Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP Home Minister Taneti Vanitha Speaks With DGP In Phone
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్ 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తాతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఫోన్‌లో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన హింసాత్మక ఘటనలను ఆమె డిజిపి దృష్టికి తీసుకొచ్చారు. చంద్రగిరి, గురజాల తాడిపత్రి గోపాలపురం తదితర నియోజకవర్గాల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలు చేసిన హింసకాండ అంశాలపై డీజీపీతో ఆమె మాట్లాడారు.ఎమ్మెల్యేలపై దాడులు చేస్తుంటే స్థానిక పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. టిడిపికి ఓటు వేయలేదు అన్న కారణాలతో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలపై టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకుల దాడులను స్థానిక పోలీసుల దృష్టికి తీసుకొచ్చినా స్థానిక పోలీసులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు డీజీపీకి తెలిపారు.దాడులకు పాల్పడ్డ నాయకులను, కార్యకర్తలను చట్టం ప్రకారం వెంటనే అరెస్టు చేయాలని ఆమె కోరారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కచ్చితంగా తెలియజేయాలని డీజీపీని కోరారు. రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ నియమించిన భద్రతా వ్యవహారాల పరిశీలకుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సమాచారం ఉన్నట్లు హోం మంత్రి తెలిపారు.

KSR Comment On AP Elections After Poling
వైఎస్సార్‌సీపీలో ఉన్నంత కాన్ఫిడెన్స్‌.. కూటమిలో లేదు!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఘట్టం ముగియడంతో సర్వత్రా ఎవరు గెలుస్తారన్నదే చర్చగా సాగుతోంది. ఈ ఎన్నికలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రంగా జరిగిన ఎన్నికలు కావడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికలలో జగన్ విజయం సాధిస్తే అది దేశానికి ఒక మోడల్ అవుతుంది.జగన్ తీసుకువచ్చిన పలు వ్యవస్థలను దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి వివిధ రాష్ట్రాలు ముందుకు వస్తాయి.జగన్‌ను ఒంటరిగా ఓడించలేమన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కాళ్లావేళ్ల పడి జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుంది. అయినా ఎంతవరకు ప్రయోజనం కలిగిందన్నది ప్రశ్నార్దకమే. మూడు పార్టీల కూటమి కావడంతో బలం పెరిగిందని,తెలుగుదేశం పార్టీ నౌ ఆర్ నెవర్ అన్న చందంగా పని చేసిందని, ఆ పార్టీకి జీవన్మరణ సమస్య కావడంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు తమను తాము భ్రష్టు పట్టించుకుంటూ కూడా అబద్దాలు ప్రచారం చేశాయని, వాటన్నిటి పలితంగా గెలిచే అవకాశం లేకపోలేదన్నది ఆ పార్టీవారి భావనగా ఉంది.అయినా వైఎస్సార్‌సీపీలో కాన్ఫిడెన్స్ తెలుగుదేశం కూటమిలో కనిపించడం లేదన్నది సత్యం.. నిజంగానే టీడీపీ కూటమి గెలుస్తుందన్న నమ్మకం కలిగి ఉంటే ,ఈనాడు, ఆంధ్రజ్యోతిలు అదే తరహాలో కూటమి గెలుపు ఖాయం అన్న శీర్షిక బ్యానర్‌ ఇచ్చేవని, అలా చేయకపోవడం కూడా టీడీపీ ఓటమికి ఒక సంకేతం అన్న విశ్లేషణ వస్తోంది.నిజానికి ఈనాడుకు ఉన్న నెట్ వర్క్ రీత్యా, సోమవారం సాయంత్రానికి జనాభిప్రాయ సేకరణ పూర్తి చేసి వాస్తవ పరిస్థితిని ఇచ్చి ఉండవచ్చు. అలా చేయలేదంటే వారికి కూటమి విజయంపై సందేహం కలిగి ఉండవచ్చని కొందరు అంటున్నారు. ఒకవేళ మంగళవారం ఏమైనా ఇస్తారేమో తెలియదు. కాని కేవలం టీడీపీ వర్గాల ధీమా పేరుతోనే కథనాలు ఇచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వ పనితీరుకు ఒక రిఫరెండంగా పరిగణించే ఈ ఎన్నికలలో మహిళలు ,వివిధ సంక్షేమ పధకాల లబ్దిదారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమన్నది ఆయా వర్గాలలో వినిపిస్తున్నమాట.ఓవరాల్‌గా చూసినప్పుడు అత్యధికులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వస్తుందనే విశ్వసిస్తున్నారు. దీనికి కొన్ని కారణాలు బలీయంగా కనిపిస్తున్నాయి. అవేమిటో చూద్దాం. టీడీపీ కూటమిలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ, జనసేనలు కలిసి 31 నియో.జకవర్గాలలో పోటీచేశాయి. వారికి ఉన్న బలాబలాల రీత్యా, టీడీపీ నుంచి వచ్చే ఓట్ల బదలాయింపు వంటి అంశాల కారణంగా ఈ రెండు పార్టీలు కలిసి ఐదు నుంచి పది సీట్లు మాత్రమే గెలవవచ్చన్నది ఒక అంచనా. ఈ లెక్కన వైఎస్సార్‌సీపీ ఇరవై సీట్లను సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆధిక్యత ఉంది.గత ఎన్నికలలో సైతం 52 సీట్లకు గాను నలభై తొమ్మిదింటిని వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. 2024 ఎన్నికలలో సైతం వైఎస్సార్‌సీపీ వేవ్ రాయలసీమ అంతటా ఉంది. అయినప్పటికీ కొన్ని సీట్లు తగ్గుతాయని అనుకున్నా, మినిమమ్ ముప్పై ఐదు నుంచి నలభై సీట్లు రావచ్చని అంతా అంగీకరిస్తున్నారు. అంటే ఇప్పటికి ఏభై సీట్లు వైఎస్సార్‌సీపీ గెలుచుకున్నట్లు లెక్క అవుతుంది. ఉత్తరాంధ్రలో వైఎస్సార్‌సీపీ బలం బాగా ఉంది.అక్కడ ఉన్న ముప్పై నాలుగు సీట్లలో కనీసం పదిహేడు నుంచి ఇరవై సీట్లు వైఎస్సార్‌సీపీ గెలుచుకోవచ్చు. అదే జరిగితే ఇక్కడికి డెబ్బై సీట్లు గెలిచినట్లు అవుతుంది. ఇక ఇరవై సీట్లు తెచ్చుకుంటే వైఎస్సార్‌సీపీ గెలిచినట్లే అవుతుంది.టీడీపీ పొత్తు పెట్టుకున్న కారణంగా ముస్లిం మైనార్టీలు కూటమికి దూరం అయ్యారు. వారు కనీసం నలభై నుంచి ఏభై నియోజకవర్గాలలో ప్రభావం చూపవచ్చు. ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తివేస్తామని బీజేపీ చేసిన ప్రకటన కూడా ముస్లింలలో ఆగ్రహానికి కారణం అయింది. ఈ నేపధ్యంలో రాయలసీమలో అధిక శాతం ఉన్న ముస్లింలు వైఎస్సార్‌సీపీవైపు మొగ్గు చూపుతున్నారు. కోస్తా ఆంధ్రలో సైతం అదే పరిస్తితి ఉంది. నెల్లూరు నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు ఉన్న ఆరు జిల్లాలలో నలభై సీట్లు రావడం కష్టం కాదు. అంటే ఈ లెక్కన కనీసం 110 సీట్లు వైఎస్సార్‌సీపీకి రావడం ,తిరిగి జగన్ ముఖ్యమంత్రి కావడం తధ్యం అనిపిస్తుంది. 2014లో ఉన్న కూటమి పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పుడు నరేంద్ర మోదీ హవా బాగా పనిచేసింది.అలాగే అప్పుడే పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని పెట్టడం, కాపు వర్గాన్ని బాగా ఆకర్షించడం కారణంగా టీడీపీ అధికారంలోకి రాగలిగింది.ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ మూడు పార్టీలు 2019 ఎన్నికల సమయంలో ఒకదానిని ఒకటి తిట్టుకున్నాయి. విమర్శించుకున్నాయి. బీజేపీతో పొత్తు కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని తమ అవసరాలకు వాడుకోవడం, ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడం కోసమేనన్న సంగతి అందరికి అర్దం అయింది. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలు దాదాపు నెరవేర్చడం , ఆయన ఒంటరిగా ధైర్యంగా ఎన్నికల గోదాలోకి దిగడం, ఒక సిస్టమాటిక్ గా సభలు నిర్వహించడం , ఆచరణ సాధ్యమైన హామీలనే ఇవ్వడం వంటి కారణాల వల్ల ప్రజలలో ఆయన పట్ల ఒక నమ్మకం కుదిరింది. ప్రత్యేకించి పేద, బలహీనవర్గాలలో అది బాగా ప్రస్పుటంగా కనిపించింది. సామాజికంగా కూడా జగన్ పలు ప్రయోగాలు చేసి బిసిలకు ఎక్కువ సీట్లు ఇవ్వగలిగారు.అది కూడా ప్లస్ పాయింట్ గా ఉంది. జగన్ ఎక్కువగా పాజిటివ్ ఓటుపై ఆధారపడితే విపక్ష కూటమి నెగిటివ్ ఓటుపైనే ఆధారపడింది. వారి మానిఫెస్టోని ఎవరూ విశ్వసించడం లేదు. తెలుగుదేశం కు ఓటు వేయాలని అనుకున్నవారు సైతం ఆ ఎన్నికల ప్రణాళిక అయ్యేది కాదని తెలిసినా, ఇతర కారణాల రీత్యానే ఓట్లు వేశారు.గతంలో జగన్ ఈ స్కీములను అమలు చేస్తుంటే శ్రీలంక అయిపోయిందని ప్రచారం చేసిన చంద్రబాబు తన మానిఫెస్టోలో అంతకు మించి రెండు,మూడు రెట్లు సంక్షేమ పధకాలు అమలు చేస్తామని అనడంతో జగన్ గ్రాఫ్ బాగా పెరిగింది. అబద్దాల ప్రచారాన్ని నమ్ముకుని టీడీపీ పనిచేసింది. లేని లాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల భూములను జగన్ లాక్కుంటారంటూ తప్పుడు ప్రచారం చేశారు. అసెంబ్లీలో టీడీపీ మద్దతు ఇచ్చిన బిల్లునే మాటమార్చి వ్యతిరేకిస్తోందని చెప్పడంలో వైఎస్సార్‌సీపీ చాలా వరకు సఫలం అయింది.అది కూడా టీడీపీకి నష్టం చేసిందని చెప్పవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, రెడ్లు, అగ్రవర్ణాలలోని అధికశాతం పేదలు జగన్‌కు మద్దతు ఇస్తున్నారు. ఆ ప్రభావం పోలింగ్ పై స్పష్టంగా కనబడింది. ఈకాంబినేషన్ అలాగే కొనసాగితే జగన్ ను ఓడించడం అసాద్యం. 2019 లో ఇవే సామాజికవర్గాలు జగన్ కు భారీ ఎత్తున మద్దతు ఇచ్చాయి. అవి ఇప్పటికీ అలాగే కొనసాగుతుండడం జగన్‌కు కలిసి వచ్చే పాయింట్. తమ కోసం లక్షల మంది కార్లు వేసుకుని హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చారని టీడీపీ వాదిస్తోంది. కార్లలో వెళ్లినవారు పెత్తందార్లకు ప్రతినిధులుగా ఉంటే, బస్‌లు, ట్రైన్లలో వెళ్లినవారు పేద ప్రజలకు ప్రతినిదులగా చెప్పవచ్చు. ఆ రకంగా చూసుకున్నా, ఇలా వెళ్లినవారిలో వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులే ఎక్కువగా కనిపిస్తారు. సామాజికవర్గాల సమీకరణ రీత్యా చూసినా, ప్రాంతాల వారీగా పరిశీలించినా, రాజకీయ కోణాలలో అద్యయనం చేసినా, ఏపీలో మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీ కూటమి ప్రభుత్వమేనన్న అభిప్రాయం కలుగుతుంది. పోటీ బాగా టైట్‌గా సాగితే వైఎస్సార్‌సీపీకి కనీసం 100 నుంచి 110 సీట్లు వస్తాయి.అది వేవ్‌గా మారితే వైఎస్సార్‌సీపీ గత ఎన్నికల మాదిరి 150 వరకు రావడం కష్టం కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

20 cases On Man Behind Mumbai Billboard That Collapsed
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో హోర్డింగ్‌ కూలిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘ఇగో మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ యాడ్‌ ఏజెన్సీ యజమాని భవేష్‌ భిండేపై హత్యకేసు నమోదైంది. అయితే అతనిపై పోలీసు కేసులు కొత్తేమి కాదు. ఓ అత్యాచార కేసుతో సహా దాదాపు 20 కేసుల్లో భవేష్‌ నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం భిండే పరారీలో ఉన్నాడని, అతని ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ వస్తుందని పోలీసులు పేర్కొన్నారు.అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యజమాని 2009లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ములుండ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆయన సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్(చెక్‌ బౌన్స్‌) కింద తనపై 23 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరిలో అతనిపై ములుంద్ పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదైంది. ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు పోలీసులు. అయితే ముందస్తు బెయిల్‌పై ప్రస్తుతం బయట ఉన్నాడు.రాష్ట్రంలో హోర్డింగ్‌లు,బ్యానర్‌లను ఏర్పాటు చేయడం కోసం గత కొన్నేళ్లుగా భిండే భారతీయ రైల్వేలు, ముంబై పౌర సంస్థ, బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) నుంచి అనేక కాంట్రాక్టులను పొందినట్లు తెలుస్తోంది. అయితే చాలాసార్లు ఆయన నిబంధనలను ఉల్లఘించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భిండేతోపాటు అతని కంపెనీలలోని అనేక మంది చెట్లకు విషం, చెట్ల నరికివేత కేసుల్లో నిందితులుగా ఉన్నారు.ముంబైలోని ఘాట్‌కోపర్‌లో సోమవారం అకాల వర్షం, ఈదురు గాలులతో ఓ భారీ బిల్‌ బోర్డ్‌ పక్కనే ఉ న్న పెట్రోల్‌ పంపుపై కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. మరో 74 మంది తీవ్రంగా గాయపడ్డారు. కూలిన హోర్డింగ్‌ కింద నుజ్జునుజ్జయిన కార్లలో ఇంకా కొంత మంది చిక్కుకొని ఉండొచ్చని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

 DC Keep Playoff Dreams Alive With 19-Run Win Over LSG
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవం

ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ సత్తాచాటింది. అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. దీంతో ఢిల్లీ తమ ప్లే ఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ భవితవ్యం ఇతర జట్ల గెలుపోటములుపై ఆధారపడి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్‌(58), ట్రిస్టన్ స్టబ్స్‌(57) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వారిద్దరితో పాటు షాయ్ హోప్‌(38), కెప్టెన్ రిషబ్ పంత్‌(33) పరుగులతో రాణించారు. ఇక లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు పడగొట్టగా.. అర్షద్ ఖాన్‌, బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు.చెలరేగిన ఇషాంత్‌..అనంతరం 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులకే పరిమితమైంది. లక్నో టెయిలాండర్‌ అర్షద్‌ ఖాన్‌ అద్బుతమైన పోరాట పటిమ కనబరిచనప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. 7వ స్ధానంలో బ్యాటింగ్‌లో వచ్చిన అర్షద్‌.. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. లక్ష్య చేధనలో 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన అర్షద్‌ ఖాన్‌.. గెలుపు అంచుల దాకా తీసుకువచ్చాడు. 33 బంతులు ఎదుర్కొన్న అర్షద్‌.. 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 58 పరుగులు చేశాడు. అతడితో పాటు నికోలస్‌ పూరన్‌(61) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరూ మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్‌ శర్మ మూడు వికెట్లు, ఖాలీల్‌ అహ్మద్‌, అక్షర్‌ పటేల్‌, స్టబ్స్‌, ముఖేష్‌ కుమార్, కుల్దీప్‌ యాదవ్‌‌ తలా వికెట్‌ సాధించారు.​

CM YS Jagan Tweet On AP Election Polling
ఏపీ పోలింగ్‌పై సీఎం జగన్‌ ట్వీట్‌

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ఘట్టం ముగిసింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఏపీలో ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి అత్యధికంగా 80 శాతానికిపైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.తాజాగా ఏపీలో నమోదైన పోలింగ్‌, ఓటర్లను ఉద్ధేశిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. మండుటెండల్లోనూ తనకు ఓటువేసి ఆశీర్వదించేందుకు సునామీల తరలివచ్చిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు సాగిన పాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హామీ ఇచ్చారు.నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు… pic.twitter.com/RQcsHZqWEO— YS Jagan Mohan Reddy (@ysjagan) May 14, 2024

KTR Key Comments At rajanna Sircilla Meeting After Polls
బీజేపీ కోసం కిష‌న్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ క‌ష్ట‌ప‌డ్డాడు: కేటీఆర్‌

సాక్షి, రాజ‌న్న సిరిసిల్ల: పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలే హ‌వా కొన‌సాగించ‌బోతున్నాయ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇండియా, ఎన్డీఏ కూట‌మిల‌కు స్ప‌ష్ట‌మైన మెజార్టీ వ‌చ్చే పరిస్థితి లేదని అన్నారు. రెండు కూట‌మిలో లేని పార్టీలు.. బీఆర్ఎస్, వైఎస్సార్‌సీపీ, బీజూ జ‌న‌తాద‌ళ్ లాంటి ప్రాంతీయ శ‌క్తులే కేంద్రంలో నిర్ణ‌యాత్మ‌క పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చిల్లర, మల్లర పనులు చేస్తూ 5 నెలల టైం పాస్ చేసిందని మండిపడ్డారు. మేడిగ‌డ్డ‌, శ్వేత‌ప‌త్రాలు, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాల‌పై ఫోక‌స్ చేసి ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం య‌త్నించింద‌ని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మెజార్టీ సీట్లు మేమే సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో గులాబీ సైనికులు అద్భుత‌మైన పోరాట ప‌టిమ ప్ర‌ద‌ర్శించారు. పార్టీ కోసం కష్టపడిన గులాబీ సైకులకు వినయపూర్వక ధన్యవాదాలు. ఈ ఎన్నిక‌ల్లో మంచి ఫ‌లితాలు సాధించ‌బోతున్నాం. తెలంగాణ ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ అత్య‌ధిక స్థానాల్లో గెల‌వ‌బోతుంది. ఈనాడైనా ఏనాడైనా బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌కు శ్రీరామ‌ర‌క్ష అని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంది. ఆ రెండు పార్టీలు స‌న్నాయి నొక్కులు నొక్క‌డానికి, విమ‌ర్శ‌లు చేయ‌డానికి, కేసీఆర్‌ను దూషించ‌డానికి ప‌రిమితం అయ్యాయి. తెలంగాణ‌కు ఏం చేయ‌క‌పోయినా అడ్డ‌గోలు విమ‌ర్శ‌లు చేశాయి. వీరి వ‌ల్ల ఏం కాద‌ని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైపోయింది. ఈ ఎన్నిక‌ల్లో చేసిన కృషి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు పునాది కాబోతుంది అని కేటీఆర్ పేర్కొన్నారురాష్ట్రంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై ఆడబిడ్డలు తీవ్ర మనస్థాపంతో ఉన్నారు .కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకులు లేకనే.. మా పార్టీ నుండి వచ్చిన వారికి టిక్కెట్లు ఇచ్చి నిలబెట్టింది. ఢిల్లీలో కుస్తీలు, గల్లీలో దోస్తీల్లా రెండు పార్టీల వ్యవహారముంది. డమ్మీ అభ్యర్హులను పెట్టీ రేవంత్ రెడ్డి బీజేపీ అభ్యర్థులు గెలిచేలా ప్రణాళికలు చేశాడు. కాంగ్రెస్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని 420 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా’ అని కేటీఆర్‌ తెలపారు.

Anchor Rashmi Gautam Responds On Netizens Question On Her Tweet
ఎందుకలా వదిలేశారు?.. మీ బాధ్యత కాదా?.. రష్మి ట్వీట్‌ వైరల్

ప్రముఖ టీవీ యాంకర్, నటి రష్మి గౌతమ్‌ చేసిన ట్వీట్‌ వివాదానికి దారితీసింది. ఇటీవల తాండూరులో చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసిన ఘటనపై ఆమె ట్వీట్ చేసింది. పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆ కుక్కను చిన్నారి తల్లిదండ్రులు కొట్టిచంపారు. అయితే పేరేంట్స్‌ తీరును రష్మి తప్పుపట్టింది. చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా, బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. అయితే దీనిపై ఓ నెటిజన్ స్పందించారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులపై కేసు పెట్టాలని రష్మిక చెబుతోంది అంటూ కామెంట్ చేశాడు. దీనికి రష్మి సైతం బదులిచ్చింది.రష్మి గౌతమ్ తన ట్వీట్‌లో రాస్తూ..' ఆ చిన్నారిని ఎందుకలా ఒంటరిగా వదిలేశారు. కుక్క దాడి చేస్తుంటే తల్లిదండ్రులు నిద్ర పోతున్నారా? కనీసం ఆ చిన్నారి ఏడుపు కూడా వినిపించలేదా? జంతువులపై ఇలాంటి ప్రచారాన్ని ఆపండి. తెలివి తక్కువగా వ్యవహరించే తల్లిదండ్రులకు సంబంధించి వెయ్యి వీడియోలను షేర్‌ చేయగలను. అసలు పిల్లల జీవితాలను రిస్క్‌లో పెట్టింది ఎవరు? జంతువుల విషయానికొస్తే అన్నీ లాజిక్స్‌ మర్చిపోతారు. ఈ ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేసి.. మీరు మాత్రం ప్రశాంతతను పొందాలనుకుంటే అది జరిగే పని కాదని' రిప్లై ఇచ్చింది.అయితే దీనిపై మరో నెటిజన్‌ స్పందిస్తూ..' మీకు బుర్ర లేదని అర్థమైందండి.. ఈ మాట అంటున్నందుకు సారీ' అని రాసుకొచ్చాడు. దీనికి రష్మి బదులిస్తూ..'మీకు బుర్ర ఉంది కదా.. పిల్లలను కనడం మాత్రమే కాదు. వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది. దయచేసి పెంపుడు జంతువులు ఉన్నవాళ్లు పిల్లలను అలా వదిలేయకండి' అని సూచించింది. తల్లిదండ్రులు ఇలాంటి చిన్నచిన్న తప్పులు చేయకుండా ఉండాలని రష్మి హితవు పలికింది. అలాగే బయట వ్యక్తులపై దాడి చేయకుండా పెంపుడు జంతులకు యజమానులే తగిన శిక్షణ ఇవ్వాలని.. దాడి జరిగితే ఆ పెంపుడు జంతువు యజమానిపైనా కేసు పెట్టాలని రష్మి అన్నారు.I would have preferred responsible parents https://t.co/bgm2C3JRbJ— rashmi gautam (@rashmigautam27) May 14, 2024 The article is about a toddler And yes in this day and age of child rapes and molesters Yes the child shud be 24* 7 monitored The chances of your child getting molested by a human is higher than getting bitten by an animal https://t.co/e0Qq8TK4m1— rashmi gautam (@rashmigautam27) May 14, 2024

Sanjay Singh Confirms Assault On Swati Maliwal
స్వాతి మలివాల్‌పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌

తమ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై జరిగిన దాడి నిజమేనని ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ అంగీకరించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ స్వాతి మాలివాల్‌పై దాడి చేయడాన్ని ఖండించారు. ఈ దాడిని సీఎం దృష్టికి తీసుకెళ్లామని, తగిన చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ సంజయ్‌ సింగ్‌ వెల్లడించారు.అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఎంపీ స్వాతి మలివాల్ ఆయన నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో డ్రాయింగ్‌ రూమ్‌లో ఉన్న కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఎదురు చూస్తున్న సమయంలో బిభవ్ కుమార్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని సంజయ్‌ సింగ్‌ అన్నారు. బిభవ్‌ కుమార్‌పై త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆప్‌ ఎంపీ ఎంపీ స్వాతి మలివాల్ స్థానాన్ని న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించాలని కేజ్రీవాల్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయంపై మాట్లాడేందుకు కేజ్రీవాల్‌ ఇంటికి వెళ్లిన తనపై దాడిచేసినట్లు బిభవ్‌పై స్వాతి మలివాల్‌ ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దాడి వ్యవహారం మరింత చర్చకు దారి తీసింది. మరోవైపు బీజేపీ.. ఆప్‌పై విమర్శలు చేస్తోంది. ఈ తరుణంలో అప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ దాడిని ఖండించారు.

 Anant Ambani Radhika Merchant Second Pre Wedding bash 800 Guests To Join
అనంత్‌ - రాధిక ప్రీవెడ్డింగ్‌ బాష్‌ : 800 మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?

ఆసియా కుబేరుడు రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ తన లేడీ లవ్‌ రాధిక మర్చంట్‌ మెడలో మూడు ముళ్లు వేసేందుకు సన్నద్ధమవున్నాడు. వచ్చే నెల (జూలై 12న) అనంత్‌-రాధిక వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించేందుకు అంబానీ సిద్ధమ వుతున్నారు. ఈ క్రమంలో మార్చి మూడవ తేదీవరకు జామ్‌నగర్‌లో గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకుల సందడి ఇంకా ముగియకముందే రెండో ప్రీ వెడ్డింగ్‌ వేడుకకు సన్నద్ధమవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 28 నుంచి 30 మధ్య దక్షిణ ఫ్రాన్స్‌లో క్రూయిజ్‌ షిప్‌లో రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుక జరగనుంది. క్రూయిజ్ ఇటలీ నుండి బయలుదేరి 2365 నాటికల్ మైళ్ల (4380 కి.మీ) దూరం ప్రయాణించి దక్షిణ ఫ్రాన్స్‌లోని గమ్యస్థానానికి చేరుకుంటుందని కూడా పేర్కొంది. ఈ వేడుక కేవలం పెళ్లి చేసుకోబోయే అనంత్‌-రాధికకు మాత్రమేకాదు అతిథులందరికీ కూడా అద్భుతమైన అనుభవంగా మిగలేలా సర్వ హంగులతో ఏర్పాట్లు చేస్తున్నాయిట ఇరు కుటుంబాలు. అతిధులు ఈ వేడుకలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్‌ సెలబ్రిటీలతో సహా మొత్తం 800 మంది అతిథులు హాజరుకానున్నారు. రముఖ్యంగా అనంత్‌ సోదరుడు ఆకాష్ అంబానీ శ్లోకా మెహతా జంటతో సన్నిహితంగా ఉంటే బాలీవుడ్‌ జంట రణబీర్ కపూర్ అలియా భట్ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలవబోతున్నారు. క్రూయిజ్ షిప్‌లో మొత్తం 600 మంది సిబ్బంది అతిథుల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారట. కాగా 2017లో డ్రైవ్‌లో పరస్పర స్నేహితుల ద్వారా పరిచయమైన వీరిద్దరూ లవ్‌బర్డ్స్‌గా మారిపోయారు. కొన్నాళ్ల డేటింగ్‌ తరువాత 2023లో రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ టెంపుల్‌లో రాధికకు పెళ్లికి ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఆంటిలియాలో నిశ్చితార్థం వేడుక, 2024లో జామ్‌నగర్‌లో మూడు రోజుల పాటు ప్రీవెడ్డింగ్‌ హస్తాక్షర్ వేడుకను నిర్వహించిన సంగతి తెలిసిందే.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement