ట్రై సిరీస్‌కు జో రూట్‌ దూరం | joe Root to miss T20 tri series | Sakshi
Sakshi News home page

ట్రై సిరీస్‌కు జో రూట్‌ దూరం

Jan 23 2018 4:29 PM | Updated on Jan 23 2018 4:32 PM

joe Root to miss T20 tri series - Sakshi

సిడ్నీ:వచ్చే నెల‍్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో జరిగే ముక్కోణపు సిరీస్‌ నుంచి ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జో రూట్‌ వైదొలిగాడు. గత కొంతకాలంగా విరామం లేకుండా క్రికెట్‌ ఆడుతున్న నేపథ్యంలో రూట్‌ విశ్రాంతి తీసుకోవాలని భావించాడు. దానిలో భాగంగా ముక్కోణపు సిరీస్‌కు దూరం కానున్నట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) తాజాగా స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన యాషెస్‌ సిరీస్‌లో ఆడిన రూట్‌.. ఐదు వన్డేల సిరీస్‌లో కూడా ఆడతున్నాడు. దాంతో చిన్నపాటి బ్రేక్‌ తీసుకోవాలని రూట్‌ కోరిన నేపథ్యంలో దాన్ని ఈసీబీ అంగీకరించింది.

దీనిపై రూట్‌ మాట్లాడుతూ..' విరామం లేకుండా క్రికెట్‌ ఆడుతున్న నాకు ఒక బ్రేక్‌ కావాలి. నాకు స్వతహాగా గేమ్స్‌ మిస్‌ కావడం ఇష్టం ఉండదు. కాకపోతే కాస్త అలసటగా అనిపిస్తోంది. దాంతోనే ట్రై సిరీస్‌ నుంచి తప్పుకుంటున్నా. ఫిబ‍్రవరి చివర్లో న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు అందుబాటులోకి వస్తా' అని రూట్‌ తెలిపాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement