#WashingtonSundar: పరుగెత్తడంలో అలసత్వం.. కర్మ ఫలితం అనుభవించాల్సిందే

Sundar Looked Lazy Dragging His Bat-Down Vs MI Match Viral - Sakshi

ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాడు వాషింగ్టన్‌ సుందర్‌ బద్దకానికి బ్రాండ్‌ అంబాసిడర్‌లా తయారయ్యాడు. కనీసం పరిగెత్తడంలోనూ అలసత్వం ప్రదర్శించడంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. విషయంలోకి వెళితే.. ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ జాసన్‌ బెహండార్ఫ్‌ వేశాడు. అప్పటికే రెండు ఫోర్లతో సుందర్‌ టచ్‌లో కనిపించాడు.


Photo: IPL Twitter

ఓవర్‌ ఐదో బంతిని ఫుల్‌టాస్‌ వేయగా సుందర్‌ మిడాఫ్‌ దిశగా డ్రిల్‌ చేశాడు. సింగిల్‌కు ప్రయత్నించిన సుందర్‌ మొదట్లో వేగంగానే పరిగెత్తుకు వచ్చాడు. బంతిని అందుకున్న ఫీల్డర్‌ టిమ్‌ డేవిడ్‌ నేరుగా బంతిని డైరెక్ట్‌ త్రో వేశాడు. మరి డేవిడ్‌ వేసిన బంతి వికెట్లకు తాకదనుకున్నాడో.. తాను ఔట్‌ కానని నమ్మకమో తెలియదు కానీ  క్రీజుకు అడుగు దూరంలో నిర్లక్ష్యం ప్రదర్శించాడు.

ఆ నిర్లక్ష్యమే సుందర్‌ను దెబ్బకొట్టింది. రిప్లేలో సుందర్‌ క్రీజులోకి వచ్చేలోపే టిమ్‌ డేవిడ్‌ వేసిన త్రో డైరెక్ట్‌గా వికెట్లను తాకింది. పరిగెత్తడంలో అలసత్వం ప్రదర్శించిన సుందర్‌పై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ గుప్పుమన్నాయి. బద్దకానికి బ్రాండ్‌ అంబాసిడర్‌లా ఉన్నావు.. పరిగెత్తడంలో ఇంత నిర్లక్ష్యమా.. కర్మ ఫలితం అనుభవించాల్సిందే. అంటూ ద్వజమెత్తారు.

చదవండి: #Tilak Varma: ఉన్నది కాసేపే.. కానీ దడదడలాడించాడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top