#YuzvendraChahal: చహల్‌ చరిత్ర.. టీమిండియా తరపున తొలి బౌలర్‌గా

Yuzvendra Chahal Stands 1st Place-With-Dwayne Bravo Most Wickets IPL - Sakshi

రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్‌ యజ్వేంద్ర చహల్‌ ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్‌ చేసిన చహల్‌ 29 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.  తద్వారా ఐపీఎల్‌లో తన పేరిట ఒక రికార్డును లిఖించుకున్నాడు.

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో చహల్‌ డ్వేన్‌ బ్రావోతో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. తాజా మ్యాచ్‌తో కలిపి ఇప్పటివరకు చహల్‌ ఐపీఎల్‌లో 183 వికెట్లు పడగొట్టాడు. బ్రావో కూడా 183 వికెట్లు తీశాడు. అయితే బ్రావో 161 మ్యాచ్‌ల్లో 183 వికెట్లు తీయగా..  చహల్‌కు మాత్రం 141 మ్యాచ్‌లే అవసరమయ్యాయి.

ఇక టీమిండియా తరపున ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చహల్‌ నిలిచాడు. చహల్‌, బ్రావో తర్వాత పియూష్‌ చావ్లా 174 వికెట్లతో మూడో స్థానంలో, అమిత్‌ మిశ్రా 172 వికెట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. రవిచంద్రన్‌ అశ్విన్‌ 171 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top