కమల్‌హాసన్‌- శంకర్‌ కాంబో.. లేటేస్ట్‌ అప్‌డేట్‌ ఇదే! | Sakshi
Sakshi News home page

Indian 2: ఇండియన్‌-2 లేటేస్ట్‌ అప్‌డేట్‌ ఇదే!

Published Sun, May 19 2024 10:04 PM

kamal Haasan Latest Movie Indian 2 latest Update

శంకర్‌ డైరెక్షన్‌లో కోలీవుడ్‌ స్టార్ కమల్‌హాసన్‌ నటిస్తోన్న చిత్రం ఇండియన్‌-2. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై భారీస్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. ఈ సినిమాలోని ఫస్ట్‌ సింగిల్‌ను ఈనెల 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ ట్వీట్ చేశారు.

కాగా.. కమల్‌ హాసన్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందించిన భారతీయుడుకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూలై 12 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement