తప్పు చేసిన వారిపైనే చర‍్యలు ఉంటాయని, తప్పు చేయని వాళ‍్లు నిర్భయంగా ఉండవచ‍్చని శాసన సభ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు స‍్పష‍్టం చేశారు.
తప్పు చేసిన వారిపైనే చర‍్యలు: కోడెల
Apr 26 2017 11:51 AM | Updated on Jul 29 2019 2:44 PM
గుంటూరు: తప్పు చేసిన వారిపైనే చర‍్యలు ఉంటాయని, తప్పు చేయని వాళ‍్లు నిర్భయంగా ఉండవచ‍్చని శాసన సభ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు స‍్పష‍్టం చేశారు. డీసీసీబీ పాలకవర్గం, బ్యాంకు అధికారులు, ఉద్యోగులు బుధవారం శాసనసభ స్పీకర్‌ను కలిశారు. సహకార శాఖ కుంభకోణం నుంచి తమను కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారితో స్పీకర్ మాట్లాడుతూ.. తప్పు చేసిన వారిపైనే చర్యలు ఉంటాయన్నారు. ఇదిలా ఉంచితే గత పాలకవర్గం సమయంలో రైతు రుణాల పేరుతో రూ.6 కోట్ల స్కాం జరిగింది. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టి, అరెస్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.
Advertisement


