రెండు నెలల్లో రూ. 62,000 కోట్లు వెనక్కి | FIIs pull out $10.5 bn from Indian capital market | Sakshi
Sakshi News home page

రెండు నెలల్లో రూ. 62,000 కోట్లు వెనక్కి

Aug 5 2013 3:24 AM | Updated on Sep 1 2017 9:38 PM

రెండు నెలల్లో రూ. 62,000 కోట్లు వెనక్కి

రెండు నెలల్లో రూ. 62,000 కోట్లు వెనక్కి

గత రెండు నెలల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి 10.5 బిలియన్ డాలర్ల(రూ. 62,000 కోట్లు)

గత రెండు నెలల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి 10.5 బిలియన్ డాలర్ల(రూ. 62,000 కోట్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. రూపాయి పతనం నేపథ్యంలో  ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగవచ్చునని విశ్లేషకులు అంచనా వేశారు. జూన్‌లో రూ. 44,162 కోట్లు(7.5 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్‌ఐఐలు జూలైలోనూ డెట్, ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ. 18,124 కోట్లు(3 బిలియన్ డాలర్లు) విలువైన అమ్మకాలను నిర్వహించారు. ఈ రెండు నెలల్లోనూ డెట్ మార్కెట్ల నుంచి మొత్తంగా రూ. 45,000 కోట్లను(7.7 బిలియన్ డాలర్లు) వెనక్కి తీసుకోగా, రూ. 17,000 కోట్ల(2.8 బిలియన్ డాలర్లు) విలువైన ఈక్విటీలను విక్రయించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement