రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి | One dead and Two injured in Road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి

Dec 22 2015 7:20 PM | Updated on Aug 30 2018 3:56 PM

గీసుకొండ మండలం కొమ్మల గ్రామం వద్ద వరంగల్-నర్సంపేట రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు.

గీసుకొండ (వరంగల్ జిల్లా) : గీసుకొండ మండలం కొమ్మల గ్రామం వద్ద వరంగల్-నర్సంపేట రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. బైక్‌పై మచ్చాపూర్ గ్రామం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో భాగావత్ శివ(16) అక్కడికక్కడే మృతిచెందగా, భాగావత్ వెంకన్న(15), కొర్ర రాజు(25) లకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వెంకన్నను హైదరాబాద్ తరలించారు. రాజుకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.  సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement