ఆషాఢమాస బోనాల జాతర వేడుకల్లో భాగంగా ఆదివారం హైదరాబాదు గోల్కొండ కోటలో జగదాంబ మహంకాళి అమ్మవారికి రెండో బోనం పూజ భక్తిశ్రద్ధలతో జరిగింది. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. వేలాది మంది భక్తులతో కోట కిటకిటలాడింది. గత ఆదివారం కన్నా భక్తులు ఈసారి భారీ సంఖ్యలో తరలివచ్చారు.


