Harry Brook: బ్యాటర్‌గా విఫలం.. కొత్త అవతారం ఎత్తిన హ్యారీ బ్రూక్‌

Harsha Bhogle Says Harry Brook-Highest Paid Cameraman After Take Lens - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ హ్యాట్రిక్‌ పరాజయాన్ని చవి చూసింది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో హోంగ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ 145 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది. బ్యాటర్ల వైఫల్యంతో ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కోట్లు పెట్టి కొన్న హ్యారీ బ్రూక్‌ ప్రదర్శన ఒక్క మ్యాచ్‌కే పరిమితమైంది. స్పిన్నర్ల బలహీతనను అధిగమించలేక బ్రూక్‌ వికెట్‌ పారేసుకుంటున్నాడు.

ఇక ఢిల్లీతో మ్యాచ్‌లో అయితే 14 బంతుల్లో ఏడు పరుగులు మాత్రమే చేసి నోర్ట్జే బౌలింగ్‌లో వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు.  అయితే బ్యాటర్‌గా పూర్తిగా విఫలమవుతున్న హ్యారీ బ్రూక్‌ ఢిల్లీ ఇన్నింగ్స్‌ సందర్భంగా కాసేపు కెమెరామన్‌గా అలరించాడు. బ్రూక్‌ కెమెరామన్‌ పాత్రను పోషించడంపై కామెంటేటర్‌ హర్షా బోగ్లే స్పందించాడు.

''ఓ మ్యాన్‌.. ఇవాళ బ్రూక్‌ రూపంలో మనకు ఒక కొత్త కెమెరామన్‌ కనిపిస్తున్నాడు. టెలివిజన్‌ ప్రొడక్షన్‌ చరిత్రలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కెమెరామన్‌గా బ్రూక్‌ చరిత్ర సృష్టించాడు'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. కాగా బ్రూక్‌ను వేలంలో ఎస్‌ఆర్‌హెచ్‌ రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: #JiteshSharma: అదనపు మార్కుల కోసం క్రికెటర్‌ అవతారం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top