#AidenMarkram: 'ఏందయ్యా మార్క్రమ్‌.. కెప్టెన్‌ అయ్యుండి ఉమ్రాన్‌ విషయం తెలియదంటావ్‌!'

Markram Reply On Pacer-Umran Malik Absense Dont Know Whats Happening - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో జట్టుగా ప్లే ఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఆరంభం నుంచే మెరుగైన ఆటతీరును కనబరచని ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అ‍న్ని విభాగాల్లో విఫలమైంది. ఎయిడెన్‌ మార్క్రమ్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినా ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటతీరులో పెద్దగా మార్పు లేదు.  క్లాసెన్‌ మినహా జట్టులో స్థిరమైన బ్యాటింగ్‌ చేసిన ఆటగాడు ఒక్కడు కనిపించలేదు. బౌలింగ్‌ విభాగం కూడా అంతంతమాత్రమే.

తాజాగా ఆర్‌సీబీతో మ్యాచ్‌ సందర్భంగా..  టాస్‌ సమయంలో ఉమ్రాన్‌ మాలిక్‌ విషయంలో ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ మార్క్రమ్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగించాయి. మొన్నటికి మొన్న తప్పుడు షీట్‌ సమర్పించి ఒక ఆటగాడి డెబ్యూ చేయకపోవడానికి కారణమయ్యాడు.

ఇక టాస్‌ సమయంలో తుది జట్టు విషయంపై స్పందించాడు. ''హ్యారీ బ్రూక్‌ తుది జట్టులోకి వచ్చాడు. కార్తిక్‌ త్యాగి, నితీశ్‌లు అరంగేట్రం చేశారు అని తెలిపాడు. అయితే ఉమ్రాన్‌ మాలిక్‌ ఎందుకు ఆడడం లేదని ప్రశ్న వేయగా.. దీనిపై మార్క్రమ్‌.. 150 కిమీ వేగంతో బంతులు విసరగల నైపుణ్యం ఉమ్రాన్‌ మాలిక్‌ సొంతం. కానీ అతను ఆడకపోవడం వెనుక ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ అతని బౌలింగ్‌లో వేగం ఉంది. చాలా ఆట ఆడాల్సి ఉంది.'' అంటూ తన మాటలతో చిన్నపాటి కన్ఫూజన్‌ క్రియేట్‌ చేశాడు.

మార్క్రమ్‌ వ్యాఖ్యలపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ వినూత్నంగా స్పందించారు. ''ఏందయ్యా మార్క్రమ్‌.. కెప్టెన్‌ అయ్యుండి ఉమ్రాన్‌ మాలిక్‌ విషయం తెలియదంటావా.. జట్టులో ఏం జరుగుతుంది'' అంటూ కామెంట్‌ చేశారు.  అయితే ఇటీవలే ఎస్‌ఆర్‌హెచ్‌ కోచ్‌ బ్రియాన్‌ లారా బర్త్‌డే వేడుకల్లోనూ ఉమ్రన్‌ మాలిక్‌ ఎక్కడా కనిపించలేదు. దీంతో కచ్చితంగా ఉమ్రాన్‌ విషయంలో ఏదో జరిగిందంటూ అభిమానులు పేర్కొన్నారు.

చదవండి: క్లాసెన్‌ విధ్వంసం.. సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ తరపున రెండో శతకం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top