#SRH: ఒకప్పుడు బలం.. ఇప్పుడదే బలహీనత

What-Happen SRH Once-Upon-Time-Won-Many-Low Scoring Matches-Bowling IPL - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు మరో పరాజయం ఎదురైంది. శనివారం సొంతమైదానంలో లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ 182 పరుగులు భారీ స్కోరు చేసి కూడా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. అందుకు బౌలింగ్‌ వైఫల్యమే ప్రధాన కారణం. 

కానీ ఒకప్పుడ ఇదే బౌలింగ్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌ సంచలన విజయాలు సాధించింది. గతంలో వార్నర్‌ నాయకత్వంలోని ఎస్‌ఆర్‌హెచ్‌ చాలాసార్లు లోస్కోరింగ్‌ మ్యాచ్‌లను కూడా నెగ్గింది. బ్యాటింగ్‌లో వీక్‌గా కనిపించినా ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌ మాత్రం బలంగా ఉండేది. బౌలింగ్‌తో బలంతోనే 2016లో సగం మ్యాచ్‌లు నెగ్గిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత సీజన్లలోనూ బౌలింగ్‌తోనే లోస్కోరింగ్‌ మ్యాచ్‌లను కాపాడుకోగలిగింది.

అలాంటిది ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ఏదైతే బలమని భావించామో అదే బలహీనతగా మారింది. ఇదే హైదరాబాద్‌లో తక్కువ స్కోర్లను కాపాడుకొని మ్యాచ్‌లు గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌ ఈ సీజన్‌లో దారుణంగా తయారైంది. ఒకటి అరా మ్యాచ్‌లు తప్ప ఏ బౌలర్‌ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యారు.

ఇక లక్నోతో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒకప్పుడు స్వింగ్‌ కింగ్‌గా పేరు పొందిన భువనేశ్వర్‌ పూర్తిగా విఫలం కాగా.. యార్కర్ల నటరాజన్‌ ఘోరంగా ఫెయిలవుతున్నాడు. మయాంక్‌ మార్కండే తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. ఇలా ఈ సీజన్‌లో అటు బ్యాటింగ్‌.. ఇటు బౌలింగ్‌తో నాసిరకం ప్రదర్శన చేస్తూ పరాజయాలను మూటగట్టుకుంటుంది ఎస్‌ఆర్‌హెచ్‌.

చదవండి: అది నోబాల్‌.. థర్డ్‌ అంపైర్‌ చీటింగ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top