మోత్కుపల్లికి గవర్నర్ గిరీ! | governorpost to Motkupalli | Sakshi
Sakshi News home page

మోత్కుపల్లికి గవర్నర్ గిరీ!

Apr 26 2015 2:39 AM | Updated on Aug 10 2018 8:13 PM

మోత్కుపల్లికి గవర్నర్ గిరీ! - Sakshi

మోత్కుపల్లికి గవర్నర్ గిరీ!

టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి ఖరారైంది.

ఈశాన్య రాష్ట్రాల్లో ఒకదానికి నియమించే అవకాశం
 
హైదరాబాద్: టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి ఖరారైంది. ఆయనను త్వ రలోనే ఈశాన్య రాష్ట్రాల్లో ఒక దానికి గవర్నర్‌గా నియమించనున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్రం టీడీపీ అధినేత చంద్రబాబుకు సమాచారమిచ్చినట్లు తెలిసింది. మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీలు అటు కేంద్రం, ఇటు ఏపీలో అధికారాన్ని పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ నేతలకు, జాతీయస్థాయిలో టీడీపీ నేతలకు పదవులు ఇవ్వాలని ఆ రెండు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి.

అందులో భాగంగానే ఈ పదవుల పంపకం జరుగుతోంది. గతంలో ఆయనకు రాజ్యసభ అవకాశం ఇవ్వని చంద్రబాబు.. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే గవర్నర్ పదవి ఇప్పిస్తానని హామీనిచ్చారు. ఖాళీగా ఉన్న పలు రాష్ట్రాల గవర్నర్ పదవుల నియామకానికి కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే మోత్కుపల్లిని గవర్నర్‌గా నియమించనున్నారు.
 
ట్రైఫెడ్ చైర్మన్‌గా రమేష్ రాథోడ్
 
గిరిజన సహకార మా ర్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ నియమితులు కానున్నారు. ఆయనను ట్రైఫెడ్ చైర్మన్‌గా నియమించేందుకు కేంద్రం సమ్మతించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement