అశ్విన్ ను వదిలేశాడు..విరాట్ను పట్టేశాడు! | virat kohli gets out at 167 runs | Sakshi
Sakshi News home page

అశ్విన్ ను వదిలేశాడు..విరాట్ను పట్టేశాడు!

Nov 18 2016 10:33 AM | Updated on Sep 4 2017 8:27 PM

అశ్విన్ ను వదిలేశాడు..విరాట్ను పట్టేశాడు!

అశ్విన్ ను వదిలేశాడు..విరాట్ను పట్టేశాడు!

ఇంగ్లండ్ తో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి(167;267 బంతుల్లో 18 ఫోర్లు) ఐదో వికెట్ గా వెనుదిరిగాడు.

విశాఖ:ఇంగ్లండ్ తో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి(167;267 బంతుల్లో 18 ఫోర్లు) ఐదో వికెట్ గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారీ శతకం సాధించిన కోహ్లి.. ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్ లో అవుటయ్యాడు. స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న బెన్ స్టోక్స్ కు క్యాచ్ ఇచ్చి విరాట్ పెవిలియన్ చేరాడు. అయితే అంతకుముందు బంతిలో రవి చంద్రన్ అశ్విన్ తృటిలో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

సరిగ్గా అలీ వేసిన 100 ఓవర్ రెండో బంతికి అశ్విన్ ఇచ్చిన క్యాచ్ ను స్టోక్స్ వదిలేశాడు. ఆ క్రమంలోనే సింగిల్ వచ్చింది. ఆ మరుసటి బంతికి విరాట్ ను అలీ అవుట్ చేశాడు. సరిగ్గా స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న స్టోక్స్ మరోసారి ఎటువంటి తప్పిదం చేయకుండా ఆ క్యాచ్ ను పట్టుకున్నాడు. దాంతో డబుల్ సెంచరీ చేస్తాడనుకున్న విరాట్ పెవిలియన్కు చేరాడు. భారత స్కోరు 351 పరుగుల వద్ద విరాట్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement