'బుల్లెట్ ట్రైన్స్ కాదు.. బెటర్ ట్రాక్స్ కావాలి' | country needs better tracks and not bullet trains, says Dinesh Trivedi | Sakshi
Sakshi News home page

'బుల్లెట్ ట్రైన్స్ కాదు.. బెటర్ ట్రాక్స్ కావాలి'

Aug 5 2015 9:52 AM | Updated on Oct 8 2018 3:36 PM

'బుల్లెట్ ట్రైన్స్ కాదు.. బెటర్ ట్రాక్స్ కావాలి' - Sakshi

'బుల్లెట్ ట్రైన్స్ కాదు.. బెటర్ ట్రాక్స్ కావాలి'

మధ్యప్రదేశ్లో రెండు రైళ్లు నదిలోకి పడిన దుర్ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతుండగానే రాజకీయ విమర్శలు మొదలయ్యాయి.

న్యూఢిల్లీ:  మధ్యప్రదేశ్లో రెండు రైళ్లు నదిలోకి పడిన దుర్ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతుండగానే రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. రైల్వే శాఖ మాజీ మంత్రి, తృణమాల్ కాంగ్రెస్ నేత దినేశ్ త్రివేది.. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశానికి బుల్లెట్ రైళ్ల కంటే నాణ్యమైన ట్రాక్లు అవసరమని త్రివేది వ్యాఖ్యానించారు. రైల్వే ప్రమాద సంఘటనలు జరగకుండా ప్రయాణికులను కాపాడాలంటే నాణ్యమైన ట్రాక్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

ధనవంతులు ప్రయాణించే రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని, మిగిలిన రైళ్ల భద్రత చర్యలను గాలికి వదిలేస్తారమని త్రివేది విమర్శించారు. ఈ దుర్ఘటన గురించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. రైల్వే మంత్రి సురేష్ ప్రభు నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement