Mayank Agarwal: మారని ఆటతీరు.. ఏ స్థానంలో ఆడించినా అంతే!

Mayank Agarwal Batting Failure Continues Only 2Runs As Finisher Vs CSK - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ దారుణ ఆటతీరు కొనసాగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం సీఎస్‌కేతో మ్యాచ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ ఓపెనర్‌గా కాకుండా ఐదో స్థానంలో వచ్చాడు. కానీ ఏ స్థానంలో వచ్చినా తన ఆటతీరు మారదని మరోసారి నిరూపించాడు మయాంక్‌.

నాలుగు బంతులెదుర్కొని కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి జడేజా బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అసలు వికెట్‌ టు వికెట్‌ బౌలింగ్‌ చేసి జడేజా బౌలింగ్‌లో ఫ్రంట్‌ఫుట్‌ రావడమే తప్పు.. అలాంటి ధోని కీపర్‌గా ఉన్నప్పుడు అలా చేయడం ఇంకా పెద్ద తప్పు. క్షణం కూడా ఆలస్యం చేయని ధోని వికెట్లను ఎగురగొట్టేశాడు.

కనీసం అంచనా లేకుండా ఫ్రంట్‌ఫుట్‌ షాట్‌కు యత్నించడం మయాంక్‌ ఆట ఎంత పేలవంగా ఉందనేది చూపించింది. ఓపెనర్‌గా విఫలమయ్యాడని ఫినిషర్‌ రోల్‌లో పంపిస్తే దానికి న్యాయం చేయలేకపోయాడు. వాస్తవానికి 2022 సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు కెప్టెన్‌ అయిన తర్వాత మయాంక్‌ అగర్వాల్‌ ఆట పూర్తిగా మసకబారుతూ వచ్చింది.

పంజాబ్‌ కింగ్స్‌లో ఉన్నప్పుడు పరుగులు చేసిన మయాంక్‌ ఎస్‌ఆర్‌హెచ్‌లోకి వచ్చాకా తన బ్యాటింగ్‌నే పూర్తిగా మరిచిపోయాడు. అలాంటి మయాంక్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ కూడా  రూ. 8.5 కోట్లు చెల్లించి తీసుకున్నప్పటికి ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటివరకు మయాంక్‌ ఆరు మ్యాచ్‌లాడి 115 పరుగులు మాత్రమే చేశాడు.

కేకేఆర్‌తో మ్యాచ్‌లో 48 పరుగులు చేసినప్పటికి చాలా బంతులు వృథా చేశాడు. అసలు ముందు మయాంక్‌ను కాదు అనాల్సింది.. ఎస్‌ఆర్‌హెచ్‌ మేనేజ్‌మెంట్‌ను. తలా తోక లేకుండా జట్టును తయారు చేసింది. గత్యంతరం లేకనే మయాంక్‌ అగర్వాల్‌కు అవకాశం ఇస్తున్నారు.

అయితే కనీసం రానున్న మ్యాచ్‌ల్లో ఆఖర్లో బ్యాటింగ్‌కు వస్తున్న అబ్దుల్‌ సమద్‌కు ప్రమోషన్‌ ఇచ్చి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు పంపితే బాగుంటుందేమో. ఇక మయాంక్‌ ఆటతీరుపై సోషల్‌ మీడియాలో అభిమానులు ట్రోల్స్‌తో రెచ్చిపోయారు. మీరు ఒకసారి లుక్కేయండి.

చదవండి: సుందరానికి తొందరెక్కువ.. తప్పించుకోవడం కష్టం!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top