కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
సాలూరు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పూదోట ప్రకాష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఏరియా ఆస్పత్రి వద్ద నిర్వహించిన ధర్నాకు ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంట్రాక్ట్ ఏజెన్సీల చట్ట ప్రకారం కార్మికులకు పీఎఫ్, బీమా చెల్లింపులు చెల్లించకుండా ఒక్కో చోట ఒకలా చెల్లిస్తున్నారని ఆరోపించారు. పేదరోగులకు సేవచేసుకుంటూ జీవిస్తున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు బుగత అశోక్, బలగ రాధ తదితరులు పాల్గొన్నారు.


