
Photo: IPL Twitter
ఐపీఎల్ చరిత్రలోనే ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు మనీష్ పాండే అత్యంత పేలవంగా ఔటవ్వడం ఆసక్తి కలిగించింది. శనివారం ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో మనీష్ పాండే ఒక్క పరుగు మాత్రమే చేసి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అభిషేక్ శర్మ వేసిన స్లో బంతిని ఆడేందుకు క్రీజు దాటిన పాండే అసలు ఎందుకు ఫ్రంట్‌ఫుట్ వచ్చాడో ఎవరికి అర్థం కాలేదు.
కాస్త ఫ్రంట్‌ఫుట్ అనుకుంటే పర్వాలేదు.. కానీ రెండు అడుగుల దూరం వచ్చి మరీ వికెట్ సమర్పించుకున్నాడు పాండే. మాములుగా అయితే ఏ క్రికెటర్ అయినా స్లోబాల్‌ను క్రీజులోనే ఆడే ప్రయత్నం చేస్తాడు. అంతర్జాతీయ అనుభవం ఉన్న మనీష్ పాండే ఇంత చెత్తగా ఆడడం ఆశ్చర్యపరిచింది. పాండే క్రీజు దాటిన మరుక్షణమే క్లాసెన్ బెయిల్స్ ఎగురగొట్టాడు. బహుశా మనీష్ పాండే ఔటైన తీరు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పేలవమైన ఔట్‌గా మిగిలిపోయే అవకాశం ఉంది.
ఇక మనీష్ పాండే 2021 నుంచి ఐపీఎల్‌లో అత్యంత చెత్త ఫామ్‌ను కనబరుస్తున్నాడు. అప్పటినుంచి 20 మ్యాచ్‌లాడిన పాండే 512 పరుగులు మాత్రమే చేవాడు. ఇందులో నాలుగు అర్థసెంచరీలు ఉన్నాయి.
He's actually disgrace to cricket.@im_manishpandey pic.twitter.com/oefH4MKKCU
— Anil (@NANI57ANIL) April 29, 2023