నగరంలో ఆధ్యాత్మిక ప్రభ వెల్లివిరిసింది. రంజాన్ శోభ పరిఢవిల్లింది.
నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు.. శుక్రవారం నెలవంక దర్శనమివ్వడంతో శనివారం ఈద్గాల వద్ద భక్తిశ్రద్ధలతో ఈద్– ఉల్– ఫితర్ పండగ నమాజులను చేశారు.
వేకువజాము నుంచే రంజాన్ సందడి నెలకొంది. గ్రేటర్‌లోని మక్కా మసీదు, పాతబస్తీ, ప్రాచీన గోల్కొండ, కుతుబ్‌షాహీ, మీరాలం, మాదన్నపేట్‌తో పాటు తదితర ప్రాంతాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకొన్నారు.


