టీ విరామ సమయానికి టీమిండియా స్కోరు 234/2 | team india 234 for two wickets at tea | Sakshi
Sakshi News home page

టీ విరామ సమయానికి టీమిండియా స్కోరు 234/2

Jan 8 2015 9:58 AM | Updated on Sep 2 2017 7:24 PM

ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి, నాల్గో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో టీ విరామ సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 234 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.

సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి, నాల్గో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో టీ విరామ సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 234 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం కేఎల్ రాహుల్(106;256 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్), విరాట్ కోహ్లీ(67;121 బంతుల్లో 5ఫోర్లు,2 సిక్సర్లు) లు నాటౌట్ గా క్రీజ్ లో ఉన్నారు.

 

టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ టెస్టుల్లో  తొలి సెంచరీ(102) నమోదు చేసిన సంగతి తెలిసిందే.  ఇక్కడ ఆస్ట్రేలియాతో జరగుతున్న చివరి టెస్టులో రాహుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 253 బంతులను ఎదుర్కొన్నఈ కర్ణాటక ఓపెనర్ 11ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో శతకం పూర్తి చేశాడు.   తను ఆడిన రెండో టెస్టులోనే సెంచరీ చేసిన క్రికెటర్ గా రాహుల్ రికార్డు నెలకొల్పాడు. 

Advertisement
 
Advertisement
Advertisement