చెపాక్‌లో తలా సందడి.. మరో తలా కోసమే వచ్చాడంటున్న నెటిజన్స్! | Ajith Kumar attended IPL match at Chennai Chepauk Stadium CSK vs SRH | Sakshi
Sakshi News home page

Ajith Kumar: చెపాక్‌లో అజిత్ కుమార్ సందడి.. భార్యతో కలిసి ఐపీఎల్‌ మ్యాచ్‌కు హీరో

Apr 26 2025 7:46 AM | Updated on Apr 26 2025 8:48 AM

Ajith Kumar attended IPL match at Chennai Chepauk Stadium CSK vs SRH

కోలీవుడ్ స్టార్ హీరో ‍అజిత్ కుమార్‌ ఇటీవలే సూపర్‌ హిట్‌ తన ఖాతాలో వేసుకున్నారు. ఆయన నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అధిక్ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.  ఏప్రిల్ 10న విడుదలైన 'గుడ్ బ్యాడ్ అగ్లీ'కి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. విదాముయార్చి ఫెయిల్యూర్ తర్వాత వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.

రెండు రోజుల క్రితమే అజిత్ తన భార్య షాలినితో కలిసి వివాహా వార్షికోత్సవం జరుపుకున్నారు. వీరిద్దరి బంధానికి దాదాపు 25 ఏళ్లు పూర్తి కావడంతో కేక్ కట్‌ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా ఈ జంట ఐపీఎల్‌ మ్యాచ్‌లోనూ సందడి చేశారు. తమ కుమారుడు ఆద్వైక్‌తో కలిసి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ను ఎంజాయ్ చేశారు. అభిమానులు తలా అని ముద్దుగా పిలుచుకునే అజిత్‌.. మరో తలాగా పిలవబడే ఎంఎస్‌ ధోని ఆటను ఆస్వాదించేందుకు స్డేడియానికి వచ్చారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అతని కొడుకు ఆద్వైక్‌ను తన ఒడిలో కూర్చొబెట్టుకుని మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకించారు.

కాగా.. ఈ మ్యాచ్‌లో మరో హీరో శివకార్తికేయన్ కూడా స్టేడియంలో కనిపించారు.అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో హీరోయిన్ శృతిహాసన్‌ సైతం సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్‌- చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. అయితే సినిమాలతో పాటు రేసింగ్‌లోనూ అజిత్‌ కుమార్‌ యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన టీమ్ బెల్జియంలో జరిగిన కారు రేస్‌లో రెండో స్థానంలో నిలిచింది. 

Advertisement
 
Advertisement
Advertisement