ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా(141/5) | team india lose fifth wicket at 141 runs | Sakshi
Sakshi News home page

ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా(141/5)

Dec 30 2014 11:53 AM | Updated on Sep 2 2017 6:59 PM

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 141 పరుగుల వద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది.

మెల్ బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 141 పరుగుల వద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది. చటేశ్వర పూజారా (21) పరుగులు చేసి ఐదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. మరోప్రక్క అజ్యింకా రహానే(47) పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. 104 పరుగులకే ధోనీ సేన నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది.  చివరి రోజు 384 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఆదిలోనే కీలక వికెట్లను చేజార్చుకుంది.

 

శిఖర్ ధావన్ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, కేఎల్ రాహుల్(1), మురళీ విజయ్(11) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. అనంతరం విరాట్ కోహ్లీ(54)పరుగులతో మరోసారి ఆకట్టుకున్నప్పటికీ నాల్గో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ జాన్సన్, ర్యాన్ హారిస్ లకు తలో రెండు వికెట్లు లభించాయి.

Advertisement
 
Advertisement
Advertisement