నెల్లిమర్ల రూరల్: కోడి పందాలు ఆడుతూ పట్టుబడిన ఏడుగురు వ్యక్తులకు జిల్లా కోర్టు మూడు రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.50 చొప్పున జరిమానా విధించిందని ఎస్సై రామగణేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 9న జగ్గరాజుపేట గ్రామ శివారులో కోడిపందాలు ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి నాలుగు కోడిపుంజులు, రూ.7,510 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి జిల్లా కోర్టులో సెకెండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీనివాసరావు ముందు హాజరుపరచగా, ముద్దాయిలకు జైలుశిక్షతో పాటు అపరాధ రుసుం విధిస్తూ తీర్పు చెప్పారని పేర్కొన్నారు.