14 ఏళ్ల వయస్సులోనే కల.. ఎవరీ ‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ | Sakshi
Sakshi News home page

14 ఏళ్ల వయస్సులోనే కల.. ఎవరీ ‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’

Published Sun, May 19 2024 6:32 PM

How To Naturals Ice Cream Founder Raghunandan Kamath Made A Rs 400 Crore Company

సంక్షోభంలో అవకాశాల్ని ఎలా సృష్టించుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే పీహెచ్‌డీలు చేయాల్సిన అవసరం లేదు. రోజూ వారి నిత్యం మన నిజ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశంలోనూ ఏదో ఒక బిజినెస్‌ ఐడియా ఉంటుంది. దాన్ని మనం గుర్తించాలి. సరైన సమయంలో దాన్ని ఒడిసిపట్టుకుంటే అవకాశాలు అనంతం.  

చేతిలో డిగ్రీ లేదు. జేబులో చిల్లిగవ్వలేదు. కానీ జీవితంలో ఏదైనా సాధించాలనే తపనతో నాడు 14ఏళ్ల వయస్సులో రైలెక్కి మంగళూరు నుంచి ముంబైకి వెళ్లిన రఘునందన్ కామత్ నేడు ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అవతరించారు. ఎవరీ రఘునందన్‌ కామత్‌.  

మామిడి పండ్ల వ్యాపారి కుటుంబంలో
గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేచురల్స్ ఐస్ క్రీమ్ వ్యవస్థాపకుడు రఘునందన్ కామత్ అనారోగ్యంతో కన్నుమూశారు. మంగళూరులోని ఓ కుగ్రామంలో మామిడి పండ్ల వ్యాపారి కుటుంబంలో జన్మించిన కామత్‌.. నేడు రూ.400 కోట్ల విలువైన నేచురల్స్ అనే ఐస్ క్రీం కంపెనీ అధిపతిగా పేరు గడించారు. ఆయన ప్రయాణం ఎలా సాగింది?

శ్రమ నీ అయుధం అయితే 
ఐస్ క్రీం మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు సంపాదించిన రఘునందన్ శ్రీనివాస్ కామత్ చిన్న నాటి 14 ఏళ్ల వయస్సు వచ్చే వరకు మామిడి పండ్ల వ్యాపారం చేసే తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నారు. చెట్టు మీద మామిడి పండ్లను కోయడం దగ్గర నుంచి అమ్మడం వరకు తెలుసుకున్నారు. అయితే, మామిడి పండ్ల వ్యాపారంలో మెళుకువలు తెలుసుకున్న కామత్‌కు బుర్ర నిండా ఆలోచనలే. శ్రమ నీ అయుధం అయితే విజయం నీ బానిస అవుతుందని నమ్మే ఆయనకు ఐస్‌క్రీం బిజినెస్‌ చేయాలని కోరిక ఆ వయస్సులో బలంగా నాటుకుంది.

రైలు ఎక్కి ముంబైకి
ఐస్‌క్రీం బిజినెస్‌ అంటే కృత్తిమ ఫ్లేవర్లు, లేదంటే పాలు, షుగర్,ఐస్‌తో చేయడం కాకుండా రకరకాల పండ‍్లతో ఐస్‌క్రీం తయారు చేసే వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా 1984లో మంగళూరు నుండి రైలు ఎక్కి ముంబైకి పయనమయ్యారు. అక్కడే ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న తన సోదరుడి వద్దకు వెళ్లారు. అదే రెస్టారెంట్‌లో కామత్‌ పనికి కుదిరారు. రోజులు గడుస్తున్నాయి. వ్యాపారలో మెళుకువలు నేర్చుకున్నారు.

ఆలోచనలు మెదడును తొలిచేస్తుంటే
మామిడి, అరటి పండు, పుచ్చకాయ ఇలా రకరకాల పండ్లతో ఐస్‌క్రీమ్‌లను ఎందుకు తయారు చేయకూడదు? అలా తయారు చేస్తే కస్టమర్లకు నచ్చుతుందో? లేదో? ఇలా రకరకలా ఆలోచనలు మెదడును  తొలిచేస్తుంటే.. ఉండబట్టలేక పావు బాజీ ప్రధాన వంటకంగా, మరోవైపు పండ్లతో   ఐస్‌క్రీమ్‌లను అమ్మడం ప్రారంభించారు.  

12 రుచులతో
అలా  రఘునందన్ శ్రీనివాస్ కామత్ ముంబై జుహు అనే ప్రాంతంలో తన తొలి ఐస్ క్రీమ్ పార్లర్‌ను కేవలం ఆరుగురు సిబ్బందితో, 12 రుచులతో ప్రారంభించాడు. అప్పట్లో, దీనిని తరచుగా కస్టమర్లు ఐస్ క్రీమ్ ఆఫ్ జుహు స్కీమ్ అని పిలిచేవారు.

మూడు పువ్వులు ఆరు కాయలుగా
రోజులు గడుస్తున్నాయి. వ్యాపారం జోరందుకు. కామత్‌ ఐస్‌క్రీమ్‌కి మౌత్‌ పబ్లిసిటీ ఎక్కువైంది. 37ఏళ్లలో ఇంతింతై వటుడింతై అన్న చందగా ప్రస్తుతం, నేచురల్స్ ఐస్ క్రీమ్ 15 నగరాల్లో 165కి పైగా అవుట్‌లెట్‌లతో వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement