IPL 2023 KKR Vs SRH: హ్యారీ బ్రూక్‌ సెంచరీ.. 23 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయం

IPL 2023: KKR Vs SRH Match Live Updates-Highlights - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో విజయాన్ని నమోదు చేసింది. 229 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. నితీష్‌రానా(41 బంతుల్లో 75 పరుగులు), రింకూ సింగ్‌(31 బంతుల్లో 58 పరుగులు) మినహా మిగతావారు రాణించడంలో విఫలమయ్యారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో మార్కో జాన్సెన్‌, మయాంక్‌ మార్కండేలు తలా రెండు వికెట్లు తీయగా.. నటరాజన్‌, భువనేశ్వర్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

నితీష్‌ రానా ఔట్‌.. ఆరో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
ధాటిగా ఆడుతున్న నితీష్‌ రానా(41 బంతుల్లో 75 పరుగులు) నటరాజన్‌ బౌలింగ్‌లో సుందర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్‌ ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.

విధ్వంసం సృష్టిస్తున్న నితీష్‌, రింకూ సింగ్‌.. 
16 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్‌ ఐదు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. నితీష్‌ రానా 38 బంతుల్లో 69 బ్యాటింగ్‌, రింకూ సింగ్‌ 18 బంతుల్లో 32 బ్యాటింగ్‌ విధ్వంసం సృష్టిస్తున్నారు. కేకేఆర్‌ గెలవాలంటే 24 బంతుల్లో 70 పరుగులు చేయాల్సి ఉంది.

మరోసారి విఫలమైన రసెల్‌.. ఐదో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌ ఆండీ రసెల్‌ బ్యాటింగ్‌ వైఫల్యం కొనసాగుతుంది. తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో మూడు పరుగులు మాత్రమే చేసి మయాంక్‌ మార్కండే బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో కేకేఆర్‌ 96 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

నాలుగో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్‌ తడబడుతుంది. ఎన్‌ జగదీశన్‌(36) రూపంలో కేకేఆర్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం కేకేఆర్‌ 4 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. నితీష్‌ రానా 35, రసెల్‌ ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నారు.

34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కేకేఆర్‌
229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ కష్టాల్లో పడింది. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. నితీష్‌ రాణా 2, ఎన్‌ జగదీషన్‌ 20 పరుగులతో ఆడుతున్నారు.


Photo Credit : IPL Website

హ్యారీ బ్రూక్‌ సెంచరీ.. కేకేఆర్‌ టార్గెట్‌ 229
కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ స్కోరు చేసింది. హ్యారీ బ్రూక్‌ 55 బంతుల్లో 100 నాటౌట్‌ సీజన్‌లో తొలి సెంచరీ నమోదు చేయడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. మార్క్రమ్‌ 50, అభిషేక్‌ శర్మ 35 పరుగులతో రాణించారు.


Photo Credit : IPL Website

మార్క్రమ్‌(50) ఔట్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌ 129/3
ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ తొలిసారి దూకుడు ప్రదర్శిస్తోంది. కెప్టెన్‌ మార్క్రమ్‌ 25 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్‌ అందుకున్నాడు. అయితే ఫిఫ్టీ కొట్టిన మరుసటి బంతికే వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ మూడు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. బ్రూక్‌ 53 పరుగులతో క్రీజులో ఉన్నారు.


Photo Credit : IPL Website

9 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ 85/2
9 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్‌ రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది.  బ్రూక్‌ 45, మార్క్రమ్‌ 14 పరుగులతో ఆడుతున్నారు.


Photo Credit : IPL Website

తొలి వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
మయాంక్‌ అగర్వాల్‌ మరోసారి విఫలమయ్యాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో 9 పరుగులు చేసిన మయాంక్‌ రసెల్‌ బౌలింగ్‌లో వరుణ్‌ చక్రవర్తికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ వికెట్‌ నష్టానికి 46 పరుగులు చేసింది.


Photo Credit : IPL Website

2 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ 28/0
కేకేఆర్‌తో మ్యాచ్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ దూకుడుగా ఆరంభించింది. 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్‌ 18, మయాంక్‌ అగర్వాల్‌ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.


Photo Credit : IPL Website

టాస్‌ గెలిచిన కేకేఆర్‌
ఐపీఎల్ 16వ సీజ‌న్ 19వ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఢీ కొంటున్నాయి. టాస్‌ గెలిచిన కేకేఆర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది.  కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జ‌రుగుతుండడంతో  మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా ఉండ‌నుంది. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(కెప్టెన్‌), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్‌), మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌కీపర్‌), N జగదీసన్, నితీష్ రాణా(కెప్టెన్‌), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, సుయాష్ శర్మ, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి

ఇక వ‌రుస‌గా రెండు మ్యాచుల్లో నెగ్గిన కోల్‌క‌తా హ్యాట్రిక్ కొట్టాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. మరోవైపు హోంగ్రౌండ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి బోణీ కొట్టిన ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో విజయంపై కన్నేసింది.  దాంతో, పై చేయి సాధించే జ‌ట్టు ఏది అనేది? మ‌రికొన్ని గంట‌ల్లో తెలియ‌నుంది. ఇక ఇరుజట్లు ఇప్పటిరకు 23 మ్యాచ్‌లు జరగ్గా.. కేకేఆర్‌ 15 సార్లు గెలుపొందితే.. ఎస్‌ఆర్‌హెచ్‌ 8సార్లు మాత్రమే నెగ్గింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top