతడు యువ ఆటగాడు అనికేత్ వర్మ. ఐపీఎల్-2025లో భాగంగా ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అనికేత్ వర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అనికేత్.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.కేవలం 13 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అనికేత్.. 5 సిక్స్‌లతో 36 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ లక్నో ముందు ఫైటింగ్ స్కోర్ ఉంచడంలో అనికేత్ది కీలక పాత్ర. ఈ క్రమంలో ఎవరీ అనికేత్ అని నెటిజన్లు తెగవేతికేస్తున్నారు. ఎవరీ అనికేత్ వర్మ..?23 ఏళ్ల అనికేత్ వర్మ.. ఫిబ్రవరి 5, 2002న ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జన్మించాడు. కానీ అతడు దేశవాళీ క్రికెట్లో మాత్రం మధ్యప్రదేశ్ తరపున ఆడుతున్నాడు. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన వర్మ.. పవర్ హిట్టింగ్‌కు పెట్టింది పేరు. మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. అనికేత్ వర్మ ఇప్పటికే దేశవాళీ క్రికెట్లో తనను తను నిరూపించుకున్నాడు.ఫెయిత్ క్రికెట్ క్లబ్ తరపున 44 బంతుల్లో 120 చేసిన వర్మ.. మధ్యప్రదేశ్ లీగ్ (MPL) టీ20 లీగ్‌లో కేవలం 41 బంతుల్లో 123 పరుగులు చేశాడు. అదేవిధంగా పురుషుల అండర్-23 స్టేట్ A ట్రోఫీలో సైతం ఆజేయ సెంచరీతో మెరిశాడు. ఈ క్రమంలోనే అతడిని ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌కు సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్నో బౌలర్లు అద్బుతంగా రాణించారు. లక్నో పేసర్ శార్ధూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(47) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అనికేత్ వర్మ(36), నితీశ్ కుమార్ రెడ్డి(32),క్లాసెన్(26) రాణించారు.చదవండి: #Ishan Kishan: నిన్న సెంచరీ.. కట్ చేస్తే! నేడు తొలి బంతికే ఔట్ -
ఇషాన్ సక్సెస్ సీక్రెట్ ఇదే!
-
సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై అద్భుత విజయం
-
IPL SRH Vs RR: రాజస్తాన్‌పై ఎస్ఆర్హెచ్ గ్రాండ్ విక్టరీ..
IPL 2025- SRH VS Rajasthan Royals Match Live Updatesఎస్ఆర్హెచ్ ఘన విజయం..ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులు మాత్రమే చేయగల్గింది. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్( 35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 70) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సంజూ శాంసన్(66), హెట్‌మైర్(42) పరుగులతో పోరాడారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షమీ, జంపా చెరో వికెట్ సాధించారు. శాంసన్, జురెల్ ఔట్దూకుడుగా ఆడిన సంజూ శాంసన్(66), ధ్రువ్ జురెల్(70) వరుస క్రమంలో ఔటయ్యారు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో శాంసన్ ఔట్ కాగా.. జంపా బౌలింగ్‌లో జురెల్ పెవిలియన్‌కు చేరాడు.శాంసన్, జురెల్ హాఫ్ సెంచరీలు..రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లు సంజూ శాంసన్(59), ధ్రువ్ జురెల్(69) దూకుడుగా ఆడుతున్నారు. 13 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. 15 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 169/5.9 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 108/39 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ 3 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజులో సంజూ శాంసన్(48), ధ్రువ్‌జురెల్(38) ఉన్నారు.రాజస్తాన్ మూడో వికెట్ డౌన్నితీష్ రాణా రూపంలో రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రాణా.. మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 57/3. క్రీజులో సంజూ శాంసన్(32), ధ్రువ్‌జురెల్(3) ఉన్నారు.రాజస్తాన్‌కు భారీ షాక్..287 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్‌కు భారీ షాక్ తగిలింది. సిమ్రాన్‌జీత్ సింగ్ వేసిన రెండో ఓవర్లో రాజస్తాన్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత యశస్వి జైశ్వాల్(1).. తర్వాత రియాన్ పరాగ్(4) పెవిలియన్‌కు చేరాడు. 3 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 35/2భారీ స్కోర్ చేసిన సన్‌రైజర్స్..ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ట్రావిస్ హెడ్(67) హాఫ్ సెంచరీతో మెరవగా.. క్లాసెన్(34), నితీశ్ కుమార్(30) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే మూడు వికెట్లు పడగొట్టగా.. థీక్షణ రెండు, సందీప్ శర్మ ఒక్క వికెట్ సాధించారు. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.ఇషాన్ కిషన్ సెంచరీ..రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ సెంచరీతో మెరిశాడు. కేవలం 45 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ సెంచరీని కిషన్ అందుకున్నాడు.మూడో వికెట్ డౌన్‌నితీశ్ రెడ్డి రూపంలో ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన నితీశ్.. థీక్షణ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో ఇషాన్ కిషన్(75), క్లాసెన్(1) ఉన్నారు. 16 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 219/3. ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ..ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 25 బంతుల్లో కిషన్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 70 పరుగులతో కిషన్ తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 7 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. 14 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 196/2. ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ డౌన్..ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 67 పరుగులు చేసిన హెడ్.. తుషార్ దేశ్ పాండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 147/2. క్రీజులో నితీష్ కుమార్‌రెడ్డి(15), ఇషాన్ కిషన్(35) ఉన్నారు.ట్రావిస్ హెడ్ ఫిప్టీ.. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. కేవలం 21 బంతుల్లోనే హెడ్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. హెడ్ 59 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఇప్పటివరకు 8 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. 9 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 124/1.దూకుడుగా ఆడుతున్న హెడ్..ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 15 బంతుల్లో 41 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడితో పాటు ఇషాన్ కిషన్(20) పరుగులతో క్రీజులో ఉన్నాడు. 6 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 94/1తొలి వికెట్ డౌన్..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. మహేష్ థీక్షణ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి ఇషాన్ కిషన్ వచ్చాడు. 5 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 55/1ఐపీఎల్ 25 లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ కెప్టన్ రియాన్ పరాగ్.. ముందుగా సన్ రైజర్స్ ను బ్యాటింగ్ ఆహ్వానించాడు. పిచ్ ను చూస్తుంటే డ్రై వికెట్ గా ఉందని, దాంతోనే ముందుగా బౌలింగ్ తీసుకున్నట్లు తెలిపాడు.ఇరు జట్ల బలాబలాలు..ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (మార్చి 23) మధ్యాహ్నం జరుగబోయే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ఎస్ఆర్హెచ్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియం (హైదరాబాద్) వేదిక కానుంది. గత సీజన్ ఫైనల్లో కేకేఆర్ చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకున్న ఆరెంజ్ ఆర్మీ.. తొలి మ్యాచ్‌లో గెలిచి సీజన్‌ను ఘనంగా ప్రారంభించాలని భావిస్తుంది. గతేడాది మూడో స్థానంతో సరిపెట్టుకున్న రాయల్స్ సైతం గెలుపుతో సీజన్‌ను ప్రారంభించాలని పట్టుదలగా ఉంది.ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు పరిశీలిస్తే.. రాయల్స్‌పై సన్‌రైజర్స్ కాస్త పైచేయి కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్‌ల్లో తలపడగా.. సన్‌రైజర్స్ 11, రాయల్స్ 9 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఇరు జట్లు మధ్య జరిగిన గత మూడు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్సే విజయం సాధించింది. హైదరాబాద్‌లో ఇరు జట్లు తలపడిన చివరిసారి (2023) మాత్రం రాయల్స్‌నే విజయం వరించింది. ఇరు జట్లు హైదరాబాద్‌లో నాలుగుసార్లు తలపడగా రాయల్స్ ఆ ఒక్కసారి మాత్రమే గెలుపొందింది.సన్ రైజర్స్ తుది జట్టుప్యాట్ కమిన్స్( కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్, సిమర్ జీత్ సింగ్, హర్షల్ పటేల్; మహ్మద్ షమీరాజస్తాన్ తుది జట్టురియాన్ పరాగ్(కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శివం దూబే, నితీష్ రానా, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్ మెయిర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షనా, తుషారా దేశ్ పాండే, సందీప్ శర్మ, ఫజల్ హక్ పరూఖి -
IPL మ్యాచ్ టికెట్ల దందా.. ఉప్పల్ మెట్రో వద్ద బ్లాక్‌లో అమ్మకం
సాక్షి, ఉప్పల్: నేటి నుంచి ఐపీఎల్ సీజన్-18 ప్రారంభం కానుంది. ఇక, రేపు హైదరాబాద్ వేదికగా రాజస్థాన్, SRH మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు బ్లాక్‌లో అమ్మడం కలకలం రేపింది. ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను అమ్ముతున్న వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. ఐపీఎల్ సందడి వేళ ఉప్పల్‌లో ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లు తిలకించేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. మ్యాచ్ టికెట్స్ కోసం ఎగబడతారు. కానీ, కొందరు మాత్రం మ్యాచ్ టికెట్లను బ్లాక్‌లో అమ్మడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రేపు జరగబోయే RR Vs SRH మ్యాచ్ టికెట్లను ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ఓ వ్యక్తి అమ్మడం కలకలం రేపింది. మెట్రో స్టేషన్ వద్ద భరద్వాజ్ అనే వ్యక్తి టికెట్లను అమ్మడం కొందరు గుర్తించారు. దీంతో, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఓటీ పోలీసులు అక్కడిని చేరుకుని భరద్వాజ్‌కు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, అతడి వద్ద ఉన్న ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ టికెట్లను ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. -
ఐపీఎల్‌కి ముందే విధ్వంసం మొదలుపెట్టిన ఇషాన్ కిషన్
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ న్యూ జాయినీ ఇషాన్ కిషన్ విధ్వంసం మొదలైంది. ఎస్ఆర్హెచ్ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌ల్లో పాకెట్ డైనమైట్ చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు మెరుపు అర్ద సెంచరీలు సాధించాడు. తాజాగా జరిగిన ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో ఇషాన్ ఆకాశమే హద్దుగా చెలరేగి 22 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అంతకుముందు ఓ మ్యాచ్‌లో 19 బంతుల్లో 49.. మరో మ్యాచ్‌లో 30 బంతుల్లో 70.. ఇంకో మ్యాచ్‌లో 23 బంతుల్లో 64 పరుగులు చేశాడు. సీజన్ ప్రారంభానికి ముందు ఇషాన్ అరివీర భయంకర ఫామ్ చూసి సన్‌రైజర్స్ శ్రేణులు ఖుషీగా ఉన్నాయి. ఈ సీజన్లో ఇషాన్ మరో విధ్వంకర ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌కు ప్రారంభించే అవకాశం ఉంది. ఇషాన్, అభిషేక్ తమ సహజ శైలిలో చెలరేగితే ఈ సీజన్లో సన్‌రైజర్స్ ఆపడం ఎవరి తరమూ కాదు. ఇషాన్‌ను ఈ సీజన్ మెగా వేలంలో సన్‌రైజర్స్ రూ. 11.25 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్‌కు ఆడిన ఇషాన్.. ఆ జట్టు విజయాల్లో అత్యంత ప్రాముఖ్యమైన పాత్ర పోషించాడు.ఈ సీజన్లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్ ఇషాన్, అభిషేక్, హెడ్, క్లాసెన్, అభినవ్ మనోహర్, నితీశ్ కుమార్ రెడ్డితో కూడి అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తుంది. గత సీజన్లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ స్కోర్లు నమోదు చేసిన సన్‌రైజర్స్ ఈసారి ఆ స్కోర్లను కూడా అధిగమించే అవకాశం ఉంది. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌ల్లోనే 260, 270 పరుగులను సునాయాసంగా చేస్తున్న ఆరెంజ్ ఆర్మీ.. అస్సలు మ్యాచ్‌ల్లో 300 స్కోర్‌ను దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గత సీజన్లో సన్‌రైజర్స్ ఆర్సీబీపై 287 (ఐపీఎల్ హిస్టరీలో ఇదే అత్యధిక స్కోర్), ముంబై ఇండియన్స్‌పై 277, ఢిల్లీ క్యాపిటల్స్‌పై 266 పరుగులు చేసింది. గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్లో మరింత ప్రమాదకరంగా కనిపిస్తున్న ఆరెంజ్ ఆర్మీ పరుగుల సునామీ సృష్టించడం ఖాయమనిపిస్తుంది. గత సీజన్లో తృటిలో టైటిల్ చేజార్చుకున్న హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది. ఈ సీజన్లో బ్యాటింగ్‌తో పాటు సన్‌రైజర్స్ బౌలింగ్ కూడా సమతూకంగా ఉంది. కెప్టెన్ కమిన్స్‌తో పాటు ఈ సీజన్లో కొత్తగా షమీ, ఉనద్కత్, హర్షల్ పటేల్, ఆడమ్ జంపా జట్టులో చేరారు.ఈ సీజన్లో సన్‌రైజర్స్ ప్రయాణం మార్చి 23న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 22న ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్.. ఆర్సీబీతో తలపడనుంది.2025 ఐపీఎల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే..పాట్ కమిన్స్ (కెప్టెన్), అథర్వ్ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, వియాన్ ముల్దర్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమర్జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్ -
IPL 2025: IPL కప్ మనదేనా?
-
కావ్య మారన్ సెలక్షన్ అదిరిందంటున్న ఫ్యాన్స్
-
IPL 2024: ఫైనల్లో ఎస్ఆర్హెచ్ చిత్తు.. చాంపియన్‌గా కేకేఆర్
-
సన్‌రైజర్స్ యజమానిని, కంటతడిపెట్టించిన కేకేఆర్..
-
ఐపీఎల్ 2024 ప్రైజ్ మనీ ఎవరికి ఎన్ని కోట్లు ?
-
కేకేఆర్ విజయంతో బెంగాల్లో సంబరాలు మిన్నంటాయి: సీఎం మమత
కోల్కత్తా: ఐపీఎల్-17(2024)లో విజేతగా నిలిచిన కోల్కత్తా నైట్‌రైడర్ జట్టును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందించారు. ఈ ఐపీఎల్ సీజన్లో రికార్డులు బద్దలు కొట్టినందుకు ప్లేయర్స్‌కు వ్యక్తిగతంగా అభినందనలు తెలిపారు.కాగా, మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా..‘కోల్‌కతా నైట్ రైడర్స్ విజయంతో బెంగాల్ అంతటా సంబరాలు మిన్నంటాయి. ఈ ఐపీఎల్ సీజన్లో రికార్డు బద్దలు కొట్టినందుకు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ఫ్రాంచైజీని వ్యక్తిగతంగా అభినందించాలనుకుంటున్నాను. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. Kolkata Knight Riders' win has brought about an air of celebration all across Bengal.I would like to personally congratulate the players, the support staff and the franchise for their record breaking performance in this season of the IPL.Wishing for more such enchanting…— Mamata Banerjee (@MamataOfficial) May 26, 2024 ఇక, ఐపీఎల్-17 సీజన్లో కేకేఆర్ అద్భుత ఆటతీరును కనబరిచింది. సీజన్ ప్రారంభం నాటి నుంచి దూకుడుగా ఆడుతూ టేబుట్ టాపర్‌గా నిలిచింది. చివరగా ఫైనల్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి 114 లక్ష్యాన్ని కేవలం పదో ఓవర్లోనే పూర్తి చేసింది. కాగా, ఈ సీజన్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా కేకేఆర్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ నిలిచాడు. ICYMI! That special run to glory 💫💜Recap the #Final on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvSRH | #TheFinalCall pic.twitter.com/qUDfUFHpka— IndianPremierLeague (@IPL) May 26, 2024 📽️ 𝗥𝗔𝗪 𝗥𝗘𝗔𝗖𝗧𝗜𝗢𝗡𝗦Moments of pure joy, happiness, jubilation, and happy tears 🥹 What it feels to win the #TATAIPL Final 💜Scorecard ▶️ https://t.co/lCK6AJCdH9#KKRvSRH | #Final | #TheFinalCall | @KKRiders pic.twitter.com/987TCaksZz— IndianPremierLeague (@IPL) May 26, 2024 -
IPL 2024 ఫైనల్ జోరుగా బెట్టింగ్..
-
ఫైనల్లో తలపడనున్న SRH, KKR జట్లు
-
SRH: అతనే కదా..! 'అభీ రైజింగ్..'!!
ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు కొన్నేళ్ల క్రితం ఒక 17 ఏళ్ల కుర్రాడిని ఎంచుకుంది. అయితే తుది జట్టు సమీకరణాల్లో భాగంగా అతనికి ఆరంభంలో అవకాశాలు రాలేదు. ఆ తర్వాత వరుస పరాజయాలతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయింది. దాంతో చివరి మూడు మ్యాచ్‌లలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి ఒక ప్రయత్నం చేయాలని టీమ్ మేనేజ్మెంట్ భావించింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌తో తొలి అవకాశం దక్కించుకున్న ఆ కుర్రాడు చెలరేగిపోయాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి19 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతరం మరో మ్యాచ్‌లోనూ నాటౌట్ ఉన్న అతను ఇంకో పోరులో ఒక భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో అవుటయ్యాడు.టీమ్ కోచ్ రికీ పాంటింగ్ అతని దగ్గరకు వచ్చాడు. సాధారణంగా ఇలాంటివి ఆడితే కోచ్‌లు అవసరంగా ఆ షాట్ ఆడావని, లేదా తొందరపడ్డావు, కాస్త జాగ్రత్త వహించాల్సిందని చెబుతారు. కానీ పాంటింగ్ మాత్రం ‘ఈ షాట్ మళ్లీ ఆడితే నాకు బంతి అక్కడ ప్రేక్షకుల గ్యాలరీల్లో కనిపించాలి’ అని ప్రోత్సహించాడు. ఆ కుర్రాడి మనసులో ఇది బాగా ముద్రించుకుపోయింది. ఆపై ఎప్పుడు అవకాశం వచ్చినా అతను దానిని మరచిపోలేదు. ఇప్పుడు ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున రికార్డు స్థాయిలో సిక్సర్ల పంట పండిస్తున్న ఆ కుర్రాడే అభిషేక్ శర్మ. ఢిల్లీపై చెలరేగిన మ్యాచ్ అతనికి ఐపీఎల్లో మొదటి మ్యాచ్ మాత్రమే కాదు, ఓవరాల్‌గా కూడా అతని సీనియర్ కెరీర్లో తొలి టి20 కావడం విశేషం. తన వీర దూకుడుతో హైదరాబాద్ అభిమానుల దృష్టిలో అభిషేక్ కొత్త హీరోగా మారిపోయాడు. ఓపెనర్‌గా తన విధ్వంసక ఆటతీరుతో జట్టుకు అద్భుత విజయాలు అందించి అతను రైజర్స్ రాత మార్చాడు.ఐపీఎల్ ఈ సీజన్లో మెరుపు బ్యాటింగ్ చూస్తున్నవారికి అభిషేక్ శర్మ అనూహ్యంగా దూసుకొచ్చిన ఆటగాడిలా కనిపించవచ్చు. కానీ స్కూల్ క్రికెట్ స్థాయి నుంచే అతను అసాధారణ ప్రతిభతో వేర్వేరు వయో విభాగాల్లో రాణిస్తూ పై స్థాయికి చేరాడు. పంజాబ్‌లోని అమృత్సర్ అతని స్వస్థలం. మాజీ క్రికెటర్ అయిన తండ్రి రాజ్‌కుమార్ శర్మ తొలి కోచ్ అయి ఆటలో ఓనమాలు నేర్పించాడు. ప్రస్తుత భారత జట్టులో కీలక ఆటగాడైన శుభ్‌మన్ గిల్, అభిషేక్ చిన్ననాటి స్నేహితులు. అండర్–12 నుంచి అండర్–19 స్థాయి వరకు, ఆపై దేశవాళీలో సీనియర్ స్థాయిలో కూడా కలసి ఆడారు. అయితే గిల్ లిఫ్ట్ అందుకున్నట్లుగా వేగంగా దూసుకుపోతే, మెట్ల ద్వారా ఒక్కో అడుగు పైకి ఎదిగేందుకు శ్రమిస్తున్న అభిషేక్‌కు గుర్తింపు దక్కడం ఆలస్యమైంది. భారత దేశవాళీ క్రికెట్లో అభిషేక్ తొలిసారి అందరి దృష్టిలో పడింది 2015–16 సీజన్లోనే. ఆ ఏడాది అండర్–16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో 7 మ్యాచ్‌లలోనే అతను 1200 పరుగులు సాధించడంతో పాటు బౌలింగ్‌లో 57 వికెట్లు పడగొట్టడం విశేషం.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకుంటూ..అండర్–19 ప్రపంచకప్‌తో..విజయ్ మర్చంట్ ట్రోఫీ తర్వాత అభిషేక్ అడుగు సహజంగానే అండర్–19 స్థాయి వైపు పడింది. 16 ఏళ్ల వయసులోనే అతను భారత అండర్–19 జట్టులోకి ఎంపికయ్యాడు. అంతే కాకుండా కెప్టెన్‌గా కూడా అవకాశం దక్కించుకున్నాడు. 2016లోనే ఆసియా కప్‌లో జట్టును విజేతగా నిలిపి తన సారథ్య ప్రతిభను కూడా ప్రదర్శించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే అండర్–19 వరల్డ్ కప్ కూడా వచ్చింది. ఈసారి పృథ్వీ షా కెప్టెన్సీలో జట్టు ఆడింది. అయితే కెప్టెన్సీ లేకపోయినా జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న అభిషేక్.. మన టీమ్ వరల్డ్ కప్ విజేతగా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ ప్రపంచకప్ విజయానికి సరిగ్గా వారం రోజుల ముందే వేలంలో ఢిల్లీ టీమ్ అతడిని రూ. 55 లక్షలకు తీసుకుంది.ఆల్‌రౌండ్ ప్రతిభతో..‘క్లీన్ స్ట్రయికర్’.. అభిషేక్ ఆట గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా అతని గురించి వినిపించే ఏకవాక్య ప్రశంస. బ్యాటింగ్‌లో ఎక్కడా తడబాటు కనిపించకుండా, బంతిని బలంగా బాదిన సమయంలో కూడా చూడముచ్చటగా, కళాత్మకంగా షాట్ ఆడే తీరుపై అందరూ చెప్పే మాట అది. కెరీర్ ఆరంభంలో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేసే ఆటగాడిగా ఉన్న అభిషేక్ ఆ తర్వాత తన శ్రమతో, పట్టుదలతో టాప్ ఆర్డర్‌కు చేరాడు. ఓపెనర్‌గా విధ్వంసక బ్యాటింగ్ చేయడమే కాదు, కీలక సమయాల్లో జట్టుకు ఉపయోగపడే స్పిన్నర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. స్పిన్‌లో ఎంతో సాధనతో అతను బ్యాక్ స్పిన్నింగ్ లెగ్కట్టర్ అనే ప్రత్యేక తరహాలో బౌలింగ్ అస్త్రాన్ని తయారుచేసుకున్నాడు. ఇది ఎన్నోసార్లు అతనికి వికెట్‌ని తెచ్చిపెట్టింది.తండ్రి రాజ్‌కుమార్ శర్మ, యువరాజ్ సింగ్‌తో..యువరాజ్ మార్గనిర్దేశనంలో..భారత మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అంటే మొదటి నుంచి అభిషేక్‌కు వీరాభిమానం. తర్వాతి రోజుల్లో అది అభిమానంగా మాత్రమే కాకుండా మరింత పెద్ద స్థాయికి చేరింది. గత కొన్నేళ్లుగా యువీ అతనికి మెంటార్‌గా వ్యవహరిస్తూ ప్రోత్సహిస్తున్నాడు. అధికారికంగా పంజాబ్ క్రికెట్లో ఎలాంటి హోదా లేకపోయినా కేవలం అభిషేక్ కోసం అతను తన సమయాన్ని వెచ్చిస్తూ అతని ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాడు. అభి స్టాన్స్, షార్ట్ బంతులు ఆడటంలో మెలకువలు, మానసికంగా దృఢంగా మార్చడం.. ఇలా అన్నింటిలో యువీ అండగా నిలిచాడు. ఇప్పుడు ఈ కుర్రాడు ఆడే కొన్ని దూకుడైన షాట్లు యువీ ఆటను గుర్తుకు తెస్తాయంటే ఆశ్చర్యం లేదు. గత ఏడాది అభిషేక్ తన అద్భుత ఆటతో పంజాబ్ జట్టుకు తొలిసారి దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. ఈ టోర్నీలో 2 సెంచరీలు, 3 సెంచరీలు సహా ఏకంగా 180 స్ట్రైక్‌రేట్‌తో అతను 485 పరుగులు చేశాడు. ఇందులో ఆంధ్రపై 51 బంతుల్లోనే 112 పరుగులు చేసిన మ్యాచ్‌లో పంజాబ్ టోర్నీ రికార్డు స్కోరు 275 పరుగులను నమోదు చేసింది.ఐపీఎల్‌తో రైజింగ్..2019లో సన్‌రైజర్స్ టీమ్ శిఖర్ ధావన్‌ను ఢిల్లీకి బదిలీ చేసి అతనికి బదులుగా ముగ్గురు ఆటగాళ్లను తీసుకుంది. వారిలో అభిషేక్ శర్మ కూడా ఒకడు. అయితే వరుసగా మూడు సీజన్లలో కూడా అతడిని లోయర్ ఆర్డర్‌లోనే ఆడించడంతో పాటు పరిమిత అవకాశాలే వచ్చాయి. దాంతో అతని అసలు సామర్థ్యం వెలుగులోకి రాలేదు. అయితే మూడో ఏడాది (2021) చివరి రెండు మ్యాచ్‌లలో అతను ఆశించినట్లుగా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయించారు. ముంబైతో మ్యాచ్‌లో 16 బంతుల్లో 33 పరుగులు సాధించడంతో అతని దూకుడైన శైలి మేనేజ్మెంట్కు అర్థమైంది. తాము చేసిన పొరపాటును సరిదిద్దుకుంటున్నట్లుగా 2022 ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ ఏకంగా రూ.6.5 కోట్లకు అభిషేక్‌ను మళ్లీ తీసుకుంది.అమ్మ, తోబుట్టువుతో..రెండు సీజన్ల పాటు నిలకడగా రాణించిన అతను జట్టుకు విజయాలు అందించాడు. అయితే అభిషేక్ విశ్వరూపం ఈ ఏడాదే కనిపించింది. అటు పేస్, ఇటు స్పిన్ బౌలింగ్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన అతను 200కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ ట్రవిస్ హెడ్‌తో కలసి అతను అందించిన ఆరంభాలు రైజర్స్‌కు ఘన విజయాలను ఇచ్చాయి. టోర్నీలో అతను కొట్టిన ఫోర్లకంటే సిక్సర్లే ఎక్కువగా ఉండటం అతని విధ్వంసం ఎలాంటిదో చూపిస్తుంది. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో టీమ్ అత్యధిక స్కోరు (277) సాధించడంలో అతనిదే కీలక పాత్ర. ముంబైతో జరిగిన ఈ మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 16 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది హైదరాబాద్ టీమ్ తరఫున లీగ్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేశాడు.ఇక లక్నోతో జరిగిన మ్యాచ్‌లోనైతే 28 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచిన ఇన్నింగ్స్‌ను ఐపీఎల్ అభిమానులెవరూ మరచిపోలేరు. సరిగ్గా చెప్పాలంటే గత కొన్నేళ్లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించక ముందే ఐపీఎల్లో ఆడి (అన్క్యాప్డ్ ప్లేయర్) సత్తా చాటిన ఆటగాళ్లలో అభిషేక్ అగ్రస్థానంలో ఉంటాడంటే అతిశయోక్తి కాదు. అతని తాజా ప్రదర్శనతో వచ్చే టి20 వరల్డ్ కప్‌లో అభిషేక్‌కు చోటు ఇవ్వాల్సిందనే చర్చ జరిగింది. అయితే స్వయంగా మెంటార్ యువరాజ్ కూడా దానికి ఇంకా సమయం ఉందని, 23 ఏళ్ల అభిషేక్ రాబోయే ఇంకా మరిన్ని అస్త్రశస్త్రాలతో సిద్ధమై భారత జట్టులో అరంగేట్రం చేయగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ తర్వాత టీమిండియాలో సీనియర్ల స్థానంలో కుర్రాళ్లు చోటు దక్కించునే అవకాశాలు ఉండటంతో ఆ జాబితాలో అభిషేక్ పేరు తప్పక ఉండవచ్చనేది మాత్రం వాస్తవం. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
ఐపీఎల్ ఫైనల్ కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్ హైదరాబాద్
-
Qualifier 1: సన్‌రైజర్స్ విఫలం.. ఫైనల్ చేరిన కేకేఆర్
-
అదరగొట్టిన అయ్యర్ బ్రదర్స్.. ఫైనల్లో KKR
-
ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిన సమంత పోస్ట్!
సినిమాలకు గ్యాప్ ఇచ్చినా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది సమంత. నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఫ్యాన్స్ అలరిస్తుంది. తన పర్సనల్ విషయాలను సైతం షేర్ చేసుకుంటుంది. తన పోస్టులతో అప్పుడప్పడు యువతకు ఓ మెసేజ్ కూడా అందిస్తుంది. అలాగే ఒక్కోసారి చిలిపి పోస్ట్‌లు కూడా పెడుతూ.. ఫ్యాన్స్‌ని అయోమయంలో పడేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ పెట్టిన పోస్ట్ ఒకటి ఇటు సామ్ అభిమానులతో పాటు అటు క్రికెట్ లవర్స్‌ని కన్ఫ్యూజన్లో పడేసింది. సమంత పెట్టిన పోస్ట్ ఏంటి?ఐపీఎల్ 2024 క్లైమాక్స్‌కి చేరిన సంగతి తెలిసిందే. మంగళవారం నుంచే ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ప్రారంభం అయ్యాయి. క్యాలిఫయిర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించి ఫైనల్‌కి చేరుకుంది. సన్ రైజర్స్ ఫైనల్‌కు చేరాలంటే.. క్వాలిఫయిర్ 2 తప్పక గెలవాల్సి ఉంటుంది. దీని కంటే ముందు నేడు(మే 22) రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ బెర్త్ కోసం సన్‌రైజర్స్‌లో పోటీ పడాల్సి ఉంటుంది.(చదవండి: ‘కల్కి’ ప్రమోషన్స్‌కి అన్ని కోట్లా..? ఓ పెద్ద సినిమానే తీయొచ్చు!)ఇలా ఐపీఎల్ ఆట చాలా ఆసక్తికరంగా సాగుతున్న వేళ సమంత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 'మీరు విజయం సాధిస్తే చూడాలని ఉంది' ఓ పోస్ట్ పెట్టింది. 'మీ హృదయం ఏది కోరుకున్నా, మీరు ఎలాంటి ఆకాంక్షలు కలిగి ఉన్నా, నేను మీ కోసం మద్దతు ఇస్తాను. మీరు విజయానికి అర్హులు’ అంటూ ఆ పోస్ట్ కింద రాసుకొచ్చింది. దీంతో సమంత ఆర్సీబీ మద్దతుగా ఈ పోస్ట్ పెట్టిందని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఎస్ఆర్హెచ్కు సపోర్ట్ చేస్తూ ఈ పోస్ట్ చేసిందని కామెంట్ చేస్తున్నారు. సామ్ పోస్ట్‌ని షేర్ చేస్తూ మాకంటే మాకు సపోర్ట్ చేస్తుందంటూ ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గొడవపడుతున్నారు. ఇంకొంత మంది నెటిజన్స్ అయితే ఇది క్రికెట్‌కు సంబంధించినది కాదని, తన అభిమానుల కోసమే అలా రాసుకొచ్చిందని అంటున్నారు. సమంత సందిస్తే తప్ప ఆ పోస్ట్ అర్థం ఏంటి? ఎవరునుద్దేశించి చేశారనే విషయాలు తెలియవు. మరి సామ్ క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
వరల్డ్ కప్ నే కాళ్ళ కింద పెట్టుకున్న కెప్టెనే ఇలా అంటే..
-
SRH vs PBKS: రెండో స్థానంలో సన్ రైజర్స్
-
సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌తో కలిసి బిర్యానీ ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ ఎవరంటే?(ఫొటోలు)
-
SRH vs GT: మైదానంలో పరిస్థితి ఇదీ.. ప్లే ఆఫ్స్‌లో సన్‌రైజర్స్
-
SRH Vs GT: సన్‌రైజర్స్ గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్‌లో?!
-
IPL 2024: పిచ్చెక్కిస్తున్న సన్‌రైజర్స్.. ఈసారి టైటిల్ పక్కా..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఏ రేంజ్లో రెచ్చిపోతున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీ గతంలో ఎన్నడూ లేనంతగా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఇంతటి సమతూకమైన జట్టు బహుశా పొట్టి క్రికెట్ చరిత్రలో ఎక్కడా లేదనే చెప్పవచ్చు. బ్యాటింగ్ విభాగంలో సన్‌రైజర్స్ ప్రదర్శన న భూతో న భవిష్యతి అన్న చందంగా ఉంది. ఈ జట్టులో ఉన్నటువంటి విధ్వంసకర వీరులు యావత్ పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఏ జట్టులోనూ లేరు. ఓపెనర్ల దగ్గరి నుంచి ఎనిమిది, తొమ్మిదో స్థానం ఆటగాళ్ల వరకు అందరూ మెరుపు వీరులే ఉన్నారు.ఓపెనర్లు అభిషేక్, హెడ్ ఊచకోత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీరిద్దరు తమకెదురైన ప్రతి బౌలర్‌ను గడగడలాడిస్తున్నారు. వీరి దెబ్బకు బ్యాటింగ్ రికార్డులు ఒక్కొటిగా బద్దలవుతూ ఉన్నాయి. వీరిద్దరి తర్వాత బ్యాటింగ్‌కు దిగే మార్క్రమ్, క్లాసెన్ విధ్వంసం ఇంకో లెవెల్లో ఉంది. వీరు కూడా తమేమీ తక్కువ కాదు అన్నట్లు విధ్వంసం సృస్టిస్తున్నారు.మార్క్రమ్ గత కొన్ని మ్యాచ్‌లుగా లయ తప్పినట్లు కనిపిస్తున్నా క్లాసెన్ మాత్రం అవకాశం దొరికిన ప్రతిసారి రెచ్చిపోతున్నాడు. ఈ నలుగురితో పాటు యువ ఆల్‌రౌండర్లు నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్‌లు కూడా తమ దాకా వస్తే మెరుపులు మెరిపిస్తున్నారు.బౌలింగ్ విభాగంలో సైతం సన్‌రైజర్స్ చాలా పటిష్టంగా ఉంది. స్వింగ్ సుల్తాన్ భునేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇతనికి కమిన్స్, నటరాజన్, ఉనద్కత్ తోడవుతున్నారు. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం స్పిన్నర్ విజయ్‌కాంత్ వియాస్కాంత్ పర్వాలేదనిపించాడు. షాబాజ్ అహ్మద్, నితీశ్ రెడ్డి కూడా బంతితో రాణిస్తున్నారు.సన్‌రైజర్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలతో పాటు ఫీల్డింగ్‌లోనూ పటిష్టంగా ఉంది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో నితీశ్, సన్వీర్ సింగ్ పట్టిన క్యాచ్‌లే ఇందుకు నిదర్శనం. ఈ సీజన్లో సన్‌రైజర్స్ బెంచ్ కూడా చాలా పటిష్టంగా ఉంది. ఎంతలా అంటే.. బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లతో మరో సమతూకమైన జట్టును తయారు చేయవచ్చు. మొత్తంగా ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీ గతంలో ఎన్నడూ లేనట్లు అత్యంత పటిష్టంగా కనిపిస్తూ టైటిల్ దిశగా పరుగులు పెడుతుంది. ఈసారి సన్‌రైజర్స్ టైటిల్ ఎగరేసుకుపోవడం పక్కా అని అభిమానులు ధీమాగా ఉన్నారు. విశ్లేషకులు, మాజీలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. -
SRH vs LSG: ఏమా పరుగుల విధ్వంసం.. లక్నో చిత్తు
-
SRH Vs LSG: ప్లే ఆఫ్స్ రేసు.. రెండింటికీ కీలక మ్యాచ్
-
మరో బిగ్ మ్యాచ్.. సన్‌రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
-
వాటే మ్యాచ్.. ఆఖరి బంతికి రాయల్స్‌పై రైజర్స్ గెలుపు
-
Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
-
Anchor Sreemukhi: ఉప్పల్ స్టేడియంలో యాంకర్ శ్రీముఖి సందడి (ఫోటోలు)
-
IPL 2024 RR vs SRH: సై అంటే సై అంటున్న కొదమసింహాలు
-
సన్‌రైజర్స్‌ను చిత్తు చేసిన సీఎస్కే
-
SRH Vs RCB Photos: నిన్న హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్‌కు వెళ్ళలేదా అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే
-
తగ్గేదేలే అంటున్న కమిన్స్..ఆర్సీబీ పరిస్థితి ఏంటో?
-
ఉప్పల్‌లో ఉల్లాసంగా SRH, RCB ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
-
Kaviya Maran: వేలకోట్లకు ఏకైక వారసురాలు.. కావ్యా మారన్ గురించి ఈ విషయాలు తెలుసా? (ఫోటోలు)
-
బౌలర్లపై దయలేని సన్ రైజర్స్.. పాపం ఢిల్లీ
-
సన్‌రైజర్స్‌ను ఢీకొట్టనున్న ఢిల్లీ.. ఈసారి!
-
బెంగళూరులో దుమ్మురేగొట్టిన ఆరెంజ్ ఆర్మీ ‘ఓ రేంజ్’ బ్యాటింగ్ (ఫొటోలు)
-
RCB Vs SRH: చిన్నస్వామి స్టేడియంలో సత్తా చాటేదెవరు?
-
అక్కడ అందరి ముందే దుస్తులు మార్చుకోవాలి: యాంకర్ వింధ్య
ఇది ఐపీఎల్ సీజన్. తెలుగులో ఓ అమ్మాయి చక్కగా మాట్లాడుతోంది. బాడీ లాంగ్వేజ్ ప్రొఫెషనల్‌గా ఉంది. ఏ ముంబై అమ్మాయో అనుకునేటట్లు ఉంది. ఆ అమ్మాయి పేరు 'వింధ్య విశాఖ' మేడపాటి. 20 మంది యాంకర్లను వెనక్కినెట్టి, వ్యాఖ్యాతగా అవకాశం దక్కించుకన్న మొదటి తెలుగమ్మాయిగా వింధ్య రికార్డు సృష్టించింది. స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా మగవాళ్లను మాత్రమే చూసిన తెలుగు తెరకు పరిచయమైన తొలి తెలుగమ్మాయి. ఐపీఎల్ సీజన్-11 నుంచి హోస్ట్‌గా క్రికెట్ అభిమానులను ఆమె ఆకర్షిస్తోంది. తాజాగా తన మోడలింగ్ రోజుల గురించి పలు విషయాలను ఆమె పంచుకుంది. ఎక్కువగా మగవారు మాత్రమే ఉన్న క్రికెట్ రంగంలో కుటుంబసభ్యుల ప్రోత్సహం వల్లే తాను కెరీర్లో రాణించగలుగుతున్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వింధ్య తెలిపారు. డిగ్రీ సెకండియర్‌లో ఉన్నప్పుడు న్యూస్ ప్రజెంటర్‌గా, మోడల్‌గా అవకాశాలు ఎక్కువగా వస్తున్నప్పుడు చదువుని నిర్లక్ష్యం చేయకూడదని తన అమ్మగారి షరతు పెట్టడంతో ఎం.ఏ ఇంగ్లీష్ పూర్తి చేసినట్లు ఆమె చెప్పారు. ఆ తర్వాత ఆమె కొంతకాలం పాటు మోడలింగ్‌లోనూ శిక్షణ పొందానని పేర్కొన్నారు. (ఇదీ చదవండి: 63 ఏళ్ల టాప్ హీరోతో సినిమా.. నో చెప్పిన మీనా) అలా కాలేజీ రోజుల్లోనే పలు అందాల పోటీల్లో పాల్గొన్న వింధ్య విన్నర్‌గా కూడా రాణించినట్లు తెలిపింది. దీంతో ఎలాగైనా మోడలింగ్ చేయాలనే ఆలోచన రావడంతో చదువు పూర్తి అయన తర్వాత మోడలింగ్‌లో శిక్షణ తీసుకున్నట్లు ఆమె అన్నారు. 'సుమారు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఒక ఫ్యాషన్ వీక్‌లో నేను పాల్గొన్నాను. అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ షో గా నా కెరియర్లో మిగిలిపోయింది. అక్కడి వాతావరణం చూసిన తర్వాత ఈ రంగం నాకు ఏ మాత్రం సెట్ కాదని అనుకున్నాను. ఆ ఫ్యాషన్ షో కోసం వచ్చిన అమ్మాయిలకు దుస్తులు మార్చుకోవడానికీ సరైన గదులు కూడా లేవు. బ్యాక్ స్టేజ్ వద్ద అందరి ముందు దుస్తులు మార్చుకోవాల్సి ఉంటుంది. అది చూసి కొంత సమయం పాటు షాకయ్యా. ఆ క్షణంలోనే నిర్ణయం తీసుకున్నా ఈ రంగం నాకు ఏ మాత్రం సెట్ కాదనిపించింది. ఆ ఒక్క షో వల్ల మోడలింగ్‌ను వదిలేశాను. ఇది నాకు ఎదురైన అనుభవాన్ని మాత్రమే చెప్పుతున్నాను. అన్ని చోట్లా ఇలాగే ఉంటుందనేది నా అభిప్రాయం కాదు.'అని వింధ్య తెలిపారు. ఆమెకు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. గోపాల గోపాల, ముకుందా వంటి చిత్రాల్లో కూడా తనకు అవకాశం వచ్చినట్లు వింధ్య చెప్పారు. కానీ తనకు సినిమా రంగం అంటే పెద్దగా ఆసక్తి లేకపోవడంతో ఆ చిత్రాలకు నో చెప్పినట్లు ఆమె అన్నారు. -
ఉప్పల్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లో సోల్డ్ అవుట్.. అభిమానులకు మరోసారి నిరాశే
-
SRH vs PBKS: గెలుపు ఎవరిది?
-
నితీశ్ కుమార్‌రెడ్డి ధనాధన్ ఇన్నింగ్స్.. SRH ఉత్కంఠ విజయం
-
#Dhoni: కమిన్స్‌కు ‘షాకిచ్చిన’ ప్రేక్షకులు.. అట్లుంటది ధోనితోని!
IPL 2024- SRH vs CSK- Dhoni Entry Viral Video: మహేంద్ర సింగ్ ధోని.. ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. ఒక ఎమోషన్.. ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు హైదరాబాద్ ప్రేక్షకులు. తలా మైదానంలో అడుగుపెట్టగానే ఆరెంజ్ ఆర్మీ సైతం ధోని నామస్మరణతో అభిమానం చాటుకుంది. ఇక సీఎస్కే ఫ్యాన్స్ తమ జెండాలు రెపరెపలాడిస్తూ ధోనికి ఘన స్వాగతం పలికారు. కేవలం అభిమానులు మాత్రమే కాదు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు సైతం ధోని ఆగమనాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్- సన్‌రైజర్స్ మ్యాచ్ సందర్భంగా ఈ అందమైన దృశ్యాలు చోటుచేసుకున్నాయి. Overwhelming Yellove! Chaala Thanks, Hyderabad! 🥳💛#SRHvCSK #WhistlePodu 🦁💛 pic.twitter.com/nZIYuBrbdA — Chennai Super Kings (@ChennaiIPL) April 5, 2024 ఇక ధోని క్రేజ్‌ను చూసి సన్‌రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ ఆశ్చర్యపోయాడు. తమ సొంతమైదానంలో సీఎస్కే స్టార్‌కు ప్రేక్షకులు స్వాగతం పలికిన తీరును తాను ముందెన్నడూ చూడలేదన్నాడు. ధోని బ్యాటింగ్‌కు రాగానే.. మైదానం దద్దరిల్లిపోయిందని.. ఇంత వరకూ తాను అంత శబ్దం ఎప్పుడూ వినలేదంటూ ధోని క్రేజ్‌కు ఫిదా అయ్యాడు. కాగా శుక్రవారం ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. సీఎస్కేను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. స్లో వికెట్‌పై పరుగులు తీసేందుకు చెన్నై బ్యాటర్లు బాగా ఇబ్బంది పడ్డారు. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (12), రుతురాజ్ గైక్వాడ్(26) నిరాశపరచగా.. అజింక్య రహానే(35) నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అయితే, శివం దూబే మాత్రం(24 బంతుల్లో 45) తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఐదో స్థానంలో వచ్చిన రవీంద్ర జడేజా(23 బంతుల్లో 31) నాటౌట్‌గా నిలవగా.. ఏడో స్థానంలో డారిల్ మిచెల్(13) దిగడంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే, నటరాజన్ బౌలింగ్‌లో మిచెల్ అవుట్ కాగానే ధోని ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. From Orange 🧡, To Yellow 💛 For MS Dhoni 🫶🏻 ft. Hyderabad #TATAIPL | #SRHvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/iGYeoxxCvi — IndianPremierLeague (@IPL) April 6, 2024 తలా అలా గ్రౌండ్లో అడుగుపెట్టగానే కేరింతలతో ఉప్పల్ స్టేడియం ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ధోని ఒక్క పరుగు చేసి అజేయంగా నిలిచాడు. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి సీఎస్కే 165 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. ఏదేమైనా ధోని ఎంట్రీ ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. వైజాగ్‌లో వింటేజ్ ధోని విధ్వంసం విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్-2024లో ధోని తొలిసారి బ్యాటింగ్ చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ కేవలం 16 బంతుల్లోనే 37 పరుగులు రాబట్టాడు. There is nothing beyond Thala's reach 🔥💪 #IPLonJioCinema #Dhoni #TATAIPL #DCvCSK pic.twitter.com/SpDWksFDLO — JioCinema (@JioCinema) March 31, 2024 చదవండి: #Kavya Maran: పట్టపగ్గాల్లేని సంతోషం.. కావ్యా మారన్ పక్కన ఎవరీ అమ్మాయి? 2024? 2005? 🤔#DCvCSK #WhistlePodu #Yellove🦁💛pic.twitter.com/T6tWdWO5lh — Chennai Super Kings (@ChennaiIPL) March 31, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సొంత మైదానంలో వరుసగా రెండో విజయం
-
IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం.. ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత
సాక్షి,హైదరాబాద్: ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న ఉప్పల్ స్టేడియం వద్ద క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మ్యాచ్ టికెట్లున్నా లోపలికి అనుమతించడం లేదంటూ స్టేడియం వద్ద క్రికెట్ అభిమానులు ఆందోళనకు దిగారు. స్టేడియం ఎంట్రీ గేట్ 4 వద్ద ఉన్న బారికేడ్లను తోసేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, క్రికెట్ ఫ్యాన్స్‌కు మధ్య తోపులాట జరిగడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు టికెట్లున్నవారందరినీ క్యూలో ఉంచి ఒక్కొక్కరినీ లోపలికి పంపించడంతో గొడవ సద్దుమణిగింది. టాటా ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్), చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఉప్పల్ స్టేడియానికి క్రికెట్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కావడంతో ధోనీ అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియంకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇదీ చదవండి.. క్రికెట్ అభిమానులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్‌న్యూస్ -
IPL 2024: క్రికెట్ అభిమానులకు ఆర్టీసి ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్..
ఐపీఎల్-2024 సందర్భంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈరోజు (05-04-2024) సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ని వీక్షించడానికి భారీగా అభిమానులు వెళ్లనున్నారు. దీంతో స్టేడియం పరసర ప్రంతాల్లో సాధారణ ప్రయాణీకులకు ఎదురయ్యే ఇబ్బందులను గురించి ట్విట్టర్ లో ఆర్టీసి ఎండీ సజ్జనార్ "ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టండి. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లే క్రికెట్ అభిమానుల కోసమే హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఉప్పల్ స్టేడియానికి #TSRTC నడుపుతోంది. ఈ బస్సులు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయి. వీటిని ఉపయోగించుకుని క్షేమంగా స్టేడియానికి వెళ్లి క్రికెట్ మ్యాచ్ ని వీక్షించాలని #TSRTC యాజమాన్యం కోరుతోందని తెలిపారు". క్రికెట్ అభిమానులకు విజ్ఞప్తి!? ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా… pic.twitter.com/FxQT9joKAl — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 5, 2024 -
ఉప్పల్ దంగల్ : హైదరాబాద్ Vs చెన్నై మ్యాచ్‌కు సర్వం సిద్ధం (ఫొటోలు)
-
IPL 2024 SRH Vs MI: ఆరెంజ్ఆర్మీతో సన్‌రైజర్స్.. బెస్ట్ ఫొటోలు
-
IPL 2024: రసెల్ సిక్సర్ల సునామీ.. గేల్ రికార్డు బద్దలు
ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్ ఓ భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సిక్సర్ల సునామీ (25 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) సృష్టించిన రసెల్.. ఐపీఎల్లో అత్యంత వేగంగా 200 సిక్సర్లను (1322 బంతుల్లో) పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రసెల్‌కు ముందు ఈ రికార్డు క్రిస్ గేల్ (1811 బంతుల్లో) పేరిట ఉండేది. రసెల్, గేల్ తర్వాత అత్యంత వేగంగా 200 సిక్సర్లు పూర్తి చేసిన ఘనత కీరన్ పోలార్డ్‌కు (2055) దక్కింది. ఈ జాబితాలో టాప్-3 ఆటగాళ్లు విండీస్ వీరులే కావడం విశేషం. ఈ మ్యాచ్‌తో సిక్సర్ల సంఖ్యను 202కు పెంచుకున్న రసెల్.. క్యాష్ రిచ్ లీగ్‌లో 200 సిక్సర్ల మైలురాయిని తాకిన తొమ్మిదో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రసెల్‌కు ముందు గేల్ (357), రోహిత్ శర్మ (257), ఏబీ డివిలియర్స్ (251), ధోని (239), విరాట్ కోహ్లి (235), వార్నర్ (228), పోలార్డ్ (223), రైనా (203) ఈ మార్కును తాకిన వారిలో ఉన్నారు. కాగా, సన్‌రైజర్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో రసెల్ బ్యాటింగ్ విన్యాసాలకు హర్షిత్ రాణా అద్భుతమైన బౌలింగ్ (4-0-33-3) తోడు కావడంతో కేకేఆర్ చిరస్మరణీయ విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌కు చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. రాణా అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాగే కీలకమైన క్లాసెన్ వికెట్‌తో పాటు షాబాజ్ అహ్మద్ వికెట్లు పడగొట్టి కేకేఆర్‌ను గెలిపించాడు. ఆఖరి ఓవర్ తొలి బంతికే క్లాసెన్ సిక్సర్ బాదినప్పటికీ.. సన్‌రైజర్స్ మిగిలిన ఐదు బంతుల్లో 7 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సాల్ట్ (54), రసెల్ (64) అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో క్లాసెన్ (63; 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించినప్పటికీ సన్‌రైజర్స్ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. -
IPL 2024 ఓవరాక్షన్‌కు తగిన మూల్యం చెల్లించుకున్న హర్షిత్ రాణా
కేకేఆర్ పేస్ సంచలనం హర్షిత్ రాణా తాను చేసిన ఓవరాక్షన్‌కు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. సన్‌రైజర్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన రాణా.. మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేసిన అనంతరం కోపంగా ఫ్లయింగ్ కిస్ ఇస్తూ సెండాఫ్ ఇచ్చాడు. A flying kiss by Harshit Rana to Mayank Agarwal as a send off.pic.twitter.com/LVkQYKmisZ — Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2024 ఈ అతి చేష్ఠలను తీవ్రంగా పరిగణించిన మ్యాచ్ రిఫరీ మను నయ్యర్ రాణా మ్యాచ్ ఫీజ్‌లో 60 శాతం కోత విధించాడు. ఇదే మ్యాచ్‌లో రాణా హెన్రిచ్ క్లాసెన్ పట్ల కూడా దురుసుగా ప్రవర్తించాడు. ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకున్న రిఫరీ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.5 నిబంధన ఉల్లంఘన కింద జరిమానా విధించాడు. Harshit Rana fined 60% of his match fees for giving Mayank Agarwal a send off. pic.twitter.com/kTXDBOXUtB — Mufaddal Vohra (@mufaddal_vohra) March 24, 2024 కాగా, నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలుపుకు చివరి ఓవర్లో 13 పరుగులు కావాల్సి ఉండగా రాణా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. షాబాజ్ అహ్మద్‌తో పాటు అప్పటికే శివాలెత్తిపోయిన ఉన్న క్లాసెన్‌ను ఔట్ చేసి కేకేఆర్‌ను గెలిపించాడు. ఓవర్ తొలి బంతికే క్లాసెన్ సిక్సర్ బాదినప్పటికీ.. సన్‌రైజర్స్ మిగిలిన ఐదు బంతుల్లో 7 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన రాణా 33 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. HARSHIT RANA, THE HERO OF KKR. SRH needed 13 in 6 balls - 6 on the first ball then 1,W,1,W,0 to win it for KKR. 🤯 pic.twitter.com/oXlzpAEJLV — Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2024 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సాల్ట్ (54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రసెల్ (64; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో క్లాసెన్ (63; 8 సిక్సర్లు) చెలరేగినప్పటికీ సన్‌రైజర్స్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. -
KKR Vs SRH: శభాష్ సుయాష్.. సన్‌రైజర్స్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు..!
ఐపీఎల్ 2024 సీజన్లో ప్రారంభమైన రెండో రోజు అదిరిపోయే మ్యాచ్‌ను అందించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య నిన్న (రాత్రి 7:30 గంటలకు) జరిగిన మ్యాచ్ ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది. భారీ లక్ష్య ఛేదనలో ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా.. హెన్రిచ్ క్లాసెన్ తొలి బంతికే సిక్సర్ బాది సన్‌రైజర్స్ శిబిరంలో గెలుపుపై ధీమా పెంచగా.. కేకేఆర్ ఆటగాళ్లు హర్షిత్ రాణా, సుయాష్ శర్మ ఆ ఆనందాన్ని వారికి ఎంతో సేపు నిలబడనీయలేదు. చివరి ఓవర్ బౌలింగ్ చేసిన రాణా వైవిధ్యమైన బంతులు సంధించి సన్‌రైజర్స్ గెలుపుకు అడ్డుకోగా.. సుయాష్ శర్మ కీలక దశలో (2 బంతుల్లో 5 పరుగులు) మెరుపు క్యాచ్ (క్లాసెన్) పట్టి ఆరెంజ్ ఆర్మీ చేతుల్లో నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. ONE OF THE GREATEST CATCHES IN IPL HISTORY...!!! - Take a bow, Suyash Sharma. 🫡pic.twitter.com/CAq18gb8EO — Johns. (@CricCrazyJohns) March 23, 2024 సుయాష్ ఆ క్యాచ్ మిస్ చేసి ఉంటే బౌండరీ లభించి సన్‌రైజర్స్ సునాయాసంగా మ్యాచ్ గెలిచేది. ఒకవేళ ఆ క్యాచ్ డ్రాప్ అయ్యి, పరుగు రాకపోయినా అప్పటికే శివాలెత్తి ఉన్న క్లాసెన్ ఆఖరి బంతికి సిక్సర్ బాది సన్‌రైజర్స్‌ను గెలిపించేవాడు. సుయాష్ అందుకున్న ఈ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. క్యాచెస్ విన్ మ్యాచెస్ అని ఇందుకే అంటారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సాల్ట్ (54), రసెల్ (64) అర్దసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఆఖర్లో రసెల్ 7 సిక్సర్లు, 3 బౌండరీలతో విరుచుకుపడి కేకేఆర్ 200 పరుగుల మార్కును దాటేందుకు దోహదపడ్డాడు. చివర్లో రమన్‌దీప్ సింగ్ (35; ఫోర్, 4 సిక్సర్లు), రింకూ సింగ్ (23; 3 ఫోర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్ 3 వికెట్లు పడగొట్టగా.. మయాంక్ మార్కండే 2, కమిన్స్ ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. ఆదిలో తడబడినప్పటికీ గెలుపు అంచుల వరకు వచ్చి ఓటమిపాలైంది. క్లాసెన్ మెరుపు ఇన్నింగ్స్‌తో (29 బంతుల్లో 63; 8 సిక్సర్లు) మ్యాచ్ రూపురేఖల్నే మార్చేశాడు. అయితే గెలుపుకు 5 పరుగులు కావాల్సిన తరుణంలో అతడు ఔట్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా కేకేఆర్పైపు మలుపు తిరిగింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసి లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సన్‌రైజర్స్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (32), అభిషేక్ శర్మ (32) ఓ మోస్తరు స్కోర్లతో శుభారంభాన్ని అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి జిడ్డు బ్యాటింగ్‌తో (20 బంతుల్లో 20) సన్‌రైజర్స్ ఓటమికి పరోక్ష కారకుడయ్యాడు. సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్ తమ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. -
ఉత్కంఠ పోరులో SRHపై KKR విజయం..
-
IPL 2024: కేక పుట్టిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త పాట
ఐపీఎల్ 2024 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త పాటను ఇవాళ (మార్చి 20) విడుదల చేసింది. క్యాచీ ట్యూన్ కలిగిన ఈ పాట "సన్‌రైజర్స్ మేము బ్రో పక్కా ఇంకో రేంజ్ బ్రో.." అంటూ సాగుతుంది. ఈ పాటలో సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్ పాట్ కమిన్స్, మాజీ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్, విధ్వంసకర ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్, కొత్త ఆటగాడు ట్రవిస్ హెడ్, భారత ఆటగాళ్లు భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ అగర్వాల్, జయదేవ్ ఉనద్కత్ తదితర ఆటగాళ్లు కొత్త జెర్సీలు ధరించి బీట్‌కు తగ్గట్టుగా చిందేశారు. సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్న ఈ పాట ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. 𝑺𝒖𝒏𝑹𝒊𝒔𝒆𝒓𝒔 𝒎𝒆𝒎𝒖 𝒃𝒓𝒐, 𝑷𝒂𝒌𝒌𝒂 𝒊𝒏𝒌𝒐 𝒓𝒂𝒏𝒈𝒆 𝒃𝒓𝒐🧡 Our new anthem is here to set your playlist on fire🔥#SRHAnthem2024 #PlayWithFire #OrangeArmy pic.twitter.com/U4xRxhYfGv — SunRisers Hyderabad (@SunRisers) March 20, 2024 కాగా, ఐపీఎల్ 17వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా జరిగే సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఆర్సీబీతో తలపడుతుంది. సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ కేకేఆర్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు: పాట్ కమిన్స్(కెప్టెన్), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి. నటరాజన్, అన్మోల్ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హక్ ఫరూకీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగా, జయదేవ్ ఉనాద్కట్, ఆకాష్ సింగ్, ఝాతావేద్ సుబ్రమణ్యన్. తొలి విడత షెడ్యూల్లో సన్‌రైజర్స్ ఆడే మ్యాచ్‌ల వివరాలు.. మార్చి 23 (శనివారం): కోల్‌కతాలో కేకేఆర్‌తో (రాత్రి 7:30 గంటలకు) మార్చి 27 (బుధవారం): హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో (రాత్రి 7:30) మార్చి 31 (ఆదివారం): అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో (మధ్యాహ్నం 3:30 గంటలకు) ఏప్రిల్ 5 (శుక్రవారం): హైదరాబాద్‌లో సీఎస్కే (రాత్రి 7:30 గంటలకు) -
IPL 2024: షెడ్యూల్, వేదికలు, పది జట్లు.. పూర్తి వివరాలు
అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా క్రికెట్ సమరానికి సమయం ఆసన్నమైంది. చెపాక్ వేదికగా మార్చి 22న ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ మొదలుకానుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోరుతో 2024 సీజన్‌కు తెరలేవనుంది. ఇక దేశంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 21 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఇప్పటికే తెలిపారు. ఈ నేపథ్యంలో ఏ రోజు ఏ మ్యాచ్?.. వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు తదితర వివరాలు తెలుసుకుందాం! ఐపీఎల్-2024 తొలి దఫా షెడ్యూల్లో 21 మ్యాచ్‌లు.. ఏయే వేదికల్లో అంటే! ►మార్చి 22- చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే- CSK) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ- RCB)- చెన్నై ►మార్చి 23- పంజాబ్ కింగ్స్(పీబీకేఎస్- PBKS)వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ- DC)- మొహాలీ(మధ్యాహ్నం) ►మార్చి 23- కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్)- కోల్‌కతా(రాత్రి) ►మార్చి 24- రాజస్తాన్ రాయల్స్(ఆర్ఆర్) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ)- జైపూర్(మధ్యాహ్నం) ►మార్చి 24- గుజరాత్ టైటాన్స్(జీటీ-GT) వర్సెస్ ముంబై ఇండియన్స్(ఎంఐ- MI)- అహ్మదాబాద్(రాత్రి) ►మార్చి 25- ఆర్సీబీ- పంజాబ్ కింగ్స్- బెంగళూరు ►మార్చి 26- సీఎస్కే- గుజరాత్ టైటాన్స్- చెన్నై ►మార్చి 27- సన్‌రైజర్స్- ముంబై- హైదరాబాద్ ►మార్చి 28- రాజస్తాన్- ఢిల్లీ- జైపూర్ ►మార్చి 29- ఆర్సీబీ- కేకేఆర్- బెంగళూరు ►మార్చి 30- లక్నో- పంజాబ్- లక్నోలో ►మార్చి 31- గుజరాత్- సన్‌రైజర్స్- అహ్మదాబాద్(మధ్యాహ్నం) ►మార్చి 31- ఢిల్లీ- సీఎస్కే- వైజాగ్ ►ఏప్రిల్ 1- ముంబై- రాజస్తాన్- ముంబై ►ఏప్రిల్ 2- ఆర్సీబీ- లక్నో- బెంగళూరు ►ఏప్రిల్ 3- ఢిల్లీ- కేకేఆర్- వైజాగ్ ►ఏప్రిల్ 4- గుజరాత్- పంజాబ్- అహ్మదాబాద్ ►ఏప్రిల్ 5- సన్‌రైజర్స్- సీఎస్కే- హైదరాబాద్ ►ఏప్రిల్ 6- రాజస్తాన్- ఆర్సీబీ- జైపూర్ ►ఏప్రిల్ 7- ముంబై- ఢిల్లీ- ముంబై ►ఏప్రిల్ 7- లక్నో- గుజరాత్- లక్నో. నోట్: మార్చి 23, 24, 31, ఏప్రిల్7న డబుల్ హెడర్ మ్యాచ్‌లు.. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లు 3.30కి, రాత్రి జరిగే మ్యాచ్‌లు 7.30కి ఆరంభమవుతాయి. స్టార్ స్పోర్ట్స్(టెలివిజన్), జియో సినిమా(డిజిటల్)లో ప్రత్యక్ష ప్రసారం. ఐపీఎల్-2024 తొలి దఫా మ్యాచ్‌లు జరిగే వేదికలు చెన్నై, మొహాలి, కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, లక్నో, వైజాగ్, ముంబై. తొలి దఫా షెడ్యూల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు వైజాగ్ హోం గ్రౌండ్‌గా ఉంటుంది. IPL 2024లో పాల్గొనే పది జట్ల వివరాలు చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చహర్, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, అజింక్య రహానే, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, సిమర్జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహీశ్ తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అవనీష్ రావు అరవెల్లి. ►గాయపడిన ఆటగాళ్ళు: డెవాన్ కాన్వే, మతీష పతిరణ. ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, నంబూరి తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్ , ల్యూక్ వుడ్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, నువాన్ తుషార, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, మొహమ్మద్ నబీ, శివాలిక్ శర్మ. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, దిల్షాన్ మధుశాంక. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, విరాట్ కోహ్లి, రజత్ పాటీదార్, అనూజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయి, విల్ జాక్స్, మహిపాల్ లామ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైశాక్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కరాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్. కోల్‌కతా నైట్ రైడర్స్ శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కేఎస్ భరత్, చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ముజీబ్ ఉర్ రెహమాన్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్ళు: జాసన్ రాయ్, గుస్ అట్కిన్సన్. గుజరాత్ టైటాన్స్ శుభమన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, బి. సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, షారుక్ ఖాన్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మానవ్ సుతార్, స్పెన్సర్ జాన్సన్. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: మహ్మద్ షమీ, రాబిన్ మింజ్. లక్నో సూపర్ జెయింట్స్ కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతం, శివమ్ మావి, అర్షిన్ కులకర్ణి, ఎం. సిద్ధార్థ్, ఆష్టన్ టర్నర్, డేవిడ్ విల్లీ, మొమ్మద్. అర్షద్ ఖాన్. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్ళు: మార్క్ వుడ్. రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డొనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చహల్, ఆడం జంపా, ఆవేష్ ఖాన్, రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్మోర్, అబిద్ ముస్తాక్, నండ్రే బర్గర్. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: ప్రసిద్ధ్ కృష్ణ. ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ (కెప్టెన్), ప్రవీణ్ దూబే, డేవిడ్ వార్నర్, విక్కీ ఓస్త్వాల్, పృథ్వీ షా, అన్రిచ్ నోర్జే, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్, ఇషాంత్ శర్మ, యష్ ధుల్, ముఖేష్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, ఝే రిచర్డ్సన్, సుమిత్ కుమార్, షాయ్ హోప్, స్వస్తిక్ చికార. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: హ్యారీ బ్రూక్, లుంగి ఎన్గిడి. పంజాబ్ కింగ్స్ శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కరాన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, హర్‌ప్రీత్ భట్యా , విద్వత్ కవేరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌవ్. సన్‌రైజర్స్ హైదరాబాద్ పాట్ కమిన్స్(కెప్టెన్), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి. నటరాజన్, అన్మోల్ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హక్ ఫరూకీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగా, జయదేవ్ ఉనాద్కట్, ఆకాష్ సింగ్, ఝాతావేద్ సుబ్రమణ్యన్. చదవండి: SRH: రెండుసార్లు చాంపియన్‌గా నిలబెడితే ఇలా చేస్తారా? షాకయ్యా -
నవీన్ సహా ఆ ఇద్దరిపై రెండేళ్ల నిషేధం.. ఐపీఎల్ జట్లకు ఎదురుదెబ్బ
Afghanistan Cricket Board (ACB) Impose Ban: స్టార్ బౌలర్లు నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫారూకీ, ముజీబ్ ఉర్ రహ్మమాన్లకు ఊహించని షాకిచ్చింది అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు. విదేశీ లీగ్‌లలో రెండేళ్ల పాటు ఆడకూడకుండా నిషేధం విధించింది. అంతేగాకుండా.. ఈ ముగ్గురి సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. నవీన్, ఫారూకీ, ముజీబ్.. జాతీయ జట్టును కాదని ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్న కారణంగా ఈ మేరకు ఏసీబీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని లోతుగా పరిశీలించేందుకు విచారణ కమిటీని కూడా నియమించింది. ఒకవేళ జాతీయ జట్టు ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించారని తేలితే నవీన్, ఫారూకీ, ముజీబ్ సెంట్రల్ కాంట్రాక్టులను ఏడాది పాటు రద్దు చేసేందుకు సిద్ధమైనట్లు ఏసీబీ తెలిపింది. ఐపీఎల్ జట్లకు ఎదురుదెబ్బ అఫ్గన్ బోర్డు నిర్ణయం కారణంగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో భాగంగా రైటార్మ్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్‌ను కేకేఆర్.. రూ. 2 కోట్ల కనీస ధరకు అతడిని కొనుగోలు చేసింది. మరోవైపు.. ఐపీఎల్-2023 సందర్భంగా రూ. 50 లక్షలకు పేసర్ నవీన్ ఉల్ హక్‌ను సొంతం చేసుకున్న లక్నో.. 2024 వేలానికి ముందు అతడిని రిటైన్ చేసుకుంది. 2023 సీజన్లో నవీన్.. మొత్తంగా 11 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. ఇక సీమర్ ఫజల్హక్ ఫారూకీని ఎస్ఆర్హెచ్ రూ. 50 లక్షలు వెచ్చించి రిటైన్ చేసుకుంది. పదహారో ఎడిషన్‌లో అతడు ఏడు మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు కూల్చాడు. దేశానికి ఆడే ఉద్దేశం లేదా? వేటు తప్పదు సౌతాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్, న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ వంటి చాలా మంది క్రికెటర్లు దేశానికి కాదని ఫ్రాంఛైజీ క్రికెట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా అఫ్గన్ బౌలర్లు నవీన్, ఫారూఖీ, ముజీబ్ కూడా ఈ జాబితాలో చేరాలని భావించారు. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలకు ఉపక్రమించింది. ‘‘ముగ్గురు జాతీయ క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్టులు, విదేశీ లీగ్‌లలో ఆడే విషయంపై ఏసీబీ నిబంధనలు విధించాలని నిర్ణయించింది. నో ఆబ్జక్షన్ లెటర్ ఇచ్చేదే లేదు వచ్చే ఏడాది వారికి సెంట్రల్ కాంట్రాక్టులు ఇవ్వాలా లేదా అన్నది తర్వాత నిర్ణయిస్తాం. ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హక్ ఫారూకీ, నవీన్ ఉల్ హక్ మురీద్ వార్షిక కాంట్రాక్టులు వదులుకుని ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వరల్డ్‌కప్-2023లో మెరుగైన ప్రదర్శన అయితే, విదేశీ లీగ్‌లలో ఆడేందుకు నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు బోర్డు నిరాకరిస్తోంది. ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడకుండా రెండేళ్ల పాటు వాళ్లపై నిషేధం విధిస్తున్నాం’’ అని అఫ్గన్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన అఫ్గనిస్తాన్ అంచనాలకు మించి రాణించింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి పటిష్ట జట్లను మట్టికరిపించి సంచలన విజయాలు నమోదు చేసి ఒకానొక సందర్భంలో సెమీస్ రేసులోనూ నిలిచింది. ఇలాంటి తరుణంలో అంతర్జాతీయ క్రికెట్లో తమదైన ముద్ర వేస్తున్న సమయంలో కీలక ఆటగాళ్లు ఇలా ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఏసీబీ తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. చదవండి: Rohit Sharma On His T20 Career: నాకూ ఆడాలనే ఉంది.. టీ20 కెరీర్‌పై రోహిత్ శర్మ క్లారిటీ! -
ఐపీఎల్ మినీ వేలం 2023
-
లారాకు ఉద్వాసన.. సన్‌రైజర్స్ కొత్త కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ ప్లేయర్
ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రస్తుత హెడ్ కోచ్, బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాపై వేటు వేసింది. అతని స్థానంలో కొత్త కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ స్పిన్నర్, ప్రస్తుత ఆస్ట్రేలియా పురుషుల టీమ్ అసిస్టెంట్ కోచ్ డేనియల్ వెటోరీని నియమించింది. గత సీజన్లో (2023) జట్టు పేలవ ప్రదర్శనకు లారాను బాధ్యున్ని చేస్తూ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 2023 సీజన్ ప్రారంభానికి ముందు టామ్ మూడీ నుంచి బాధ్యతలు చేపట్టిన లారా.. ఆ సీజన్లో జట్టుపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. అతని ఆధ్వర్యంలో సన్‌రైజర్స్ 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి ఆఖరి స్థానంతో ముగించింది. 🚨Announcement🚨 Kiwi legend Daniel Vettori joins the #OrangeArmy as Head Coach🧡 Welcome, coach! 🔥 pic.twitter.com/2wXd8B1T86 — SunRisers Hyderabad (@SunRisers) August 7, 2023 ఆరు సీజన్లలో నలుగురు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గత ఆరు సీజన్లలో నలుగురు హెడ్ కోచ్‌లను మార్చింది. 2019, 2022 సీజన్లలో టామ్ మూడీ.. 2020, 2021 సీజన్లలో ట్రెవర్ బేలిస్.. 2023 సీజన్లో లారా.. తాజాగా వెటోరీ సన్‌రైజర్స్ హెడ్ కోచ్‌లుగా నియమితులయ్యారు. గతంలో ఆర్సీబీ కోచ్‌గా వెటోరీ.. న్యూజిలాండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లేయర్‌గా పేరు గాంచిన డేనియల్ వెటోరీ.. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ప్రస్తుతం అతను ఆస్ట్రేలియా పురుషుల జట్టు అసిస్టెంట్ కోచ్ పదవితో పాటు హండ్రెడ్ లీగ్‌లో బర్మింగ్హమ్ ఫీనిక్స్ పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వెటోరీ.. కరీబియన్ లీగ్‌లో బార్బడోస్ రాయల్స్ హెడ్ కోచ్‌గా, బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ హెడ్‌కోచ్‌గా, ఇంగ్లండ్ వైటాలిటీ బ్లాస్ట్‌లో మిడిల్సెక్స్ హెడ్‌కోచ్‌గా, బంగ్లాదేశ్ జాతీయ పురుషుల జట్టు స్పిన్ కన్సల్టెంట్గానూ పని చేశాడు. -
సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం..
-
కోహ్లీ అరుదైన రికార్డు ఫైనల్ కు అడుగు దూరంలో ఆర్సీబీ
-
'గతేడాది ఆర్సీబీకి సాయం చేశాం.. ఈసారి పరిస్థితి వేరు'
2023 సీజన్‌ని కూడా పెద్దగా అంచనాలు లేకుండా ఆరంభించింది ముంబై ఇండియన్స్. బుమ్రా గాయంతో సీజన్ నుంచి దూరం కావడం.. జోఫ్రా ఆర్చర్ సుదీర్ఘ విరామం తర్వాత ఆడినా పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయాడు. దీంతో ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్ ఆరంభంలో వరుసగా పరాజయాలే ఎదురయ్యాయి. తొలి అంచె పోటీల్లో ఎనిమిది మ్యాచుల్లో 4 విజయాలు మాత్రమే సాధించింది. అయితే రెండో అంచె పోటీలు మొదలవ్వగానే ముంబై ఇండియన్స్ గేర్ మార్చింది. అప్పటివరకు ఫామ్‌లో లేక తంటాలు పడుతున్న సూర్యకుమార్ ఫామ్‌లోకి రావడం జట్టుకు పెద్ద బలంగా మారింది. దీనికి తోడు ఆకాశ్ మద్వాల్, నేహాల్ వదేరా, కుమార్ కార్తికేయ వంటి బేస్ ప్రైజ్ బౌలర్లతోనే ముంబై వరుస విజయాలు అందుకొని ఏకంగా ప్లేఆఫ్ రేసులోకి దూసుకొచ్చింది. ఇక ముంబై తమ చివరి మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్పై 8 వికెట్ల తేడాతో విజయం అందుకున్న ముంబై ఇండియన్స్ నాలుగో స్థానానికి చేరుకుంది. అయినప్పటికి ప్లేఆఫ్స్ చేరాలంటే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతుల్లో ఆర్సీబీ ఓడిపోవాలి. ఎందుకంటే 16 పాయింట్లతో ఉన్న ముంబై నెట్ రన్ రేట్ మైనస్‌లో ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''ఏం జరిగినా నిరుత్సాహపడకూడదనే మైండ్‌సెట్‌తోనే నేటి మ్యాచ్ ఆడేందుకు వచ్చాం. మా చేతుల్లో ఉన్నదాంట్లో నియంత్రించగలం, లేనిదాన్ని కంట్రోల్ చేయలేం కదా.. నా ఫామ్ గురించి నాకు చింతలేదు, నేనెవరితో మాట్లాడలేదు కూడా...గత ఏడాది మేం ఆర్సీబీకి సాయం చేశాం. ఈసారి వాళ్లు మాకు కావాల్సిన రిజల్ట్ ఇస్తారని అనుకుంటున్నాం(నవ్వుతూ).. ఈ సీజన్‌ని సరిగ్గా ప్రారంభించకపోయినా వరుసగా మూడు విజయాలు అందుకున్నాం. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి 3 ఓవర్లలో 34 పరుగులు చేయలేక ఓడిపోయాం. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ కూడా ఆఖరి దాకా మా చేతుల్లోనే ఉంది. అయితే గెలవలేకపోయాం. ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా పెద్ద నష్టం చేశాయి. ఇప్పుడు ఆ విషయాల గురించి ఆలోచించి అనవసరం. కొన్నిసార్లు ఏం చేసినా వర్కవుట్ కాదు, రోజు మనది కాదని అలా వదిలేయాలంతే.' అంటూ పేర్కొన్నాడు. 2023 సీజన్లో ఆఖరి పొజిషన్లో నిలిచిన ముంబై ఇండియన్స్, ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఓడించింది. దీంతో నాలుగో స్థానంలో నిలిచిన ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరిన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2023: పాపం రాజస్థాన్..! -
కోహ్లి '18' వెంటపడడం లేదు.. అతని వెనకే '18' వస్తోంది
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి జెర్సీ నెంబర్ ఏంటని అడిగితే టక్కున వచ్చే సమాధానం '18'. నిజానికి 18 నెంబర్ జెర్సీ అనేది కోహ్లి తన తండ్రి జ్ఞాపకార్థం వేసుకుంటున్నట్లు చాలాసార్లు తెలిపాడు. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్లో గురువారం(మే 18న) ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సెంచరీతో మెరిశాడు. నాలుగేళ్ల తన ఐపీఎల్ సెంచరీ నిరీక్షణకు తెరదించిన కోహ్లి ఆ సెంచరీ అందుకుంది మే 18 కావడంతో మరోసారి అతని జెర్సీ నెంబర్ ప్రస్తావనకు వచ్చింది. Photo: IPL Twitter మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ జెర్సీ నెంబర్-18పై మరోసారి స్పందించాడు. నిజాయితీగా చెప్పలాంటే అండర్-19 క్రికెట్ ఆడేటప్పుడే నాపేరుతో 18 నెంబర్ జెర్సీ ఇచ్చారు. ఆ క్షణం 18 అనేది నా జీవితంలో ప్రత్యేకంగా మారబోతుందన్నది అప్పటికి తెలియదు. యాృదృశ్చికంగా నేను క్రికెట్లో అడుగుపెట్టింది ఆగస్టు 18న.. నా తండ్రి చనిపోయింది డిసెంబర్ 18న.. రెండు ముఖ్య సంఘటనలు ఒకే తేదీన జరగడం ఎప్పటికి మరిచిపోను అని చెప్పుకొచ్చాడు. ఇదంతా చూస్తుంటే.. కోహ్లి 18 నెంబర్ వెంటపడినట్లు అనిపించడం లేదు.. అతని వెనకాలే 18 వస్తున్నట్లు తెలుస్తోంది. Photo: IPL Twitter '18' నెంబర్‌తో కోహ్లికున్న అనుబంధం.. ► ఎస్ఆర్హెచ్తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో(మే 18, 2023) కోహ్లి సెంచరీ చేసింది '18' వ ఓవర్లోనే. సిక్సర్ కొట్టి కోహ్లి సెంచరీ మార్క్ అందుకున్నాడు. ►కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది 2008 ఆగస్టు 18 నాడే. ►చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై కోహ్లి సెంచరీ చేసింది కూడా '18' వ తేదీనే. మార్చి 18, 2012లో ఢాకాలో పాక్‌తో జరిగిన వన్డేలో విరాట్ 183 పరుగులు చేశాడు. యాదృశ్చికంగా అతను ఆరోజు చేసిన పరుగుల్లోనూ '18' కనిపించడం విశేషం. ►ఇక కోహ్లి టెస్టుల్లో రెండు శతకాలను ఇదే రోజున బాదాడు. 18 ఆగస్టు 2018లో ఇంగ్లండ్‌పై 103 పరుగులు.. 2013 డిసెంబర్ 18న దక్షిణాఫ్రికాపై 119 పరుగులు చేశాడు. ►ఇక కోహ్లి 17 ఏళ్ల వయసులో అతని తండ్రి ప్రేమ్ కోహ్లి 2006 డిసెంబర్ '18' వ తేదీన తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశాడు. ఆ సమయంలో కోహ్లి రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. తండ్రి మరణ వార్తను దిగమింగి మ్యాచ్ ఆడిన కోహ్లి 90 పరుగులు చేశాడు. మ్యాచ్ ముగిశాక తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. ►ఇక కోహ్లి జెర్సీ నెంబర్ '18' కి మరో ప్రత్యేకత కూడా ఉంది. కోహ్లి తండ్రి ప్రేమ్ కోహ్లి క్రికెట్ ఆడే రోజుల్లో 18 నెంబర్ జెర్సీనే వేసుకోవడం విశేషం. అందుకే కోహ్లి తన తండ్రి జ్ఞాపకార్థం అదే నెంబర్ జెర్సీతో కనిపిస్తున్నాడు. చదవండి: కోహ్లి ఫిదా.. తెలుగోళ్ల అభిమానమే వేరప్పా! నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. సెంచరీతో మెరిసిన 'కింగ్' కోహ్లి -
ఉప్పల్‌లో మ్యాచ్ అంటే చెలరేగుతాడు.. కోహ్లి అరుదైన రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ స్టార్.. కింగ్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. తాజాగా హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో కోహ్లి సూపర్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఇక ఉప్పల్‌లో మ్యాచ్ అంటే చాలు కోహ్లి చెలరేగిపోతాడు. అంతర్జాతీయ మ్యాచ్ నుంచి ఐపీఎల్ దాకా కోహ్లికి ఉప్పల్ స్టేడియంలో మంచి రికార్డు ఉంది. కోహ్లి ఉప్పల్‌లో ఇప్పటివరకు 12 టి 20 మ్యాచ్‌లు(అంతర్జాతీయ, ఐపీఎల్) ఆడి 592 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో దానిని కంటిన్యూ చేశాడు.కచ్చితంగా గెలవ్సాలిన మ్యాచ్‌లో జూలు విదిల్చిన కోహ్లి 61 బంతుల్లో సెంచరీ సాధించడం విశేషం. కోహ్లికి ఇది ఐపీఎల్లో ఆరో శతకం కాగా.. సీజన్లో ఆర్సీబీకి ఇది తొలి శతకం. దీంతో పాటు ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఆర్సీబీ మరిన్ని రికార్డులు కొల్లగొట్టింది. అవేంటో ఒకసారి చూద్దాం. ఈ క్రమంలో కోహ్లి ఐపీఎల్ 16వ సీజన్లో 500 పరుగుల మార్క్‌ను పూర్తి చేశాడు. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి 500 ప్లస్ స్కోర్లు చేయడం ఇది ఆరోసారి. టీమిండియా తరపున ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా కోహ్లి రికార్డులకెక్కాడు. ఆర్సీబీ తరపున కోహ్లి 7500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్ కలిపి కోహ్లి ఈ మార్క్ సాధించాడు. ఆర్సీబీ తరపున ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఇక కోహ్లి-డుప్లెసిస్ ద్వయం ఆర్సీబీ తరపున వంద పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ఇది నాలుగోసారి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక 100 ప్లస్ భాగస్వామ్యాలు నమోదు చేసిన జాబితాలో డేవిడ్ వార్నర్-శిఖర్ ధావన్ జోడి(ఎస్ఆర్హెచ్, ఆరుసార్లు) తొలి స్థానంలో ఉండగా.. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో(ఎస్ఆర్హెచ్, ఐదుసార్లు) రెండో స్థానంలో ఉన్నారు. ఇక మయాంక్ అగర్వాల్- కేఎల్ రాహుల్ జోడి(పంజాబ్ కింగ్స్), క్రిస్ గేల్, విరాట్ కోహ్లి జోడి(ఆర్సీబీ), కోహ్లి-డుప్లెసిస్(ఆర్సీబీ) నాలుగేసి సార్లు వంద ప్లస్ పరుగుల భాగస్వామ్యాలను నమోదు చేశారు. ఇక ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో ఒక జోడి 800 ప్లస్ పరుగులు జోడించడం ఇది రెండోసారి మాత్రమే. కోహ్లి-డుప్లెసిస్ జోడి ఈ సీజన్లో 800 పరుగులు జోడించారు. ఇంతకముందు 2016లో కోహ్లి-డివిలియర్స్ జోడి 800 పరుగులకు పైగా జోడించారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఆర్సీబీ, కోహ్లి కామన్‌గా ఉండడం విశేషం. 💯 Bow down to the greatness of 👑 #ViratKohli 👏 He is now tied with Chris Gayle for the most #TATAIPL hundreds 🔥#SRHvRCB #IPLonJioCinema #IPL2023 #EveryGameMatters pic.twitter.com/OGxWztuhk6 — JioCinema (@JioCinema) May 18, 2023 చదవండి: నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. సెంచరీతో మెరిసిన 'కింగ్' కోహ్లి -
నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. సెంచరీతో మెరిసిన 'కింగ్' కోహ్లి
ఐపీఎల్ 16వ సీజన్లో కింగ్ కోహ్లి సెంచరీ మార్క్ సాధించాడు. గురువారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఈ ఆర్సీబీ ఓపెనర్ సిక్సర్‌తో శతకం పూర్తి చేయడం విశేషం. ఈ సీజన్లో ఆర్సీబీ తరపున కోహ్లిది తొలి శతకం కాగా.. ఓవరాల్‌గా సీజన్లో ఇది ఏడో శతకం. 61 బంతుల్లో శతకం సాధించిన కోహ్లి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. 35 బంతుల్లో తొలి ఫిఫ్టీ సాధించిన కోహ్లి.. మలి ఫిఫ్టీని 26 బంతుల్లో అందుకున్నాడు. కాగా కోహ్లికి ఐపీఎల్లో ఇది ఆరో శతకం కాగా.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ శతకంతో మెరవడం విశేషం. అచ్చొచ్చిన ఉప్పల్ స్టేడియంలో కోహ్లి సెంచరీ సాధించడం అభిమానులను సంతోషపెట్టింది. అంతేకాదు ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్రో పోషించాడు. కోహ్లి ఆడిన ఈ ఇన్నింగ్స్ కొంతకాలం గుర్తుండిపోవడం ఖాయం. A magnificent CENTURY by Virat Kohli 🔥🔥 Take a bow, King Kohli! His SIXTH century in the IPL.#TATAIPL #SRHvRCB pic.twitter.com/gd39A6tp5d — IndianPremierLeague (@IPL) May 18, 2023 చదవండి: 'కెప్టెన్ అయ్యుండి ఉమ్రాన్ విషయం తెలియదంటావ్!' -
'కెప్టెన్ అయ్యుండి ఉమ్రాన్ విషయం తెలియదంటావ్!'
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ రెండో జట్టుగా ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఆరంభం నుంచే మెరుగైన ఆటతీరును కనబరచని ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో విఫలమైంది. ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినా ఎస్ఆర్హెచ్ ఆటతీరులో పెద్దగా మార్పు లేదు. క్లాసెన్ మినహా జట్టులో స్థిరమైన బ్యాటింగ్ చేసిన ఆటగాడు ఒక్కడు కనిపించలేదు. బౌలింగ్ విభాగం కూడా అంతంతమాత్రమే. తాజాగా ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా.. టాస్ సమయంలో ఉమ్రాన్ మాలిక్ విషయంలో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ మార్క్రమ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగించాయి. మొన్నటికి మొన్న తప్పుడు షీట్ సమర్పించి ఒక ఆటగాడి డెబ్యూ చేయకపోవడానికి కారణమయ్యాడు. ఇక టాస్ సమయంలో తుది జట్టు విషయంపై స్పందించాడు. ''హ్యారీ బ్రూక్ తుది జట్టులోకి వచ్చాడు. కార్తిక్ త్యాగి, నితీశ్‌లు అరంగేట్రం చేశారు అని తెలిపాడు. అయితే ఉమ్రాన్ మాలిక్ ఎందుకు ఆడడం లేదని ప్రశ్న వేయగా.. దీనిపై మార్క్రమ్.. 150 కిమీ వేగంతో బంతులు విసరగల నైపుణ్యం ఉమ్రాన్ మాలిక్ సొంతం. కానీ అతను ఆడకపోవడం వెనుక ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ అతని బౌలింగ్‌లో వేగం ఉంది. చాలా ఆట ఆడాల్సి ఉంది.'' అంటూ తన మాటలతో చిన్నపాటి కన్ఫూజన్ క్రియేట్ చేశాడు. మార్క్రమ్ వ్యాఖ్యలపై క్రికెట్ ఫ్యాన్స్ వినూత్నంగా స్పందించారు. ''ఏందయ్యా మార్క్రమ్.. కెప్టెన్ అయ్యుండి ఉమ్రాన్ మాలిక్ విషయం తెలియదంటావా.. జట్టులో ఏం జరుగుతుంది'' అంటూ కామెంట్ చేశారు. అయితే ఇటీవలే ఎస్ఆర్హెచ్ కోచ్ బ్రియాన్ లారా బర్త్‌డే వేడుకల్లోనూ ఉమ్రన్ మాలిక్ ఎక్కడా కనిపించలేదు. దీంతో కచ్చితంగా ఉమ్రాన్ విషయంలో ఏదో జరిగిందంటూ అభిమానులు పేర్కొన్నారు. Working with @DaleSteyn62 😎 IPL journey with @SunRisers 🧡 Message for young fans 🤗 His answers are as quick & rapid as his spells 🔥 Presenting 𝙁𝙖𝙨𝙩 𝙏𝙖𝙠𝙚𝙨 with @umran_malik_01⚡️⚡️ - By @ameyatilak #TATAIPL | #SRHvRCB pic.twitter.com/qAUSpHuMLD — IndianPremierLeague (@IPL) May 18, 2023 How does Markram not know what's up with Umran Malik behind the scenes? Been a weird season, with weird vibes from SRH. — Nikhil 🏏 (@CricCrazyNIKS) May 18, 2023 SRH is out of IPL 2023 but still they are not giving chances to Umran Malik 🤦♂️ SRH management surely doesn't believe in team building for the future and this explains their bad performance for last 3 seasons. pic.twitter.com/Zv9sZ70BAu — Utsav 💔 (@utsav045) May 18, 2023 చదవండి: క్లాసెన్ విధ్వంసం.. సీజన్లో ఎస్ఆర్హెచ్ తరపున రెండో శతకం -
క్లాసెన్ విధ్వంసం.. సీజన్లో ఎస్ఆర్హెచ్ తరపున రెండో శతకం
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ నుంచి స్థిరమైన బ్యాటింగ్ కనబరుస్తున్న ఒకే ఒక్కడు హెన్రిచ్ క్లాసెన్. అలాంటి క్లాసెన్ గురువారం ఆర్సీబీతో మ్యాచ్‌లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. 49 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న క్లాసెన్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. Photo: IPL Twitter కాగా క్లాసెన్‌కు ఐపీఎల్లో ఇదే తొలి శతకం కాగా.. ఎస్ఆర్హెచ్ తరపున ఈ సీజన్లో క్లాసెన్‌ది రెండో శతకం కాగా.. తొలి శతకం హ్యారీ బ్రూక్ సాధించిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా ఈ సీజన్లో ఇది ఆరో సెంచరీ. ఇంతకముందు ఈ సీజన్లో వెంకటేశ్ అయ్యర్(కేకేఆర్), యశస్వి జైశ్వాల్(రాజస్తాన్ రాయల్స్), హ్యారీ బ్రూక్(ఎస్ఆర్హెచ్), సూర్యకుమార్ యాదవ్(ముంబై ఇండియన్స్), ప్రభ్‌సిమ్రన్ సింగ్(పంజాబ్ కింగ్స్) సెంచరీ మార్క్ అందుకున్నారు. Klaasen mowa khundal khundal ke maarre 💯 Heroic Heinrich shines bright in Hyderabad with his maiden #TATAIPL ton ⚡️🔥#SRHvRCB #IPL2023 #IPLonJioCinema #EveryGameMatters | @SunRisers pic.twitter.com/s54WE0x5FR — JioCinema (@JioCinema) May 18, 2023 చదవండి: RCB ప్లేఆఫ్ కోసం పూజలు.. పిచ్చి పీక్స్ అంటే ఇదే! -
IPL 2023: కోహ్లి సెంచరీ.. ఆర్సీబీ ఘన విజయం
IPL 2023: SRH Vs RCB Match Live Updates: ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. కోహ్లి 61 బంతుల్లో శతకంతో వీరవిహారం చేయగా.. డుప్లెసిస్ 47 బంతుల్లో 71 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో విజయంతో ఆర్సీబీ రన్‌రేట్‌ను మరింత మెరుగుపరుచుకుంది. 13 ఓవర్లలో ఆర్సీబీ 117/0 ఆర్సీబీ 13 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 117 పరుగులు చేసింది. కోహ్లి 64, డుప్లెసిస్ 54 పరుగులతో ఆడుతున్నారు. కోహ్లి, డుప్లెసిస్ అర్థశతకాలు.. ఆర్సీబీ 108/0 ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఆర్సీబీ టార్గెట్ దిశగా సాగుతుంది. కోహ్లి, డుప్లెసిస్‌లు అర్థశతకాలతో చెలరేగడంతో ఆర్సీబీ 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 108 పరుగులు చేసింది. దంచుతున్న కోహ్లి, డుప్లెసిస్.. ఆర్సీబీ 90/1 187 పరుగుల పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఇన్నింగ్స్ దూకుడుగా ఆరంభించింది. కోహ్లి 46, డుప్లెసిస్ 42 పరుగులతో చెలరేగి ఆడుతున్నారు. ప్రస్తుతం ఆర్సీబీ 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. ఆర్సీబీ టార్గెట్ 187.. ఆర్సీబీతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 51 బంతుల్లో 104 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. హ్యారీ బ్రూక్ 27 పరుగులు చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో మైకెల్ బ్రాస్‌వెల్ రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, హర్షల్‌పటేల్, షాబాజ్ అహ్మద్‌లు తలా ఒక వికెట్ తీశారు. క్లాసెన్ సెంచరీ.. ఎస్ఆర్హెచ్ 19 ఓవర్లలో 182/4 19 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 49 బంతుల్లో శతకం సాధించాడు. 51 బంతుల్లో 104 పరుగులు చేసిన క్లాసెన్ హర్షల్‌పటేల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. క్లాసెన్ ఫిఫ్టీ.. 11 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 95/2 11 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 24 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకోగా.. మార్క్రమ్ 16 పరుగులతో ఆడుతున్నాడు. 33 పరుగులకే రెండు వికెట్లు డౌన్ ఆర్సీబీతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మైకెల్ బ్రాస్‌వెల్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడం విశేషం. తొలుత 11 పరుగులు చేసిన అభిషేక్ శర్మను క్లీన్‌బౌల్డ్ చేసిన బ్రాస్‌వెల్.. ఆ తర్వాత 15 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠిని క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. 4 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 27/0 4 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 11, రాహుల్ త్రిపాఠి 15 పరుగులతో ఆడుతున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గురువారం 65వ మ్యాచ్‌లో హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ కన్నా ఆర్సీబీకి చాలా కీలకం. ప్లేఆఫ్ చేరాలంటే మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవడం తప్పనిసరి. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, కార్తీక్ త్యాగి, మయాంక్ డాగర్, భువనేశ్వర్ కుమార్, నితీష్ రెడ్డి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, మైకేల్ బ్రేస్‌వెల్, వేన్ పార్నెల్, హర్షల్ పటేల్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్ #RCB won the toss and opted to field first in Hyderabad 🏏 Catch all the action from #SRHvRCB - LIVE & FREE on #JioCinema, available on all sim cards.#EveryGameMatters #TATAIPL #IPLonJioCinema #IPL2023pic.twitter.com/1NmcJyczIb — JioCinema (@JioCinema) May 18, 2023 -
'హైదరాబాద్ బిర్యానీ మస్తుంది.. SRH పని పడతం'
ఐపీఎల్ 16వ సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే గుజరాత్ ప్లేఆఫ్‌కు చేరుకోగా.. మిగతా మూడు స్థానాల కోసం ఏడు జట్ల మధ్య పోటీ నెలకొంది. అందులో ఆర్సీబీ కూడా ఉంది. మే 18న హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. ఎస్ఆర్హెచ్ ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించగా.. ఆర్సీబీకి మాత్రం చాన్స్ ఉంది. కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ ఆటను చూడడానికి హైదరాబాద్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆర్సీబీ హైదరాబాద్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సిరాజ్ జుబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్‌లో కొత్త ఇంటిని నిర్మించాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ఆడేందుకు వచ్చిన ఆర్సీబీ జట్టును సిరాజ్ తన ఇంటికి ఆహ్వానించాడు. సోమవారం ఆర్సీబీ ప్లేయర్లు సిరాజ్ కొత్త ఇంట్లో సందడి చేశారు. కుటుంబంతో ఆనందంగా గడిపిన ఆర్సీబీ ఆటగాళ్లకు సిరాజ్ ఫేమస్హైదరాబాద్ బిర్యానీ తినిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆర్సీబీ యాజమాన్యం ఈ వీడియోనూ షేర్ చేస్తూ ''హైదరాబాద్ బిర్యానీ మస్తుంది.. ఇక ఎస్ఆర్హెచ్ పని పడతాం'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ విజయం సాధిస్తే ప్లే ఆప్స్‌కు అర్హత సాధించే ఛాన్స్ ఉంది. Hyderabadi Biryani time! 🥳 The boys took a pitstop at Miyan's beautiful new house last night! 🏡#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/kEjtB1pQid — Royal Challengers Bangalore (@RCBTweets) May 16, 2023 చదవండి: ప్రతీసారి మనది కాదు సూర్య.. జాగ్రత్తగా ఆడాల్సింది! -
గుజరాత్ గెలిచినా.. నెహ్రాలో కనిపించని సంతోషం
గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా సోమవారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో జట్టు బ్యాటింగ్ ప్రదర్శనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లో గిల్ సెంచరీ చేసినప్పటికి.. గుజరాత్ గెలిచినప్పటికి నెహ్రా మొహంలో మాత్రం సంతోషం కనిపించలేదు. అందుకు కారణం గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఆఖర్లో కుప్పకూలడమేనంట. తొలి ఇన్నింగ్స్ అనంతరం కెప్టెన్ పాండ్యాతో ఆశిష్ నెహ్రా డగౌట్లో నిలబడి సీరియస్‌గా చర్చించడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాస్తవానికి ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. సాహా డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో గిల్-సాయికిషోర్‌లు వేగంగా ఆడుతూ రెండో వికెట్‌కు 14 ఓవర్లలోనే 147 పరుగులు జోడించారు. వీరి దూకుడు చూసి గుజరాత్ స్కోరు ఈజీగా 220-240 మధ్య ఉంటుందని భావించారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. సెంచరీ కోసం గిల్ మెళ్లగా ఆడడం.. అదే సమయంలో చివరి ఆరు ఓవర్లలో కేవలం 41 పరుగులు మాత్రమే చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. అందులో నాలుగు వికెట్లు చివరి ఓవర్లో పోగొట్టుకోవడం గుజరాత్ బ్యాటింగ్ వీక్నెస్ను బయటపెట్టింది. ఇదే నెహ్రా కోపానికి కారణమయింది. గిల్ 58 బంతుల్లో సెంచరీ మార్క్ చేసి ఐపీఎల్లో తొలి సెంచరీ సాధించినప్పటికి నెహ్రా అభినందించకపోవడం కెమెరాలకు చిక్కింది. అంతేకాదు సాయికిషోర్, పాండ్యాలు ఔటయ్యాకా గుజరాత్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడంపై నెహ్రా సీరియస్ అయ్యాడు. బ్యాటింగ్ విఫలంపై పాండ్యాతో చాలాసేపు చర్చించాడు. ఎందుకంటే నెహ్రా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకున్నాడు. ప్లేఆఫ్ చేరే క్రమంలో ప్రతీ మ్యాచ్ ముఖ్యం.. అందునా ఎస్ఆర్హెచ్ ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు కాబట్టే నెహ్రా అంత ఆగ్రహానికి లోనయ్యాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన గుజరాత్ టైటాన్స్ సీజన్లో ప్లేఆఫ్‌లో అడుగుపెట్టింది. అయితే ఇలాంటి బ్యాటింగ్‌తో టైటిల్ కొట్టలేమని పాండ్యాతో నెహ్రా అన్నట్లు తెలిసింది. అయితే పాండ్యా కూడా తమ బ్యాటింగ్ ఫెయిల్యూర్‌పై దృష్టి పెడుతామని నెహ్రాకు వివరించినట్లు తెలుస్తోంది. pic.twitter.com/huFccqaJzy — ChhalRaheHainMujhe (@ChhalRahaHuMain) May 16, 2023 చదవండి: 'చెప్పి మరి సిక్సర్ కొట్టడం సంతోషంగా అనిపించింది' -
'చెప్పి మరి సిక్సర్ కొట్టడం సంతోషంగా అనిపించింది'
ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా సోమవారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్(58 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 101) సెంచరీ చేశాడు. ఐపీఎల్లో గిల్‌కు ఇదే తొలి శతకం. కాగా తన సెంచరీతో గుజరాత్ విజయంలో కీలకపాత్రో పోషించిన గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అవార్డు అందుకున్న సమయంలో తన ఇన్నింగ్స్ గురించి గిల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌తో మ్యాచ్ ఆడితే తనకు పూనకాలు వస్తాయని తెలిపాడు. సన్ రైజర్స్ తోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన తాను.. ఇప్పుడు సెంచరీ కూడా అందుకున్నాని చెప్పాడు. భవిష్యత్ లో మరిన్ని సెంచరీలు సాధిస్తానని అన్నాడు. ''అభిషేక్ శర్మబౌలింగ్లో కొట్టిన సిక్స్ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అతనికి ముందే చెప్పాను. నువ్వు బౌలింగ్ వేస్తే సిక్స్ కొడతానని. అన్నట్లుగానే సిక్స్ కొట్టాను.'' అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు. దేశవాళీ క్రికెట్లో అభిషేక్ శర్మ, శుభ్ మన్ గిల్ పంజాబ్ కు ఓపెనర్లుగా ఆడుతారు. ఈ చనువుతోనే గిల్ ఈ కామెంట్స్ చేశాడు. తనకు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి ఆరాధ్య క్రికెటర్లని చెప్పిన గిల్.. వారి వల్లే క్రికెటర్ అయ్యానని చెప్పుకొచ్చాడు. తనకు క్రికెట్ అర్ధమైనప్పటి నుంచి కోహ్లీ నా హీరో. ఆట పట్ల అతడికి ఉన్న పిచ్చి, అంకితభావం, ఎనర్జీ నన్ను చాలా.. ప్రోత్సహించాయి. ఆటపై ఎంతో మక్కువ చూపేలా చేశాయని శుభ్‌మన్ గిల్ చెప్పాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. శుభ్‌మన్‌కు తోడుగా సాయి సుదర్శన్(36 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 47)రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 5 వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, ఫరూఖీ, నటరాజన్ తలో వికెట్ తీశారు. లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 154 పరుగులే చేసి ఓటమిపాలైంది. చదవండి: గుజరాత్ ఇప్పటికే; పోటీలో ఏడుజట్లు.. ప్లేఆఫ్స్‌కు వెళ్లేదెవరు? -
మార్క్రమ్ చేసిన తప్పు.. ఆలస్యంగా వెలుగులోకి
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్ అవకాశాలు దాదాపు ముగిసినట్లే. శనివారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 182 పరుగుల భారీ స్కోరు చేసి కూడా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. అభిషేక్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ ఎస్ఆర్హెచ్ను ముంచగా.. మిగతా బౌలర్లు కూడా అంతగా రాణించలేకపోయారు. దీంతో ఎస్ఆర్హెచ్ భారీ ఓటమిని మూటగట్టుకుంది. అయితే మ్యాచ్‌కు ముందు మార్క్రమ్ చేసిన తప్పిదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రతీ మ్యాచ్‌కు ముందు ఇచ్చే తుది జట్టు షీట్‌ను మార్క్రమ్ తప్పుగా ఇచ్చాడు. టాస్ సమయంలో చెప్పిన ఆటగాడి పేరు తుది జట్టులో లేకపోగా.. కనీసం సబ్‌స్టిట్యూట్‌గా కూడా లేకపోవడం గమనార్హం. విషయంలోకి వెళితే.. వాస్తవానికి లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్ ద్వారా యంగ్ బౌలర్ సన్విర్ సింగ్ అరంగేట్రం చేయాల్సింది. మార్క్రమ్ కూడా టాస్ సమయంలో సన్విర్ సింగ్ ఐపీఎల్‌తో పాటు ఎస్ఆర్హెచ్ తరపున డెబ్యూ చేయనున్నట్లు పేర్కొన్నాడు. కానీ సన్వర్ సింగ్ పేరు ఆ తర్వాత తుది జట్టులో కనిపించలేదు. పొరపాటున అలా జరిగి ఉంటుందిలే అనుకుంటే.. అసలు ఫీల్డింగ్.. బ్యాటింగ్ ఇలా రెండు సమయాల్లోనూ అతను కనిపించలేదు. ఇక వివ్రాంత్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. మాజీ క్రికెటర్.. ప్రస్తుతం ఐపీఎల్లో కామెంటేటర్‌గా పనిచేస్తున్న స్కాట్ స్టైరిస్ ఈ తప్పిదాన్ని గుర్తించాడు. మార్క్రమ్ ఇచ్చిన తప్పుడు షీట్‌ను కెమెరా ముందు పెట్టాడు. ఆ షీట్లో సన్వర్ సింగ్ పేరు క్రాస్ చేసి నటరాజన్ పేరును పెట్టారు. ''ఒక ఆటగాడికి అరంగేట్రం అని చెప్పి ఇప్పుడు అతని పేరు కనిపించకపోవడం అనేది తప్పు. మ్యాచ్ అరంగేట్రం చేస్తున్నానన్న సంతోషం కాసేపు కూడా లేకుండా చేశారు. దీనికి మార్క్రమ్ బాధ్యత వహించాలి.'' అని పేర్కొన్నాడు. మరో విశేషమేమిటంటే.. సన్వర్ సింగ్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఎస్ఆర్హెచ్ క్యాప్ అందుకున్నాడు. కానీ తుదిజట్టు సహా ఇంపాక్ట్ ప్లేయర్లలో ఎక్కడా అతని పేరు కనిపించలేదు. అయితే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ సమయంలో నటరాజన్‌ను సన్వర్ సింగ్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపించినట్లు తెలిసింది. అయితే గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సన్వర్ సింగ్ ఎస్ఆర్హెచ్ తరపున అరంగేట్రం చేసే అవకాశం ఉంది. These Clowns had submitted wrong teamsheet lmao 😭 pic.twitter.com/sti6OnBX2r — . (@manisayzz) May 14, 2023 చదవండి: ఔటైతే బాధపడతారు.. కానీ ఇక్కడ సీన్ రివర్స్ -
హెచ్‌సీఏను ఏకిపారేసిన సునీల్ గావస్కర్
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ మరో పరాజయాన్ని మూటగట్టుకొని ప్లేఆఫ్ చేరే అవకాశాలను కోల్పోయింది. శనివారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ సమయంలో నోబాల్ విషయమై ఎస్ఆర్హెచ్ అభిమానులు కాస్త అతి చేశారు. థర్డ్ అంపైర్ నోబాల్ ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు అభిమానులు లక్నో డగౌట్‌వైపు బోల్టులు, మేకులతో దాడి చేశారు. ఈ సమయంలో లక్నో ఆటగాళ్లు సహా సిబ్బంది అక్కడ ఉండడంతో కాస్త గందరగోళం నెలకొంది, అయితే డగౌట్‌కు కనీస భద్రతా ప్రమాణాలు లేకుండా కేవలం టెంట్లతో ఏర్పాటు చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. దేవుని దయ వల్ల మేకులు ఎవరికి గుచ్చుకోకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇదే విషయమై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ హెచ్‌సీఏ వైఖరిని ఎండగట్టాడు. ''ఐపీఎల్లో ఇతర వేదికల్లో డగౌట్లను ఫ్లెక్సీ గ్లాస్‌తో ఏర్పాటు చేశారు. కానీ హైదరాబాద్ స్టేడియంలో మాత్రం డగౌట్లను కేవలం గొడుగుల కింద ఏర్పాటు చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఇవాళ లక్నోతో మ్యాచ్ సందర్భంగా నోబాల్ ఇవ్వలేదని అభిమానులు మేకులు, బోల్టులు విసరడం మంచి పద్దతి కాదు. దేవుని దయవల్ల ఎవరికి ఏం కాలేదు. అయినా డగౌట్ ఏర్పాటులో ఇంత నిర్లక్ష్య ధోరణి పనికిరాదు. హెచ్‌సీఏ నిర్వహణ లోపం ఏంటనేది మరోసారి బయటపడింది. కనీసం సరైన డగౌట్లు నిర్మించలేని పరిస్థితిలో హెచ్‌సీఏ ఉండడం దురదృష్టకరం'' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఆవేశ్ ఖాన్ వేశాడు. ఓవర్ మూడో బంతి హైఫుల్ టాస్‌గా వెళ్లింది. క్రీజులో ఉన్న అబ్దుల్ సమద్ నడుము పై భాగంలో వెళ్లడంతో ఫీల్డ్ అంపైర్ నోబాల్‌కు కాల్ ఇచ్చాడు. అయితే లక్నో సూపర్‌జెయింట్స్ అంపైర్ కాల్‌ను చాలెంజ్ చేశారు. దీంతో అల్ట్రాఎడ్జ్‌లో పరిశీలించిన థర్డ్ అంపైర్ బంతి క్లియర్‌గా ఉందని.. నో బాల్ కాదని చెప్పాడు. దీంతో క్లాసెన్ సహా అబ్దుల్ సమద్‌లు షాక్‌కు గురయ్యారు. వాస్తవానికి నడుము పై నుంచి బంతి వెళితే నోబాల్ ఇవ్వడం జరుగుతుంది. అంత క్లియర్‌గా నోబాల్ అని కనిపిస్తున్నా థర్డ్ అంపైర్ కరెక్ట్ బాల్‌గా కౌంట్ చేయడం ఆసక్తి కలిగించింది. చదవండి: సూపర్ ప్రబ్‌సిమ్రన్.. ఓపెనర్‌గా వచ్చి సెంచరీ కొట్టి -
'యష్ దయాల్ చివర్లో.. నువ్వు మధ్యలోనే ముంచేశావ్'
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. శనివారం లక్నో సూపర్‌జెయింట్స్ ఏడు వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్పై ఘన విజయాన్ని సాధించింది. అయితే ఎస్ఆర్హెచ్ ఓటమికి ప్రధాన కారణం మాత్రం అభిషేక్ శర్మ. అతను వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్. అప్పటివరకు లక్నో స్కోరు 14 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులతో ఉంది. కాస్త టైట్‌గా బౌలింగ్ చేస్తే ఎస్ఆర్హెచ్కు పట్టు చిక్కేది. ఈ సమయంలో తెలివిగా ఆలోచించాల్సిన కెప్టెన్ మార్క్రమ్ అనవసర తప్పిదం చేశాడు. పార్ట్‌టైమ్ బౌలర్ అయిన అభిషేక్ శర్మను గుడ్డిగా నమ్మి బౌలింగ్ అప్పజెప్పాడు. ఈ తప్పిదం ఎస్ఆర్హెచ్ను ముంచడంతో పాటు మ్యాచ్‌ను కోల్పోయేలా చేసింది. అసలు ఏ మాత్రం పసలేని బౌలింగ్‌ను లక్నో బ్యాటర్లు చీల్చి చెండాడారు. Photo: IPL Twitter తొలుత మార్కస్ స్టోయినిస్ రెండు సిక్సర్లు బాది ఔట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన పూరన్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. అయితే చెత్త బౌలింగ్‌తో అభిషేక్ శర్మ దారుణంగా ట్రోల్‌కు గురయ్యాడు. ''యష్ దయాల్ చివర్లో ఐదు సిక్సర్లు ఇచ్చుకుంటే.. నువ్వు మాత్రం మధ్యలోనే ఐదు సిక్సర్లు ఇచ్చుకొని మ్యాచ్‌ను ముంచావ్.. ఒక పార్ట్‌టైమ్ బౌలర్‌ని నమ్మితే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి..'' అంటూ కామెంట్ చేశారు. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు ఇచ్చుకున్న అభిషేక్ శర్మ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో అభిషేక్ శర్మ చేరిపోయాడు. ఇంతకముందు ఇదే సీజన్లో యష్ దయాల్(గుజరాత్ టైటాన్స్).. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు సమర్పించుకోగా.. శివమ్ మావి(కేకేఆర్).. 2022లో లక్నోతో మ్యాచ్‌లో, హర్షల్ పటేల్(ఆర్సీబీ).. 2021లో సీఎస్కేతో మ్యాచ్‌లో, షెల్డన్ కాట్రెల్(పంజాబ్ కింగ్స్).. 2020లో రాజస్తాన్‌తో మ్యాచ్‌లో, రాహుల్ శర్మ(పుణే వారియర్స్).. 2012లో ఆర్సీబీతో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు సమర్పించుకున్నారు. The incredible Stoinis 🔥 😤 with some Super Giant hits 🙌#SRHvLSG #IPLonJioCinema #TATAIPL #IPL2023 #EveryGameMatters | @LucknowIPL @MStoinis pic.twitter.com/WTCMrUyOUQ — JioCinema (@JioCinema) May 13, 2023 .@SunRisers abhi shaken by Pooran Power 🙌 #SRHvLSG #TATAIPL #IPLonJioCinema #IPL2023 #EveryGameMatters | @LucknowIPL pic.twitter.com/wwAAqnGKVQ — JioCinema (@JioCinema) May 13, 2023 చదవండి: #SRH: ఒకప్పుడు బలం.. ఇప్పుడదే బలహీనత -
#SRH: ఒకప్పుడు బలం.. ఇప్పుడదే బలహీనత
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్కు మరో పరాజయం ఎదురైంది. శనివారం సొంతమైదానంలో లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 182 పరుగులు భారీ స్కోరు చేసి కూడా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. అందుకు బౌలింగ్ వైఫల్యమే ప్రధాన కారణం. కానీ ఒకప్పుడ ఇదే బౌలింగ్‌తో ఎస్ఆర్హెచ్ సంచలన విజయాలు సాధించింది. గతంలో వార్నర్ నాయకత్వంలోని ఎస్ఆర్హెచ్ చాలాసార్లు లోస్కోరింగ్ మ్యాచ్‌లను కూడా నెగ్గింది. బ్యాటింగ్‌లో వీక్‌గా కనిపించినా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మాత్రం బలంగా ఉండేది. బౌలింగ్‌తో బలంతోనే 2016లో సగం మ్యాచ్‌లు నెగ్గిన ఎస్ఆర్హెచ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత సీజన్లలోనూ బౌలింగ్‌తోనే లోస్కోరింగ్ మ్యాచ్‌లను కాపాడుకోగలిగింది. అలాంటిది ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ఏదైతే బలమని భావించామో అదే బలహీనతగా మారింది. ఇదే హైదరాబాద్‌లో తక్కువ స్కోర్లను కాపాడుకొని మ్యాచ్‌లు గెలిచిన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఈ సీజన్లో దారుణంగా తయారైంది. ఒకటి అరా మ్యాచ్‌లు తప్ప ఏ బౌలర్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యారు. ఇక లక్నోతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒకప్పుడు స్వింగ్ కింగ్‌గా పేరు పొందిన భువనేశ్వర్ పూర్తిగా విఫలం కాగా.. యార్కర్ల నటరాజన్ ఘోరంగా ఫెయిలవుతున్నాడు. మయాంక్ మార్కండే తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. ఇలా ఈ సీజన్లో అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌తో నాసిరకం ప్రదర్శన చేస్తూ పరాజయాలను మూటగట్టుకుంటుంది ఎస్ఆర్హెచ్. చదవండి: అది నోబాల్.. థర్డ్ అంపైర్ చీటింగ్ -
అది నోబాల్.. థర్డ్ అంపైర్ చీటింగ్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా శనివారం ఎస్ఆర్హెచ్, లక్నో సూపర్‌జెయింట్స్(LSG)మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. నో బాల్ విషయంలో థర్డ్ అంపైర్ వ్యవహరించిన తీరుపై స్టేడియానికి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవ్వడం ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే.. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఆవేశ్ ఖాన్ వేశాడు. ఓవర్ మూడో బంతి హైఫుల్ టాస్‌గా వెళ్లింది. నడుము పై భాగంలో వెళ్లడంతో ఫీల్డ్ అంపైర్ నోబాల్‌కు కాల్ ఇచ్చాడు. అయితే లక్నో సూపర్‌జెయింట్స్ అంపైర్ కాల్‌ను చాలెంజ్ చేశారు. దీంతో అల్ట్రాఎడ్జ్‌లో పరిశీలించిన థర్డ్ అంపైర్ బంతి సమద్ బ్యాట్ ఎడ్జ్‌కు తాకి వెళ్లిందని.. నో బాల్ కాదని చెప్పాడు. దీంతో క్లాసెన్ సహా అబ్దుల్ సమద్‌లు షాక్‌కు గురయ్యారు. వాస్తవానికి నడుము పై నుంచి బంతి వెళితే నోబాల్ ఇవ్వడం జరుగుతుంది. అంత క్లియర్‌గా నోబాల్ అని కనిపిస్తున్నా థర్డ్ అంపైర్ కరెక్ట్ బాల్‌గా కౌంట్ చేయడం ఆసక్తి కలిగించింది. ఇదే ఎస్ఆర్హెచ్ అభిమానులకు కోపం తెప్పించింది. థర్డ్ అంపైర్‌ని తిడుతూనే ఎల్ఎస్జీ డగౌట్ వైపు కొంతమంది అభిమానులు నట్స్, బోల్ట్‌లు విసిరికొట్టారు. అవి వచ్చి డగౌట్లో పడడంతో గందరగోళం నెలకొంది. దీంతో లక్నో ఆటగాళ్లంతా డగౌట్వైపుగా రావడం.. క్లాసెన్, క్వింటన్ డికాక్‌లు నోబాల్ వ్యవహారంపై సీరియస్‌గా చర్చించడం కనిపించింది. అయితే ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని కంగారు పడిన వేళ అంపైర్లు కలగజేసుకొని డగౌట్ నుంచి ఆటగాళ్లను పంపించేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన తర్వాత క్లాసెన్ ఏకాగ్రత కోల్పోయాడు. 47 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్న క్లాసెన్ అదే ఓవర్లో చివరి బంతికి భారీ షాట్‌కు యత్నించి ప్రేరక్ మన్కడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పెవిలియన్ వెళ్లే సమయంలో క్లాసెన్ మొహం బాధతో నిండిపోవడం కనిపించింది. 3rd Umpire gives this as a fair delivery. - The Hyderabad crowd starts chanting 'Kohli, Kohli'.#SRHvLSGpic.twitter.com/2vY2YkxKQa — runmachinevi143 (@runmachinevi143) May 13, 2023 After a controversial reversal of no ball decision by the third umpire, the SRH fans in the stadium are showing their frustrations at the LSG dugout. The crowd were also heard chanting, "Kohli, Kohli" with Gambhir in the dugout 👀 📸 JioCinema#SRHvLSG #SRH #SRHvsLSG pic.twitter.com/jPti6MyaFe — 12th Khiladi (@12th_khiladi) May 13, 2023 A blunder from the third umpire? 📸: Jio Cinema#IPL2023 | #SRHvLSG pic.twitter.com/pyQk6IzUoj — CricTracker (@Cricketracker) May 13, 2023 చదవండి: సైబర్‌క్రైమ్‌ను ఆశ్రయించిన సచిన్ టెండూల్కర్ -
ఎస్ ఆర్ హెచ్ టీంకి బాహుబలి అతను... జీరో టు హీరో అంటే ఇదే
-
SRH పై వార్నర్ పాజిటివ్ ట్వీట్..కావ్య మారన్ పై ఫ్యాన్స్ ఫైర్
-
ఓటమికి కారణం ఆ యాంకరే వామ్మో... వద్దు తల్లో అంటున్న ఫ్యాన్స్
-
బ్రూక్ కి అంత.. ఫిలిప్స్‌కి ఇంతే ఫైనల్ 4 లో ఎస్ ఆర్ హెచ్
-
అదృష్టం ఎస్‌ఆర్‌హెచ్‌వైపు.. కొంపముంచిన నో బాల్
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఒక అద్బుత విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. అయితే మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్కు అదృష్టం కూడా కలిసి వచ్చింది. 18వ ఓవర్లో గ్లెన్ పిలిప్స్ ఏడు బంతుల్లోనే మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 25 పరుగులతో విధ్వంసం సృష్టించి మ్యాచ్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌వైపు తిప్పాడు. కానీ మరుసటి బంతికే అతను ఔటవ్వడంతో మళ్లీ రాజస్తాన్ వైపు తిరిగింది. కొంపముంచిన నోబాల్.. ఇక ఆఖరి ఓవర్లో ఎస్ఆర్హెచ్ విజయానికి 17 పరుగులు అవసరమైన దశలో సందీప్ శర్మ లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేశాడు. తొలి బంతికి రెండు పరుగులు రాగా.. రెండో బంతిని అబ్దుల్ సమద్ సిక్సర్ తరలించడంతో నాలుగు బంతుల్లో 9 పరుగులు అవసరం అయ్యాయి. ఇక మూడో బంతికి రెండు పరుగులు, నాలుగో బంతికి, ఐదో బంతికి సింగిల్స్ రావడంతో ఆఖరి బంతికి ఎస్ఆర్హెచ్కు ఐదు పరుగులు అవసరం అయ్యాయి. సందీప్ ఆఖరి బంతి వేశాడు. సమద్ లాంగాఫ్ దిశగా గాల్లోకి లేపాడు. అక్కడే ఉన్న బట్లర్ క్యాచ తీసుకోవడంతో ఎస్ఆర్హెచ్ మరో ఓటమి ఎదురైంది అనుకునేలోపే ఊహించని ట్విస్ట్. అంపైర్ నోబాల్ అని ప్రకటించాడు. దీంతో ఒత్తిడిలో పడిన సందీప్ యార్కర్ వేయగా.. అబ్దుల్ సమద్ స్ట్రెయిట్సిక్స్తో ఎస్ఆర్హెచ్కు మరిచిపోలేని విజయాన్ని అందించాడు. ఒక రకంగా మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలవాలని రాసి పెట్టి ఉన్నట్లుంది. అందుకే ఎస్ఆర్హెచ్ను నోబాల్ రూపంలో అదృష్టం వరించింది. This is the best league in the world and you can't change our minds 🔥 Congrats Samad, hard luck, Sandeep!#RRvSRH #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/phHD2NjyYI — JioCinema (@JioCinema) May 7, 2023 చదవండి: మ్యాచ్‌ను మలుపు తిప్పిన గ్లెన్ పిలిప్స్ -
మ్యాచ్‌ను మలుపు తిప్పిన గ్లెన్ పిలిప్స్
ఐపీఎల్ 16వ సీజన్లో మరో ఆసక్తికర పోరు జరిగింది. టి20 క్రికెట్లో ఉండే అసలైన మజా ఎలా ఉంటుందో ఆదివారం ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ నిరూపించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి ఎస్ఆర్హెచ్ థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది. 215 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి బంతికి అందుకొని నాలుగు వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. మలుపు తిప్పిన గ్లెన్ పిలిప్స్ ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అప్పటికే 174 పరుగులకు ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. ఎస్ఆర్హెచ్ విజయానికి 12 బంతుల్లో 41 పరుగులు కావాలి. దాదాపు గెలుపు అసాధ్యమనుకున్న దశలో గ్లెన్ పిలిప్స్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఒక్క ఓవర్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడిన పిలిప్స్ హ్యాట్రిక్ సిక్సర్లతో పాటు ఒక బౌండరీ బాది మొత్తంగా 22 పరుగులు పిండుకున్నాడు. ఓవరాల్‌గా ఏడు బంతుల్లోనే మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. ఒకవేళ పిలిప్స్ ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడకపోయుంటే ఎస్ఆర్హెచ్కు మరో ఓటమి ఎదురయ్యేది. అందుకే మ్యాచ్ హీరో గ్లెన్ పిలిప్స్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇన్నాళ్లు హ్యారీ బ్రూక్‌ను నమ్ముకున్న ఎస్ఆర్హెచ్ ఇకనైనా గ్లెన్ పిలిప్స్కు అవకాశం ఇస్తుందేమో చూడాలి. Small role, Huge impact. What a return for Glenn Phillips in IPL. pic.twitter.com/BgyC1iPGtJ — Johns. (@CricCrazyJohns) May 7, 2023 Played just seven balls and won the player of the match - Glenn Phillips for you. 📸: Jio Cinema pic.twitter.com/LClV2Vwl3K — CricTracker (@Cricketracker) May 7, 2023 చదవండి: చహల్ చరిత్ర.. టీమిండియా తరపున తొలి బౌలర్‌గా -
చహల్ చరిత్ర.. టీమిండియా తరపున తొలి బౌలర్‌గా
రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చహల్ ఐపీఎల్లో చరిత్ర సృష్టించాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన చహల్ 29 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఐపీఎల్లో తన పేరిట ఒక రికార్డును లిఖించుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో చహల్ డ్వేన్ బ్రావోతో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. తాజా మ్యాచ్‌తో కలిపి ఇప్పటివరకు చహల్ ఐపీఎల్లో 183 వికెట్లు పడగొట్టాడు. బ్రావో కూడా 183 వికెట్లు తీశాడు. అయితే బ్రావో 161 మ్యాచ్‌ల్లో 183 వికెట్లు తీయగా.. చహల్‌కు మాత్రం 141 మ్యాచ్‌లే అవసరమయ్యాయి. ఇక టీమిండియా తరపున ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చహల్ నిలిచాడు. చహల్, బ్రావో తర్వాత పియూష్ చావ్లా 174 వికెట్లతో మూడో స్థానంలో, అమిత్ మిశ్రా 172 వికెట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. రవిచంద్రన్ అశ్విన్ 171 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. -
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ అంటే చాలు.. చెలరేగిపోతారు
ఐపీఎల్ 16వ సీజన్లో ఆదివారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ భారీ స్కోరు చేసింది. బట్లర్ 95, శాంసన్ 66 నాటౌట్ విధ్వంసం సృష్టించడంతో రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 214 పరుగులు చేసింది. Photo: IPL Twitter ► ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ అంటే చాలు.. జాస్ బట్లర్, సంజూ శాంసన్‌లు చెలరేగిపోతారు. ముఖ్యంగా శాంసన్‌లో ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో 38 బంతుల్లో 66 పరుగులు నాటౌట్‌గా నిలిచిన శాంసన్ ఖాతాలో 4 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఎస్ఆర్హెచ్తో ఆడిన చివరి 9 మ్యాచ్‌ల్లో శాంసన్ వరుసగా 102*, 48*, 26, 36, 48, 82, 55, 55, 66* పరుగులు చేశాడు. అంటే తొమ్మిది ఇన్నింగ్స్‌ల వ్యవధిలో ఐదు అర్థసెంచరీలు సహా ఒక సెంచరీ మార్క్ సాధించిన శాంసన్ ఎస్ఆర్హెచ్పై స్పష్టమైన ఆధిక్యం చూపాడు. Another game against @SunRisers, another 50 for Sanju Samson 🔥 4 in a row against the #OrangeArmy for @rajasthanroyals skipper ✨#RRvSRH #IPLonJioCinema #IPL2023 #TATAIPL | @IamSanjuSamson pic.twitter.com/3IQRkbtBrQ — JioCinema (@JioCinema) May 7, 2023 Photo: IPL Twitter ► ఇక రాజస్తాన్ ఓపెనర్ జాస్ బట్లర్ కూడా ఎస్ఆర్హెచ్ అంటూ చాలు పూనకం వచ్చినట్లుగా ఆడుతున్నాడు. తాజా మ్యాచ్‌లో ఐదు పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికి 59 బంతుల్లో 95 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్తో గత నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా 124, 35, 54, 95 పరుగులు సాధించాడు. Back to 𝘽𝙊𝙎𝙎𝙄𝙉𝙂 it Jos Buttler brings up 5️⃣0️⃣!#IPLonJioCinema #RRvSRH #IPL2023 | @josbuttler pic.twitter.com/GkadXOqAcr — JioCinema (@JioCinema) May 7, 2023 ► ఇక బట్లర్, సంజూ శాంసన్ కలిసి రాజస్తాన్ తరపున ఒక మ్యాచ్‌లో రెండో వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించిన జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో బట్లర్- శాంసన్‌లు రెండో వికెట్‌కు 138 పరుగులు జోడించారు. ఇంతకముందు కూడా ఈ రికార్డు ఎస్‌ఆర్‌హెచ్‌పైనే ఉంది. 2021లో బట్లర్- శాంసన్ జోడినే 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రికార్డులకెక్కారు. ఇక మూడో స్థానంలో రహానే-స్మిత్ జోడి 2019లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 130 పరుగులు జోడించారు. ► ఇక రాజస్తాన్ రాయల్స్‌కు హోంగ్రౌండ్ అయిన జైపూర్‌లో ఇప్పటివరకు 202 పరుగులే ఇన్నింగ్స్ అత్యధిక స్కోరు. తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో 214 పరుగులు చేసిన రాజస్తాన్ పాత రికార్డును బద్దలుకొట్టింది. చదవండి: అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఐపీఎల్ దాకా అన్నీ ఇక్కడే! -
జైశ్వాల్ సరికొత్త చరిత్ర.. రెండో పిన్న వయస్కుడిగా రికార్డు
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఐపీఎల్ 16వ సీజన్లో తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. తాజాగా ఆదివారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో జైశ్వాల్ ఒక రికార్డు అందుకున్నాడ. 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఐపీఎల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న రెండో పిన్న వయస్కుడిగా జైశ్వాల్ రికార్డులకెక్కాడు. 21 ఏళ్ల 130 రోజుల్లో 34 ఇన్నింగ్స్‌ల్లో జైశ్వాల్ ఈ ఫీట్ సాధించాడు. జైశ్వాల్ కంటే ముందు రిషబ్ పంత్(20 ఏళ్ల 218 రోజులు) 35 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు మార్క్ అందుకొని తొలి స్థానంలో నిలిచాడు. ఇక పంత్, జైశ్వాల్ తర్వాత పృథ్వీ షా(21 ఏళ్ల 169 రోజులు) 44 ఇన్నింగ్స్‌ల్లో, సంజూ శాంసన్(21 ఏళ్ల 183 రోజులు) 44 ఇన్నింగ్స్‌ల్లో, శుబ్‌మన్ గిల్(21 ఏళ్ల 222 రోజులు) 41 ఇన్నింగ్స్‌ల్లో, దేవదత్ పడిక్కల్(21 ఏళ్ల 285 రోజులు) 35 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. Yashasvi Jaiswal becomes second fastest Indian, second youngest batter to 1000 IPL runs #IPL2023 #SRHvsRR #RRvsSRH #YashasviJaiswal #RajasthanRoyals #SunrisersHyderabad #worlddais source: Sportstar pic.twitter.com/gdfHISnyJK — Dais World ® (@world_dais) May 7, 2023 𝐎𝐔𝐓𝐓𝐀 𝐒𝐈𝐆𝐇𝐓 👋 The Yashasvi Jaiswal show is on at SMS!#IPLonJioCinema #RRvSRH #TATAIPL #IPL2023 | @ybj_19 pic.twitter.com/xtUzG6uXzx — JioCinema (@JioCinema) May 7, 2023 చదవండి: అదరగొట్టినా.. పాపం ఎండ వేడిమికి తట్టుకోలేకపోయాడు -
IPL 2023: ఉత్కంఠపోరులో ఎస్ఆర్హెచ్ సంచలన విజయం
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ నాలుగు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. 215 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఆఖరి బంతికి అందుకొని ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. 18వ ఓవర్లో గ్లెన్ పిలిప్స్ 22 పరుగులు పిండుకోవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరమైన దశలో అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్లు సమయోచితంగా ఆడి ఎస్ఆర్హెచ్ను గెలిపించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్‌లో అబిషేక్ శర్మ 55, రాహుల్ త్రిపాఠి 47, గ్లెన్ పిలిప్స్ 25, క్లాసెన్ 26 పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో చహల్ నాలుగు వికెట్లు తీయగా.. అశ్విన్, కుల్దీప్ యాదవ్ చెరొక వికెట్ తీశారు. ఐదో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. చహల్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. తొలుత రాహుల్ త్రిపాఠిని వెనక్కి పంపిన చహల్.. మార్క్రమ్ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 18 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. క్లాసెన్(26)ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ 26 పరుగులు చేసిన క్లాసెన్ చహల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 17 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 47, మార్క్రమ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. 14 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 136/2 14 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 37, క్లాసెన్ 8 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 55 పరుగులు అభిషేక్ శర్మ అశ్విన్ బౌలింగ్‌లో చహల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 9 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 73/1 ఎస్ఆర్హెచ్ 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 32, రాహుల్ త్రిపాఠి 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. టార్గెట్ 215.. ఏడు ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 58/1 215 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ ఏడు ఓవర్లలో వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 20, రాహుల్ త్రిపాఠి 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. బట్లర్, శాంసన్ విధ్వంసం.. ఎస్ఆర్హెచ్ టార్గెట్ ఎంతంటే? ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించింది. బట్లర్, సంజూ శాంసన్ దూకుడుతో రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. జాస్ బట్లర్ (59 బంతుల్లో 95 పరుగులు).. ఐదు పరుగులతో సెంచరీ మిస్ అవ్వగా.. కెప్టెన్ సంజూ శాంసన్(38 బంతుల్లో 66 నాటౌట్) విధ్వంసం సృష్టించాడు. జైశ్వాల్ 35 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్, మార్కో జాన్సెన్ చెరొక వికెట్ తీశారు. శాంసన్, బట్లర్ దూకుడు.. రాజస్తాన్ 185/1 ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. బట్లర్ 91, శాంసన్ 47 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో 17 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 185 పరుగులు చేసింది. బట్లర్ అర్థశతకం.. రాజస్తాన్ 12 ఓవర్లలో 125/1 జాస్ బట్లర్ అర్థ శతకంతో మెరవడంతో రాజస్తాన్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 125 పరుగులు చేసింది. బట్లర్ 51, శాంసన్ 32 పరుగులతో ఆడుతున్నారు. జైశ్వాల్(35) ఔట్.. రాజస్తాన్ 8 ఓవర్లలో 74/1 35 పరుగులు చేసిన జైశ్వాల్ మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో నటరాజన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం రాజస్తాన్ 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది. జాస్ బట్లర్ 20, సంజూ శాంసన్ 13 పరుగులతో ఆడుతున్నాడు. 3 ఓవర్లలో రాజస్తాన్ రాయల్స్ 35/0 మూడు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్ 17, జాస్ బట్లర్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్ ఐపీఎల్ 16వ సీజన్లో ఆదివారం జైపూర్ వేదికగా 52వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ కొంటున్నాయి. జైపూర్‌లోని స్లో పిచ్ వేదికగా ఇరుజట్లు పోటీ పడతున్నాయి. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. Sanju Samson wins the toss and opts for hosts @rajasthanroyals to BAT FIRST tonight!🏏 Watch #RRvSRH, LIVE & FREE on #JioCinema, available on any sim card.#RRvSRH #TATAIPL #IPLonJioCinema #IPL2023pic.twitter.com/OdiLISl766 — JioCinema (@JioCinema) May 7, 2023 సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, వివ్రాంత్ శర్మ, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(వికెట్ కీపర్/కెప్టెన్), జో రూట్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, మురుగన్ అశ్విన్, సందీప్ శర్మ, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన సంజూ సేన విజయంపై కన్నేసింది. మరోవైపు వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న హైదరాబాద్ బలమైన రాజస్తాన్‌ను ఎలా ఎదుర్కొంటుదనేది ఆసక్తిగా మారింది. -
ఏ స్థానంలో వచ్చినా అంతే.. విసుగెత్తిస్తున్నాడు!
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వైఫల్యం కొనసాగుతుంది. 13.25 కోట్లు పెట్టినందుకు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే సెంచరీతో చెలరేగిన బ్రూక్ ఆ తర్వాత ఒక్క మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేకపోతున్నాడు. ఓపెనర్ నుంచి ఐదో స్థానం వరకు బ్యాటింగ్ వచ్చినా అదే దారుణ ఆటతీరు కనబరుస్తున్నాడు. తాజాగా గురువారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ నాలుగో స్థానంలో వచ్చి డకౌట్ అయ్యాడు. అయితే ఇదే కేకేఆర్‌పై ఈ సీజన్లో సెంచరీ మార్క్ అందుకున్న బ్రూక్ ఈసారి మాత్రం పేలవంగా ఔట్ అయ్యాడు. స్పిన్ ఆడడంలో తన బలహీనతను మరోసారి బయటపెట్టాడు. అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు మరోసారి దొరికిపోయాడు. అనుకుల్ ఫుల్‌లెంగ్త్ డెలివరీ వేయగా.. బ్రూక్ అడ్డుకునే ప్రయత్నంలో ప్యాడ్లకు తాకింది. దీంతో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో సెంచరీ మినహా బ్రూక్ మిగతా 8 మ్యాచ్‌లు కలిపి 79 బంతులు ఎదుర్కొని 63 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. బ్రూక్ ఆటతీరుపై అభిమానులు మరోసారి ట్రోలింగ్‌కు దిగారు. ''ఏ స్థానంలో వచ్చినా అదే ఆటతీరు.. విసుగెత్తిస్తున్నాడు''.. ''ఆడించింది చాలు.. బెంచ్‌కు పరిమితం చేయడం మేలనుకుంటా'' అని కామెంట్ చేశారు. #HarryBrook feels like he conquered India again after making a 💯 on a flat track and made comments on the Indian fans, now he will get roasted based on his lean patch after that. A huge Kudos to #SRH team management who continue to buy these expensive foreign players who have… pic.twitter.com/N50bbUZbUS — Pichaa Paati (@Pichaa_paati) May 4, 2023 చదవండి: డెత్ ఓవర్లలో 'కింగ్' అనిపించుకుంటున్న రింకూ సింగ్ -
డెత్ ఓవర్లలో 'కింగ్' అనిపించుకుంటున్న రింకూ సింగ్
ఐపీఎల్ 16వ సీజన్లో కేకేఆర్‌కు దొరికిన ఆణిముత్యం రింకూ సింగ్. మూడు సీజన్ల నుంచి అతను కేకేఆర్‌కు ఆడుతున్నప్పటికి ఏ సీజన్లోనూ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి కేకేఆర్‌ను గెలిపించి ఒక్కసారిగా హీరో అయిపోయాడు. ఆ తర్వాత కూడా అదే టెంపోను కంటిన్యూ చేస్తున్న రింకూ సింగ్ డెత్ ఓవర్లలో కింగ్‌గా మారిపోయాడు. తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లోనూ స్లోపిచ్‌పై తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. హాఫ్ సెంచరీ మిస్ అయినప్పటికి రింకూ సింగ్ 35 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 46 పరుగులతో సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. అతని బ్యాటింగ్‌తోనే కేకేఆర్ 170 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. Photo: IPL Twitter ఈ క్రమంలోనే రింకూ సింగ్ ఒక రికార్డు అందుకున్నాడు. ఈ సీజన్లో డెత్ ఓవర్లలో(17-20 ఓవర్ల మధ్య) అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రింకూ సింగ్ తొలి స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు డెత్ ఓవర్లలో 197.53 స్ట్రైక్‌రేట్‌తో 161 పరుగులు చేశాడు. రింకూ సింగ్ తర్వాత షిమ్రోన్ హెట్‌మైర్ 200 స్ట్రైక్‌రేట్‌తో 144 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. టిమ్ డేవిడ్ 213.11 స్ట్రైక్‌రేట్‌తో 130 పరుగులతో మూడో స్థానంలో.. ఇక ద్రువ్ జురేల్ 205 స్ట్రైక్‌రేట్‌తో 115 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. దీంతో పాటు కేకేఆర్ జట్టు మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో పవర్‌ప్లేలో మూడు వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసిన కేకేఆర్.. మిడిల్ ఓవర్లలో(7-14 ఓవర్లు) 9.75 రన్‌రేట్‌తో 78 పరుగులు చేసి ఒక వికెట్ నష్టపోయింది. ఇక డెత్ ఓవర్లలో(15-20 ఓవర్లు) ఐదు వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. కాగా మిడిల్ ఓవర్లలో కేకేఆర్ ఈ సీజన్లో 8.9 రన్‌రేట్‌తో 801 పరుగులు చేయడం విశేషం. కేకేఆర్ మినహా ఏ జట్టు మిడిల్ ఓవర్లలో ఇన్ని పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాయి. Rinku Singh's rescue innings for KKR: KKR 3/16 & he scored 35(28) KKR 3/92 & he scored 42*(23) KKR 5/142 & he scored 40(15) KKR 3/47 & he scored 46(33) KKR 3/128 & he scored 48*(21) KKR 5/96 & he scored 58*(31) KKR 4/70 & he scored 53*(33) KKR 3/35 & he scored 46(35) pic.twitter.com/urCRHrlDLl — Johns. (@CricCrazyJohns) May 4, 2023 చదవండి: సంచలన క్యాచ్‌తో మెరిసిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ -
IPL 2023: ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అప్డేట్స్
IPL 2023: SRH Vs KKR Match Live Updates: మార్క్రమ్(41)ఔట్.. ఆరో వికెట్ డౌన్ 41 పరుగులు చేసిన మార్క్రమ్ వైభవ్ అరోరా బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఎస్ఆర్హెచ్ 145 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. క్లాసెన్(36) ఔట్.. ఎస్ఆర్హెచ్ 134/5 హెన్రిచ్ క్లాసెన్(36) రూపంలో ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ నష్టపోయింది. మార్క్రమ్తో కలిసి ఐదో వికెట్‌కు 50కి పైగా పరుగులు జోడించిన క్లాసెన్ ఠాకూర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రసెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ ఐదు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. మార్క్రమ్ 39, అబ్దుల్ సమద్ ఐదు పరుగులతో ఆడుతున్నారు. బ్రూక్ డకౌట్.. నాలుగు వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్ 172 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ కష్టాల్లో పడింది. హ్యారీ బ్రూక్ డకౌట్‌గా వెనుదిరగడంతో నాలుగో వికెట్ నష్టపోయింది. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. మార్క్రమ్ 2, క్లాసెన్ ఐదు పరుగులతో ఆడుతున్నారు. టార్గెట్ 172.. 38 పరుగులకు రెండు వికెట్లు డౌన్ 172 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 5 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 6, మార్క్రమ్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు అభిషేక్ శర్మ 9, మయాంక్ అగర్వాల్ 18 పరుగులు చేసి ఔటయ్యారు. Photo Credit : IPL Website ఎస్ఆర్హెచ్ టార్గెట్ 172 ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రింకూ సింగ్ 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ నితీశ్‌రానా 42 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో మార్కో జాన్సన్, టి. నటరాజన్‌లు చెరో రెండె వికెట్లు తీయగా.. భువనేశ్వర్, కార్తిక్ త్యాగి, మార్క్రమ్, మయాంక్ మార్కండేలు తలా ఒక వికెట్ తీశారు. Photo Credit : IPL Website 16 ఓవరల్లో కేకేఆర్ 137/6 16 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. రింకూ సింగ్ 29, శార్దూల్ ఠాకూర్ ఆరు పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్ 42 పరుగులు చేసిన నితీశ్ రానా మార్క్రమ్ స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. అతని బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం కేకేఆర్ 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. రింకూ సింగ్ 22, రసెల్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website 9 ఓవర్లలో కేకేఆర్ స్కోరు 73/3 9 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. నితీశ్ రానా 24, రింకూ సింగ్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website 35 పరుగులకే మూడు వికెట్లు డౌన్ 35 పరుగుల వద్ద కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన జేసన్ రాయ్ కార్తిక్ త్యాగి బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. Photo Credit : IPL Website 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో కేకేఆర్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మార్కో జాన్సన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టడం విశేషం. Photo Credit : IPL Website టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ ఐపీఎల్ 16వ సీజన్లో హైదరాబాద్ వేదికగా 47వ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్, కేకేఆర్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ బ్యాటింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగి, టి నటరాజన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి Nitish Rana calls right at the toss & @KKRiders choose to BAT FIRST tonight🏏 Watch #SRHvKKR, LIVE & FREE on #JioCinema, available on any sim card.#TATAIPL #IPLonJioCinema #IPL2023 pic.twitter.com/A6QyPUh2nt — JioCinema (@JioCinema) May 4, 2023 గత మ్యాచ్‌లో విజయంతో ఎస్ఆర్హెచ్ వరుస ఓటములకు బ్రేక్ వేసింది. ఇక కేకేఆర్ మాత్రం ఒక మ్యాచ్‌లో గెలుపు.. మరో మ్యాచ్‌లో ఓటమి అన్నట్లుగా సాగుతుంది. ఈ సీజన్లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. హ్యారీ బ్రూక్ సెంచరీ సాధించింది ఈ మ్యాచ్‌లోనే. -
SRHvsKKR : ఉప్పల్ స్టేడియంలో ఆటగాళ్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
-
చేజేతులా ఓటమి.. అక్షర్ పటేల్‌ను ముందే పంపించి ఉంటే!
ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ వైఫల్యం కొనసాగుతుంది. తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఓటమిని కొనితెచ్చుకుంది. ఒక దశలో వికెట్ నష్టపోకుండా 112 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఢిల్లీ ఈజీగా మ్యాచ్ గెలిచేస్తుందని అంతా భావించారు. అందుకు తగ్గట్లుగానే మిచెల్ మార్ష్, ఫిలిప్ సాల్ట్‌ల ఇన్నింగ్స్ కొనసాగింది. స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు ఔట్ కావడం ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచింది. వీరి తర్వాత వచ్చిన ఏ ఆటగాడు కూడా కనీసం క్రీజులో ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. ఫామ్‌లో ఉన్న అక్షర్ పటేల్‌ను ఏడో స్థానంలో బ్యాటింగ్ పంపండం కూడా ఢిల్లీ ఓటమికి మరో కారణం. సాల్ట్ ఔటైన తర్వాత అక్షర్ పటేల్‌కు బ్యాటింగ్ ప్రమోషన్ ఇచ్చి నాలుగో స్థానంలో పంపి ఉంటే పరిస్థితి కచ్చితంగా వేరుగా ఉండేదే. ఎందుకంటే ఆఖరిదశలోనూ అక్షర్ పటేల్ వేగంగా ఆడేందుకే ప్రయత్నించాడు. 14 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 29 పరుగులు చేసిన అక్షర్‌పటేల్ క్రీజులోకి వచ్చేసరికి ఓవర్లు తక్కువగా ఉన్నాయి. దీంతో అతను కూడా ఏం చేయలేకపోయాడు. ఒక రకంగా ఇది కెప్టెన్ వార్నర్ తప్పు. ఫామ్‌లో ఉన్న అక్షర్ పటేల్‌ను కాదని మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్‌లను బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపించడం ఏంటో ఎవరికి అర్థం కాలేదు. ఈ సీజన్లో అక్షర్ పటేల్ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. 8 మ్యాచ్‌ల్లో 211 పరుగులు చేసిన అక్షర్ ఖాతాలో ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఇక బౌలింగ్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. చదవండి: ఐపీఎల్ చరిత్రలో అత్యంత పేలవమైన ఔట్ అనుకుంటా! -
ఐపీఎల్ చరిత్రలో అత్యంత పేలవమైన ఔట్ అనుకుంటా!
ఐపీఎల్ చరిత్రలోనే ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు మనీష్ పాండే అత్యంత పేలవంగా ఔటవ్వడం ఆసక్తి కలిగించింది. శనివారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో మనీష్ పాండే ఒక్క పరుగు మాత్రమే చేసి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అభిషేక్ శర్మ వేసిన స్లో బంతిని ఆడేందుకు క్రీజు దాటిన పాండే అసలు ఎందుకు ఫ్రంట్‌ఫుట్ వచ్చాడో ఎవరికి అర్థం కాలేదు. కాస్త ఫ్రంట్‌ఫుట్ అనుకుంటే పర్వాలేదు.. కానీ రెండు అడుగుల దూరం వచ్చి మరీ వికెట్ సమర్పించుకున్నాడు పాండే. మాములుగా అయితే ఏ క్రికెటర్ అయినా స్లోబాల్‌ను క్రీజులోనే ఆడే ప్రయత్నం చేస్తాడు. అంతర్జాతీయ అనుభవం ఉన్న మనీష్ పాండే ఇంత చెత్తగా ఆడడం ఆశ్చర్యపరిచింది. పాండే క్రీజు దాటిన మరుక్షణమే క్లాసెన్ బెయిల్స్ ఎగురగొట్టాడు. బహుశా మనీష్ పాండే ఔటైన తీరు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పేలవమైన ఔట్‌గా మిగిలిపోయే అవకాశం ఉంది. ఇక మనీష్ పాండే 2021 నుంచి ఐపీఎల్లో అత్యంత చెత్త ఫామ్‌ను కనబరుస్తున్నాడు. అప్పటినుంచి 20 మ్యాచ్‌లాడిన పాండే 512 పరుగులు మాత్రమే చేవాడు. ఇందులో నాలుగు అర్థసెంచరీలు ఉన్నాయి. He's actually disgrace to cricket.@im_manishpandey pic.twitter.com/oefH4MKKCU — Anil (@NANI57ANIL) April 29, 2023 చదవండి: అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా -
అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా
ఐపీఎల్ చరిత్రలో ఎస్ఆర్హెచ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ మ్యాచ్‌ల్లో తొలి ఓవర్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్ తొలి స్థానంలో నిలిచాడు. భువీ తాను వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఇప్పటివరకు 24 వికెట్లు పడగొట్టాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్‌ను డకౌట్ చేయడం ద్వారా భువీ ఈ ఫీట్ సాధించాడు. భువనేశ్వర్ తర్వాత ట్రెంట్ బౌల్ట్(21 వికెట్లు) రెండో స్థానంలో, ప్రవీణ్ కుమార్ 15 వికెట్లతో మూడో స్థానంలో, సందీప్ శర్మ 13 వికెట్లతో నాలుగో స్థానంలో, 12 వికెట్లతో జహీర్ ఖాన్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 27 బంతుల్లో 53 పరుగులు నాటౌట్ తొలి అర్థసెంచరీతో మెరవగా.. అభిషేక్ శర్మ 36 బంతుల్లో 67 పరుగులతో రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. చదవండి: కేకేఆర్‌ను ఎన్కౌంటర్ చేసిన విజయ్ శంకర్ -
ఢిల్లీ క్యాపిటల్స్‌పై 9 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ మూడో విజయాన్ని నమోదు చేసింది. శనివారం ఢిల్లీ క్యాపటల్స్తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 9 పరుగుల తేడాతో విజయం అందుకుంది. 198 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 63, ఫిల్ సాల్ట్ 59 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికి మిగతావారు విఫలం కావడంతో ఢిల్లీ చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుంది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో మయాంక్ మార్కండే రెండు వికెట్లు తీయగా.. నటరాజన్, భువనేశ్వర్, అభిషేక్ శర్మ, అకిల్ హొసెన్‌లు తలా ఒక వికెట్ తీశారు. 18 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 163/6 18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.. అక్షర్ పటేల్ 14, రిపల్ పటేల్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. మిచెల్ మార్ష్(63) ఔట్.. నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ. ప్రస్తుతం ఢిల్లీ స్కోరు 125/4గా ఉంది మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ 198 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కోల్పోయింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన మనీష్ పాండే అత్యంత పేలవంగా స్టంపౌట్ అయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీ మూడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. దంచుతున్న మార్ష్, పిలిప్ సాల్ట్.. ఢిల్లీ 97/1 ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దాటిగా ఆడుతుంది. 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. మార్ష్ 47, పిలిప్ సాల్ట్ 49 పరుగులతో ఆడుతున్నారు. ఆరు ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 57/1 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. పిలిప్ సాల్ట్ 36, మిచెల్ మార్ష్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website క్లాసెన్, అభిషేక్ శర్మ మెరుపులు.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 198 ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ భారీస్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 27 బంతుల్లో 53 పరుగులు నాటౌట్ తొలి అర్థసెంచరీతో మెరవగా.. అభిషేక్ శర్మ 36 బంతుల్లో 67 పరుగులతో రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. 17 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 162/6 17 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. 28 పరుగులు చేసిన అబ్దుల్ సమద్ మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో కీపర్ పిలిప్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 13 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 120/5 13 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ ఐదు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. అబ్దుల్ సమద్ 8, క్లాసెన్ 17 పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website 11 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 107/4 11 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ నాలుగు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 66, క్లాసెన్ 12 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు మార్క్రమ్ 8 పరుగులు వద్ద ఔట్ కాగా.. హ్యారీ బ్రూక్ డకౌట్‌గా వెనుదిరిగాడు. Photo Credit : IPL Website అభిషేక్ శర్మ ఫిఫ్టీ.. ఎస్ఆర్హెచ్ 83/2 ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో మెరిశాడు. సిక్సర్‌తో ఫిఫ్టీ మార్క్ అందుకోవడం విశేషం. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. అభిషేక్ 57, మార్క్రమ్ 8 పరుగులతో ఆడుతున్నారు. ఆరు ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 62/2 ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఆరు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 43, మార్క్రమ్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా శనివారం ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్ఆర్హెచ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్‌కీపర్), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్, అక్షర్ పటేల్, రిపాల్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, అకేల్ హోసేన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్ Meanwhile, in Delhi, @SunRisers win the toss & elect to bat first! Who will come out victorious in the capital? 💬👇#DCvSRH #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/Jwsvh30otU — JioCinema (@JioCinema) April 29, 2023 వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి గాడిలో పడుతుందేమో చూడాలి. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మూడో విజయంపై కన్నేసింది. -
ఐపీఎల్ టీ20 కాస్త అదుపుతప్పి... టెస్ట్ మ్యాచ్ గా ఆడితే.. ఇదే పరిస్థితి..!
-
బ్యాటర్‌గా విఫలం.. కొత్త అవతారం ఎత్తిన హ్యారీ బ్రూక్
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ హ్యాట్రిక్ పరాజయాన్ని చవి చూసింది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో హోంగ్రౌండ్లో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 145 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది. బ్యాటర్ల వైఫల్యంతో ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కోట్లు పెట్టి కొన్న హ్యారీ బ్రూక్ ప్రదర్శన ఒక్క మ్యాచ్‌కే పరిమితమైంది. స్పిన్నర్ల బలహీతనను అధిగమించలేక బ్రూక్ వికెట్ పారేసుకుంటున్నాడు. ఇక ఢిల్లీతో మ్యాచ్‌లో అయితే 14 బంతుల్లో ఏడు పరుగులు మాత్రమే చేసి నోర్ట్జే బౌలింగ్‌లో వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే బ్యాటర్‌గా పూర్తిగా విఫలమవుతున్న హ్యారీ బ్రూక్ ఢిల్లీ ఇన్నింగ్స్ సందర్భంగా కాసేపు కెమెరామన్‌గా అలరించాడు. బ్రూక్ కెమెరామన్ పాత్రను పోషించడంపై కామెంటేటర్ హర్షా బోగ్లే స్పందించాడు. ''ఓ మ్యాన్.. ఇవాళ బ్రూక్ రూపంలో మనకు ఒక కొత్త కెమెరామన్ కనిపిస్తున్నాడు. టెలివిజన్ ప్రొడక్షన్ చరిత్రలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కెమెరామన్‌గా బ్రూక్ చరిత్ర సృష్టించాడు'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. కాగా బ్రూక్‌ను వేలంలో ఎస్ఆర్హెచ్ రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. He'll whack it outta the park and show you how it sails through the air too - Harry Brook 😉#SRHvDC #TATAIPL #IPLonJioCinema #IPL2023 pic.twitter.com/ar6t314xu3 — JioCinema (@JioCinema) April 24, 2023 చదవండి: #JiteshSharma: అదనపు మార్కుల కోసం క్రికెటర్ అవతారం -
'ఇంత దారుణమా.. ఎస్ఆర్హెచ్కే ఇది చెల్లింది!'
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ వైఫల్యం కొనసాగుతుంది. సీజన్లో ఏడు మ్యాచ్‌లాడిన ఎస్ఆర్హెచ్ కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. అయితే రోజురోజుకు ఎస్ఆర్హెచ్ ఆట దిగజారిపోతుంది. ఈ సీజన్లో వరుస విజయాలతో దుమ్మురేపుతున్న జట్లను ఎస్ఆర్హెచ్ ఓడించలేదంటే ఒక అర్థం ఉంది. కానీ సీజన్లో వరుసగా ఐదు ఓటములు చవిచూసి ఆఖరిస్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో చేతిలోనే పరాభవం ఎదుర్కోవడం ఎస్ఆర్హెచ్ అభిమానులను ఆశ్చర్యం కలిగించింది. వాస్తవానికి మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కంటే ఎస్ఆర్హెచ్ ఫెవరెట్‌గా కనిపించింది. ముందు బౌలింగ్ చేసి ఢిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంతో అరె ఎస్ఆర్హెచ్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటుందిలే అని అంతా అనుకున్నారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇచ్చిన 145 పరుగుల సాధారణ లక్ష్యాన్ని అందుకోవడానికి ఎస్ఆర్హెచ్ కిందామీదా పడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసి ఏడు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. వాషింగ్టన్ సుందర్ ఆఖరి వరకు క్రీజులో ఉన్నప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసి.. బ్యాటింగ్‌లో 15 బంతుల్లో 24 పరుగులతో రాణించి ఫామ్‌లోకి వచ్చాడంటూ ఊదరగొట్టినా ఉపయోగం లేకుండా పోయింది. నిజానికి సీఎస్కేతో మ్యాచ్ సందర్భంగానే తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ అష్టకష్టాలు పడింది. అదే చెత్త బ్యాటింగ్‌ను సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌పై ప్రదర్శించింది. ధాటిగా ఆడిన హెన్రిచ్ క్లాసెన్‌ను మార్క్రమ్ కంటే ముందే పంపించి ఉంటే ఫలితం కచ్చితంగా వేరుగా ఉండేది. ఒక రకంగా చేజేతులా ఎస్ఆర్హెచ్ ఓటమిని కొనితెచ్చుకుంది. ఈ ఓటమిని జీర్ణించుకోలేని ఎస్ఆర్హెచ్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురిపించారు. ముఖ్యంగా ''ఎస్ఆర్హెచ్ను బ్యాన్ చేయండి'' అనేది ఎక్కువగా కనిపించింది.. ''ఇంత దారుణమా.. ఆఖరికి ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో కూడా ఓడారు'' అంటూ కామెంట్ చేశారు. చదవండి: 'వార్నర్‌ను పక్కన పెట్టి అతడికి ఢిల్లీ కెప్టెన్సీ ఇవ్వండి' -
SRHకి ధోని పాఠాలు...రాత మారుతోందా?
-
ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లకు ధోని సలహాలు.. జ్ఞానోదయం కలిగేనా!
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే నాలుగో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. హోంగ్రౌండ్లో తమను ఓడించడం అంత సులువు కాదని సీఎస్కే మరోసారి నిరూపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ సీఎస్కే బౌలర్ల దాటికి పరుగులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అనంతరం సీఎస్కే 18.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. డెవన్ కాన్వే 77 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు., ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం సీఎస్కే కెప్టెన్ ధోనిని ఎస్ఆర్హెచ్ యువ ఆటగాళ్లను కలిశాడు. ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ డాగర్ సహా ఇతర ఆటగాళ్లు ధోని చెప్పిన సలహాలను శ్రద్దగా వినడం ఆసక్తి కలిగించింది. మ్యాచ్ ఆడుతున్నంతసేపే ధోని అవతలి జట్టును, ఆటగాళ్లను ప్రత్యర్థిగా చూస్తాడు. ఒకసారి మ్యాచ్ ముగిసిదంటే ధోని ప్రత్యర్థి జట్టుతోనే ఎక్కువగా గడపడానికి ఇష్టపడతాడు. గతంలోనూ ధోని ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లకు సలహాలు ఇవ్వడం చూశాం. తాజాగా ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లకు సలహాలు ఇస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ''ధోని సలహాలతోనైనా ఎస్ఆర్హెచ్లో మార్పు వస్తుందేమో.. కనీసం ఇప్పటికైనా ఆటగాళ్లకు జ్ఞానోదయం కలుగుతుందేమో చూడాలి.'' అంటూ కామెంట్ చేశారు. ఇక ఆరు మ్యాచ్‌ల్లో రెండు గెలిచిన ఎస్ఆర్హెచ్కు ఇది హ్యాట్రిక్ పరాజయం. MS Dhoni having a discussion with Umran Malik and all other youngsters listening carefully. What a lovely picture! pic.twitter.com/hFZA4RtX2s — Mufaddal Vohra (@mufaddal_vohra) April 21, 2023 చదవండి: Mayank Agarwal: మారని ఆటతీరు.. ఏ స్థానంలో ఆడించినా అంతే క్లాసెన్ అడ్డుకున్నా.. ఈసారి ధోని వదల్లేదు! -
Mayank Agarwal: మారని ఆటతీరు.. ఏ స్థానంలో ఆడించినా అంతే!
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ దారుణ ఆటతీరు కొనసాగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం సీఎస్కేతో మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ ఓపెనర్‌గా కాకుండా ఐదో స్థానంలో వచ్చాడు. కానీ ఏ స్థానంలో వచ్చినా తన ఆటతీరు మారదని మరోసారి నిరూపించాడు మయాంక్. నాలుగు బంతులెదుర్కొని కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి జడేజా బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అసలు వికెట్ టు వికెట్ బౌలింగ్ చేసి జడేజా బౌలింగ్‌లో ఫ్రంట్‌ఫుట్ రావడమే తప్పు.. అలాంటి ధోని కీపర్‌గా ఉన్నప్పుడు అలా చేయడం ఇంకా పెద్ద తప్పు. క్షణం కూడా ఆలస్యం చేయని ధోని వికెట్లను ఎగురగొట్టేశాడు. కనీసం అంచనా లేకుండా ఫ్రంట్‌ఫుట్ షాట్‌కు యత్నించడం మయాంక్ ఆట ఎంత పేలవంగా ఉందనేది చూపించింది. ఓపెనర్‌గా విఫలమయ్యాడని ఫినిషర్ రోల్లో పంపిస్తే దానికి న్యాయం చేయలేకపోయాడు. వాస్తవానికి 2022 సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్ అయిన తర్వాత మయాంక్ అగర్వాల్ ఆట పూర్తిగా మసకబారుతూ వచ్చింది. పంజాబ్ కింగ్స్‌లో ఉన్నప్పుడు పరుగులు చేసిన మయాంక్ ఎస్ఆర్హెచ్లోకి వచ్చాకా తన బ్యాటింగ్‌నే పూర్తిగా మరిచిపోయాడు. అలాంటి మయాంక్‌పై ఎస్ఆర్హెచ్ కూడా రూ. 8.5 కోట్లు చెల్లించి తీసుకున్నప్పటికి ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటివరకు మయాంక్ ఆరు మ్యాచ్‌లాడి 115 పరుగులు మాత్రమే చేశాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో 48 పరుగులు చేసినప్పటికి చాలా బంతులు వృథా చేశాడు. అసలు ముందు మయాంక్‌ను కాదు అనాల్సింది.. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ను. తలా తోక లేకుండా జట్టును తయారు చేసింది. గత్యంతరం లేకనే మయాంక్ అగర్వాల్‌కు అవకాశం ఇస్తున్నారు. అయితే కనీసం రానున్న మ్యాచ్‌ల్లో ఆఖర్లో బ్యాటింగ్‌కు వస్తున్న అబ్దుల్ సమద్‌కు ప్రమోషన్ ఇచ్చి బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపితే బాగుంటుందేమో. ఇక మయాంక్ ఆటతీరుపై సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్స్‌తో రెచ్చిపోయారు. మీరు ఒకసారి లుక్కేయండి. Speeds in #Chennai today: Duronto Express ⚡ Jaddu's sword⚡⚡ Dhoni's gloves ⚡⚡⚡#CSKvSRH #IPLonJioCinema #TATAIPL #IPL2023 | @msdhoni pic.twitter.com/p7qtuEe9AI — JioCinema (@JioCinema) April 21, 2023 Ayindhi edho ayindhi oka vandha unchukoni migatha auction dabbulu icheyi @mayankcricket pic.twitter.com/Ve1EsOLfoL — వేటగాడు (@rao_4005) April 21, 2023 Bus lo iddharu rajinikanth lu undaga crease ela daatav ra @mayankcricket — King of the jungle (@tigersathhii) April 21, 2023 Every one down contender of Indian team is in academy these days... Tripathi and Hooda❤️🔥 Whereas Mayank Agarwal today came as finisher, finished his innings with 2 runs off 4 balls, consistency at its peak😍🔥 #CSKvSRH — TukTuk Academy (@TukTuk_Academy) April 21, 2023 చదవండి: సుందరానికి తొందరెక్కువ.. తప్పించుకోవడం కష్టం! -
సుందరానికి తొందరెక్కువ.. తప్పించుకోవడం కష్టం!
సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని తన కీపింగ్ స్మార్ట్‌నెస్ మరోసారి చూపించాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో మొదట సూపర్ స్టంపింగ్‌తో మెరిసిన ధోని ఆఖర్లో సుందర్‌ను రనౌట్ చేసిన తీరు హైలెట్‌గా మారింది. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ ఆఖరి బంతిని మార్కో జాన్సెన్ మిస్ చేశాడు. ఒక్క పరుగుతో వచ్చేది ఏం లేదని అక్కడే ఆగిపోయే ఉంటే బాగుండేది. ఎదురుగా ఉన్నది ధోని అని తెలిసి కూడా జాన్సెన్ రిస్క్ చేశారు. ఫలితం నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న సుందర్ క్రీజులోకి వచ్చేలోపే ధోని బంతితో డైరెక్ట్ హిట్ వేయడంతో వికెట్లు ఎగిరిపడ్డాయి. "సుందరానికి బాగా తొందరెక్కువ.. బంతి ధోని చేతుల్లోకి వెళితే తప్పించుకోవడం కష్టమని తెలిసి కూడా రిస్క్ అవసరమా'' అంటూ అభిమానులు కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. \ | / Dhoni 𝚠̶𝚊̶𝚜̶ is here! 💥#CSKvSRH #TATAIPL #IPLonJioCInema #IPL2023 pic.twitter.com/9r21Ay7PIS — JioCinema (@JioCinema) April 21, 2023 చదవండి: క్లాసెన్ అడ్డుకున్నా.. ఈసారి ధోని వదల్లేదు! -
క్లాసెన్ అడ్డుకున్నా.. ఈసారి ధోని వదల్లేదు!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కేతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ దారుణ ఆటతీరు కనబరుస్తోంది. 92 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సంగతి పక్కనబెడితే మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 14వ ఓవర్ జడేజా వేశాడు. ఓవర్ తొలి బంతిని మయాంక్ స్ట్రెయిట్ షాట్ ఆడాడు. Photo: IPL Twitter అయితే జడ్డూ క్యాచ్ తీసుకునే అవకాశం వచ్చింది. కానీ ఇదే సమయానికి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న క్లాసెన్ జడ్డూ క్యాచ్ అందుకునే క్రమంలో అతనికి అడ్డుగా వచ్చాడు. దీంతో జడ్డూ ఫ్లోర్‌పై పడిపోయాడు. అయితే యాదృశ్చికంగా జరిగిందా లేక క్లాసెన్ కావాలనే అడ్డుకున్నాడా అన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంలో జడేజా క్లాసెన్‌వైపు ''ఇదేంటి'' అన్నట్లుగా సీరియస్ లుక్ ఇచ్చాడు. Photo: IPL Twitter అయితే క్లాసెన్ తనకు వచ్చిన లైఫ్‌ను మయాంక్ కాపాడుకోలేకపోయాడు. అదే ఓవర్లో ఐదో బంతికి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఔట్‌సైడ్ ఆఫ్ దిశగా వేసిన బంతిని ఆడేందుకు మయాంక్ ఫ్రంట్‌ఫుట్ వచ్చాడు. అయితే బంతి మిస్ అయి ధోని చేతుల్లో పడింది. కీపింగ్‌లో సూపర్ టైమింగ్ కనబరిచే ధోని క్షణం ఆలస్యం చేయకుండా స్టంపింగ్ చేశాడు. దీంతో మయాంక్ పెవిలియన్ బాట పట్టాడు. మయాంక్ ఔటైన అనంతరం క్లాసెన్‌వైపు సీరియస్ లుక్ ఇచ్చిన జడేజా.. బాగుందా అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం హైలెట్‌గా నిలిచింది. Speeds in #Chennai today: Duronto Express ⚡ Jaddu's sword⚡⚡ Dhoni's gloves ⚡⚡⚡#CSKvSRH #IPLonJioCinema #TATAIPL #IPL2023 | @msdhoni pic.twitter.com/p7qtuEe9AI — JioCinema (@JioCinema) April 21, 2023 Jaddu😈pic.twitter.com/SOxL82wFdi — Karthik™ (@im_karthik777) April 21, 2023 -
ఎస్ఆర్హెచ్పై సీఎస్కే ఘన విజయం
ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 135 పరుగుల టార్గెట్‌ను 18.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. డెవన్ కాన్వే(55 బంతుల్లో 77 నాటౌట్) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. రుతురాజ్ గైక్వాడ్ 35 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో మయాంక్ మార్కండే రెండు వికెట్లు పడగొట్టాడు. విజయానికి 16 పరుగుల దూరంలో సీఎస్కే.. సీఎస్కే ఆడుతూ పాడుతూ లక్ష్యం దిశగా సాగుతుంది. 16 ఓవర్లు ముగిసేరికి రెండు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 16 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. కాన్వే 65, రాయుడు 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాన్వే ఫిఫ్టీ.. 10 ఓవర్లలో సీఎస్కే 86/0 135 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే ప్రస్తుతం 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 86 పరుగులు చేసింది. డెవన్ కాన్వే 33 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ అందుకున్నాడు. గైక్వాడ్ 34 పరుగులతో సహకరిస్తుననాడు. విజయం దిశగా సీఎస్కే.. 7 ఓవర్లలో 66/0 ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో సీఎస్కే విజయం దిశగా పయనిస్తోంది. ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. కాన్వే 42, గైక్వాడ్ 22 పరుగులతో ఆడుతున్నారు. టార్గెట్ 135.. సీఎస్కే 32/0 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. రుతురాజ్ 14, కాన్వే 17 పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website సీఎస్కే టార్గెట్ 135 సీఎస్కేతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేసింది. అభిషేక్ శర్మ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రాహుల్ త్రిపాఠి 21 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జడేజా మూడు వికెట్లతో మెరవగా.. మతీషా పతీరణా, ఆకాశ్ సింగ్, మహీష్ తీక్షణలు తలా ఒక వికెట్ తీశారు. Photo Credit : IPL Website 16 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 106/5 16 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ ఐదు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. క్లాసెన్ 11, మార్కో జాన్సెన్ ఐదు పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website 95 పరుగులకే ఐదు వికెట్లు 95 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ షాట్ ఆడే ప్రయత్నంలో ధోని సూపర్ స్టంపౌట్‌తో వెనుదిరిగాడు. Photo Credit : IPL Website నాలుగో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ సీఎస్కేతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. 12 పరుగులు చేసిన మార్క్రమ్ తీక్షణ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం నాలుగు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. Photo Credit : IPL Website రెండో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ సీఎస్కేతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. మంచి టచ్‌లో కనిపించిన అభిషేక్ నాయర్(36 పరుగులు) జడేజా బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 11 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 21, మార్ర్కమ్ 8 పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website బ్రూక్(18)ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ 18 పరుగులు చేసిన బ్రూక్ ఆకాశ్ సింగ్ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది. అభిషేక్ 20, త్రిపాఠి ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website 4 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 34/0 4 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. బ్రూక్ 18, అభిషేక్ శర్మ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సీఎస్కే ఐపీఎల్ 16వ సీజన్లో ఇవాళ(శుక్రవారం) చెన్నై వేదికగా 29వ మ్యాచ్‌లో సీఎస్కే, ఎస్ఆర్హెచ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సీఎస్కే ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(కెప్టెన్/వికెట్ కీపర్), మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సింగ్, మతీషా పతిరానా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్ #ThalaDhoni wins the toss and @ChennaiIPL are BOWLING FIRST at Chepauk! Watch the #TATAIPL Southern Derby⚔️, in Tamil or Telugu, LIVE & FREE on #JioCinema#CSKvSRH #TATAIPL #IPLonJioCinema #IPL2023 pic.twitter.com/lvnYvDnLPm — JioCinema (@JioCinema) April 21, 2023 వరుస విజయాలతో దూకుడు మీదున్న సీఎస్కేను ఎస్ఆర్హెచ్ ఎలా నిలువరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. హోంగ్రౌండ్లో మ్యాచ్ ఆడుతుండడంతో సీఎస్కే మ్యాచ్‌లో మరింత బలంగా కనిపిస్తుంది. -
పాపం...కావ్య పాపకే ఎందుకు ఇలా జరుగుతుంది?
-
ఇది విన్నారా.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి!
క్రికెట్లో ఫీల్డ్ అంపైర్ పనేంటని అడిగితే ఎవరైనా సమాధానం చెప్పగలరు. బ్యాటర్లు కొట్టే బౌండరీలు, సిక్సర్లకు సిగ్నల్స్ ఇవ్వడం.. బౌలర్లకు ఆదేశాలు ఇవ్వడం.. రనౌట్లు, నోబ్లు, వైడ్లు, లెగ్‌బైలు ఇలా చెప్పుకుంటూ పోతే మ్యాచ్‌లో ఆటగాళ్ల కన్నా అంపైర్‌కే ఎక్కువ పని ఉంటుంది. అనుక్షణం ఏకాగ్రతతో ఉంటూ మ్యాచ్‌లో కీలకంగా వ్యవహరించడం అతని పాత్ర. ఒకప్పుడు ఫీల్డ్ అంపైర్ ఏది చెబితే అదే శాసనం. ఇప్పుడంటే డీఆర్ఎస్ల రూపంలో అంపైర్ల నిర్ణయాన్ని చాలెంజ్ చేయొచ్చు. కానీ ఒకప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్.. రనౌట్ ఈ రెండు అంశాల్లో తప్ప అంపైర్ ఔట్ ఇచ్చాడంటే బ్యాటర్ మాట మాట్లాడకుండా పెవిలియన్‌కు వెళ్లాల్సిందే. అయితే ఇప్పుడు డీఆర్ఎస్లు అంపైర్లను కన్ఫూజన్‌కు గురిచేస్తున్నాయి. బంతి బంతికి డీఆర్ఎస్ కోరే అవకాశం ఉండడంతో వైడ్ బాల్స్‌ను కూడా సందేహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా మంగళవారం ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అర్జున్ వేసిన నాలుగో బంతి త్రిపాఠి పక్క నుంచి లెగ్‌స్టంప్ అవతల నుంచి వెళ్లింది. అయితే అర్జున్ టెండూల్కర్‌తో పాటు కీపర్ ఇషాన్ కిషన్ క్యాచ్‌ఔట్ అంటూ అప్పీల్ చేశారు. కానీ అంపైర్ వైడ్ ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రివ్యూ తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో అర్జున్, ఇషాన్‌లు సైలెంట్ అయిపోయారు. కానీ ఇక్కడే అసలు కథ ప్రారంభమయింది. ఏమైందో తెలియదు కానీ నితిన్ మీనన్ తొలిసారి అంపైర్ రివ్యూను ఉపయోగించాడు. అసలు అది వైడ్ బాల్ అవునా కాదా అనే డౌట్‌తో రివ్యూకు వెళ్లాడు. అల్ట్రాఎడ్జ్‌లో అది క్లియర్ వైడ్ అని తెలిసింది. అంపైర్‌గా ఇన్నేళ్ల అనుభవం ఉండి కూడా నితిన్ మీనన్ రివ్యూ వెళ్లడం క్రికెట్ ఫ్యాన్స్‌కు ఆసక్తి కలిగించింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఉంటేనే ఈ రివ్యూను అంపైర్ ఉపయోగిస్తారు. ఐపీఎల్లో ఇంతవరకు ఈ రివ్యూ ఏ అంపైర్ వాడుకోలేదు. ఒక రకంగా ఐపీఎల్ చరిత్రలో ఒక అంపైర్ డీఆర్ఎస్ కోరడం ఇదే తొలిసారి. అయితే ఒక వైడ్ బాల్ విషయంలో అయోమయానికి గురవ్వడం ఏంటో.. దీనికోసం థర్డ్ అంపైర్ వరకు వెళ్లడమేంటో అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అలాగే రివ్యూ కోరుకోవాల్సింది ఆటగాళ్లని.. అంపైర్లు కాదని కొందరు విమర్శించారు. What's just Nitin Menon has done by taking caught behind decision upstairs on his own... What we can call this..#IPL2O23 #SRHvsMI @cricbuzz pic.twitter.com/4E8tzVXAzg — Amit K Jha (@Amit_sonu_) April 18, 2023 Why the hell did Nitin Menon take the review? Strange. #MIvsSRH — Mihir Gadwalkar (@mihir_gadwalkar) April 18, 2023 Umpire taking review for caught behind🤔 Whats happening??#MIvsSRH — Manish Nonha (@ManishNonha) April 18, 2023 చదవండి: పిచ్చి ప్రవర్తన.. హీరో కాస్త విలన్ అయిపోతున్నాడు! 'ఎగతాళి చేసినోళ్లే మెచ్చుకుంటున్నారు' -
'ఎగతాళి చేసినోళ్లే మెచ్చుకుంటున్నారు'
ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో గెలిచి సీజన్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. పెద్దగా అనుభవం లేకపోయినప్పటికి కెప్టెన్ రోహిత్ శర్మ ఆఖరి ఓవర్లో బంతిని అర్జున్ టెండూల్కర్ చేతికి ఇచ్చాడు. అయితే కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ అద్భుతంగా బౌలింగ్ చేసిన అర్జున్ ఒక వికెట్ తీసుకొని నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాదు భువనేశ్వర్‌ను ఔట్ చేసిన అర్జున్ తన ఖాతాలో తొలి వికెట్‌ను వేసుకున్నాడు. అర్జున్ ప్రదర్శనపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఒకప్పుడు క్రికెటర్‌గా పనికిరాడు అని ఎగతాళి చేసినవాళ్లే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. తాజాగా పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా అర్జున్ టెండూల్కర్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. ''చాలా మంది అర్జున్ను బంధుప్రీతి అంటూ ఎగతాళి చేశారు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో అద్బుతంగా బౌలింగ్ చేసి తానేంటో నిరూపించుకున్నాడు. పెద్దగా అనుభవం లేనప్పటికి ఆఖరి ఓవర్లో సూపర్ బౌలింగ్ చేసి కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. అర్జున్‌కు అభినందనలు. అర్జున్ ప్రదర్శన పట్ల సచిన్ కచ్చితంగా గర్వించాలి.'' అని పేర్కొంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ 40 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 60 పరుగులు నాటౌట్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిలక్ వర్మ 17 బంతుల్లో 37 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. ఇషాన్ కిషన్ 38 పరుగులు చేశాడు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్ అయింది. మయాంక్ అగర్వాల్ 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్లాసెన్ 36, మార్క్రమ్ 22 పరుగులు చేసి ఔటయ్యారు. Many mocked him for nepotism but tonight he has shown his spot is well earned 👏 Congrats Arjun. @sachin_rt you must be so proud #Arjuntendulkar #SRHvsMI #TATAIPL2023 — Preity G Zinta (@realpreityzinta) April 18, 2023 చదవండి: పరుగెత్తడంలో అలసత్వం.. కర్మ ఫలితం అనుభవించాల్సిందే #Tilak Varma: ఉన్నది కాసేపే.. కానీ దడదడలాడించాడు -
పరుగెత్తడంలో అలసత్వం.. కర్మ ఫలితం అనుభవించాల్సిందే
ఎస్ఆర్హెచ్ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్లా తయారయ్యాడు. కనీసం పరిగెత్తడంలోనూ అలసత్వం ప్రదర్శించడంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. విషయంలోకి వెళితే.. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ జాసన్ బెహండార్ఫ్ వేశాడు. అప్పటికే రెండు ఫోర్లతో సుందర్ టచ్‌లో కనిపించాడు. Photo: IPL Twitter ఓవర్ ఐదో బంతిని ఫుల్‌టాస్ వేయగా సుందర్ మిడాఫ్ దిశగా డ్రిల్ చేశాడు. సింగిల్‌కు ప్రయత్నించిన సుందర్ మొదట్లో వేగంగానే పరిగెత్తుకు వచ్చాడు. బంతిని అందుకున్న ఫీల్డర్ టిమ్ డేవిడ్ నేరుగా బంతిని డైరెక్ట్ త్రో వేశాడు. మరి డేవిడ్ వేసిన బంతి వికెట్లకు తాకదనుకున్నాడో.. తాను ఔట్ కానని నమ్మకమో తెలియదు కానీ క్రీజుకు అడుగు దూరంలో నిర్లక్ష్యం ప్రదర్శించాడు. ఆ నిర్లక్ష్యమే సుందర్‌ను దెబ్బకొట్టింది. రిప్లేలో సుందర్ క్రీజులోకి వచ్చేలోపే టిమ్ డేవిడ్ వేసిన త్రో డైరెక్ట్‌గా వికెట్లను తాకింది. పరిగెత్తడంలో అలసత్వం ప్రదర్శించిన సుందర్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ గుప్పుమన్నాయి. బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నావు.. పరిగెత్తడంలో ఇంత నిర్లక్ష్యమా.. కర్మ ఫలితం అనుభవించాల్సిందే. అంటూ ద్వజమెత్తారు. Extreme sloppy and lazy running from Washington Sundar! When you are hitting the ball so well, why to get run out like that!!#RohitSharma𓃵 #ViratKohli𓃵 #MSDhoni𓃵 #washingtonsundar #Sundar #SRHvsMI #TATAIPL2023 #Rohit #IPLOnStar #IPL2O23 #kavyamaran pic.twitter.com/H0LtWKJcPV — Cricket Fanatic (@CricketFanati20) April 18, 2023 చదవండి: #Tilak Varma: ఉన్నది కాసేపే.. కానీ దడదడలాడించాడు -
'గుడ్డిగా నమ్మడమేనా.. సొంత నిర్ణయం లేదా!'
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పట్టు బిగించింది. 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ చేధనలో తడబడుతోంది. 84 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే రివ్యూ విషయంలో ఇషాన్ కిషన్‌ను గుడ్డిగా నమ్మి చేతులు కాల్చుకున్నాడు రోహిత్ శర్మ. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్‌లో 9వ ఓవర్లో గ్రీన్ వేసిన మూడో బంతి లెగ్‌సైడ్ వెళ్లింది. క్లియర్‌గా వైడ్ అని తెలుస్తున్నప్పటికి ఇషాన్ ఔట్ అంటూ అప్పీల్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ వైడ్ సిగ్నల్ ఇచ్చినప్పటికి ఇషాన్ మాత్రం తనకు సౌండ్ వినిపించిందని.. కచ్చితంగా ఔట్ అంటూ బలంగా పేర్కొన్నాడు. అయితే రోహిత్‌కు వైడ్ అని తెలుస్తున్నప్పటికి ఇషాన్‌పై నమ్మకంతో రివ్యూకు వెళ్లాడు. అల్ట్రాఎడ్ఝ్లో బంతి ఎక్కడ బ్యాట్‌కు తగలకపోగా.. దూరంగా వెళుతున్నట్లు క్లియర్‌గా కనిపించింది. దీంతో ముంబై రివ్యూ కోల్పోయింది. అంతే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను అభిమానులు ట్రోల్ చేశారు. ''ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మడమేనా.. నీకంటూ సొంత నిర్ణయం లేదా''.. ''అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఎన్నోసార్లు ఇతరుల మీద ఆధారపడి చేతులు కాల్చుకున్నావు.. ఇప్పుడు ఐపీఎల్లో కూడా అదే పరిస్థితి''.. ''క్లియర్ వైడ్ అని నీకు తెలిసినప్పటికి అనవసరంగా రివ్యూకు వెళ్లావు.. కెప్టెన్‌గా ఇదేనా నీ అనుభవం'' అంటూ కామెంట్లు చేశారు. #ishankishan wasting DRS since childhood 😂😂😂 3/3 wrong referrals#MIvsSRH #IPL2023 pic.twitter.com/GPjLBPvPI4 — Rahul Batra (@rulebreaker_rb) April 18, 2023 -
#Tilak Varma: ఉన్నది కాసేపే.. కానీ దడదడలాడించాడు
ముంబై ఇండియన్స్ బ్యాటర్.. తెలుగు తేజం నంబూరి తిలక్ వర్మ తన హోంగ్రౌండ్ హైదరాబాద్‌లో దుమ్మురేపాడు. మంగళవారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో క్రీజులో ఉన్నది కాసేపే అయినప్పటికి తన బ్యాటింగ్‌తో దడదడలాడించాడు. 17 బంతుల్లో 37 పరుగులు చేసిన తిలక్ వర్మ ఇన్నింగ్స్‌లో 4 సిక్సర్లు, రెండు ఫోర్లు ఉండడం విశేషం. Photo: IPL Twitter తిలక్ వర్మ ఆడుతున్నది ముంబై ఇండియన్స్‌కు అయినప్పటికి హోంగ్రౌండ్లో అతనికి మంచి సపోర్ట్ లభించింది. తిలక్ ఆడుతున్నంత సేపు కొట్టేది ఎస్ఆర్హెచ్పై అయినప్పటికి మ్యాచ్‌కు వచ్చిన అభిమానులు మాత్రం తిలక్ వర్మ ఆటను చూపి ఉప్పొంగిపోయారు. అతను సిక్సర్లు, బౌండరీలు కొట్టినప్పుడల్లా ఎస్ఆర్హెచ్ జెండాలతోనే చీర్ చేయడం ఆసక్తిని కలిగించింది. ఇక తిలక్ వర్మ ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌కు కీలక బ్యాటర్‌గా ఉన్నాడు. ఈ సీజన్లో ముంబై తరపున 214 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అతని ఖాతాలో ఒక అర్థసెంచరీ ఉంది. కాగా తిలక్ వర్మ స్వస్థలం హైదరాబాద్ కాగా.. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ఆడడానికి వచ్చిన ముంబై ఇండియన్స్ జట్టు తిలక్ వర్మ ఇంట్లో సరదాగా గడిపిన సంగతి తెలిసిందే. చదవండి: స్టన్నింగ్ క్యాచ్‌తో అరుదైన జాబితాలో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ -
రోహిత్ రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో నాలుగో ఆటగాడిగా
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్లో ఆరువేల పరుగులు మైలురాయిని చేరుకున్నాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహత్ ఈ ఫీట్ సాధించాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఆరువేల పరుగుల మార్క్‌ను అందుకున్న నాలుగో ఆటగాడిగా హిట్‌మ్యాన్ నిలిచాడు. రోహిత్‌కు ఆరువేల పరుగులు చేరుకోవడానికి 226 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. కాగా రోహిత్ కంటే ముందు కోహ్లి(186 ఇన్నింగ్స్‌లు), శిఖర్ ధావన్(199 ఇన్నింగ్స్‌లు), డేవిడ్ వార్నర్(165 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు. ఇక ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో కోహ్లి 6844 పరుగులు(228 మ్యాచ్‌లు), శిఖర్ ధావన్ 6477 పరుగులు(210 మ్యాచ్‌లు) రెండో స్థానంలో, మూడో స్థానంలో డేవిడ్ వార్నర్ 6109 పరుగులు(167 మ్యాచ్‌లు), రోహిత్ శర్మ 6014 పరుగులు(232 మ్యాచ్‌లు) ఉన్నారు. Rohit Sharma is only the third Indian to score 6,000 IPL runs! #IPL2023 pic.twitter.com/F7B7hXacu3 — Wisden India (@WisdenIndia) April 18, 2023 -
రోహిత్ ఔట్.. బుంగమూతి పెట్టిన రితికా
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఇవాళ ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆడుతున్నాయి. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ ఆడేందుకు వచ్చిన ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. 18 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 28 పరుగులు చేశాడు. Photo: IPL Twitter మంచి టచ్‌లో ఉన్న రోహిత్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో నటరాజన్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి మిడాఫ్‌లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. భాగ్యనగరంలో భర్త ఆటను ఎంజాయ్ చేద్దామని వచ్చిన రితికాకు నిరాశే మిగిలింది. రోహిత్ ఔట్ కాగానే బుంగమూతి పెట్టింది. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Ritika Sajdeh's reaction on Rohit Sharma dismissal. pic.twitter.com/MmYVkOf5Lr — CricketGully (@thecricketgully) April 18, 2023 -
ఎస్ఆర్హెచ్ 178 ఆలౌట్.. 14 పరుగుల తేడాతో ముంబై గెలుపు
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్ అయింది. మయాంక్ అగర్వాల్ 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్లాసెన్ 36, మార్క్రమ్ 22 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా, రిలే మెరిడిత్, జాసన్ బెహండార్ఫ్లు తలా రెండు వికెట్లు తీయగా.. అర్జున్ టెండూల్కర్, కామెరాన్ గ్రీన్ చెరొక వికెట్ పడగొట్టారు. ఆరో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఓటమి దిశగా పయనిస్తోంది. మయాంక్ అగర్వాల్(48), క్లాసెన్(36) వెనువెంటనే ఔట్ కావడంతో ఎస్ఆర్హెచ్ 132 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. అబ్దుల్ సమద్1, మార్కో జాన్సెన్ (0) క్రీజులో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ అభిషేక్ శర్మ(1) రూపంలో ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. పియూష్ చావ్లా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 8 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 64/2 8 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 28, మార్క్రమ్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండు వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. 4 ఓవర్లలో 26/2 4 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. మయాంక్ ఆరు పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు హ్యారీ బ్రూక్ 9, రాహుల్ త్రిపాఠి ఏడు పరుగులు చేసి బెండార్ఫ్ బౌలింగ్‌లో వెనుదిరిగారు. ఎస్ఆర్హెచ్ టార్గెట్ 193.. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ 40 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 60 పరుగులు నాటౌట్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిలక్ వర్మ 17 బంతుల్లో 37 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. ఇషాన్ కిషన్ 38 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు వికెట్లు తీయగా.. నటరాజన్, భువనేశ్వర్ చెరొక వికెట్ తీశారు. ఫిఫ్టీతో మెరిసిన గ్రీన్.. ముంబై 172/4 ముంబై బ్యాటర్ కామెరాన్ గ్రీన్ ఫిఫ్టీతో మెరిశాడు. 33 బంతుల్లో 5ఫోర్లు, సిక్సర్ సాయంతో అర్థసెంచరీ సాధించాడు. కాగా గ్రీన్‌కు ఇదే తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ. ప్రస్తుతం ముంబై 18 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. గ్రీన్ 58, టిమ్ డేవిడ్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. దంచి కొడుతున్న తిలక్ వర్మ.. 16 ఓవర్లలో 144/3 హోంగ్రౌండ్లో తిలక్ వర్మ దుమ్మురేపుతున్నాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఉతికారేస్తూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. 16 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ మూడు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. తిలక్ వర్మ 15 బంతుల్లో 31 బ్యాటింగ్, గ్రీన్ 38 బ్యాటింగ్ క్రీజులో ఉన్నారు. మార్క్రమ్ స్టన్నింగ్ క్యాచ్.. సూర్య(7) ఔట్ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ముంబై మూడో ఇకెట కోల్పోయింది. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో షాట్ ఆడే ప్రయత్నంలో మార్క్రమ్ స్టన్నింగ్ క్యాచ్‌తో వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై 12 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. గ్రీన్ 21, తిలక్ వర్మ క్రీజులో ఉన్నారు. 9 ఓవర్లలో ముంబై 69/1 9 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 25, కామెరాన్ గ్రీన్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 28 పరుగులు చేసిన రోహిత్ శర్మ నటరాజన్ బౌలింగ్‌లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రోహిత్ శర్మ(28) ఔట్.. తొలి వికెట్ డౌన్ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన రోహిత్ శర్మ నటరాజన్ బౌలింగ్‌లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. 3 ఓవర్లలో ముంబై ఇండియన్స్ స్కోరెంతంటే? మూడు ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 19, ఇషాన్ కిషన్ 8 పరుగులతో ఆడుతున్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 16వ సీజన్ 25వ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ ఎదురుపడుతున్నాయి. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ రెండు జట్లు ఓటములతోనే సీజన్‌ను ప్రారంభించాయి. ఆ తర్వాత పుంజుకుని వరుసగా రెండు విజయాలు నమోదు చేసిన ఇరుజట్లు హ్యాట్రిక్ విజయంపై కన్నేశాయి. #TheOrangeArmy skipper Aiden Markram elects to field first after winning the toss in Hyderabad 🤩 Watch #SRHvMI -LIVE & FREE with #IPLonJioCinema across all telecom operators 👈#IPL2023 #TATAIPL | @SunRisers @AidzMarkram pic.twitter.com/wW3pe1MV2e — JioCinema (@JioCinema) April 18, 2023 సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్ ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, అర్జున్ టెండూల్కర్, నేహాల్ వధేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్ ఇక సొంత గ్రౌండ్లో ఆడుతుండడం ఎస్ఆర్హెచ్కు పెద్ద బలం అని చెప్చొచ్చు. పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసిన మార్క్రమ్ సేన ముంబై పట్టు పట్టేందుకు సిద్ధమైంది. గత మ్యాచ్‌లో కోల్‌కతాకు షాకిచ్చిన ముంబై అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. దాంతో, ఎవరిది పై చేయి కానుంది అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఇరుజట్ల గత రికార్డులు పరిశీలిస్తే 19 మ్యాచ్‌లు జరగ్గా.. పదింటిలో ముంబై నెగ్గగా.. తొమ్మిది మ్యాచ్‌ల్లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. -
నితీష్ రాణా దెబ్బకు ఉమ్రాన్ మాలిక్‌కు చుక్కలు
-
ఐపీఎల్ 2023లో తొలి రికార్డ్ క్రియేట్ చేసిన బ్రూక్
-
మయాంక్ అగర్వాల్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
-
గెలిచారు.. కానీ తప్పిదాలు చాలానే
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ రెండో విజయాన్నినమోదు చేసింది. శుక్రవారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 20 పరుగుల తేడాతో గెలిచింది. అయితే మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ గెలిచినప్పటికి చాలా లోపాలు ఉన్నాయి. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో బౌలింగ్ సంగతి పక్కనబెడితే ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ మాత్రం దారుణంగా ఉందని చెప్పొచ్చు. సులువైన క్యాచ్‌లు వదిలేయడంతో పాటు రనౌట్ చాన్స్‌లు కూడా మిస్ చేశారు. కేకేఆర్ ముందు 229 పరుగులు కష్టసాధ్యమైన లక్ష్యం ఉంది కాబట్టే ఎస్ఆర్హెచ్ గెలిచింది అనుకోవచ్చు. అటు ఇటుగా టార్గెట్ 200 ఉండుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ కచ్చితంగా ఓడిపోయి ఉండేది. రానున్న మ్యాచ్‌ల్లో ఫీల్డింగ్, బౌలింగ్ లాంటి అంశాల్లో మెరుగుపడాల్సిన అవసరం చాలా ఉంది. ఇక హ్యారీ బ్రూక్ సీజన్లో తొలి సెంచరీ నమోదు చేయడం.. కెప్టెన్ మార్క్రమ్ హఫ్ సెంచరీ చేయడం.. అభిషేక్ శర్మ మంచి స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయడం చూస్తుంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్‌కు తిరుగుండదనిపిస్తుంది. మయాంక్ అగర్వాల్ గాడిలో పడితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనఫ్ మరింత పటిష్టంగా తయారవుతుంది. ఇదే జోష్‌ను వచ్చే మ్యాచ్‌ల్లోనూ కంటిన్యూ చూస్తే ఎస్ఆర్హెచ్ టైటిల్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. -
అంతా బాగానే ఉంది.. ఆ బలహీనతను అధిగమిస్తే తిరుగుండదు
ఐపీఎల్ 16వ సీజన్లో హ్యారీ బ్రూక్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్లో తొలి సెంచరీ నమోదు చేయడంతో పాటు డెబ్యూ ఐపీఎల్ ఆడుతున్న బ్రూక్‌కు ఇదే తొలి సెంచరీ. 55 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో సెంచరీ మార్క్ అందుకున్న హ్యారీ బ్రూక్ ఆటపై అన్నివైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. సెంచరీ మాట అటుంచితే ఒక్క విషయంలో మాత్రం బ్రూక్ వెనుకబడ్డాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో స్పిన్ ఆడడంలో తెగ ఇబ్బంది పడ్డాడు. పేస్ బౌలర్లను ఉతికారేసిన బ్రూక్ స్పిన్నర్ల బౌలింగ్‌లో మాత్రం కాస్త స్లోగా ఆడాడు. పేసర్ల బౌలింగ్‌లో అతని స్ట్రైక్‌రేట్ 258 ఉంటే.. స్పిన్నర్ల బౌలింగ్‌లో అతని స్ట్రైక్‌రేట్ 117గా ఉండడం గమనార్హం. ఒకవేళ వచ్చే మ్యాచ్‌ల్లో బ్రూక్ స్పిన్ ఆడడంపై దృష్టి పెడితే అతనికి తిరుగుండదు. ఎలాగూ పేసర్ల బౌలింగ్‌ను చీల్చిచెండాడుతున్నాడు. ఇక హ్యారీ బ్రూక్‌కు ఇదే తొలి ఐపీఎల్ సీజన్. టెస్టు మ్యాచ్‌ల్లో మంచి రికార్డు ఉన్నప్పటికి ఒక్కసారి కుదురుకున్నాడంటే ఔట్ చేయడం చాలా కష్టం. పరిస్థితులు అలవాటు పడేవరకు ఏ క్రికెటర్‌కైనా పరుగులు చేయడం కాస్త ఇబ్బందే. హ్యారీ బ్రూక్ ఆ ఫేజ్‌ను అనుభవించాడు. ప్రస్తుతం దాని నుంచి బయటపడ్డాడు. ఫలితం.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఏకంగా సెంచరీతో మెరిసి విమర్శకుల నోళ్లు మూయించాడు. చదవండి: 'గర్ల్‌ఫ్రెండ్ మాత్రమే ఇక్కడుంది.. అందరూ వెళ్లిపోయారు' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'గర్ల్‌ఫ్రెండ్ మాత్రమే ఇక్కడుంది.. అందరూ వెళ్లిపోయారు'
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ హ్యారీ బ్రూక్ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో తొలి సెంచరీ బ్రూక్ దే. 55 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో వంద పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడినప్పటికి పేసర్ల బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ ఊచకోత కోశాడు. హ్యారీ బ్రూక్ ఇన్నింగ్స్‌ను చూసిన అతని గర్ల్‌ఫ్రెండ్ చప్పట్లతో అభినందించడం వైరల్‌గా మారింది. ఇక ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ అనంతరం హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. ''స్పిన్ ఆడడంలో కాస్త ఇబ్బందికి గురైన మాట వాస్తవమే. కానీ పవర్‌ప్లేను వీలైనంత మేర సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నా. ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో స్ట్రైక్ రొటేట్ చేస్తూ మార్క్రమ్, అభిషేక్ శర్మలకు సహకరించా. వాళ్లు ఔటైన తర్వాత ఆ బాధ్యతను నేను తీసుకున్నా. బాగా ఆడాలని మాత్రమే అనుకున్నా.. కానీ ఇలా సెంచరీ చేస్తానని ఊహించలేదు. నా వంతు పాత్ర పోషించా.. ఇంకా మ్యాచ్ మిగిలే ఉంది. మా బౌలర్లు ఏం చేస్తారో చూడాలి. నేను ఐపీఎల్ ఆడుతున్నానని తెలిసి ఫ్యామిలీ మొత్తం వచ్చింది. కొన్ని కారణాల రిత్యా వాళ్లు వెళ్లిపోయారు.. కానీ నా గర్ల్‌ఫ్రెండ్ మాత్రం ఇక్కడే ఉంది. నా ఇన్నింగ్స్‌ను బాగా ఎంజాయ్ చేసింది. ఈరోజు నా ప్రదర్శనపై ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉందని భావిస్తున్నా'' అంటూ తెలిపాడు. 𝐘𝐞𝐫 𝐚 𝐰𝐢𝐳𝐚𝐫𝐝, 𝐇𝐚𝐫𝐫𝐲 🧙♂💫 Ladies & Gentlemen, the first 💯 of #IPL2023 🧡👏#KKRvSRH #HarryBrook #IPLonJioCinema #TATAIPL | @SunRisers pic.twitter.com/4nXzSi4ilV — JioCinema (@JioCinema) April 14, 2023 Harry Brook said, "my girlfriend is here, but the rest of the family just left. I knew this would happen as soon as they left I'll get some runs (laughs)". pic.twitter.com/TJatdittlh — Mufaddal Vohra (@mufaddal_vohra) April 14, 2023 -
హ్యారీ బ్రూక్ చరిత్ర.. ఐపీఎల్ 16వ సీజన్లో తొలి సెంచరీ
ఐపీఎల్ 2023 సీజన్లో తొలి సెంచరీ నమోదైంది. ఎస్ఆర్హెచ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. తాను ఆడుతున్న డెబ్యూ ఐపీఎల్‌లోనే సెంచరీ బాదిన క్రికెటర్‌గా హ్యారీ బ్రూక్ చరిత్రకెక్కాడు. 55 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న బ్రూక్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అయితే ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో 99 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ 92 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. ఇక హ్యారీ బ్రూక్ సెంచరీ.. ఓవరాల్‌గా ఐపీఎల్లో 76వది కావడం విశేషం. అయితే సీజన్లో తొలి మూడు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో విఫలమైన బ్రూక్ కేకేఆర్‌తో మ్యాచ్‌లో మాత్రం తన బ్యాటింగ్ పవరేంటో రుచి చూపించాడు. పేస్ బౌలర్లను ఉతికారేసిన బ్రూక్ స్పిన్నర్ల బౌలింగ్‌లో మాత్రం కాస్త స్లోగా ఆడాడు. పేసర్ల బౌలింగ్‌లో అతని స్ట్రైక్‌రేట్ 295 ఉంటే.. స్పిన్నర్ల బౌలింగ్‌లో అతని స్ట్రైక్‌రేట్ 95గా ఉండడం గమనార్హం. 𝐘𝐞𝐫 𝐚 𝐰𝐢𝐳𝐚𝐫𝐝, 𝐇𝐚𝐫𝐫𝐲 🧙♂💫Ladies & Gentlemen, the first 💯 of #IPL2023 🧡👏#KKRvSRH #HarryBrook #IPLonJioCinema #TATAIPL | @SunRisers pic.twitter.com/4nXzSi4ilV— JioCinema (@JioCinema) April 14, 2023 Harry Brook, turning out to be the 𝗦𝗮𝘂𝗰𝗲rer's stone 🪄 The 𝐌𝐀𝐈𝐃𝐄𝐍 𝐈𝐏𝐋 💯 we all waited for 😍 | @Harry_Brook_88 pic.twitter.com/BV5Hc2Nm17 — SunRisers Hyderabad (@SunRisers) April 14, 2023 -
#HarryBrook: 13.25 కోట్లు దండగన్నారు.. ఇప్పుడు చెప్పండి!
టెస్టులాడే ఆటగాడిని ఐపీఎల్‌కు తీసుకొచ్చారు.. 13.25 కోట్లు పెట్టి కొంటే దారుణంగా విఫలమవుతున్నాడు.. ఎస్ఆర్హెచ్ ఇలాంటి వారిని ఎందుకు కొనుగోలు చేస్తుందో అర్థం కాదు.. ఇవి తొలి మూడు మ్యాచ్‌ల్లో హ్యారీ బ్రూక్ విఫలమైనప్పుడు వచ్చిన విమర్శలు. సోషల్ మీడియాలో అయితే బ్రూక్‌ను దారుణంగా ట్రోల్ చేశారు. కానీ ఇవేవి పట్టించుకోకుండా కెప్టెన్ మార్క్రమ్ సహా ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ అతనిపై నమ్మకముంచింది. ఎట్టకేలకే శుక్రవారం(ఏప్రిల్ 14) కేకేఆర్‌తో మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ తన బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన బ్రూక్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. తనను విమర్శించిన వారికి బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. 32 బంతుల్లో ఐదు ఫోర్లు, 2 సిక్సర్లతో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. హ్యారీ బ్రూక్‌కు ఇదే తొలి ఐపీఎల్ సీజన్. టెస్టు మ్యాచ్‌ల్లో మంచి రికార్డు ఉన్నప్పటికి ఒక్కసారి కుదురుకున్నాడంటే ఔట్ చేయడం చాలా కష్టం. పరిస్థితులు అలవాటు పడేవరకు ఏ క్రికెటర్‌కైనా పరుగులు చేయడం కాస్త ఇబ్బందే. హ్యారీ బ్రూక్ ఆ ఫేజ్‌ను అనుభవించాడు. ప్రస్తుతం దాని నుంచి బయటపడ్డాడు. ఫలితం.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్‌తో మెరిశాడు. బ్రూక్ ఫామ్‌లోకి కాస్త అతన్ని ఆపడం ఎవరి తరం కాదు.. ఓపెనింగ్‌లో పంపింస్తే రాణించే అవకాశం ఉంటుంది అని ఒక మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యాయి. అందుకే ఓపిక ఉండడం చాలా అవసరం అని అంటారు. ఏమో బ్రూక్ ఇకపై తన విశ్వరూపం చూపించే అవకాశం ఉందేమో. ఇటీవలే ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ హ్యారీ బ్రూక్ తొలుత విఫలమయ్యాడు. ఒకసారి కుదురుకున్నాకా అతనికి అడ్డు లేకుండా పోయింది. పీఎస్ఎల్లో 10 మ్యాచ్‌లాడిన బ్రూక్ ఏడు ఇన్నింగ్స్‌లు ఆడి 262 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉండడం విశేషం. ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా ఓడుతుందా అన్నది పక్కనబెడితే.. బ్రూక్ లాంటి ఆటగాడు ఫామ్‌లోకి రావడం ఎస్ఆర్హెచ్కు కొండంత బలం. రానున్న మ్యాచ్‌ల్లో అతను కీలకంగా మారే అవకాశం ఉంది. -
హ్యారీ బ్రూక్ సెంచరీ.. 23 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ రెండో విజయాన్ని నమోదు చేసింది. 229 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. నితీష్రానా(41 బంతుల్లో 75 పరుగులు), రింకూ సింగ్(31 బంతుల్లో 58 పరుగులు) మినహా మిగతావారు రాణించడంలో విఫలమయ్యారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండేలు తలా రెండు వికెట్లు తీయగా.. నటరాజన్, భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్ తలా ఒక వికెట్ తీశారు. నితీష్ రానా ఔట్.. ఆరో వికెట్ కోల్పోయిన కేకేఆర్ ధాటిగా ఆడుతున్న నితీష్ రానా(41 బంతుల్లో 75 పరుగులు) నటరాజన్ బౌలింగ్‌లో సుందర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. విధ్వంసం సృష్టిస్తున్న నితీష్, రింకూ సింగ్.. 16 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ ఐదు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. నితీష్ రానా 38 బంతుల్లో 69 బ్యాటింగ్, రింకూ సింగ్ 18 బంతుల్లో 32 బ్యాటింగ్ విధ్వంసం సృష్టిస్తున్నారు. కేకేఆర్ గెలవాలంటే 24 బంతుల్లో 70 పరుగులు చేయాల్సి ఉంది. మరోసారి విఫలమైన రసెల్.. ఐదో వికెట్ కోల్పోయిన కేకేఆర్ కేకేఆర్ ఆల్‌రౌండర్ ఆండీ రసెల్ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతుంది. తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో మూడు పరుగులు మాత్రమే చేసి మయాంక్ మార్కండే బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో కేకేఆర్ 96 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్ భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్ తడబడుతుంది. ఎన్ జగదీశన్(36) రూపంలో కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం కేకేఆర్ 4 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. నితీష్ రానా 35, రసెల్ ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నారు. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ కష్టాల్లో పడింది. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. నితీష్ రాణా 2, ఎన్ జగదీషన్ 20 పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website హ్యారీ బ్రూక్ సెంచరీ.. కేకేఆర్ టార్గెట్ 229 కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ భారీ స్కోరు చేసింది. హ్యారీ బ్రూక్ 55 బంతుల్లో 100 నాటౌట్ సీజన్లో తొలి సెంచరీ నమోదు చేయడంతో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. మార్క్రమ్ 50, అభిషేక్ శర్మ 35 పరుగులతో రాణించారు. Photo Credit : IPL Website మార్క్రమ్(50) ఔట్.. ఎస్ఆర్హెచ్ 129/3 ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ తొలిసారి దూకుడు ప్రదర్శిస్తోంది. కెప్టెన్ మార్క్రమ్ 25 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. అయితే ఫిఫ్టీ కొట్టిన మరుసటి బంతికే వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ మూడు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. బ్రూక్ 53 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website 9 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 85/2 9 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. బ్రూక్ 45, మార్క్రమ్ 14 పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ మయాంక్ అగర్వాల్ మరోసారి విఫలమయ్యాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో 9 పరుగులు చేసిన మయాంక్ రసెల్ బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 46 పరుగులు చేసింది. Photo Credit : IPL Website 2 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 28/0 కేకేఆర్‌తో మ్యాచ్‌ను ఎస్ఆర్హెచ్ దూకుడుగా ఆరంభించింది. 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ 18, మయాంక్ అగర్వాల్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website టాస్ గెలిచిన కేకేఆర్ ఐపీఎల్ 16వ సీజన్ 19వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఢీ కొంటున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా ఉండనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్), మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌కీపర్), N జగదీసన్, నితీష్ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, సుయాష్ శర్మ, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి The 🪙 lands in favour of @KKRiders & they'll be BOWLING first in #KKRvSRH! Catch pulsating #TATAIPL action, LIVE & FREE, on JioCinema on all telecom operators!#IPLonJioCinema #IPL2023 | @SunRisers pic.twitter.com/8QeJTF05el — JioCinema (@JioCinema) April 14, 2023 ఇక వరుసగా రెండు మ్యాచుల్లో నెగ్గిన కోల్‌కతా హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉంది. మరోవైపు హోంగ్రౌండ్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి బోణీ కొట్టిన ఎస్ఆర్హెచ్ రెండో విజయంపై కన్నేసింది. దాంతో, పై చేయి సాధించే జట్టు ఏది అనేది? మరికొన్ని గంటల్లో తెలియనుంది. ఇక ఇరుజట్లు ఇప్పటిరకు 23 మ్యాచ్‌లు జరగ్గా.. కేకేఆర్ 15 సార్లు గెలుపొందితే.. ఎస్ఆర్హెచ్ 8సార్లు మాత్రమే నెగ్గింది. -
కేకేఆర్ వద్దన్నోడిని ఎస్ఆర్హెచ్ హత్తుకుంది.. ప్రతీకారం తీర్చుకునేనా?
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ తొలి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి(48 బంతుల్లో 74 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించి ఎస్ఆర్హెచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఇవాళ(శుక్రవారం) ఈడెన్ గార్డెన్స్ వేదివగా కేకేఆర్‌తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. అయితే ఇదే రాహుల్ త్రిపాఠి 2020 మెగావేలంలో కేకేఆర్ రూ.60 లక్షల కనీస ధరకే కొనుగోలు చేసింది. ఆ తర్వాత రెండేళ్ల పాటు కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక 2022లో మెగావేలానికి ముందు రాహుల్ త్రిపాఠిని వదిలేసింది. దీంతో వేలంలో ఎస్ఆర్హెచ్ రూ. 8.5 కోట్లు పెట్టి మరీ కొనుగోలు చేసింది. అయితే గత సీజన్లో రాహుల్ త్రిపాఠి అంతంత మాత్రంగానే ఆడాడు. అయితే తనపై నమ్మకముంచిన ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. తాజాగా తనను వద్దనుకున్న కేకేఆర్‌తో ఇవాళ రాహుల్ త్రిపాఠి మ్యాచ్ ఆడబోతున్నాడు. ఎస్ఆర్హెచ్ను గెలిపించి ఫామ్ మీదున్న రాహుల్ త్రిపాఠి తన ప్రతీకారం తీర్చుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారంది. ఇక రాహుల్ త్రిపాఠి ఇప్పటివరకు ఐపీఎల్లో 79 మ్యాచ్‌లాడి 1906 పరుగులు చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 93గా ఉంది. ఇక టీమిండియా తరపున 5 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ త్రిపాఠి 97 పరుగులు చేశాడు. -
హర్షా భోగ్లేకి ధావన్ సూపర్ పంచ్..
-
సరైన నిర్ణయం కాదు.. కానీ ప్రయోగం ఫలించింది
-
#KavyaMaran: 'చల్ హట్ రే'.. నీకు నేనే దొరికానా!
ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరుగుతుందంటే చాలు ఆటగాళ్ల కంటే ఒకరిమీదే కెమెరాలు ఎక్కువ ఫోకస్‌గా ఉంటాయి. ఈ పాటికే మీకు అర్థమైంది అనుకుంటా ఎవరనేది. అవునండీ ఆమె కావ్యా మారన్. ప్రతీ సీజన్లో ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా అక్కడ టక్కున వాలిపోయి వారిని ఉత్సాహపరుస్తుంది. జట్టు ఓడిపోతే తాను బాధపడుతుంది.. గెలిస్తే ఆ ఆనందాన్ని అందరితో పంచుకుంటుంది. అలాంటి కావ్యా మారన్‌కు ఇవాళ పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఒక కెమెరామన్ కోపం తెప్పించాడు. ఆ కోపానికి వేరే కారణం ఉంది లెండి. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ సమయంలో 88 పరుగులకే 9 వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ వంద పరుగులు కూడా చేయదని కావ్యా మారన్ తెగ సంతోషపడింది. కానీ కాసేపటికే సీన్ రివర్స్ అయింది. ధావన్ తన క్లాస్ ఆటతీరుతో ఆకట్టుకుంటుడడంతో కావ్యా మారన్‌కు ఫ్రస్టేషన్ పీక్స్‌కు చేరింది. ఇదే సమయంలో ఆమె స్టాండ్స్‌లో కూర్చొని సీరియస్‌గా మ్యాచ్ చూస్తున్న సమయంలో ఒక కెమెరామెన్ ఆమె వైపు కెమెరా తిప్పాడు. అది గమనించిన కావ్యా మారన్.. నీకు నేనే దొరికానా అన్నట్లుగా కోపంతో'' చల్ ..హట్ రే '' అని పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ 99 పరుగులతో అసమాన ఆటతీరు ప్రదర్శించి పంజాబ్‌కు 143 పరుగుల గౌరవప్రదమైన స్కోరును అందించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 17.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. Baby #kavyamaran 😂 To cameraman Hat rey 😹😹#SRHvPBKS pic.twitter.com/duImSUu5OZ — चयन चौधरी (@Chayanchaudhary) April 9, 2023 -
IPL 2023 SRH Vs PBKS: కావ్య పాప నవ్విందిరోయ్..
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఎస్ఆర్హెచ్కు మధ్యలో ధావన్ తన ఇన్నింగ్స్‌తో భయపెట్టినప్పటికి.. బ్యాటింగ్‌లో ఎలాంటి తడబాటుకు లోనవ్వకుండా 144 పరుగుల టార్గెట్‌ను చేధించింది. అయితే ఈ సీజన్లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఎదురైన ఓటములతో తెగ బాధపడిపోయిన ఫ్రాంచైజీ కో-ఓనర్ కావ్యా మారన్ ఎట్టకేలకు నవ్వింది. హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌కు హాజరైన ఆమె ఆద్యంతం జట్టును ఎంకరేజ్ చేస్తూ కనిపించింది. తొలుత బౌలర్లు చెలరేగి వికెట్లు తీయడంతో సంతోషంతో ఎగిరి గెంతులేసింది. ఆఖర్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడుతుంటే మొహం బిక్కముడుచుకు కూర్చొంది. 144 పరుగుల టార్గెట్‌ను ఎస్ఆర్హెచ్ చేధిస్తుందో లేదో అన్న టెన్షన్ ఆమె ముఖంలో క్లియర్‌గా కనిపించింది. అయితే రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ మార్ర్కమ్లు జట్టును విజయతీరాలకు చేర్చిన తర్వాత పట్టరాని సంతోషంతో ఆమె మొహంలో నవ్వులు విరపూశాయి. మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్ల వైపు సూపర్ అంటూ థంబ్స్ అప్(బొటనవేలు) చూపిస్తూ నవ్వడం హైలెట్‌గా నిలిచింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఎస్ఆర్హెచ్ ఓటములతో డీలా పడిన కావ్యా మారన్ ఎట్టకేలకు నవ్వడంతో అభిమానులు ఉప్పొంగిపోయారు. కావ్య పాప నవ్విందిరోయ్ అంటూ కామెంట్ చేశారు. Baby Kallalo ఆనందం 😘🥰@SunRisers 🥳#SRHvsPBKS #kavyamaran pic.twitter.com/fVOM5Q7Ro9 — Pavan 🏹 (@Pavan_BPN) April 9, 2023 𝗪𝗛𝗔𝗧 𝗔 𝗪𝗜𝗡!👌 👌 1⃣st victory of the #TATAIPL 2023 for @SunRisers as they beat #PBKS by 8⃣ wickets in Hyderabad 👏 👏 Scorecard 👉 https://t.co/Di3djWhVcZ #TATAIPL | #SRHvPBKS pic.twitter.com/DoAFIkaMgb — IndianPremierLeague (@IPL) April 9, 2023 -
'థాంక్స్ హైదరాబాద్'.. కోహ్లి రికార్డు బద్దలు
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ హైదరాబాద్ అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. ఆదివారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి ఆఖరి వరకు నిలిచి 66 బంతుల్లో 99 పరుగులు చేసిన ధావన్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఒకవైపు సహచరులు వెనుదిరుగుతున్నా తాను మాత్రం ఒంటరిపోరాటం చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. ఈ క్రమంలో ఒక్క పరుగు దూరంలో సెంచరీ మార్క్‌కు దూరమైనప్పటికి కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా 88 పరుగుల వద్ద పంజాబ్ తొమ్మిదో వికెట్ కోల్పోయాకా ధావన్.. ఆఖరి నెంబర్ బ్యాటర్‌తో కలిసి పదో వికెట్‌కు 55 పరుగులు అజేయంగా జోడించి చరిత్ర సృష్టించాడు. ఇక ఎస్ఆర్హెచ్పై 99 పరుగుల ఇన్నింగ్స్‌తో ధావన్ కోహ్లి రికార్డును బద్దలు కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన టీమిండియా ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు కోహ్లి ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు 50 సార్లు చేయగా.. తాజాగా ధావన్ కోహ్లి రికార్డును బద్దలుకొట్టి 51వ ఫిఫ్టీ ప్లస్ స్కోరు సాధించాడు. కాగా కోహ్లి 50- ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేయడానికి 216 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. ధావన్ మాత్రం 206 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇక తొలి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. వార్నర్ ఇప్పటివరకు ఐపీఎల్లో 60 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. ఇక తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం ధావన్ మాట్లాడుతూ.. ''హైదరాబాద్ ప్రజలు నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ అనుకుంటున్నా. ఒకవైపు వికెట్లు పడుతుండడంతో ఒకదశలో ఒత్తిడి అనిపించింది. కానీ ఏమైనా సరే చివరి వరకు నిలబడాలనుకున్నా.. అందుకే వికెట్ కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడాను. సెంచరీ మార్క్ మిస్ అవడం కంటే ఒక గొప్ప ఇన్నింగ్స్ ఆడానన్న సంతోషం ఎక్కువగా ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. Shikhar Dhawan said, "I'm glad that the Hyderabad crowd still remembers me". — Mufaddal Vohra (@mufaddal_vohra) April 9, 2023 -
Shikar Dhawan: టి20 కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్; పలు రికార్డులు బద్దలు
టీమిండియా గబ్బర్.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ తన టి20 కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి ఆఖరి వరకు నిలిచి 66 బంతుల్లో 99 పరుగులు చేసిన ధావన్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. కేవలం ఒక్క పరుగు దూరంలో సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయాడు. ఒకవైపు సహచరులు వెనుదిరుగుతున్నా తాను మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఇక 88 పరుగుల వద్ద పంజాబ్ తొమ్మిదో వికెట్ కోల్పోయిన తర్వాత ఆఖరి బ్యాట్స్‌మన్‌తో కలిసి ధావన్ 55 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే శిఖర్ ధావన్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ► ఐపీఎల్లో 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన బ్యాటర్ల జాబితాలో ధావన్ చోటు సంపాదించాడు. ఇంతకముందు సురేశ్‌రైనా (2013లో ఎస్ఆర్హెచ్పై), క్రిస్ గేల్(2019లో ఆర్సీబీపై), మయాంక్ అగర్వాల్(2021లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై) ఉండగా.. తాజాగా శిఖర్ ధావన్ వీరి సరసన చేరాడు. ► ఇక టి20 క్రికెట్లో పదో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన జంటగా ధావన్-మోహిత్ రాతే జోడి ఐదో స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో గ్రాంట్ ఇలియట్, జుల్ఫికర్ బాబర్ జోడి 63 పరుగులు(పీఎస్ఎల్ 2016, క్వెటా గ్లాడియేటర్స్ వర్సెస్ పెషావర్ జాల్మీ) ఉన్నారు. 62* - కేబీ అహిర్ & ఎన్ అహిర్, పనామా v అర్జెంటీనా, నార్త్ సౌండ్, 2021 61* - DJ వోరాల్ & DR బ్రిగ్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ vs హోబర్ట్ హరికేన్స్, హోబర్ట్, 2020 59 - స్ట్రీక్ & జేయి ఎవరైనా, వార్విక్షైర్ vs వోర్సెస్టర్షైర్, బర్మింగ్‌హామ్, 2005 55* - ఆర్ ఫ్రైలింక్ & పి సుబ్రాయెన్, డాల్ఫిన్స్ vs లాహోర్ లయన్స్, బెంగళూరు, 2014 ► ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి ఆఖరి వరకు నిల్చొని పదో నెంబర్ బ్యాటర్ వరకు అందరితో కలిసి ఆడిన రెండో ఆటగాడిగా ధావన్ అరుదైన రికార్డు సాధించాడు. ఇంతకముందు పార్థివ్ పటేల్ మాత్రమే 2019లో సీఎస్కే తరపున ఈ ఫీట్ సాధించాడు. Ek aur 𝐬𝐡𝐢𝐤𝐡𝐚𝐫 ki ore badhte hue 𝐆𝐚𝐛𝐛𝐚𝐫 💪 Shikhar Dhawan's 50 makes him the 🔝scoring batter of #TATAIPL2023 🙌 Keep watching #SRHvPBKS - LIVE & FREE on #JioCinema across all telecom operators 👈#IPLonJioCinema #IPL2023 #TATAIPL pic.twitter.com/kXyy1jPpMb — JioCinema (@JioCinema) April 9, 2023 -
IPL 2023 SRH Vs PBKS: ‘విన్’రైజర్స్...
Sunrisers Hyderabad vs Punjab Kings- సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ సీజన్లో రెండు వరుస ఓటముల తర్వాత సన్‌రైజర్స్ చెలరేగింది. హైదరాబాద్ జట్టు సంపూర్ణ ఆధిపత్యంతో కీలక విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శిఖర్ ధావన్ (66 బంతుల్లో 99 నాటౌట్; 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీకి దూరమయ్యాడు. మయాంక్ మర్కండే (4/15) కింగ్స్ పతనంలో కీలకపాత్ర పోషించాడు. అనంతరం సన్‌రైజర్స్ 17.1 ఓవర్లలో 2 వికెట్లకు 145 పరుగులు చేసి గెలిచింది. రాహుల్ త్రిపాఠి (48 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెపె్టన్ మార్క్రమ్ (21 బంతుల్లో 37 నాటౌట్; 6 ఫోర్లు) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 52 బంతుల్లోనే 100 పరుగులు జోడించారు. శిఖర్ మినహా... ఒక ఎండ్‌లో ధావన్ పట్టుదలగా చివరి వరకు నిలబడగా, మరో ఎండ్ నుంచి కనీసం సహకారం లేకపోవడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించలేకపోయింది. ఇన్నింగ్స్ తొలి బంతికి ప్రభ్‌సిమ్రన్ (0)ను అవుట్ చేసి భువనేశ్వర్ మొదటి దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత జాన్సెన్ తన వరుస ఓవర్లలో మాథ్యూ షార్ట్ (1), జితేశ్ శర్మ (4)లను అవుట్ చేయడంతో జట్టు 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. స్యామ్ కరన్ (15 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్) కొద్దిసేపు ధావన్‌కు అండగా నిలిచాడు. అయితే ఆ తర్వాత పంజాబ్ టపటపా వికెట్లు కోల్పోయింది. 35 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 6 వికెట్లు చేజార్చుకుంది. దాంతో స్కోరు 88/9 వద్ద నిలిచింది. పంజాబ్ 100 పరుగులు చేయడం కూడా సందేహంగానే అనిపించింది. అయితే ఈ దశలో ధావన్ తను అనుభవాన్నంతా రంగరించి బాధ్యతను తీసుకున్నాడు. ఈ సమయంలో ధావన్ 47 పరుగుల వద్ద (38 బంతుల్లో) ఉన్నాడు. ఆపై చెలరేగిపోయిన అతను తర్వాతి 28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో మరో 52 పరుగులు సాధించడం విశేషం. చివరి వికెట్‌కు ధావన్, మోహిత్ రాఠీ 55 పరుగులు జోడించగా, అందులో 52 ధావనే చేశాడు. భారీ భాగస్వామ్యం... ఛేదనలో రైజర్స్‌కు పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు. ఓపెనర్లు బ్రూక్ (13), మయాంక్ అగర్వాల్ (21) ఫర్వాలేదనిపించడంతో పవర్‌ప్లేలో స్కోరు 34 పరుగులకు చేరింది. వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా... త్రిపాఠి, మార్క్రమ్ కలిసి సునాయాసంగా జట్టును విజయం దిశగా నడిపించారు. పంజాబ్ బౌలర్లు ఎంతగా శ్రమించినా ఈ జోడీని ఇబ్బంది పెట్టలేకపోయారు. వరుస ఫోర్లతో దూకుడు ప్రదర్శించిన త్రిపాఠి 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎలిస్ ఓవర్లో మార్క్రమ్ నాలుగు ఫోర్లు కొట్టడంతో హైదరాబాద్ గెలుపు ఖాయమైంది. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్‌సిమ్రన్ (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 0; ధావన్ (నాటౌట్) 99; షార్ట్ (ఎల్బీ) (బి) జాన్సెన్ 1; జితేశ్ (సి) మార్క్రమ్ (బి) జాన్సెన్ 4; కరన్ (సి) భువనేశ్వర్ (బి) మర్కండే 22; రజా (సి) మయాంక్ (బి) ఉమ్రాన్ 5; షారుఖ్ (ఎల్బీ) (బి) మర్కండే 4; హర్‌ప్రీత్ (బి) ఉమ్రాన్ 1; చహర్ (ఎల్బీ) (బి) మర్కండే 0; ఎలిస్ (బి) మర్కండే 0; రాఠీ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు 143). వికెట్ల పతనం: 1–0, 2–10, 3–22, 4–63, 5–69, 6–74, 7–77, 8–78, 9–88. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–33–1, జాన్సెన్ 3–1–16–2, నటరాజన్ 4–0–40–0, సుందర్ 1–0–6–0, మర్కండే 4–0–15–4, ఉమ్రాన్ 4–0–32–2. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: బ్రూక్ (బి) అర్ష్ దీప్ 13; మయాంక్ (సి) కరన్ (బి) చహర్ 21; త్రిపాఠి (నాటౌట్) 74; మార్క్రమ్ (నాటౌట్) 37; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (17.1 ఓవర్లలో 2 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1–27, 2–45. బౌలింగ్: స్యామ్ కరన్ 3–0–14–0, అర్ష్ దీప్ 3–0–20–1, హర్‌ప్రీత్ 3.1–0–26–0, ఎలిస్ 3–0–28–0, రాహుల్ చహర్ 3–0–28–1, రాఠీ 2–0–29–0. 𝗪𝗛𝗔𝗧 𝗔 𝗪𝗜𝗡!👌 👌 1⃣st victory of the #TATAIPL 2023 for @SunRisers as they beat #PBKS by 8⃣ wickets in Hyderabad 👏 👏 Scorecard 👉 https://t.co/Di3djWhVcZ #TATAIPL | #SRHvPBKS pic.twitter.com/DoAFIkaMgb — IndianPremierLeague (@IPL) April 9, 2023