IPL 2023 SRH Vs RCB: IPL 2023: కోహ్లి సెంచరీ.. ఆర్‌సీబీ ఘన విజయం

IPL 2023: SRH Vs RCB Match Live Updates-Highlights - Sakshi

IPL 2023: SRH Vs RCB Match Live Updates:

ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 19.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. కోహ్లి 61 బంతుల్లో శతకంతో వీరవిహారం చేయగా.. డుప్లెసిస్‌ 47 బంతుల్లో 71 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో విజయంతో ఆర్‌సీబీ రన్‌రేట్‌ను మరింత మెరుగుపరుచుకుంది. 

13 ఓవర్లలో ఆర్‌సీబీ 117/0
ఆర్‌సీబీ 13 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 117 పరుగులు చేసింది. కోహ్లి 64, డుప్లెసిస్‌ 54 పరుగులతో ఆడుతున్నారు.

కోహ్లి, డుప్లెసిస్‌ అర్థశతకాలు..  ఆర్‌సీబీ 108/0
ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ టార్గెట్‌ దిశగా సాగుతుంది. కోహ్లి, డుప్లెసిస్‌లు అర్థశతకాలతో చెలరేగడంతో ఆర్‌సీబీ 12 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 108 పరుగులు చేసింది.

దంచుతున్న కోహ్లి, డుప్లెసిస్‌.. ఆర్‌సీబీ 90/1
187 పరుగుల పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ దూకుడుగా ఆరంభించింది. కోహ్లి 46, డుప్లెసిస్‌ 42 పరుగులతో చెలరేగి ఆడుతున్నారు. ప్రస్తుతం ఆర్‌సీబీ 9 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 90 పరుగులు చేసింది.

ఆర్‌సీబీ టార్గెట్‌ 187..
ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ 51 బంతుల్లో 104 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. హ్యారీ బ్రూక్‌ 27 పరుగులు చేశాడు. ఆర్‌సీబీ బౌలర్లలో మైకెల్‌ బ్రాస్‌వెల్‌ రెండు వికెట్లు తీయగా.. సిరాజ్‌, హర్షల్‌పటేల్‌, షాబాజ్‌ అహ్మద్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

క్లాసెన్‌ సెంచరీ.. ఎస్‌ఆర్‌హెచ్‌ 19 ఓవర్లలో 182/4
19 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్‌ నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ 49 బంతుల్లో శతకం సాధించాడు. 51 బంతుల్లో 104 పరుగులు చేసిన క్లాసెన్‌ హర్షల్‌పటేల్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 

క్లాసెన్‌ ఫిఫ్టీ.. 11 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ 95/2
11 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్‌ రెండు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ 24 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ అందుకోగా.. మార్క్రమ్‌ 16 పరుగులతో ఆడుతున్నాడు.

33 పరుగులకే రెండు వికెట్లు డౌన్‌
ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మైకెల్‌ బ్రాస్‌వెల్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడం విశేషం. తొలుత 11 పరుగులు చేసిన అభిషేక్‌ శర్మను క్లీన్‌బౌల్డ్‌ చేసిన బ్రాస్‌వెల్‌.. ఆ తర్వాత 15 పరుగులు చేసిన రాహుల్‌ త్రిపాఠిని క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్‌ చేర్చాడు. 

4 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ 27/0
4 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్‌ వికెట్‌ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ 11, రాహుల్‌ త్రిపాఠి 15 పరుగులతో ఆడుతున్నారు.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆర్‌సీబీ
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా గురువారం 65వ మ్యాచ్‌లో హైదరాబాద్‌ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌, ఆర్‌సీబీ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన  ఆర్‌సీబీ బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ కన్నా ఆర్‌సీబీకి చాలా కీలకం. ప్లేఆఫ్‌ చేరాలంటే మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలవడం తప్పనిసరి. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌ కీపర్‌), హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, కార్తీక్ త్యాగి, మయాంక్ డాగర్, భువనేశ్వర్ కుమార్, నితీష్ రెడ్డి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్ (వికెట్‌ కీపర్‌), షాబాజ్ అహ్మద్, మైకేల్ బ్రేస్‌వెల్, వేన్ పార్నెల్, హర్షల్ పటేల్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top