'దేవర' ఫియర్‌ సాంగ్‌ వచ్చేసింది | Sakshi
Sakshi News home page

'దేవర' ఫియర్‌ సాంగ్‌ వచ్చేసింది

Published Sun, May 19 2024 7:04 PM

Devara First Song Out Now

పాన్‌ ఇండియా హీరో ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్‌లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా దేవర. పాన్‌ ఇండియా రేంజ్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీగా దేవర ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. మే 20న తారక్‌ పుట్టినరోజు సందర్భంగా తాజాగా దేవర నుంచి ఫస్ట్‌ సాంగ్‌ను మేకర్స్‌విడుదల చేశారు.

బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందించాడు. తాజాగా విడుదలై ఫియర్‌ సాంగ్‌ అభిమానులను మెప్పించేలా ఉంది. ఇందులోని ప్రతి పదం గూస్‌ బంప్స్‌ తెప్పించేలా ఉంది. ఈ పాట కోసం గేయ రచయతలు ఎంతో ప్రత్యేకంగా దీనిని రచించారని ఇప్పటికే మేకర్స్‌ చెప్పారు. ఈ పాటను తెలుగులో రామజోగయ్య శాస్త్రి ,హిందీలో మనోజ్ ముంతాషిర్, తమిళంలో విష్ణు ఏడవన్, కన్నడలో ఆజాద్ వరదరాజ్, మలయాళంలో గోపాలకృష్ణన్ రచించారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement