కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు

Published Sun, May 19 2024 7:38 PM

Pm Modi Sensational Comments On Congress Ruled States

జెంషెడ్‌పూర్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం(మే19) జార్ఖండ్‌లోని జెంషెడ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ’యువరాజు రాహుల్‌గాంధీ పరిశ్రమలు, పెట్టుబడులను వ్యతిరేకిస్తున్నాడు. 

దీంతో పెట్టుబడిదారులు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. కాంగ్రెస్‌, దాని మిత్రపకక్షాలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో పెట్టుబడులు రాకపోతే అక్కడి యువత పరిస్థితి ఏంటి. చాలా మంది వ్యాపారవేత్తలు వచ్చి నాతో ఇలా చెబుతున్నారు. 

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితులు బాగోలేవంటున్నారు. వారి సిద్ధాంతాలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని చెబుతున్నారు. యువరాజు ఆలోచన విధానం, వారి మిత్రపకక్షాల ఆలోచనా విధానం ఒకేలా ఉంది’అని ప్రధాని అన్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement