3సెం.మీ.ల వర్షపాతం  | 3 Cm Rain In Vangur | Sakshi
Sakshi News home page

Mar 18 2018 1:25 AM | Updated on Mar 18 2018 1:25 AM

3 Cm Rain In Vangur - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. గత 24 గంటల్లో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వంగూరులో 3సెం.మీ.ల అత్యధిక వర్షపాతం నమోదైంది. యాచారం, అశ్వారావుపేట, కల్వకుర్తి, తిమ్మాజీపేట, అచ్చంపేట, డోర్నకల్, ముల్కలపల్లి, ఇబ్రహీంపట్నం, రంజల్, ఆర్మూర్, జడ్చర్ల, మోర్తాడ్, జూలూరుపాడు, కొణిజర్లలో 2సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైంది. చాలాచోట్ల 1సెం.మీ. వర్షపాతం నమోదవడంతో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తగ్గాయి.

Advertisement
 
Advertisement
Advertisement