కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న బాలురు | Boys escaped from kidnappers | Sakshi
Sakshi News home page

కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న బాలురు

Jul 27 2018 12:53 AM | Updated on Jul 12 2019 3:37 PM

Boys escaped from kidnappers - Sakshi

ఎదులాపురం(ఆదిలాబాద్‌): హైదరాబాద్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసి మహారాష్ట్రకు తరలించగా ఇద్దరు బాలురు వారి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. వివరాలు.. హైదరాబాద్‌ భెల్‌ కాలనీలో నివాసం ఉంటున్న ఓరిరాల్‌ ప్రశాంత్‌(16) అక్కడి ఉద్యానవానికి బుధవారం ఆడుకోవడానికి వెళ్లాడు. గుర్తుతెలియని వ్యక్తులు తినుబండారాల్లో మత్తు పదార్థాలు కలిపి బాలుడిని కారులో మహారాష్ట్ర ఉత్కేడ్‌కు తీసుకెళ్లారు. అతడిని ఎవరూ గుర్తించకుండా గుండు చేయించారు.

ప్రశాంత్‌ మెలకువ వచ్చేసరికి గుర్తుతెలియని ప్రాంతంలోని ఓ గదిలో ఉండ డంతో కిడ్నాప్‌ అయ్యాయని తెలుసుకున్నాడు. అతడితో పాటు మరో బాలుడు ఉండగా వారిరువురు అక్కడినుంచి తప్పించుకున్నారు. రైల్వేస్టేషన్‌ చేరుకుని ఎవరికి తోచిన రైలులో వారు ఎక్కగా ప్రశాంత్‌ ఆదిలాబాద్‌కు చేరుకున్నాడు. స్టేషన్‌లో దిగిన బాలుడు రైల్వే పోలీసును సంప్రదించగా వారు తమకు అప్పగించారని అమృత్‌రావు వివరించారు. గురువారం ఆదిలాబాద్‌ చేరుకున్న తల్లి వాణికి బాలుడిని అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement