ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి.. ఆర్‌బీఐ ఏం చెబుతోంది? | Do You Know How Many Bank Accounts Should You Have | Sakshi
Sakshi News home page

ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి.. ఆర్‌బీఐ ఏం చెబుతోంది?

May 19 2024 7:49 PM | Updated on May 19 2024 7:49 PM

Do You Know How Many Bank Accounts Should You Have

ఈ రోజుల్లో దాదాపు పుట్టిన బిడ్డ దగ్గర మొదలుకొని.. అందరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అయితే ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి. ఎక్కువ అకౌంట్స్ ఉంటే ఏమైనా సమస్య వస్తుందా? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అయితే ఓ సంస్థ నుంచి మరో సంస్థకు మారిన ప్రతిసారీ బ్యాంక్ అకౌంట్ కూడా మారుతుంది. ఇలా ఒక వ్యక్తికి కనీస నాలుగు లేదా ఐదు అకౌంట్స్ ఉంటాయి. ఉద్యోగులకు మాత్రమే కాకుండా రైతులకు, సాధారణ వ్యక్తులకు కూడా మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఒక వ్యక్తికి ఇన్ని అకౌంట్స్ మాత్రమే ఉండాలి అనే నిబంధన విధించలేదు. కాబట్టి ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయినా ఉండవచ్చు. అయితే ప్రతి ఖాతాలోనూ మినిమమ్ బ్యాలెన్స్ అనేది ఉంచాల్సి ఉంటుంది. మినిమమ్ బ్యాలెన్స్ లేకుండా దాని కొంత మొత్తంలో ఫైన్ వేసే అవకాశం ఉంటుంది. అయితే అన్ని బ్యాంకులు ఇలా ఫైన్ వేస్తాయని చెప్పలేము.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement